పెట్రోల్‌ ట్యాంకుకు చీమలు.. ఇందులో నిజమెంత?

Eenadu icon
By National News Team Published : 18 Jun 2026 00:31 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Fact Check | ఇంటర్నెట్ డెస్క్‌: ఇంధన దిగుమతులను తగ్గించుకోవడం, కాలుష్యాన్ని నివారించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్‌ బ్లెండింగ్‌ను ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం 20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ లభిస్తోంది. వంద శాతం ఇథనాల్‌ వినియోగానికీ చట్టబద్ధమైన అనుమతులు తాజాగా జారీ చేసింది. అయితే, ఇ20 పెట్రోల్‌ వినియోగం వల్ల ఇంజిన్‌లు పాడవుతున్నాయంటూ జరుగుతోన్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. తాజాగా ఇ20 పెట్రోల్‌ పోసిన వాహన ట్యాంకులకు చీమలు పడుతున్నాయంటూ మరో ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం పేర్కొంది. ఇలాంటి వదంతులు ప్రజలు నమ్మొద్దని ‘ఎక్స్‌’ వేదికగా విజ్ఞప్తి చేసింది. ( Fact Check)

ఇ20 పెట్రోల్‌ చీమలను ఆకర్షిస్తుందంటూ కొందరు సోషల్‌ మీడియా వేదికగా దుష్ప్రచారం చేయడం తమ దృష్టికి వచ్చిందని కేంద్రం తెలిపింది. 20 శాతం ఇథనాల్‌ కలిపిన ఇంధనం చీమలను ఆకర్షిస్తుందనడానికి ఎలాంటి శాస్ర్తీయపరమైన ఆధారాల్లేవని పేర్కొంది. ఇ20 ఇథనాల్‌ను చీమలు ఆకర్షిస్తాయన్న ప్రచారాన్ని ప్రభుత్వరంగ చమురు సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) కూడా ఖండించింది. పెట్రోల్ మిశ్రమం కోసం ఉపయోగించే ఫ్యూయల్-గ్రేడ్ ఇథనాల్ ఉత్పత్తి ప్రక్రియలో మిగిలిపోయిన చక్కెరలను తొలగిస్తారని, పైగా ఫ్యూయల్ ఇథనాల్‌లో కీటకాలను దూరంగా ఉంచే డీనాచురెంట్లు ఉంటాయని పేర్కొంది. అందువల్ల, పెట్రోల్‌ ట్యాంకుకు చీమలు పడుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారానికి ఎలాంటి ఆధారాలూ లేవని కొట్టి పారేసింది. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయొద్దని హెచ్చరించింది.


► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మూడు రోజుల్లో నీట్‌ పరీక్ష.. విద్యార్థులకు ఎన్‌టీఏ మెసేజ్‌ నీట్‌-యూజీ రీటెస్టును పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ’ తెలిపింది.
  • టెలిగ్రామ్‌ కొత్త డార్క్‌ వెబ్‌.. నేరగాళ్లకు అడ్డా: కేంద్రం సంచలన ఆరోపణలు Telegram: మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు చేసింది. ఈ యాప్‌ను ‘కొత్త డార్క్‌ వెబ్‌’గా పేర్కొన్న కేంద్రం.. ఇది నేరగాళ్లకు అడ్డగా మారిందని ఆరోపించింది. 
  • ఒక్కో ఎంపీకి మరో రూ.10కోట్లు ఇచ్చారు - సంజయ్‌ రౌత్‌ శివసేన (యూబీటీ)లో సంక్షోభం ముదురుతున్నట్లే కనిపిస్తోంది. ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశానికి ఆరుగురు ఎంపీలు డుమ్మా కొట్టడంపై పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
  • లోయలో పడిన బొలెరో.. ఏడుగురి దుర్మరణం హిమాచల్‌ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
  • చీలిక వార్తల వేళ శివసేన (యూబీటీ) ఎంపీల భేటీ.. ముగ్గురే హాజరు Shiv Sena UBT: ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) రెండోసారి చీలిపోవడం ఖాయంగానే కన్పిస్తోంది.
  • అయోధ్య విరాళాల వివాదం.. సీసీటీవీ దృశ్యాలు తారుమారు..! Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర విరాళాలు, కానుకల్లో అవకతవకలు జరిగాయన్న కేసులో.. సీసీటీవీలు ట్యాంపరింగ్‌ అయ్యాయని తాజాగా సిట్‌ గుర్తించింది.
  • ఎరుపు రంగు చెవులతో అరుదైన ఏనుగు ఉత్తరాఖండ్‌లోని కార్బెట్‌ టైగర్‌ రిజర్వ్‌లో అరుదైన మగ ఏనుగు పర్యాటకులను ఆకర్షిస్తోంది.
  • ఇంధన ధరలు వెంటనే తగ్గించలేం: కేంద్రం Fuel prices: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా.. భారత్‌లో వెంటనే ఇంధన ధరలు తగ్గించలేమని కేంద్రం పేర్కొంది.
  • విశాఖపై కన్ను.. మళ్లీ బంగాళాఖాతం జలాల్లోకి పాక్‌ సబ్‌మెరైన్లు.. ! Pakistan: 1971 ఇండియా-పాక్‌ వార్‌.. బంగ్లాదేశ్‌ విముక్తి కోసం జరిగిన ఈ యుద్ధంలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని దాయాది కళ్లారా చూసింది.
  • భర్త మరణించినా అతని ఆస్తి నుంచి మాజీ భార్య భరణం పొందవచ్చు దంపతులు విడిపోయిన కేసుల్లో.. భర్త మరణానంతరం కూడా అతని ఆస్తి నుంచి భరణం పొందే హక్కు మాజీ భార్యకు ఉంటుందని బాంబే హైకోర్టు పేర్కొంది.
  • చీలిక ముంగిట ‘సేన’, ఎస్పీ! దేశంలో తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ), అఖిలేశ్‌ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) రాజకీయ సంక్షోభాల ముంగిట నిలిచినట్లు స్పష్టమవుతోంది.
  • మన విద్యావ్యవస్థ పిల్లల్ని చిదిమేస్తోంది కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బుధవారం రాజస్థాన్‌లోని కోటాలో ‘‘ఛాత్రోంకీ గూంజ్‌’’ (విద్యార్థుల ప్రతిధ్వని) పేరుతో ఏర్పాటైన మహార్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.
  • విద్యార్థుల భవితవ్యంతో రాహుల్‌ రాజకీయం: భాజపా వైద్య విద్యలో ప్రవేశం పొందాలని కోరుకుంటున్న అభ్యర్థులతో రాహుల్‌గాంధీ రాజకీయం చేస్తున్నారని భాజపా ఆరోపించింది.
  • భారత్‌ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్ర: భాగవత్‌ దేశ ఎదుగుదలను అడ్డుకునేందుకు తప్పుడు కథనాలు సృష్టించి, ప్రచారం చేసే ప్రయత్నాలు భారత్‌తోపాటు విదేశాల్లోనూ జరుగుతున్నాయని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు.
  • 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు విస్తృత మద్దతు తీవ్ర నేరాలకు పాల్పడి 30 రోజుల కన్నా ఎక్కువ కాలం నిర్బంధంలో ఉన్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే 130వ రాజ్యాంగ...
  • జాక్‌ఫ్రూట్‌తో జాక్‌పాట్‌ పెరుగుతున్న ఖర్చులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు సంప్రదాయ సాగు నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లిస్తున్నాయి.
  • గతం కాదు.. భవిష్యత్తు ముఖ్యం! క్షమించడం అలవాటు చేసుకోండి. క్షమించినంత మాత్రాన.. ఇతరులు చేసిన తప్పు ఆమోదయోగ్యమేనని మీరు అంగీకరించినట్లేమీ కాదు.
  • సైబర్‌ నేరగాళ్లు పరాన్నజీవులు అమాయకులైన మదుపరుల సొమ్మును కాజేస్తోన్న సైబర్‌ నేరగాళ్లు పరాన్న జీవులని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ మండిపడ్డారు.
  • నెలలు నిండని ప్రసవాలను సూచించే రక్త పరీక్ష నెలలు నిండకముందే ప్రసవించిన గర్భిణుల రక్తంలో అణువుల పరంగా కొన్ని తేడాలు ఉన్నాయని, ఇలాంటి వారిలో మొదటి త్రైమాసికంలోనే తేడాలు కనిపిస్తాయని ఎమరీ విశ్వవిద్యాలయం (అట్లాంటా-అమెరికా) పరిశోధకులు తేల్చారు.
  • జూనియర్లను హైకోర్టు జడ్జి పోస్టులకు సిఫార్సు చేయడంపై న్యాయాధికారి అభ్యంతరం తన కన్నా జూనియర్లు అయిన న్యాయాధికారులను హైకోర్టు జడ్జి పోస్టులకు కొలీజియం సిఫార్సు చేయడంపై హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ న్యాయాధికారి బుధవారం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

English Translation

Ants in petrol tank.. What is the truth in this?

Eenadu icon
By National News Team Published : 18 Jun 2026 00:31 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Fact Check | Internet Desk: Central government is promoting ethanol blending in petrol with an aim to reduce fuel imports and prevent pollution. At present, petrol with 20 percent ethanol is available. It has also issued legal permits for the use of 100 percent ethanol. However, the Center has denied the ongoing campaign that the engines are damaged due to the use of E20 petrol. Recently, another campaign has surfaced that ants are falling into the tanks of vehicles filled with E20 petrol. The fact check department of PIB said that this campaign is completely false. 'X' appealed to people not to believe such rumours. ( Fact Check)

The center said that they have come to the notice of some people spreading misinformation on social media that E20 petrol attracts ants. It said there was no scientific evidence that fuel with 20 percent ethanol would attract ants. State-run oil company Bharat Petroleum Corporation Limited (BPCL) has also denied the campaign that E20 ethanol is attracted to ants. The fuel-grade ethanol used for gasoline blending is said to remove residual sugars from the production process, and fuel ethanol contains denaturants that repel insects. Therefore, it dismissed the campaign that ants are infesting the petrol tank as having no basis. It warned against spreading such untruths.


► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • NEET exam in three days.. NTA message to students The 'National Testing Agency' has said that elaborate arrangements have been made to conduct the NEET-UG retest in an armed manner.
  • Telegram's new dark web. Telegram: Center made sensational allegations against messaging platform Telegram. Calling this app as the 'new dark web', the Center has alleged that it has become an obstacle for criminals. 
  • Another Rs.10 crore was given to each MP - Sanjay Raut The crisis in Shiv Sena (UBT) seems to be deepening. The leadership of the party expressed their anger on six MPs staying silent for the parliamentary meeting of the party.
  • Bolero that fell in the valley Seven people died A fatal road accident took place in Chamba district of Himachal Pradesh.
  • When Shiv Sena (UBT) MPs met at the time of the news, only three attended. Shiv Sena UBT: The Uddhav Thackeray-led Shiv Sena (UBT) seems certain to split for the second time.
  • Ayodhya donation controversy.. CCTV footage tampered..! Ayodhya Ram Mandir: In the case of tampering with donations and gifts of Ayodhya Ram Mandir, the SIT recently found that the CCTVs were tampered with.
  • A rare elephant with red ears. A rare male elephant is attracting tourists in Uttarakhand's Corbett Tiger Reserve.
  • Fuel prices not cut soon: Centre. Fuel prices: Even if crude oil prices are reduced internationally, the center has said that fuel prices will not be reduced immediately in India.
  • An eye on Visakhapatnam.. Again, Pakistani submarines enter the waters of the Bay of Bengal..! Pakistan: 1971 India-Pak War.. In this war for the liberation of Bangladesh, Daiyadi witnessed the capability of Indian Navy. Bombay High Court has said that in cases where the couple has separated.. even after the death of the husband, the ex-wife has the right to receive maintenance from his property.
  • Chilika Mungita 'Sena', SP! If we look at the latest political developments in the country, it is clear that the Uddhav Thackeray-led Shiv Sena (UBT) and Akhilesh Yadav's Samajwadi Party (SP) are on the brink of political crisis.
  • Our education system is failing our children. Congress supremo Rahul Gandhi on Wednesday addressed a rally organized under the name 'Chatronki Goonj' (Students' Echo) in Kota, Rajasthan.
  • Rahul's politics with the future of students: BJP BJP accuses Rahul Gandhi of playing politics with candidates who want admission in medical education.
  • Conspiracy to stop India's growth: Bhagwat RSS Chief Mohan Bhagwat said that attempts to create and propagate false stories to hinder the growth of the country are being made in India as well as abroad.
  • Wide support for the 130th Constitutional Amendment Bill. Article 130 of the Constitution, which allows the dismissal of Prime Ministers and Chief Ministers who have been detained for more than 30 days for serious crimes...
  • Jackpot with Jackfruit Rising costs and adverse weather conditions are diverting farmers from traditional cultivation to alternative crops.
  • Not the past.. The future is important! Make it a habit to forgive. Just sorry.. It is not like you accept that wrongdoing by others is acceptable.
  • Cybercriminals are parasites. Chief Justice of the Supreme Court Justice Suryakant said that cybercriminals who are taking money from innocent investors are parasites.
  • Blood test that indicates premature births Researchers at Emory University (Atlanta-USA) have concluded that there are some molecular differences in the blood of preterm pregnant women, and that these differences can be seen in the first trimester. A judge from Himachal Pradesh on Wednesday approached the Supreme Court against the collegium's recommendation of junior judges to the posts of high court judges.