మహా వాక్యాలు

- A
- A+
- A++

మనిషి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసేటప్పుడు ‘నేనెవరిని? ఎక్కడి నుంచి వచ్చాను?’ అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. అసలు మనిషి ఎవరు? భౌతికంగా కనిపించే శరీరమా? లేక లోపల ఉన్న మనసా? వీటన్నిటికన్నా అతీతమైన రూపమేదైనా ఉందా? వంటి ప్రశ్నలకు సమాధానాలుగా మన ఆత్మస్వరూపానికి వెలుగునిచ్చే నాలుగు మహా వాక్యాలు ఉన్నాయి. వాటి ద్వారా తెలుసుకునే తత్వజ్ఞానం మనల్ని జీవితమంతా అనేక కష్టాల నుంచి కాపాడుతుంది.
మొదటిది ‘ప్రజ్ఞానం బ్రహ్మ’. ఐతరేయోపనిషత్తులోని ఈ వాక్యానికి అర్థం ప్రపంచాన్ని తెలుసుకునే చైతన్యమే పరమ సత్యం. అదే బ్రహ్మజ్ఞానం. ఆ సత్యం నీలోనే ఉంది. జీవుడు ఏ శక్తివల్ల కంటితో రూపాన్ని, చెవితో శబ్దాన్ని, ముక్కుతో వాసనను, నాలుకతో రుచిని, చర్మంతో స్పర్శను గ్రహిస్తూ ఉన్నాడో ఆ చైతన్య శక్తే ప్రజ్ఞానం. ప్రాణులన్నిటిలో వ్యాపించి ఉన్న చైతన్యమే నేను. ఆ నేనే బ్రహ్మం. రెండోదైన ‘అహం బ్రహ్మాస్మి’కి నేనే బ్రహ్మను అని అర్థం. బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి వచ్చిన ఈ వాక్యం చాలా ప్రసిద్ధం. మూడోదైన ‘తత్వమసి’... ‘ఛాందోగ్యోపనిషత్తు’ నుంచి వచ్చింది. ‘నువ్వే బ్రహ్మ స్వరూపం. నీలోని ఆత్మే బ్రహ్మం. జీవుడు, దేవుడు వేరు కాదు ఒకటే’ననే ఈ ఉపదేశ వాక్యాన్ని గురువు శిష్యుడికి బోధిస్తాడు. జీవం బ్రహ్మం అభేదాలు అంటుందీ వాక్యం. నాలుగోదైన ‘అయం ఆత్మ బ్రహ్మ’ అనే సాక్షాత్కార వాక్యం ‘మాండుక్యోపనిషత్తు’ నుంచి వచ్చింది. ‘నేను’ అన్న భావమే పరబ్రహ్మస్వరూపం. దైవం ఎక్కడో లేదు, మన అంతరంగంలోనే ఉంది. ఆ బ్రహ్మాన్ని బయట వెతకనవసరం లేదు. సమస్త ప్రపంచానికీ అధిష్ఠానమైన ఆ బ్రహ్మమే ప్రకాశవంతమైనది... అనేది ఈ వాక్యానికి అర్థం.
ఈ నాలుగు వాక్యాలు ధార్మిక ఉపదేశాలు కావు. మామూలు మనుషులకు వచ్చే ఎన్నో సందేహాలకు సమాధానాలు. అసలు మనిషి ఎవరు? జీవాత్మ పరమాత్మల సంబంధమేంటి? వంటి గంభీరమైన ఆధ్యాత్మిక ప్రశ్నలకు ఇవి జవాబులు. నాలుగు వేదాలకు ఉపనిషత్తులు శిరస్సు వంటివి. వాటి సారమే ఈ మహావాక్యాలు. ధర్మానికి అంతిమ లక్ష్యం ఆత్మజ్ఞానం. ఈ వాక్యాలు జీవాత్మ, పరమాత్మ వేరు కాదనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించాయి. ఈ అద్వైత వేదాంతాన్ని శంకర భగవత్పాదులు ‘నిర్వాణ షట్కం’లో అద్భుతంగా ఆవిష్కరించారు.
నువ్వు వెతుకుతున్న దేవుడు నీలోనే ఉన్నాడంటూ అన్నమయ్య ‘బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే..’ అన్న కీర్తనలో విశదీకరించాడు. ఈ పరబ్రహ్మ తత్వాన్ని అనేకమంది కవులు, సాధువులు తమ రచనల్లో తెలియజేశారు. ఈ సత్యాన్ని గుర్తించగలిగితే ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూడటం అలవాటు చేసుకుంటాం. ఎవరికీ హాని తలపెట్టకుండా సన్మార్గంలో జీవితాన్ని గడిపే విధంగా మనల్ని మనమే మార్చుకుంటాం.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- సాక్షులున్నారు! కళ్లు మూసుకుని పాలు తాగుతూ పిల్లి తననెవ్వరూ గమనించడం లేదనుకుంటుందట! అదేవిధంగా మోహంతోనో, ఆవేశంతోనో, అహంకారంతోనో, అధికారంతోనో కళ్లు మూసుకుపోయి ఎవరు చూడొచ్చారులే అనుకుంటూ అధర్మపు పనులు చేయవచ్చు.
- అసలైన పూజ ఏది? మనిషి భగవంతుడికి దగ్గరవడానికి ఎంచుకునే మార్గమే పూజ. మన ఆత్మను పరమాత్మతో అనుసంధానించే వంతెనలాంటిది అది.
- వీరమాతలు చరిత్రలో ఎందరో మాతృమూర్తులు తమ బిడ్డలను ధీరపురుషులుగా తీర్చిదిద్ది వీరమాతలై వెలిగారు. మహారాణులుగా వారు అంతఃపురాలకే పరిమితమైనా, సంతానాన్ని శీలవంతులుగా సంస్కరించడంలో విశేషంగా కృషి చేశారు. తెరవెనుక నిలిచినా పరోక్ష ప్రేరకులుగా తరిగిపోని స్ఫూర్తితో ప్రకాశించారు.
- మానస సరోవరం మనసు ఒక సరోవరం లాంటిది. అందుకనే దాన్ని మానస సరోవరం అన్నారు. భౌతికంగా అది హిమాలయాల్లో ఉన్నా ప్రతి మనిషికీ మెదడే మానస సరోవరం.
- ఆధ్యాత్మిక అద్భుతాలు ఈ లోకం అనేక వింతలమయం. ఇదొక మయసభ. ప్రపంచ వింతలెన్నో మనకు తెలుసు. కానీ ఆధ్యాత్మిక వింతల గురించి కూడా ఆలోచించాలి. మనిషి మెదడులో అసాధ్యమని భావించింది అద్భుతం రూపంలో సుసాధ్యమై కళ్లముందు కొలువుతీరుతుంది.
- ఆలయం ‘లయం’ అంటే విధ్వంసం. తీవ్రమైన భూకంపం వచ్చినప్పుడో, పెద్దయెత్తున వరదలూ సునామీ లాంటివి ముంచెత్తినప్పుడో సంభవించేది అది.
- పరమాత్మను మెప్పించాలి భగవంతుడు ప్రేమతో, ఆర్తితో, వినయంతో, ఆవేదనతో, సంతోషంతో... ఎలా పిలిచినా పలుకుతాడు. కరుణిస్తాడు. రక్షిస్తాడు. అహల్య, శబరి, గుహుడు తదితరుల విన్నపాలను రామావతారంలో విన్నాడు. మద్ది వృక్షాలై పొమ్మని నారదుడి శాపం పొందిన కుబేరుడి కుమారులు నలకూబరుడు, మణిగ్రీవులను కృష్ణావతారంలో తన పాదస్పర్శతో శాపవిముక్తుల్ని చేశాడు.
- అదే అత్యుత్తమ సేవ... రంగురంగుల ప్రకృతి శోభ వర్ణనాతీతం. భౌతికంగా, మానసికంగా విభిన్న తత్వాలు ఉన్న మానవ ప్రపంచం అంతకన్నా అద్భుతం.
- జీవితమే సందేశం పాలూ నీళ్లను వేరు చేసేదిగా హంసకు పేరు. భౌతిక సుఖాలను, కష్టాలను సమ స్థితిలో అనుభవించేలా చేయగలిగే వైరాగ్య భావనలను ప్రబోధించిన వారు పరమహంస. శ్రీరామకృష్ణులు ఆచరణయోగ్యమైన ఆధ్యాత్మిక తత్వానికి నిలువెత్తు నిదర్శనం. కలకత్తాలోని దక్షిణేశ్వర్ కాళికా ఆలయంలో పూజారిగా ఉంటూ ఎంతోమందికి జ్ఞానభిక్ష అందించారు.
- యాదగిరీశా నమోస్తుతే! బ్రహ్మ, విష్ణు, రుద్ర సమన్వయ శక్తులతో సృష్టి, స్థితి, లయాత్మకమైన చైతన్య స్వరూపమే నృసింహాకృతి! శ్రీహరి దశావతారాల్లో నరసింహ రూపం విశేషమైనది. నృసింహావతారం ఎంత ప్రచండమో, అంత ప్రహ్లాదం. ఎంత ప్రళయత్వమో అంత ప్రసన్నం.
- దూరదృష్టి ‘రాబోవు నాపదలను/ లేబోనీయకయె ముందు తెలిసి మెలంగున్/ ప్రాబల్యము గలవాడే/ శోభిలు నిల నతడె’ అంటూ దూరదృష్టితో మెలిగితే ఆపదలను తప్పించుకోగలరని వర్ణించాడొక కవి. దూరదృష్టితో వ్యవహరించడమంటే, భవిష్యత్తును ఊహించగలిగే శక్తిగా భావించకూడదు.
- శరణం శరణం... శంకరం మహాశివరాత్రి లోతైన ఆధ్యాత్మిక పరమార్థం ఉన్న పండుగ. ‘శివ’ అంటే అక్షరాలా కల్యాణకారి. మహాశివరాత్రి నిరాకార స్వరూపుడైన ఆ మహాశివుడి దివ్య కార్యాలను స్మరించుకుంటూ, పరమేశ్వరుడికి ప్రణమిల్లే సుదినం.
- తపస్సు భగవంతుడి సాక్షాత్కారం కోసం తపస్సు ప్రధానమైన సాధనమన్నది దైవజ్ఞులు చెప్పే మాట. అది అంత సులభమైనది కాదు. ధ్రువుడు, ప్రహ్లాదుడు వంటి వారు నిష్ఠతో, తదేక దీక్షతో దాన్ని ఆచరించి చిరంజీవులుగా ఖ్యాతి పొందారు.
- మాటే మంత్రం తల వెనక తలంత బలగం ఉన్నా ఒక్కరూ కష్టకాలంలో ఆదుకోలేదు... అంటారు. ఈ కాలంలో ఎంతటి సంపదనైనా ఆర్జించవచ్చు కానీ కష్టంలో మనకోసం నిలబడేవారిని సంపాదించుకోవడం కష్టమే. అలా సంపాదించుకోవడం మన ప్రవర్తన, సంస్కారం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కత్తికన్నా పదునైంది నాలుక.
- మహోన్నత సంస్కర్త ప్రథమ స్వాతంత్య్ర సమరానికి అజ్ఞాతంగా బీజావాపన చేసిన యోధ, భారతీయులు పరపీడన నుంచి బయటపడి ఉజ్వల భవిష్యత్తు గల జాతిగా నిలవడానికి సహస్ర విధాలుగా పరిశ్రమించిన మహామనీషి, సంఘంలోని దురాచారాలను ఖండించి జనంలో ఆత్మవిశ్వాసానికి పాదుకొల్పిన తపస్వి స్వామి దయానందులు.
- అమూల్య వరం మనిషి ముఖం నుంచి ‘అగ్ని’ వాగ్రూపంలో వెలువడుతోందని ఐతరేయోపనిషత్తు పేర్కొంటోంది. మాట అగ్ని అంతటి పవిత్రమైనదీ ప్రమాదకరమైనదీ కూడా.
- సంకల్ప బలం మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, వైఫల్యాలు అనే కొండలను, లోయలను ఎక్కుతూ దిగుతూ ముందుకు పయనించాల్సిందే! నిజానికి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రాథమిక ఇంధనం ఏమై ఉంటుందీ అంటే- సంకల్ప బలం అని చెప్పొచ్చు.
- దాన ఫలం! సర్వ ప్రాణుల పట్ల దయ ఉన్నవారిని దైవిక లక్షణాలు కలిగినవారిగా చెబుతారు. పవిత్ర భావనలతో, నిస్వార్థంతో జీవించేవారిని తాను వెన్నంటి ఉంటానంటాడు పరమాత్ముడు గీతలో.
- ఎవరు గొప్ప? నన్ను మించిన వారెవరూ లేరు అనే అహంభావం వల్ల మనుషుల మధ్య గొడవలు జరగడం సహజమే. కానీ మునులు, మహాపురుషులు, దేవతలు సైతం వాటి ప్రభావంలో పడి, తరవాత పశ్చాత్తాపం చెందడం ఆశ్చర్యపరుస్తుంది.
- అజ్ఞానాన్ని రూపుమాపాలి! ఆదిశంకరుడు చెప్పిన అజ్ఞానం వేరు. ఈ అజ్ఞానం అది కాదు. అంతటా వ్యాపించి రాజ్యమేలుతున్న ఈ అజ్ఞానమే అధర్మానికి, అన్యాయానికి కూడా కారణం.
English Translation
Great sentences

- A
- A+
- A++

Nishi 'Who am I when taking steps towards spirituality? Where did I come from?' Who is the real man? A physical body? Or the mind inside? Is there a form beyond all these? There are four great sentences that shed light on our self in answer to such questions. Philosophical knowledge gained through them saves us from many difficulties throughout life.
The first is 'Knowledge of Brahma'. The meaning of this sentence in the Aitareyopanishad is the consciousness that knows the world is the supreme truth. That is the knowledge of Brahman. That truth is within you. By which energy a living being perceives form with the eye, sound with the ear, smell with the nose, taste with the tongue, and touch with the skin, that consciousness is knowledge. I am the consciousness that pervades all beings. That I am Brahman. The second 'Aham Brahmasmi' means that I am Brahman. This verse from Brihadaranyaka Upanishad is very famous. The third one 'Tatvamasi'... comes from 'Chandogyopanishattu'. 'You are the embodiment of Brahma. Your soul is Brahman. The Guru teaches the disciple that God and Jiva are one and the same. Jivam Brahmam Abhedalu Antundi Vakya. The fourth realization phrase 'Ayam Atma Brahma' comes from 'Mandukyopanishat'. The sense of 'I' is Parabrahmasvarupa. God is not somewhere, but within us. There is no need to look for that Brahman outside. The meaning of this sentence is that Brahman, who is supreme over the entire world, is bright.
These four sentences are not moral teachings. Answers to many doubts common people have. Who is the real man? What is the relationship between Jivatma and Paramatma? These are answers to serious spiritual questions like The Upanishads are like the head of the four Vedas. These Mahavakyas are their essence. The ultimate goal of Dharma is self-knowledge. These verses clearly declare that Jivatma and Paramatma are not separate. This Advaita Vedanta was brilliantly discovered by Shankara Bhagwatpadu in 'Nirvana Shatkam'.
Annamaiya elaborated in the hymn 'Brahmamokte para Brahmamokte..' that the God you are looking for is within you. Many poets and saints have conveyed this philosophy of ParaBrahma in their writings. If we can recognize this truth, we will get used to seeing the divine in every human being. We change ourselves in such a way that we live life in the right way without harming anyone.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
There are more
- witnesses! The cat drinks milk with its eyes closed and thinks no one is watching it! Similarly, with lust, anger, pride, and power, one can close one's eyes and do unrighteous things, thinking that no one can see.
- What is the real worship? Puja is the way man chooses to approach God. It is like a bridge that connects our soul with the Supreme.
- Heroic Mothers Many mothers in history raised their children to be brave men and became heroic mothers. As queens, they were confined to the harems, but they worked very hard in reforming the offspring into civilized ones. Even behind the scenes, they shined with undiminished spirit as indirect motivators.
- Manasa Sarovaram Mind is like a lake. That is why it is called Manasa Sarovaram. Physically it is in the Himalayas but it is a mental lake for every human being.
- Spiritual Miracles This world is full of wonders. This is a Mayasabha. We know many wonders of the world. But spiritual wonders must also be thought of. What was thought impossible in the mind of man becomes possible in the form of miracle and measured before the eyes.
- Temple 'Rhythm' means destruction. It happens when there is a severe earthquake, large-scale floods and tsunamis. God speaks with love, with gratitude, with humility, with anguish, with joy...whatever you call him. Compassionate. protects He heard the pleas of Ahalya, Sabari, Guhudu and others in Rama's incarnation. Kubera's sons, Nalakubara and Manigriva, who were cursed by Naradu to become mud plants, freed them from the curse with the touch of his feet in Krishna avatara. The human world with different philosophies physically and mentally is more wonderful.
- Life is the message Swan is known as the separator of milk and water. Paramahamsa was the one who preached the concept of dispassion which enables one to experience material pleasures and hardships equally. Sri Ramakrishna is a living example of practical spiritual philosophy. He was a priest in Dakshineshwar Kalika Temple in Calcutta and gave alms of knowledge to many people.
- Yadagirisha Namostute! Nrisimhakriti is the form of creation, state and rhythmic consciousness with the coordinated forces of Brahma, Vishnu and Rudra! Narasimha's form is unique in Srihari Dashavatars. The Nrisimhavatara is as glorious as it is glorious. The greater the flood, the greater the pleasure.
- Foresight A poet describes that if you have foresight, you will be able to avoid the dangers. To act with foresight is not to think of the power to predict the future.
- Sharanam Sharanam... Shankaram Mahashivratri is a festival with deep spiritual significance. 'Shiva' literally means benefactor. Mahashivratri Remembering the divine deeds of the formless form of Lord Shiva, Pranamille Sudinam to the Supreme Lord.
- Tapas It is said by the sages that penance is the main tool for God realization. It is not that simple. People like Dhruva and Prahlad have practiced it with devotion and gaze and gained fame as immortals.
- Mate Mantra It is said that even if there is strength behind each head, no one will be supported in difficult times. In this period we can earn any amount of wealth but it is difficult to get people to stand up for us in times of trouble. Acquiring such is possible only because of our behavior and culture. The tongue is sharper than a sword.
- A great reformer The warrior who anonymously sowed the seeds of the first freedom struggle, the great man who worked in thousands of ways to free the Indians from oppression and become a nation with a bright future, the ascetic Swami Dayanandulu who condemned the vices in the community and instilled self-confidence in the people.
- Amulya Varam. The Aitareyopanishad states that 'Agni' emanates from the face of man in the form of fire. A word is as sacred as fire and also dangerous.
- Strength of will In the life of a man, one has to move forward by going up and down the hills and valleys of joys, sorrows, successes and failures! In fact, what is the basic fuel that a person needs to reach his goal is - willpower.
- The fruit of charity! Those who are kind to all living beings are said to have divine qualities. In the Gita, the Supreme Lord says that he will support those who live with holy thoughts and selflessness.
- Who is great? Due to the ego that there is no one above me, it is natural for people to quarrel. But it is surprising that even the ancients, great men and gods fell under their influence and later repented.
- Ignorance should be eradicated! Adi Shankara said ignorance is different. This ignorance is not that. It is this ignorance that reigns all over and is the cause of iniquity and injustice.