గోల్డ్‌ మెడల్‌ కోసం.. విరాట్‌తో సూర్యవంశీని బరిలోకి దింపాలి: శ్రీశాంత్

Eenadu icon
By Sports News Team Updated : 10 Jun 2026 12:15 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు వందేళ్ల అనంతరం ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చూడబోతున్నాం. లాస్‌ ఏంజెలెస్ వేదికగా 2028లో ఒలింపిక్స్‌ జరగబోతున్నాయి. టీమ్‌ఇండియా స్వర్ణ పతకం నెగ్గాలనేదే అభిమానుల ఆకాంక్ష. టీ20 ఫార్మాట్‌లో ఈ మ్యాచులు జరుగుతాయి. విరాట్‌ కోహ్లీతో కలిసి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఓపెనర్‌గా పంపించాలని మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సూచించాడు. అయితే, విరాట్ కోహ్లీ టీ20లకు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ, ఒలింపిక్స్‌లో ఆడాలని ఉందని గతంలో విరాట్ తన మనసులోని మాట వెల్లడించాడు. ఇప్పుడు వైభవ్‌ దూకుడుకు విరాట్ సీనియారిటీ కలిస్తే బాగుంటుందనేది శ్రీశాంత్ అభిప్రాయం. 

  • అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌.. విరాట్ బాటలోనే హార్దిక్‌ పాండ్య!

‘‘వైభవ్ సూర్యవంశీ ఆటను చూస్తుంటే ముచ్చటేస్తోంది. అద్భుతంగా ఆడేస్తున్నాడు. రాబోయే ఒలింపిక్స్‌లో మనం గోల్డ్ పతకం కొట్టాలంటే బెస్ట్‌ టీమ్‌నే పంపించాలి. విరాట్ కోహ్లీ జట్టులో ఆడాలని విజ్ఞప్తి చేస్తున్నా. అప్పుడు వైభవ్‌ సూర్యవంశీతో కలిసి విరాట్ ఓపెనింగ్‌ చేయొచ్చు. సీనియర్‌, జూనియర్‌తో జట్టు సమతూకంగా ఉంటుంది. ఈ జోడీని చూసేందుకూ బాగుంటుంది. ముందుగా విరాట్ కోహ్లీని టీ20 జట్టులో ఆడమని సెలక్టర్లు కోరాలి. అతడి ఫిట్‌నెస్‌ను చూస్తే వయసు సమస్యే కాదు. నేను చెప్పే మాటలు వివాదానికి దారితీసినా ఫర్వాలేదు. ఎలాగైనా సరే విరాట్‌ను ఒప్పించాలి. ఒలింపిక్స్‌లో ఆడేలా చూడాలి’’ అని శ్రీశాంత్ తెలిపాడు.

కేవలం 15 ఏళ్ల వయసులోనే టీమ్ఇండియాకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీ.. తుది జట్టులో ఆడితే మాత్రం చరిత్ర సృష్టించినవాడవుతాడు. సచిన్‌ను అధిగమించి జాతీయ జట్టకు ఆడిన అతిపిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా మారతాడు. ఇప్పటికే వైభవ్‌ ఆటను అండర్ -19, ఐపీఎల్ మ్యాచుల్లో చూశాం. స్టార్‌ బౌలర్లనూ తుత్తునీయుల్ని చేసి పరుగులు రాబట్టాడు. 

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 12:10 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఫిఫా వరల్డ్ కప్‌లో దక్షిణ కొరియా శుభారంభం.. చెకియాపై సూపర్ విక్టరీ ఆసియా దేశం దక్షిణ కొరియా ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో బోణీ కొట్టింది. తన తొలి మ్యాచ్‌లోనే చెకియాను చిత్తు చేసింది.
  • మనుబాకర్ కోచ్‌ జస్పాల్ రాణా కన్నుమూత Coach Jaspal Rana: దిగ్గజ షూటర్‌, ప్రఖ్యాత కోచ్‌ జస్పాల్‌ రాణా (49) కన్నుమూశారు.
  • తొలి మ్యాచ్‌లోనే 3 రెడ్‌ కార్డులు.. అతడే అసలైన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ ఆటగాళ్లు అద్భుతంగా ఆడి తమ జట్టును గెలిపించడం చూస్తుంటాం. కానీ, మ్యాచ్‌ రిఫరీ కూడా తనదైన శైలి నిర్ణయాలతో వార్తల్లోకెక్కాడు.
  • సంబరం ఆరంభం మెక్సికోలో గురువారం ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఆరంభ వేడుకల్లో భాగంగా ట్రోఫీ విగ్రహాన్ని ప్రదర్శించారిలా..  మధ్యలో బంగారు వర్ణంలో మెరిసిపోయిన పెద్ద ప్రపంచకప్‌... చుట్టూ బంతులతో ప్రదర్శనకారులు.. గిరిజన వస్త్రధారణతో ఇంకొందరు.. ఆపై పాప్‌ సింగర్లు ఆటాపాటా!
  • అమ్మాయ్‌.. అదిగో ఇంకో కప్పు! మహిళల క్రికెట్లో భారత్‌ ఎంత మెరుగుపడుతున్నా సరే.. ప్రపంచకప్‌ వస్తోందంటే మన జట్టును ఫేవరెట్లలో ఒకటిగా పరిగణించడానికి సందేహమే! గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో కూడా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి మేటి జట్లను దాటి భారత్‌ టైటిల్‌ గెలుస్తుందని నమ్మినవాళ్లు తక్కువమందే.
  • భారత జట్టులో ‘ఈ’ ఛాంపియన్స్‌ ఆటగాడు శ్రీలంకతో సిరీస్‌లో ఆడే భారత అండర్‌-19 వన్డే జట్టులో హైదరాబాద్‌ ‘ఈ’ ఛాంపియన్స్‌ ఆటగాడు ఊట్కూరు యశ్వీర్‌ గౌడ్‌కు చోటు దక్కింది.
  • మహిళల జట్టులో దీక్ష గుంటూరుకు చెందిన కాట్రగడ్డ దీక్ష అండర్‌-19 భారత మహిళల టీ20 జట్టులో చోటు దక్కించుకుంది. వికెట్‌ కీపర్, ఓపెనింగ్‌ బ్యాటర్‌ అయిన దీక్షను శ్రీలంకతో సొంతగడ్డపై జరిగే సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు.
  • వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌దే అగ్రస్థానం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది. వార్షిక సవరణల్లో భాగంగా టీమ్‌ఇండియా (118) ఒక పాయింట్‌ కోల్పోయినప్పటికీ అగ్రస్థానంలోనే ఉంది.
  • ఆస్ట్రేలియా టీ20 జట్టులో నిఖిల్‌ బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో తలపడే ఆస్ట్రేలియా జట్టులో భారత్‌కు చెందిన బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ నిఖిల్‌ చౌదరి చోటు దక్కించుకున్నాడు. గత 60 ఏళ్లలో ఆస్ట్రేలియాకు ఆడబోతున్న తొలి భారత పురుష క్రికెటర్‌ నిఖిలే.
  • ఆసీస్‌పై బంగ్లా తొలిసారి బంగ్లాదేశ్‌ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాపై తొలిసారి వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. గురువారం వర్ష ప్రభావిత రెండో వన్డేలో బంగ్లా 5 వికెట్లతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలివుండగానే ఆతిథ్య జట్టు 2-0తో దక్కించుకుంది.
  • అఫ్గాన్‌ చేతిలో భారత్‌ ఓటమి ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్‌-ఎకు తొలి దెబ్బ! తిలక్‌ బృందం 4 పరుగుల (డ/లూ) తేడాతో అఫ్గానిస్థాన్‌-ఎ చేతిలో పరాజయం చవిచూసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను ఇన్నింగ్స్‌కు 49 ఓవర్లుగా కుదించగా.. మొదట భారత్‌ 9 వికెట్లకు 349 పరుగులు చేసింది.
  • సంక్షిప్త వార్తలు స్టార్‌ షూటర్లు మను బాకర్, ఇషా సింగ్‌ ఆసియా క్రీడల్లో రెండు ఈవెంట్లలో తలపడనున్నారు. సెప్టెంబరులో జపాన్‌లో జరగబోయే ఆసియా క్రీడల్లో బరిలో దిగబోయే 30 మంది సభ్యులతో కూడిన జట్టును భారత జాతీయ రైఫిల్‌ సంఘం గురువారం ప్రకటించింది.
  • బోణీ కొట్టిన మెక్సికో.. దక్షిణాఫ్రికాపై విజయం కోట్లాది మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న సాకర్‌ సంరంభం ప్రారంభమైంది. మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య మెక్సికో జట్టు ఘనంగా బోణీ కొట్టింది.
  • అట్టహాసంగా ప్రారంభమైన ఫిఫా ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ అంటే పడిచచ్చే కోట్లాది మంది అభిమానులు ఆనందంతో ఉప్పొంగుతున్న వేళ.. విశ్వ సాకర్‌ సంగ్రామం మొదలైంది. మైదానంలో తమ అభిమాన ఆటగాళ్ల మ్యాజిక్‌లను చూడాలని ఉవ్విళ్లూరుతున్న వారు ఇక నెలన్నర రోజులు పండగ చేసుకోనున్నారు. మెక్సికో సిటీలో అట్టహాసంగా ఫిఫా ప్రపంచకప్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌కు ముందు పాప్‌ సింగర్‌ షకీరా తన సంగీతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పలువురు కళాకారులు తమ ఆటపాటలు, విన్యాసాలతో అలరించారు.
  • చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. ఆసీస్‌ను ఓడించి వన్డే సిరీస్‌ కైవసం బంగ్లాదేశ్‌ క్రికెట్‌ టీమ్‌ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాపై తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను నెగ్గింది.
  • అండర్‌ 19 స్క్వాడ్‌లో ద్రవిడ్‌ కొడుకు భారత క్రికెట్‌ దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ కుమారుడు అన్వయ్‌ ద్రవిడ్‌ అండర్‌ 19 స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు.
  • భారత్‌-ఎ జట్టుకి గుంటూరు కుర్రోడు ఎంపిక గుంటూరు జిల్లాకు చెందిన యువ క్రికెటర్ షేక్ రషీద్ భారత్-ఎ జట్టులో స్థానం సంపాదించాడు.
  • ముక్కోణపు సిరీస్‌.. భారత్‌-ఎపై అఫ్గాన్‌-ఎ విజయం ముక్కోణపు సిరీస్‌లో భాగంగా భారత్‌-ఎతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌-ఎ జట్టు గెలిచింది.
  • ఆ జట్టుదే ఫిఫా వరల్డ్ కప్‌.. మెషిన్ లెర్నింగ్‌ అల్గారిథమ్‌ ఏం చెప్పిందంటే? ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ కోసం 48 జట్లు బరిలోకి దిగాయి. ఒకరికే టైటిల్ వస్తుంది. ఆ జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ దక్కనుంది.
  • ఐదుగురు మహిళా డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ల వ్యక్తిగత ఫొటోలు లీక్‌ మహిళల ప్రైవసీ విషయంలో ఆన్‌లైన్‌పై ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఐదుగురి రెజ్లర్ల ప్రైవేట్ ఫొటోలు నెట్టింట లీక్‌ కావడం చర్చనీయాంశంగా మారింది.

English Translation

For gold medal.. Suryavanshi should be pitted against Virat: Sreesanth

Eenadu icon
By Sports News Team Updated : 10 Jun 2026 12:15 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

Internet Desk: We are going to see cricket in the Olympics after almost a hundred years. The Olympics are going to be held in Los Angeles in 2028. The aspiration of the fans is for Team India to win the gold medal. These matches will be played in T20 format. Former cricketer Sreesanth suggested sending young sensation Vaibhav Suryavanshi as an opener along with Virat Kohli. However, it is known that Virat Kohli said goodbye to T20. But, in the past, Virat expressed his desire to play in the Olympics. Sreesanth is of the opinion that it would be better if Virat's seniority is added to Vaibhav's aggression. 

  • One-day series with Afghanistan.. Hardik Pandya is on the path of Virat! He is playing brilliantly. If we want to win a gold medal in the upcoming Olympics, we must send the best team. Virat Kohli is appealing to play in the team. Then Virat can do the opening along with Vaibhav Suryavanshi. The team is balanced with seniors and juniors. Good to see this pair. First the selectors should ask Virat Kohli to play in the T20 team. Looking at his fitness, age is not a problem. I don't care if my words lead to controversy. Virat needs to be convinced anyway. Sreesanth said that he should be seen playing in the Olympics.

    Vaibhav Suryavanshi, who was selected for Team India at the age of 15, would have made history if he played in the final team. He surpassed Sachin to become the youngest Indian cricketer to play for the national team. We have already seen Vaibhav play in Under-19 and IPL matches. He made the star bowlers and got runs. 

    ► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 12:10 IST

    Note:Advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

    More

    • South Korea starts well in FIFA World Cup..Super victory over Czechia Asian country South Korea has won the Football World Cup. Manubakar's coach Jaspal Rana passes away. Coach Jaspal Rana: Legendary shooter, famous coach Jaspal Rana (49) passed away.
    • 3 red cards in the first match.. He was the real 'player of the match'. We see the players playing brilliantly and leading their team to victory. But, the match referee is also in the news with his style of decisions.
    • The celebration begins. As part of the opening ceremony of the Fifa Football World Cup in Mexico on Thursday, the trophy statue was unveiled....a big golden World Cup in the middle...surrounded by performers with balls...some in tribal costumes...and then pop singers playing!
    • Girls...that's another cup! No matter how much India is improving in women's cricket, it is doubtful that our team will be considered one of the favorites with the World Cup coming up! Even in last year's ODI World Cup, there are few people who believed that India will win the title after beating the best teams like Australia, England and South Africa. Hyderabad 'E' Champions player Yashvir Goud has been named in the Indian Under-19 ODI team for the series against Sri Lanka.
    • Deeksha in the women's team Katragadda Deeksha from Guntur has made it to the Under-19 Indian Women's T20 team. Wicket keeper and opening batsman Deeksha has been selected by the selectors for the home series against Sri Lanka.
    • India tops the ODI rankings. The Indian men's team has retained the number one position in the ICC ODI rankings. Team India (118) has lost one point as part of the annual revisions but remains at the top position.
    • Nikhil in Australia's T20 team Indian batting all-rounder Nikhil Chaudhary has been included in the Australian team to face Bangladesh in the T20 series. Nikhil is the first Indian male cricketer to play for Australia in the last 60 years.
    • Bangla first time against Aussies Bangladesh made history. Won the ODI series against Australia for the first time. Bangladesh won by 5 wickets in the rain-affected second ODI on Thursday. The home team won the three ODI series 2-0 with one match remaining.
    • India lost to Afghanistan The first blow to India-A in the triangular ODI series! Tilak's team lost to Afghanistan-A by 4 runs (D/L). Due to rain, the match was reduced to 49 overs per innings.. First India scored 349 runs for 9 wickets.
    • Brief News Star shooters Manu Bakar and Isha Singh will compete in two events at the Asian Games. The National Rifle Association of India on Thursday announced the 30-member squad for the Asian Games to be held in Japan in September. Millions of people have been waiting for the start of soccer. In the opening match of the FIFA World Cup held at Mexico City Stadium, the host Mexico team hit the ball.
    • The FIFA World Cup started with a bang When crores of football fans are exhilarated with joy, the world soccer war has started. Those who are eager to see the magic of their favorite players on the field will be celebrating for a month and a half. The FIFA World Cup celebrations began in Mexico City with a bang. Before the opening match of the tournament, pop singer Shakira mesmerized the audience with her music. Many artists entertained with their games and stunts.
    • Bangladesh, who created history... won the ODI series by defeating Aussies. Bangladesh cricket team created history. Won first bilateral series against Australia.
    • Dravid's son in U-19 squad Indian cricket legend Rahul Dravid's son Anvay Dravid has got a place in the under 19 squad.
    • Guntur boy selected for India-A team A young cricketer from Guntur district, Sheikh Rasheed, got a place in India-A team.
    • Triangle series.. Afghanistan-A win over India-A Afghanistan-A team won the one-day match against India-A as part of the triangular series.
    • That team is the FIFA World Cup.. What did the machine learning algorithm say? 48 teams have entered the ring for the Football World Cup. Only one gets the title. The team will get a huge amount of prize money.
    • Personal photos of five female WWE wrestlers leaked. Women's privacy is still being criticized online. Recently, the leak of private photos of five wrestlers has become a topic of discussion.