నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/06/2026)

Eenadu icon
By National News Team Published : 18 Jun 2026 00:18 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

మేషం

పనులు వాయిదా వేయకుండా మనోధైర్యంతో పూర్తి చేస్తే ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, అనవసర ఖర్చులు తగ్గించి పొదుపు పాటించడం అవసరం. సూర్యారాధన శ్రేయస్కరం.

వృషభం

శుభకాలం కొనసాగుతోంది. అదృష్టం తోడై ప్రారంభించిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆర్థికంగా బలంగా ఉంటారు, పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.  శ్రీలక్ష్మీ అష్టోత్తర పఠనం మేలు చేస్తుంది.

మిథునం

ముఖ్యమైన పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. ఏకాగ్రతతో కృషి చేస్తే విజయం సాధ్యమే. ఆర్థిక సంబంధ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వారాంతంలో శుభఫలితాలు లభిస్తాయి. నవగ్రహ స్తోత్రం పఠించడం శ్రేయస్కరం.

కర్కాటకం

పనుల విషయంలో సహనం, జాగ్రత్త అవసరం. కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ  పట్టుదలతో అధిగమిస్తారు. సమష్టి కృషితో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి నిదానంగా ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పఠనం శ్రేయస్కరం.

సింహం

ఉద్యోగ రంగంలో మంచి పురోగతి ఉంటుంది. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. కుటుంబంలో విభేదాలకు తావివ్వకుండా శాంతంగా ఉండటం మంచిది. శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం.

కన్య

దైవానుగ్రహంతో శుభ ఫలితాలు పొందుతారు. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ఆర్థికాభివృద్ధి, విజయాలు చేకూరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. నవగ్రహ ప్రార్థన మేలు చేస్తుంది.

తుల

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో సమస్యలను ముందే గుర్తించి పరిష్కరిస్తారు. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.

వృశ్చికం

శుభకాలం కొనసాగుతోంది. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

ధనుస్సు

వ్యాపార రంగంలో శుభయోగాలు ఉన్నాయి. పెట్టుబడుల ద్వారా లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మీ నిర్ణయాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. దేవి నామస్మరణ శ్రేయస్కరం.

మకరం

మీ ప్రయత్నాలు సఫలమయ్యే కాలం. ఉద్యోగంలో పదోన్నతి లేదా గౌరవం లభిస్తాయి. వ్యాపారంలో సమస్యలు తొలగి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. శ్రీమహాలక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది.

కుంభం

వ్యాపారంలో స్పష్టమైన పురోగతి, లాభాలు కనిపిస్తాయి. కృషికి తగిన ప్రతిఫలం రెట్టింపుగా లభిస్తుంది. కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ సహనంతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సహకారం అందుతుంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

మీనం

మనోధైర్యంతో ఆటంకాలను తెలివిగా అధిగమిస్తారు. ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి. స్థిరాస్తి సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మూడు రోజుల్లో నీట్‌ పరీక్ష.. విద్యార్థులకు ఎన్‌టీఏ మెసేజ్‌ నీట్‌-యూజీ రీటెస్టును పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ’ తెలిపింది.
  • టెలిగ్రామ్‌ కొత్త డార్క్‌ వెబ్‌.. నేరగాళ్లకు అడ్డా: కేంద్రం సంచలన ఆరోపణలు Telegram: మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు చేసింది. ఈ యాప్‌ను ‘కొత్త డార్క్‌ వెబ్‌’గా పేర్కొన్న కేంద్రం.. ఇది నేరగాళ్లకు అడ్డగా మారిందని ఆరోపించింది. 
  • ఒక్కో ఎంపీకి మరో రూ.10కోట్లు ఇచ్చారు - సంజయ్‌ రౌత్‌ శివసేన (యూబీటీ)లో సంక్షోభం ముదురుతున్నట్లే కనిపిస్తోంది. ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశానికి ఆరుగురు ఎంపీలు డుమ్మా కొట్టడంపై పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
  • లోయలో పడిన బొలెరో.. ఏడుగురి దుర్మరణం హిమాచల్‌ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
  • చీలిక వార్తల వేళ శివసేన (యూబీటీ) ఎంపీల భేటీ.. ముగ్గురే హాజరు Shiv Sena UBT: ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) రెండోసారి చీలిపోవడం ఖాయంగానే కన్పిస్తోంది.
  • అయోధ్య విరాళాల వివాదం.. సీసీటీవీ దృశ్యాలు తారుమారు..! Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర విరాళాలు, కానుకల్లో అవకతవకలు జరిగాయన్న కేసులో.. సీసీటీవీలు ట్యాంపరింగ్‌ అయ్యాయని తాజాగా సిట్‌ గుర్తించింది.
  • ఎరుపు రంగు చెవులతో అరుదైన ఏనుగు ఉత్తరాఖండ్‌లోని కార్బెట్‌ టైగర్‌ రిజర్వ్‌లో అరుదైన మగ ఏనుగు పర్యాటకులను ఆకర్షిస్తోంది.
  • ఇంధన ధరలు వెంటనే తగ్గించలేం: కేంద్రం Fuel prices: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా.. భారత్‌లో వెంటనే ఇంధన ధరలు తగ్గించలేమని కేంద్రం పేర్కొంది.
  • విశాఖపై కన్ను.. మళ్లీ బంగాళాఖాతం జలాల్లోకి పాక్‌ సబ్‌మెరైన్లు.. ! Pakistan: 1971 ఇండియా-పాక్‌ వార్‌.. బంగ్లాదేశ్‌ విముక్తి కోసం జరిగిన ఈ యుద్ధంలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని దాయాది కళ్లారా చూసింది.
  • భర్త మరణించినా అతని ఆస్తి నుంచి మాజీ భార్య భరణం పొందవచ్చు దంపతులు విడిపోయిన కేసుల్లో.. భర్త మరణానంతరం కూడా అతని ఆస్తి నుంచి భరణం పొందే హక్కు మాజీ భార్యకు ఉంటుందని బాంబే హైకోర్టు పేర్కొంది.
  • చీలిక ముంగిట ‘సేన’, ఎస్పీ! దేశంలో తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ), అఖిలేశ్‌ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) రాజకీయ సంక్షోభాల ముంగిట నిలిచినట్లు స్పష్టమవుతోంది.
  • మన విద్యావ్యవస్థ పిల్లల్ని చిదిమేస్తోంది కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బుధవారం రాజస్థాన్‌లోని కోటాలో ‘‘ఛాత్రోంకీ గూంజ్‌’’ (విద్యార్థుల ప్రతిధ్వని) పేరుతో ఏర్పాటైన మహార్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.
  • విద్యార్థుల భవితవ్యంతో రాహుల్‌ రాజకీయం: భాజపా వైద్య విద్యలో ప్రవేశం పొందాలని కోరుకుంటున్న అభ్యర్థులతో రాహుల్‌గాంధీ రాజకీయం చేస్తున్నారని భాజపా ఆరోపించింది.
  • భారత్‌ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్ర: భాగవత్‌ దేశ ఎదుగుదలను అడ్డుకునేందుకు తప్పుడు కథనాలు సృష్టించి, ప్రచారం చేసే ప్రయత్నాలు భారత్‌తోపాటు విదేశాల్లోనూ జరుగుతున్నాయని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు.
  • 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు విస్తృత మద్దతు తీవ్ర నేరాలకు పాల్పడి 30 రోజుల కన్నా ఎక్కువ కాలం నిర్బంధంలో ఉన్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే 130వ రాజ్యాంగ...
  • జాక్‌ఫ్రూట్‌తో జాక్‌పాట్‌ పెరుగుతున్న ఖర్చులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు సంప్రదాయ సాగు నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లిస్తున్నాయి.
  • గతం కాదు.. భవిష్యత్తు ముఖ్యం! క్షమించడం అలవాటు చేసుకోండి. క్షమించినంత మాత్రాన.. ఇతరులు చేసిన తప్పు ఆమోదయోగ్యమేనని మీరు అంగీకరించినట్లేమీ కాదు.
  • సైబర్‌ నేరగాళ్లు పరాన్నజీవులు అమాయకులైన మదుపరుల సొమ్మును కాజేస్తోన్న సైబర్‌ నేరగాళ్లు పరాన్న జీవులని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ మండిపడ్డారు.
  • నెలలు నిండని ప్రసవాలను సూచించే రక్త పరీక్ష నెలలు నిండకముందే ప్రసవించిన గర్భిణుల రక్తంలో అణువుల పరంగా కొన్ని తేడాలు ఉన్నాయని, ఇలాంటి వారిలో మొదటి త్రైమాసికంలోనే తేడాలు కనిపిస్తాయని ఎమరీ విశ్వవిద్యాలయం (అట్లాంటా-అమెరికా) పరిశోధకులు తేల్చారు.
  • జూనియర్లను హైకోర్టు జడ్జి పోస్టులకు సిఫార్సు చేయడంపై న్యాయాధికారి అభ్యంతరం తన కన్నా జూనియర్లు అయిన న్యాయాధికారులను హైకోర్టు జడ్జి పోస్టులకు కొలీజియం సిఫార్సు చేయడంపై హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ న్యాయాధికారి బుధవారం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.