న్యూఢిల్లీ, డిసెంబర్ 19:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు న్యూఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. శుక్రవారం రాత్రి కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు బేటీ అయ్యారు. తాజ్ ప్యాలెస్ హోటల్‌లో అమిత్ షాతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని ఈ సందర్భంగా అమిత్ షాకు సీఎం చంద్రబాబు వివరించారు. ఇటీవల విశాఖపట్నం వేదికగా నిర్వహించిన పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు పెద్ద ఎత్తున సానుకూల స్పందన వచ్చిందని అమిత్ షాకు సీఎం వివరించారు. అలాగే రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై సైతం వీరు ప్రస్తావించినట్లు సమాచారం. అనంతరం క్రెడాయ్ నేషనల్ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఎకనామిక్ టైమ్స్ సంస్థ ఆయనకు పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు.. సీఎం చంద్రబాబును ఘనంగా సత్కరించారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు పలువురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలవుతూ.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పలువురు ఎంపీలు ఆయన వెంట ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన
అమరావతిలో భారీ పెట్టుబడులు.. ముందుకొచ్చిన మలేసియా కంపెనీలు
Updated Date - Dec 19 , 2025 | 09:51 PMEnglish Translation
New Delhi, December 19:Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu's visit to New Delhi has been busy. On Friday night, CM Chandrababu met Union Home Minister Amit Shah. CM Chandrababu met Amit Shah at Taj Palace Hotel. On this occasion, CM Chandrababu explained the progress of various projects in the state to Amit Shah. The CM explained to Amit Shah that the investment partnership conference organized recently at Visakhapatnam has received a large positive response. It is also reported that they mentioned the political developments in the state. Later, CM Chandrababu participated in Credai National Conference.
CM Chandrababu Naidu reached New Delhi on Thursday evening. The Economic Times has announced the award to him. In this background, TDP MPs honored CM Chandrababu grandly. Later he had a meeting with many Union Ministers. From Friday morning till night, CM Chandrababu had a series of meetings with several Union Ministers. Many MPs are accompanying CM Chandrababu during his visit to Delhi.
Also read this news..
It's like a festival for passengers. News.. Key announcement of railway department
Malaysia has taken the lead. Companies
Updated Date - Dec 19 , 2025 | 09:51 PM