‘ఆమె’ అందానికి ముగ్ధుడై.... భారతీరాజా సినీ ప్రస్థానమిది..

- A
- A+
- A++

భారతీరాజా.. భారతీయ సినీ ప్రపంచంలో గ్రామీణ జీవితానికి కొత్త భాషను నేర్పిన దర్శకుడు. పల్లె అందం, అక్కడి మనుషుల స్వచ్ఛమైన ప్రేమ, వారి అనుబంధాలు - ఆనందాలు, బాధలు - భావోద్వేగాలను ఎంతో సహజంగా వెండితెరపై ఆవిష్కరించారు. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా మట్టివాసనతో నిండిన ఓ జీవనరాగంలా అనిపిస్తుంది. ప్రేమను కవిత్వంగా, బంధాలను హృద్యంగా, ప్రకృతిని పాత్రగా మలిచిన ఆయన చిత్రాలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. అందుకే భారతీరాజా కేవలం ఒక దర్శకుడు కాదు... భావోద్వేగాలకు దృశ్యరూపమిచ్చిన ఓ గొప్ప కథకుడు. నేడు ఆయన భౌతికంగా దూరమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానాన్ని ఓసారి చూద్దాం.
సహాయ దర్శకుడిగా మొదలై..
1941 జులై 17న తేని జిల్లా అల్లి నగరం గ్రామంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నసామి పెరియమాయ తేవర్. చిన్నప్పటినుంచే కళలపై ఆసక్తి ఉన్నప్పటికీ, సినిమా రంగంలోకి రావడం సులభం కాలేదు. కన్నడ దర్శకుడు పుట్టణ్ణ కనగల్, పి.పుల్లయ్య వంటి దిగ్గజాల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసి సినిమాలో మెలకువలు నేర్చుకున్నారు. అలా ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
‘16 ఏళ్ల వయసు’తో సినీ సంప్రదాయాన్ని తిరగరాసి..
1977లో వచ్చిన ‘16 వయతినిలే’ (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో రీమేక్ అయ్యింది) సినిమాతో భారతీరాజా దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పటివరకు కేవలం స్టూడియో సెట్టింగులకే పరిమితమైన తమిళ సినిమాను నిజమైన పల్లెటూరి లొకేషన్లలోకి తీసుకెళ్లి సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. ఎలాంటి మేకప్ లేకుండా హీరోలను చూపించడం, ఎలాంటి అదనపు సొగసుల జోలికి వెళ్లకుండా సహజంగా ఉన్న అమ్మాయిలను హీరోయిన్లుగా పరిచయం చేయడంతో అప్పటి సినీ సంప్రదాయాలను తిరగరాశారు.
తెలుగులోనూ తనదైన ముద్ర..
కేవలం గ్రామీణ చిత్రాలకే పరిమితం కాకుండా, ‘సిగప్పు రోజాక్కల్’ (తెలుగులో ఎర్ర గులాబీలు) వంటి సైకో థ్రిల్లర్ చిత్రాలతో తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ (1981) చిత్రం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన తీసిన ‘వేదం పుదిదు’ సినిమా సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. రాధిక, రాధ, రేవతి, కార్తీక్, విజయశాంతి వంటి ఎందరో నటీనటులను ఆయనే వెండితెరకు పరిచయం చేశారు.
‘ఆమె’ అందానికి ముగ్ధుడై..
భారతీరాజా తన సినిమాల్లో ఎక్కువగా పల్లెటూరి కథలనే చూపించేవారు. మట్టివాసనను వెండితెర పైకి తెచ్చిన దర్శకుడిగా ఆయనకు పేరుంది. హీరోయిన్లను మేకప్ లేకుండా స్వచ్ఛంగా చూపించేవారు. దీని వెనుక కారణాన్ని ఆయన ఓ సందర్భంలో తనదైన చతురతను జోడించి చెప్పారు. ‘‘నేను ఒకమ్మాయితో ప్రేమలో పడ్డా. ఆమెను వెతుక్కుంటూ వెళ్తుంటా. ఆశ్చర్యంగా ప్రతిసారీ ఆమె నాకు పల్లెల్లోనే కనిపిస్తోంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె ఎవరో కాదు ‘ప్రకృతికాంత’. ఆమె అందానికి ముగ్ధుడినయ్యా. అందుకే కెమెరా పట్టుకుని ఆ అందాన్ని వెతుక్కుంటా’’ అంటూ పల్లెలపై తన ప్రేమను వ్యక్తపర్చారు.
పురస్కారాల పంట..
- భారతీరాజా ప్రతిభకు ఎన్నో అవార్డులు దాసోహమన్నాయి. ఆయన తన కెరీర్‌లో దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించి, ‘ఇయక్కునార్ ఇమయం (దర్శక శిఖరం)’ అనే బిరుదును పొందారు.
- జాతీయ అవార్డులు: వివిధ విభాగాల్లో మొత్తంగా 6 జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. ఇందులో తెలుగు చిత్రం ‘సీతాకోకచిలుక’కు ఉత్తమ ప్రాంతీయ చిత్ర అవార్డు కూడా ఉంది.
- పద్మశ్రీ పురస్కారం: సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ 2004లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది.
- వీటితో పాటు 4 ఫిలింఫేర్ అవార్డులు, 6 తమిళనాడు రాష్ట్ర అవార్డులు, నంది అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు.
నటుడిగానూ మెరిసి..
ఆయన కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా నటుడిగానూ అలరించారు. ‘ఆయుధ ఎళుతు’, ‘పాండియనాడు’, ‘తిరుచిత్రంబలమ్’ (తిరు), గతేడాది వచ్చిన విజయ్ సేతుపతి ‘మహారాజా’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. మోహన్‌లాల్ ‘తుడరుమ్’లో చివరిసారి తెరపై కనిపించారు. అలాగే ఆయన నటించిన ‘పులవర్’ చిత్రం ఇంకా విడుదల కావాల్సిఉంది. ఇదే నటుడిగా ఆయనకు చివరి సినిమా.
తర్వాతి తరం కోసం..
భారతీరాజా తర్వాతితరం చిత్రనిర్మాతలకు శిక్షణ ఇవ్వడానికి ‘భారతీరాజా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సినిమా (BRIIC)’ని స్థాపించారు. అందులో ఎంతోమందికి శిక్షణ ఇస్తున్నారు. ఎప్పుడు ఏ వేదిక పైకి వచ్చినా ‘నా ప్రియమైన తమిళ ప్రజలారా’ అంటూ పలకరించే ఆయనను కోల్పోవడంతో చిత్రసీమలో ఓ సువర్ణ అధ్యాయం ముగిసినట్లైంది.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 10:26 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 500 మంది.. అడవిలో 70 రోజుల షూట్: 50 ఏళ్ల ‘భక్త కన్నప్ప’ విశేషాలివీ కృష్ణంరాజు ప్రధాన పాత్రలో నటించిన ‘భక్త కన్నప్ప’ చిత్రానికి 50 ఏళ్లు. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర సంగతులివీ..
- రణ్‌వీర్ ‘డాన్ 3’ వివాదం వేళ.. తెర పైకి దీపిక ‘రేస్ 2’ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది ‘డాన్ 3’ చిత్రం. దీని చుట్టూ కొనసాగుతున్న చర్చల మధ్య రణ్‌వీర్ భార్య, నటి దీపికా పదుకొణెకు సంబంధించిన పాత వివాదం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
- రణ్‌వీర్ సింగ్‌పై నిషేధం.. బాలీవుడ్‌లో ఇక కన్పించడా? ‘ధురంధర్’ రెండు భాగాలతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని కొన్ని రోజులుగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు రణ్‌వీర్.
- ‘హల్లల్లల్లో’ అంటూ అదరగొట్టిన సింగర్.. ఎవరీ రక్షితా సురేశ్? ‘పెద్ది’లోని ప్రత్యేక గీతం పాడిన గాయని రక్షితా సురేశ్ గురించి పలు విశేషాలివీ..
- 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. కెరీర్‌పై నాగార్జున చెప్పిన విశేషాలు ప్రేమ కథలైనా, యాక్షన్ సినిమా అయినా, భక్తి పాత్రలైనా ప్రతి దానిలో కొత్తదనాన్ని చూపిస్తూ ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ గ్రీకువీరుడిగా స్థానం సొంతం చేసుకున్నారు అగ్ర కథానాయకుడు నాగార్జున.
- వెండి తెరకు మళ్లీ వెలుగులు.. కొవిడ్ తర్వాత జోష్ పెరిగిన ఓటీటీ సంస్కృతికి ఇప్పుడు క్రమంగా బ్రేక్ పడుతున్నట్లు తెలుస్తోంది.
- ఫస్ట్ మూవీ ఫ్లాప్.. ఫస్ట్ ఎలక్షన్ హిట్.. విజయ్ ఫిల్మ్ జర్నీ అసాధారణం ఒక సామాన్య కుర్రాడు.. వెండితెరపై డ్యాన్సులతో, ఫైట్లతో బాక్సాఫీస్ సామ్రాజ్యాన్ని శాసించాడు. మాములు నటుడిగా కనిపించిన వ్యక్తి.. నేడు లక్షలాది మంది గొంతుకగా మారి రాజకీయరంగంలో పెను సంచలనం సృష్టించాడు.
- గ్లామర్ క్వీన్ టు గ్లోబల్ స్టార్.. సమంత ఐకానిక్ పాత్రలివే.. ‘ఏ మాయ చేసావె’లో అమాయకపు చూపులతో మాయ చేసిన జెస్సీని ఎవరైనా మర్చిపోగలరా? ‘ఫ్యామిలీ మ్యాన్’లో ఆవేశంతో ఆమె చేసిన ఫైట్స్ వరల్డ్ ఆడియన్స్‌కు కూడా గుర్తే..
- జీవితం అంటే చదువు ఒక్కటేనా.. కోట్లు వసూలు చేసేంత కథ ‘వాళా’లో ఏముంది? ఏటా కొన్ని వందల సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి.. కానీ, కొన్నే మనల్ని పలకరిస్తాయి.. మనతో మాట్లాడతాయి.. మనసుల్ని కదిలిస్తాయి.. చిన్ననాటి జ్ఞాపకాల్ని తట్టి లేపుతాయి..
- ‘జననాయగన్’ మాత్రమే కాదు.. విడుదలకు ముందే లీక్ అయిన సినిమాలు అనేకం.. సినిమా అంటే కొన్ని వందల మంది శ్రమ. అలాంటిది థియేటర్‌లో విడుదల ముందే ఆన్‌లైన్ వచ్చేస్తే ఆ నిర్మాత, హీరోకు ఎంత కష్టం. సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రస్తుత పరిస్థితి ఇదే.
- ఏ కష్టానికి కుంగిపోని ‘ఆశ’..! తీరాన్ని అలలు తాకినట్లు ఆమె జీవితాన్ని కష్టాలు వెన్నంటాయి.. టీనేజ్‌లోనే ప్రేమ వివాహం.. గర్భిణిగా ఉన్న సమయంలో భర్త దూరం కావడంతో.. ఒక దశలో ఆత్మహత్యకు యత్నించినా.. ఆమె గానామృతాన్ని ఆస్వాదించే అదృష్టం ప్రపంచానికి ఉండటంతో మృత్యువును తప్పించుకొన్నారు.
- ‘చిచ్చుబుడ్డి’లా తళుక్కుమన్న బ్యూటీ.. ఎవరీ జోనితా గాంధీ? అడివి శేష్‌తో కలిసి జోనితా గాంధీ డ్యాన్స్ చేసిన ‘చిచ్చుబుడ్డి’ సాంగ్ విశేషంగా అలరిస్తోంది. ఇంతకీ జోనితా ఎవరు..?
- ‘ధురంధర్’ డైరెక్టర్.. ఎవరి వద్ద పని చేశారో తెలుసా? ‘ధురంధర్ 1’, ‘ధురంధర్ 2’ చిత్రాలతో సత్తా చాటారు ఆదిత్యధర్. ఆయన ఎవరి వద్ద శిక్షణ తీసుకున్నారంటే..
- పాక్ ఆర్మీలో మేజర్.. ఇండియాలో ‘బ్లాక్ టైగర్’: రియల్ ‘ధురంధర్’ కథ తెలుసా? Dhurandhar: ధురంధర్ సినిమా వేళ రియల్ ధురంధర్‌గా రవీంద్ర కౌశిక్ వైరల్ అవుతున్నారు.
- పాట వివాదం.. తెరపైకొచ్చిన రక్షిత.. ఈ హీరోయిన్ గుర్తుందా? ‘కేడీ’లోని ఓ పాట వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దానిపై స్పందించిన రక్షిత ఎవరంటే..?
- రూ.500 కోట్ల వేడుక.. తిరిగిస్తే ఒక డాలరే: ఆస్కార్ విశేషాలివే ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ‘ఆస్కార్’ అవార్డులంటే అందరికీ ఆసక్తే.
- ఆ తండ్రి పోరాటానికి ‘ఆస్కార్’.. ‘సిక్సర్’ కొట్టిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ Oscar Awards: కథలో బలం, పాత్రల మధ్య సంఘర్షణ ఉండాలే గానీ.. బాక్సాఫీసు లెక్కలతో పని లేకున్నా పురస్కారాల పంట పండుతుందని నిరూపించిందీ సినిమా.
- ఇవి సుకుమార్ వదిలిన బాణాలు... సరికొత్త కథలతో మెరుపులు.. సుకుమార్ వద్ద వర్క్ చేసిన వారంతా విజయాలతో దూసుకెళుతున్నారు. వారిపై ప్రత్యేక కథనం..
- ‘గీతగోవిందం’.. ఇది విజయ్-రష్మికల ప్రేమ ప్రయాణం.. ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక (Rashmika Mandanna) వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో.. వీరి ప్రేమ ప్రయాణాన్ని చూద్దాం..!
- నిన్న ‘ఫంకీ’.. ఇప్పుడు ‘బూకి’.. ఈ టైటిళ్లకు అర్థాలు వేరులే! ‘ఫంకీ’, ‘బూకి’ సినిమా టైటిళ్లకు అర్థాలు మీకు తెలుసా..?
English Translation
Struck by the beauty of 'her'....Bharti Raja's movie debut..

- A
- A+
- A++

Bharatiraja.. a director who taught a new language to rural life in the world of Indian cinema. The beauty of the countryside, the pure love of the people there, their attachments - joys, pains - emotions have been brought out on the silver screen very naturally. Every movie he directed feels like a living soul filled with the smell of soil. His films, which turned love into poetry, bonds into heart, and nature into character, left an indelible impression on the minds of the audience. That's why Bharathiraja is not just a director... he is a great storyteller who visualizes emotions. Today he is physically distant. On this occasion, let's take a look at his film debut.
Beginning as an assistant director..
Bhartiraja was born on July 17, 1941 in the village of Alli City, Theni district, and his original name was Chinnasamy Periyamaya Thevar. Despite being interested in the arts since childhood, it was not easy to enter the film industry. He worked as an assistant director with Kannada director Puttanna Kanagal and P. Pullaiah and learned his skills in cinema. That's how he entered the industry.
Rewrite the film tradition with '16 Vayathinile'..
Bhartiraja made his debut as a director with the movie '16 Vayathinile' (remade as 'Sixteen Years' in Telugu) in 1977. A new trend was started by taking Tamil cinema, which was limited to studio settings only, to real rural locations. He rewrote the film traditions of the time by showing heroes without any make-up and introducing natural girls as heroines without any extra finery.
His mark in Telugu...
Not limited to rural films, he showed his versatility with psycho thriller films like 'Sigappu Rojakkal' (Red Roses in Telugu). His Telugu film 'Sitakokachiluka' (1981) created a sensation at that time. His movie 'Vedam Pudidu' against caste discrimination led to a big debate in the society. He himself introduced many actors like Radhika, Radha, Revathi, Karthik, Vijayashanthi to the silver screen.
Impressed by her beauty..
Bharatiraaja used to show mostly village stories in his movies. He is known as the director who brought the smell of soil to the silver screen. The heroines were shown pure without make-up. The reason behind this he said on one occasion adding his own cleverness. I fell in love with a girl. I go looking for her. Surprisingly every time she looks to me in the countryside. She is very beautiful. She is not someone but 'nature'. I was charmed by her beauty. "That's why I hold a camera and look for that beauty," he said, expressing his love for the countryside. He has directed around 40 films in his career and earned the title of 'Iyakkunar Imayam (Director's Peak)'.
Shine as an actor..
He entertained not only as a director but also as an actor. 'Ayudha Eluthu', 'Pandyanadu', 'Tiruchithimabalam' (Thiru) and last year's Vijay Sethupathi's 'Maharaja', played key roles. Mohanlal was last seen on screen in 'Tudarum'. Also his film 'Pulavar' is yet to be released. This was his last film as an actor.
For the next generation..
Bharathiraja founded the 'Bharathiraja International Institute of Cinema (BRIIC)' to train future filmmakers. Many people are being trained in it. A golden chapter in cinema seems to have come to an end with the loss of him, who greeted him with 'My dear Tamil people' whenever he came on stage.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 10:26 ISTNote:Advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- 500 people.. 70-day shoot in the forest: 50-year-old 'Bhakta Kannappa' features 50 years of the film 'Bhakta Kannappa' starring Krishnamraju. Here are some interesting facts about this movie..
- During the controversy of Ranveer's 'Don 3'.. Deepika's 'Race 2' is on the screen. Currently, the film 'Don 3' has become a hot topic in the industry. Amidst the ongoing discussions around this, the old controversy related to Ranveer's wife, actress Deepika Padukone has once again become a topic of discussion on social media.
- Ranveer Singh's ban. Bollywood's leading actor Ranveer has become the talk of the industry for a few days after scoring a super hit with two parts of 'Dhurandhar'.
- Who is Rakshita Suresh, the singer who made a big hit by saying 'Hallallallo'? Many things about the singer Rakshitha Suresh who sang the special song in 'Peddi'. Be it love stories, action movies or devotional roles, the leading hero Nagarjuna has always earned a place as a Greek hero in the minds of the audience by showing something new in everything.
- Lights again on the silver screen.. It seems that the OTT culture that Josh grew up with after Covid is gradually breaking.
- First movie flop.. First election hit.. Vijay's film journey is unusual. An ordinary boy.. he ruled the box office empire with dances and fights on the silver screen. A person who appeared as an ordinary actor.. Today, he has become the voice of millions and created a sensation in the political arena.
- Glamour queen to global star.. Samantha is an iconic role.. Can anyone forget Jessie who deceived Maya with innocent looks in 'Ae Maya Chesave'? If the fights she did with rage in 'Family Man' are also known to the world audience..
- Is life only education? A few hundreds of movies make a noise at the box office every year.. but some greet us.. speak to us.. move our minds.. awaken childhood memories..
- Not only 'Jananayagan'.. there are many movies that are leaked before the release.. a movie is the hard work of a few hundred people. If such a thing comes online before its theatrical release, how difficult it will be for the producer and the hero. This is the current situation of film actor and TVK party president Vijay. Difficulties surround her life like waves hitting the shore.. Love marriage in her teens.. Her husband left her when she was pregnant.. At one point she tried to commit suicide.. She escaped death because the world was lucky enough to enjoy her Ganamrita. The song 'Chichubuddi' danced by Jonita Gandhi with Adivi Sesh is especially entertaining. So who is Jonita?
- Do you know who the director of 'Dhurandhar' worked for? Adityadhar showed his strength with the films 'Dhurandhar 1' and 'Dhurandhar 2'. Who did he train under..
- Major in Pak Army.. 'Black Tiger' in India: Do you know the real story of 'Dhurandhar'? Dhurandhar: Ravindra Kaushik is going viral as the real Dhurandhar during the movie Dhurandhar.
- Song controversy.. Rakshitha who appeared on the screen.. Do you remember this heroine? It is known that a song in 'KD' is involved in a controversy. Who is Rakshitha who responded to it?
- Rs 500 crore celebration. Everyone is interested in the 'Oscar' awards which are considered to be the highest award in the world film industry.
- 'Oscar' for that father's struggle.. 'One Battle After Another' hit by 'Sixer' Oscar Awards: Even if there is strength in the story and conflict between the characters.. the movie has proved that the harvest of awards will be reaped even if there is no work in terms of box office figures.
- These are the arrows left by Sukumar... Sparkling with new stories.. All those who have worked with Sukumar are flying with success. A special article on them..
- 'Geetha Govindam'.. This is Vijay-Rashmika's love journey.. In the background of Vijay Deverakonda and Rashmika Mandanna's marriage on February 26.. Let's see their love journey..!
- Yesterday 'Funky'.. Now 'Booki'.. these titles have different meanings! Do you know the meanings of the movie titles 'Funky' and 'Booki'?