US Blacklists Top Chinese Tech Energy Giants Over Military Links

ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ, టెక్నాలజీ రంగాల్లో దూసుకుపోతున్న చైనా కంపెనీలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. చైనా సైన్యానికి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా సహకరిస్తున్నాయనే అనుమానంతో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ ఎనర్జీ, బ్యాటరీ తయారీ సంస్థలతో పాటు ప్రముఖ టెక్ దిగ్గజాలను అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్‌) తన ‘మిలిటరీ లింక్డ్ కంపెనీ’ల బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఇటీవల విడుదల చేసిన ఈ తాజా జాబితా అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చకు దారితీసింది.

బ్లాక్‌లిస్ట్‌లోకి చేరిన ప్రముఖ కంపెనీలు

అమెరికా రక్షణ శాఖ ఆంక్షల పరిధిలోకి తెచ్చిన చైనా కంపెనీల్లో గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తున్న టాప్ బ్రాండ్లు ఉన్నాయి. సోలార్ ఎనర్జీ విభాగంలో.. అతిపెద్ద సోలార్ ప్యానెల్ తయారీదారులైన ట్రినా సోలార్, జేఏ సోలార్ టెక్నాలజీ ఉన్నాయి. ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో గ్లోబల్ లీడర్లుగా ఉన్న ఈవ్ ఎనర్జీ, సీఏఎల్‌బీ గ్రూప్ సంస్థలున్నాయి. చైనా ఈ-కామర్స్‌లో కీలకంగా ఉన్న అలీబాబా, ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ప్రొవైడర్ బైడు, బయోటెక్నాలజీ సంస్థ వుజి యాప్ టెక్ ఉన్నాయి.

అమెరికా చట్టం ఏం చెబుతోంది?

పెంటగాన్ నిబంధనల ప్రకారం, ఈ మిలిటరీ లింక్డ్ జాబితాలో చేరిన కంపెనీలపై అమెరికా కఠినమైన ఆంక్షలు విధిస్తుంది. అమెరికా రక్షణ శాఖ ఈ కంపెనీలతో నేరుగా ఎలాంటి వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోకూడదు. 2027 నాటికి థర్డ్ పార్టీల ద్వారా కూడా ఈ కంపెనీల ఉత్పత్తులను లేదా సేవలను కొనుగోలు చేయకుండా పూర్తిస్థాయిలో పరిమితులు అమల్లోకి వస్తాయి.

కంపెనీలు ఏం చేయబోతున్నాయి?

అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా కంపెనీలు తీవ్రంగా స్పందించాయి. ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ చట్టపరమైన పోరాటానికి సిద్ధమవుతున్నాయి. దీనిపై ట్రినా సోలార్ స్పందిస్తూ.. తాము ఎలాంటి సైనిక సంబంధిత కార్యకలాపాల్లోనూ పాల్గొనలేదని ట్రినా సోలార్ స్పష్టం చేసింది. అమెరికా నిర్ణయం పూర్తిగా నిరాధారమైనదని కొట్టిపారేసింది. ‘అమెరికా ప్రభుత్వం వెంటనే ఈ పొరపాటు నిర్ణయాన్ని సరిదిద్దుకోవాలి. అంతర్జాతీయంగా న్యాయమైన, సమానమైన, వివక్ష లేని వ్యాపార వాతావరణాన్ని కల్పించాలి. దీన్ని సవాలు చేస్తూ ఇప్పటికే చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాం’ అని ట్రినా సోలార్ ఒక అధికారిక ప్రకటనలో డిమాండ్ చేసింది.

ఇదీ చదవండి:హ్యాట్రిక్‌ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో!


English Translation
US Blacklists Top Chinese Tech Energy Giants Over Military Links

America is a strong shock to Chinese companies that are advancing in the fields of clean energy and technology worldwide. gave The US Department of Defense (Pentagon) has included the world's largest solar energy and battery manufacturing companies as well as prominent tech giants in its blacklist of 'military linked companies' on suspicion of directly or indirectly cooperating with the Chinese military. This latest list released recently has sparked a debate in the international trade circles.

Prominent companies that have joined the blacklist

The Chinese companies that have been put under US Defense Department sanctions include top brands that rule the global market. In the solar energy segment, the largest solar panel manufacturers are Trina Solar and JA Solar Technology. Eve Energy and CALB group of companies are global leaders in energy storage and electric vehicle battery manufacturing. China's e-commerce giant Alibaba, leading internet search provider Baidu and biotechnology company Wuji App Tech are among them.

What does US law say?

According to Pentagon regulations, the US imposes strict sanctions on companies that join this military-linked list. The US Department of Defense should not enter into any direct business contracts with these companies. By 2027, the complete restrictions will come into effect without buying the products or services of these companies even through third parties.

What are the companies going to do?

Chinese companies have reacted strongly to this decision taken by America. Denying these allegations, they are preparing for a legal battle. Trina Solar responds to this.. Trina Solar clarified that they are not involved in any military related activities. The US dismissed the decision as completely baseless. The US government should immediately correct this wrong decision. A fair, equitable and non-discriminatory business environment should be created internationally. "We have already started legal proceedings challenging this," demanded Trina Solar in an official statement.

Read this:Hatrick discount.. never again!