మానస సరోవరం

Eenadu icon
By Editorial Team Published : 23 Feb 2026 01:31 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

నసు ఒక సరోవరం లాంటిది. అందుకనే దాన్ని మానస సరోవరం అన్నారు. భౌతికంగా అది హిమాలయాల్లో ఉన్నా ప్రతి మనిషికీ మెదడే మానస సరోవరం. అన్నిరకాలైన ఆలోచనలకు అది కేంద్రస్థానం. కష్టసుఖాలకు కారణ స్థానం.

నిజంగా కష్టం కలిగినా దాని గురించి పెద్దగా పట్టించుకోకపోతే అది అంతగా బాధించదు. ఏదైనా మనం అనుకునేదాన్నిబట్టి ఫలితం ఉంటుంది. కష్టపడి చదవాలనుకున్నా, లక్ష్యాన్ని సాధించాలనుకున్నా, కావాల్సింది సంకల్ప బలం. అది మనసే కల్పిస్తుంది. మనిషి తన మనసును నడిపించుకునే విధానాన్నిబట్టి కష్టసుఖాలు అనుభవానికి వస్తాయి. రామదాసు మనసంతా రామనామ సంకీర్తనతో నిండిపోయింది. తానీషా అనుచరులు కొరడాలతో కొట్టినా ఆయన ఓర్చుకున్నాడు. సామాన్య మానవుడు అలా సహించలేడు. ఒక చిన్నమాట అంటేనే రెచ్చిపోయి కక్ష తీర్చుకోవాలనుకుంటాడు. అలాంటిది రామదాసు ఆ దెబ్బలను ఓర్చుకోవడమే కాక అచంచల భక్తితో కీర్తనలను కూడా ఆలపించాడు. బాధలోనూ రామనామాన్ని విడిచిపెట్టలేదు. అది ఆయన సంకల్పం, కోరిక కాదు. రామదాసు ఏమీ కోరుకోలేదు. శ్రీరామచంద్రుడికి ఆలయం నిర్మించి సేవించాలనుకున్నాడు. అది ఆయన ధర్మమేగానీ కోరిక కాదు. కోరికలు మనిషిని పతనం చేస్తాయి. విశాలమైన సముద్రంలో వేలాది ప్రవాహాలు, నదీనదాలు వచ్చి చేరతాయి. నిజానికి వాటి చేరిక వల్ల సాగరం ఉప్పొంగిపోవాలి. ప్రళయాన్ని సృష్టించాలి. కానీ వాటి కలయిక వల్ల అది ఎటువంటి పొంగునూ చూపించదు. తన ప్రశాంతతను వీడదు. భూమిపై ఒక ఉద్ధృతిలో పొంగిపొర్లిన ప్రవాహాలు కూడా సముద్రుణ్ని చేరగానే అంతటి ఆర్భాటాన్నీ కోల్పోతాయి. ఈ ప్రవాహాలన్నీ కోరికలవంటివి. చెలరేగిపోతూ మానస సరోవరాన్ని అతలాకుతలం చేయాలని చూస్తాయి. మనిషిని నానా రకాల బాధలకు గురిచేస్తాయి. అందుకే సకలవిధాల అశాంతికి కోరికలే మూలమని గీతాచార్యుడు చెప్పాడు.

సాధారణంగా గుడికి వెళ్లినప్పుడో పెద్దవారిని దర్శించినప్పుడో దీవించమని కోరుకుంటాం. ‘అభీష్టసిద్ధిరస్తు’ అని ఆశీర్వదించాలని ఆశపడతాం. నిజమే. కానీ ఎవరైనా కోరుకోవాల్సింది ఏంటంటే... ‘భగవంతుడా! నీ దయావిశేషాన్ని నాపై ప్రసరించు. ప్రశాంతిని కలిగించు. నిరంతరం నా మదిలో నీ రూపం నిలిచేటట్లు అనుగ్రహించు’ అని కోరుకోవాలి. ఇవి నిజానికి కోరికలు కావు, సంకల్పాలు. సాధించాల్సిన లక్ష్యాలు. నిజమైన కోరికలు చాలా మనస్తాపాన్ని కలుగజేస్తాయి. వాటిని అదుపులో ఉంచుకుని నిమిత్తమాత్రంగా జీవితం గడపడమే ఉత్తమమైన పరిస్థితి అని ‘ఏషాబ్రాహ్మీ స్థితిః పార్థా!’ అంటూ సాంఖ్యయోగంలో వివరించాడు పరమాత్మ. ఈ స్థితికి చేరినవారు మరణ సమయంలో కూడా ప్రశాంతంగానే ఉండగలరు. జీవన సాఫల్యం అంటే ఇది. సకల సౌఖ్యాలను సమకూర్చే యోగమిది. కోరికలు పుడతాయి. వాటివెంట పరుగుదీస్తే అవి పతనమార్గానికి తీసుకువెళ్తాయి. వాటిని మహాసముద్రంలా జీర్ణం చేసుకుంటే ప్రశాంతత మిగులుతుంది. సంతృప్తి కలుగుతుంది. ఏదీ కోరుకోకుండా ఉంటే ఈ కోరిక తీరలేదే అనే బాధ ఉండదు. అప్పుడు తామరాకుపై నీటిబొట్టులా ఉండగలం.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • సాక్షులున్నారు! కళ్లు మూసుకుని పాలు తాగుతూ పిల్లి తననెవ్వరూ గమనించడం లేదనుకుంటుందట! అదేవిధంగా మోహంతోనో, ఆవేశంతోనో, అహంకారంతోనో, అధికారంతోనో కళ్లు మూసుకుపోయి ఎవరు చూడొచ్చారులే అనుకుంటూ అధర్మపు పనులు చేయవచ్చు.
  • అసలైన పూజ ఏది? మనిషి భగవంతుడికి దగ్గరవడానికి ఎంచుకునే మార్గమే పూజ. మన ఆత్మను పరమాత్మతో అనుసంధానించే వంతెనలాంటిది అది.
  • మహా వాక్యాలు మనిషి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసేటప్పుడు ‘నేనెవరిని? ఎక్కడి నుంచి వచ్చాను?’ అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. అసలు మనిషి ఎవరు? భౌతికంగా కనిపించే శరీరమా? లేక లోపల ఉన్న మనసా? వీటన్నిటికన్నా అతీతమైన రూపమేదైనా ఉందా?
  • వీరమాతలు చరిత్రలో ఎందరో మాతృమూర్తులు తమ బిడ్డలను ధీరపురుషులుగా తీర్చిదిద్ది వీరమాతలై వెలిగారు. మహారాణులుగా వారు అంతఃపురాలకే పరిమితమైనా, సంతానాన్ని శీలవంతులుగా సంస్కరించడంలో విశేషంగా కృషి చేశారు. తెరవెనుక నిలిచినా పరోక్ష ప్రేరకులుగా తరిగిపోని స్ఫూర్తితో ప్రకాశించారు.
  • ఆధ్యాత్మిక అద్భుతాలు ఈ లోకం అనేక వింతలమయం. ఇదొక మయసభ. ప్రపంచ వింతలెన్నో మనకు తెలుసు. కానీ ఆధ్యాత్మిక వింతల గురించి కూడా ఆలోచించాలి. మనిషి మెదడులో అసాధ్యమని భావించింది అద్భుతం రూపంలో సుసాధ్యమై కళ్లముందు కొలువుతీరుతుంది.
  • ఆలయం ‘లయం’ అంటే విధ్వంసం. తీవ్రమైన భూకంపం వచ్చినప్పుడో, పెద్దయెత్తున వరదలూ సునామీ లాంటివి ముంచెత్తినప్పుడో సంభవించేది అది.
  • పరమాత్మను మెప్పించాలి భగవంతుడు ప్రేమతో, ఆర్తితో, వినయంతో, ఆవేదనతో, సంతోషంతో... ఎలా పిలిచినా పలుకుతాడు. కరుణిస్తాడు. రక్షిస్తాడు. అహల్య, శబరి, గుహుడు తదితరుల విన్నపాలను రామావతారంలో విన్నాడు. మద్ది వృక్షాలై పొమ్మని నారదుడి శాపం పొందిన కుబేరుడి కుమారులు నలకూబరుడు, మణిగ్రీవులను కృష్ణావతారంలో తన పాదస్పర్శతో శాపవిముక్తుల్ని చేశాడు.
  • అదే అత్యుత్తమ సేవ... రంగురంగుల ప్రకృతి శోభ వర్ణనాతీతం. భౌతికంగా, మానసికంగా విభిన్న తత్వాలు ఉన్న మానవ ప్రపంచం అంతకన్నా అద్భుతం.
  • జీవితమే సందేశం పాలూ నీళ్లను వేరు చేసేదిగా హంసకు పేరు. భౌతిక సుఖాలను, కష్టాలను సమ స్థితిలో అనుభవించేలా చేయగలిగే వైరాగ్య భావనలను ప్రబోధించిన వారు పరమహంస. శ్రీరామకృష్ణులు ఆచరణయోగ్యమైన ఆధ్యాత్మిక తత్వానికి నిలువెత్తు నిదర్శనం. కలకత్తాలోని దక్షిణేశ్వర్‌ కాళికా ఆలయంలో పూజారిగా ఉంటూ ఎంతోమందికి జ్ఞానభిక్ష అందించారు.
  • యాదగిరీశా నమోస్తుతే! బ్రహ్మ, విష్ణు, రుద్ర సమన్వయ శక్తులతో సృష్టి, స్థితి, లయాత్మకమైన చైతన్య స్వరూపమే నృసింహాకృతి! శ్రీహరి దశావతారాల్లో నరసింహ రూపం విశేషమైనది. నృసింహావతారం ఎంత ప్రచండమో, అంత ప్రహ్లాదం. ఎంత ప్రళయత్వమో అంత ప్రసన్నం.
  • దూరదృష్టి ‘రాబోవు నాపదలను/ లేబోనీయకయె ముందు తెలిసి మెలంగున్‌/ ప్రాబల్యము గలవాడే/ శోభిలు నిల నతడె’ అంటూ దూరదృష్టితో మెలిగితే ఆపదలను తప్పించుకోగలరని వర్ణించాడొక కవి. దూరదృష్టితో వ్యవహరించడమంటే, భవిష్యత్తును ఊహించగలిగే శక్తిగా భావించకూడదు.
  • శరణం శరణం... శంకరం మహాశివరాత్రి లోతైన ఆధ్యాత్మిక పరమార్థం ఉన్న పండుగ. ‘శివ’ అంటే అక్షరాలా కల్యాణకారి. మహాశివరాత్రి నిరాకార స్వరూపుడైన ఆ మహాశివుడి దివ్య కార్యాలను స్మరించుకుంటూ, పరమేశ్వరుడికి ప్రణమిల్లే సుదినం.
  • తపస్సు భగవంతుడి సాక్షాత్కారం కోసం తపస్సు ప్రధానమైన సాధనమన్నది దైవజ్ఞులు చెప్పే మాట. అది అంత సులభమైనది కాదు. ధ్రువుడు, ప్రహ్లాదుడు వంటి వారు నిష్ఠతో, తదేక దీక్షతో దాన్ని ఆచరించి చిరంజీవులుగా ఖ్యాతి పొందారు.
  • మాటే మంత్రం తల వెనక తలంత బలగం ఉన్నా ఒక్కరూ కష్టకాలంలో ఆదుకోలేదు... అంటారు. ఈ కాలంలో ఎంతటి సంపదనైనా ఆర్జించవచ్చు కానీ కష్టంలో మనకోసం నిలబడేవారిని సంపాదించుకోవడం కష్టమే. అలా సంపాదించుకోవడం మన ప్రవర్తన, సంస్కారం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కత్తికన్నా పదునైంది నాలుక.
  • మహోన్నత సంస్కర్త ప్రథమ స్వాతంత్య్ర సమరానికి అజ్ఞాతంగా బీజావాపన చేసిన యోధ, భారతీయులు పరపీడన నుంచి బయటపడి ఉజ్వల భవిష్యత్తు గల జాతిగా నిలవడానికి సహస్ర విధాలుగా పరిశ్రమించిన మహామనీషి, సంఘంలోని దురాచారాలను ఖండించి జనంలో ఆత్మవిశ్వాసానికి పాదుకొల్పిన తపస్వి స్వామి దయానందులు.
  • అమూల్య వరం మనిషి ముఖం నుంచి ‘అగ్ని’ వాగ్రూపంలో వెలువడుతోందని ఐతరేయోపనిషత్తు పేర్కొంటోంది. మాట అగ్ని అంతటి పవిత్రమైనదీ ప్రమాదకరమైనదీ కూడా.
  • సంకల్ప బలం మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, వైఫల్యాలు అనే కొండలను, లోయలను ఎక్కుతూ దిగుతూ ముందుకు పయనించాల్సిందే! నిజానికి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రాథమిక ఇంధనం ఏమై ఉంటుందీ అంటే- సంకల్ప బలం అని చెప్పొచ్చు.
  • దాన ఫలం! సర్వ ప్రాణుల పట్ల దయ ఉన్నవారిని దైవిక లక్షణాలు కలిగినవారిగా చెబుతారు. పవిత్ర భావనలతో, నిస్వార్థంతో జీవించేవారిని తాను వెన్నంటి ఉంటానంటాడు పరమాత్ముడు గీతలో.
  • ఎవరు గొప్ప? నన్ను మించిన వారెవరూ లేరు అనే అహంభావం వల్ల మనుషుల మధ్య గొడవలు జరగడం సహజమే. కానీ మునులు, మహాపురుషులు, దేవతలు సైతం వాటి ప్రభావంలో పడి, తరవాత పశ్చాత్తాపం చెందడం ఆశ్చర్యపరుస్తుంది.
  • అజ్ఞానాన్ని రూపుమాపాలి! ఆదిశంకరుడు చెప్పిన అజ్ఞానం వేరు. ఈ అజ్ఞానం అది కాదు. అంతటా వ్యాపించి రాజ్యమేలుతున్న ఈ అజ్ఞానమే అధర్మానికి, అన్యాయానికి కూడా కారణం.