కామారెడ్డి, డిసెంబర్ 19:తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయి.. ఆ వెంటనే ఫలితాలు సైతం వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో నకిలీ కుల ధృవీకరణ పత్రంతో సర్పంచ్ పదవికి ఎన్నికైనట్లు గ్రామస్తులు తాజాగా గుర్తించారు. దాంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వారంతా చేరుకుని ఆందోళన బాట పట్టారు. అతడిని సర్పంచ్ పదవి నుంచి వెంటనే తొలగించి.. మళ్లీ గ్రామ పంచాయతీ ఎన్నిక నిర్వహించాలంటూ కలెక్టరేట్ ఎదుట గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.


జిల్లాలోని రాజంపేట మండలం అన్నారం గ్రామం ఎస్టీ రిజర్వుడ్‌గా నిర్ణయించారు. ఈ గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా రవీందర్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో అతడు సర్పంచ్‌గా విజయం సాధించాడు. అయితే అతడు ఎస్టీ కాదని.. నకిలీ కుల ధృవీకరణ పత్రం ద్వారా ఈ ఎన్నికల బరిలో నిలిచినట్లు ఆ తర్వాత గ్రామస్తులు గుర్తించారు. దాంతో శుక్రవారం ఉదయం కామారెడ్డి జిల్లా కలెకర్ట్ కార్యాలయానికి గ్రామస్తులంతా చేరుకుని.. ఆందోళన చేపట్టారు.


తప్పుడు కుల ధృవీకరణ పత్రం ద్వారా రవీందర్‌ ఈ ఎన్నికల బరిలో నిలిచి గెలిచారంటూ విమర్శించారు. అతడిని సర్పంచ్ పదవి నుంచి డిస్మిస్ చేసి.. గ్రామ పంచాయతీకి మళ్లీ ఎన్నిక నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలోని ఏవోకు అన్నారం గ్రామస్తులు వినతి పత్రం సమర్పించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

For MoreTelangana NewsAndTelugu News


English Translation

Kamareddy, December 19:The Gram Panchayat elections in Telangana have been completed.. Soon after that the results have come out. The villagers recently found out that the Sarpanch was elected with a fake caste certificate in this election. They all reached the district collector's office and started protesting. The villagers protested in front of the Collectorate demanding that he should be removed from the post of Sarpanch immediately. This incident took place in Kamareddy district.


Annaram village of Rajampeta mandal in the district has been decided as ST reserve. Ravinder Bari stood as Sarpanch candidate from this village. He won as Sarpanch in this election. But the villagers later found out that he was not an ST. On Friday morning, all the villagers reached the Kamareddy district collector's office and started protesting.


Ravinder was criticized for winning the election with a fake caste certificate. They demanded the government to dismiss him from the post of Sarpanch and conduct re-election to the Gram Panchayat. Annaram villagers submitted a petition to the AO in the office as the district collector was not available.

Read this news too..

For MoreTelangana NewsAndTelugu News