త్వరలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0

- A
- A+
- A++

రాయదుర్గం, న్యూస్‌టుడే: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి క్యూర్-ప్యూర్-రేర్ అనే త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. మంగళవారం రాయదుర్గం జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో ‘గ్రోత్ ఎక్స్- 2026’ సదస్సు ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ఇందు కోసమే క్యూర్..ప్యూర్..రేర్ వ్యూహాన్ని అమలు చేస్తున్నాం. క్యూర్ కింద సాంకేతికత, ఆవిష్కరణల అభివృద్ధి, ప్యూర్‌లో తయారీ రంగానికి దన్నుగా నిలవడం, రేర్‌లో గ్రామీణ ఉత్పాదకతను ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి’ అని శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. గౌరవ అతిథిగా హాజరైన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ప్రసంగిస్తూ.. ఏఐని బాధ్యతాయుతంగా వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలో వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు సీఎంగా హైదరాబాద్‌లో సాంకేతికత అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. అనంతరం వచ్చిన ప్రభుత్వాలు దాన్ని అనుసరించి నగరం ఉన్నతంగా ఎదిగేలా చేశాయని పేర్కొన్నారు. ఏఐజీ ఛైర్మన్ డా.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. అవయవదానానికి కుటుంబసభ్యులు ముందుకొచ్చినా.. పరిశోధనల కోసం వాటిని వినియోగించే చట్టాలు దేశంలో లేవన్నారు. నైతిక ప్రమాణాలు కాపాడుతూ పరిశోధన అవకాశాలను ప్రోత్సహించేలా చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రెండు దశాబ్దాల క్రితం తాను రూపొందించిన నాగ్ స్టెంట్‌కు పేటెంట్ తీసుకోలేదని, పేటెంట్ల కారణంగా పరికరాల ధరలు పెరిగి, రోగులకు ఆర్థిక భారంగా మారతాయని చెప్పారు. స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు పవన్‌కుమార్ మాట్లాడుతూ.. మరో దశాబ్దకాలంలో విమాన టికెట్ల ధరలతోనే అంతరిక్ష ప్రయాణం సాధ్యమయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు ఆర్.రవికుమార్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గరిమెళ్ల, డైరెక్టర్ సంగీత, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఫీజుల నియంత్రణకు కమిటీ రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు విశ్రాంత న్యాయమూర్తి లేదా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటుచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
- పది పరీక్షలకు హాజరవుతున్నా.. అమ్మ చంకలో బిడ్డనే! ఈ చిత్రంలో అమ్మ చంకలో ఉన్న బాలిక పేరు సుమిత. పుట్టుకతోనే మూగ, వినికిడి లోపంతో బాధపడుతోంది. ఎత్తు 1.5 అడుగులు మాత్రమే.
- పసిపిల్లల హృదయాలయం కల్లాకపటం తెలియని పసి మనసులు.. హృద్రోగ సమస్యలతో తల్లడిల్లుతుంటే.. మేమున్నాం అంటూ అక్కున చేర్చుకుంటోంది సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీసత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్‌కేర్ అండ్ రీసెర్చ్.
- మీరే ప్రభుత్వానికి కళ్లు.. చెవులు సివిల్ సర్వీసెస్ అధికారులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అందించేందుకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి హార్వర్డ్ వర్సిటీ రానుందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
- అధికార గర్వంతో పేదల ఇళ్లు కూల్చారు భూదాన్ భూముల్లో నిర్మించిన ఇళ్లను కూల్చడంతో వీధినపడిన నిరుపేదల పక్షాన సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని, అసెంబ్లీలోనూ గళం విప్పి ప్రభుత్వంతో కొట్లాడతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
- ఎప్‌సెట్ రద్దు చేయాలి రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఈఏపీసెట్ (ఎప్‌సెట్)ను రద్దు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
- నేరాలను ఆపేది చదువే! నేర ప్రవృత్తికి... అక్షరాస్యతకు మధ్య సంబంధం ఉందని చెబుతున్నాయి గణాంకాలు. రాష్ట్రంలో ఏటా సగటున 5 వేల మంది విచారణ ఖైదీలు, 2 వేల మంది శిక్ష పడ్డ ఖైదీలు జైళ్లకు వస్తున్నారు.
- కాళేశ్వరంలో భారాస అవినీతికి భాజపా సహకారం ‘కాళేశ్వరం సహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో దోచుకున్న సొమ్ములో కొంతైనా పాపపరిహారం కింద కేసీఆర్ పేదలకు పంచి ప్రజలను క్షమాపణ కోరాలి.
- న్యుమోనియాకు బిట్స్ హైదరాబాద్ ఆచార్యుల కొత్త టీకా! న్యుమోనియా నియంత్రణకు కొత్త టీకాను కనుగొన్నట్లు బిట్స్ హైదరాబాద్ ఆచార్యులు, పరిశోధకులు యోగేశ్వర్ దేవరకొండ, ఎం.వి.ఎన్. జనార్దన్‌రెడ్డి, అరుణిమ, కీర్తిమాన్ స్యాల్‌లు గురువారం తెలిపారు. ‘‘స్ట్రెప్టోకోకల్ న్యుమోనియా కట్టడికి ఏడాది నుంచి పరిశోధనలు చేస్తున్నా.
- ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇం‘ధనం’! రోజువారీ వినియోగ వస్తువుల ప్యాకేజింగ్ వ్యర్థాలను ఇంధనంగా మార్చే సాంకేతికతను హైదరాబాద్‌లోని భారతీయ రసాయన సాంకేతిక పరిశోధన సంస్థ ్బఐఐసీట్శీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
- కొండాపూర్ భూములపై స్టేటస్‌కో ఇవ్వం హైదరాబాద్ కొండాపూర్‌లోని సర్వే నం.59లో ఉన్న 57.09 ఎకరాల వివాదాస్పద భూమిపై స్టేటస్‌కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
- 8.68 లక్షల భూభారతి దరఖాస్తులు ఏమయ్యాయి?: హరీశ్‌రావు ‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెవెన్యూ సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.. భూభారతి పేరిట రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటివరకు 8.68 లక్షల దరఖాస్తులు వచ్చినా.. పరిష్కారం కాలేదు’ అని శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు.
- ఖనిజాల పరిశోధనలకు ఎన్‌ఎండీసీ, ఐఐటీ-హెచ్ భాగస్వామ్యం ఖనిజాల పరిశోధనల కోసం హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)తో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎండీసీ) పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఒప్పందం చేసుకుంది.
- ఇది పదాలు పలికించే ‘పలక’ తల్లి ఒడిని వదిలి అప్పుడప్పుడే బడిబాట పట్టే బాలలు భయం, బెరుకు లేకుండా... అలవోకగా అక్షరాలు, పదాలు నేర్చుకునేందుకు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నాగారం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కేతావత్ తావుర్యానాయక్ ‘మైస్లేట్’ పేరుతో ప్రత్యేకంగా ఓ పలకను రూపొందించారు.
- అరుదైన ఖనిజాలపై ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేయాలి: ఎన్‌సీఎంఎం నేటి ఆధునిక ప్రపంచంలో అరుదైన ఖనిజాలకు అధిక ప్రాధాన్యముందని, ఈ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరముందని నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్(ఎన్‌సీఎంఎం) కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
- టీఎస్‌జీఆర్‌ఈఏ అధ్యక్షుడిగా పేరి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం(టీఎస్‌జీఆర్‌ఈఏ) అధ్యక్షుడిగా పేరి వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎంసీ లింగన్నలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- అగ్నిమాపక శాఖలోని సౌకర్యాలపై వివరణివ్వండి: హైకోర్టు విపత్తులను ఎదుర్కోవడానికి అగ్నిమాపక శాఖలో ఉన్న సౌకర్యాలు, వనరులు, పరికరాల స్థితిగతులపై వివరాలు సమర్పించాలంటూ ప్రభుత్వానికి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
- సంక్షిప్త వార్తలు కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్, మాజీ ఎంపీ వి.హనుమంతరావులకు రాజ్యసభ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు విజ్ఞప్తి చేశారు.
- వసతులు లేవు.. అధ్యాపకులు లేరు విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సగటున 72 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 80 శాతం డిగ్రీ కళాశాలల్లో మౌలిక సౌకర్యాల కొరత వేధిస్తోంది.
- మహిళా సంఘాల్లోని 42 లక్షల మందికి 30 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు టీ-డయాగ్నస్టిక్స్ ద్వారా 42 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 30 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు... గ్రామీణ మహిళలకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన సహా పలు కార్యక్రమాలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.
English Translation
Ease of doing business 2.0 soon

- A
- A+
- A++

Rayadurgam, Newstoday: Comprehensive development of the state. State IT Minister Duddilla Sridharbabu stated that the three-pronged strategy of Cure-Pure-Rare is being implemented. It has been revealed that the 'Ease of Doing Business 2.0' system will be made available soon with the aim of attracting investments. The 'Growth X-2026' conference under the auspices of the Federation of Telangana Chamber of Commerce and Industry (FTCCI) started at the Rayadurgam JRC Convention on Tuesday. The minister who was present as the chief guest said.. 'Our government's goal is to increase the economy of the state which is currently 200 billion dollars to one trillion dollars by 2034 and 3 trillion dollars by 2047. For this reason we are implementing Cure..Pure..Rare strategy. Under CURE we are promoting technology and innovation development, supporting manufacturing sector under Pure and promoting rural productivity under Rare. Sridhar Babu called the industrialists to come forward to work with the government. BJP state president N. Ramachander Rao, who was present as the guest of honour, said that there is a need to use AI responsibly. He said that when Vajpayee was the Prime Minister at the Centre, Chandrababu Naidu as the CM initiated the development of technology in Hyderabad. It is stated that the subsequent governments followed it and made the city grow higher. AIG Chairman Dr. Nageswara Reddy said.. Even if the family members come forward for organ donation.. He said there are no laws in the country to use them for research. Laws need to be amended to promote research opportunities while maintaining ethical standards, he said. He said that the Nag Stent, which he designed two decades ago, was not patented and due to patents, the prices of the devices would increase and become a financial burden for the patients. Pawan Kumar, the founder of Skyroute Aerospace, said that in another decade, space travel is possible with the price of air tickets. FTCCI President R. Ravikumar, Vice President Srinivas Garimella, Director Sangeeta and many industrialists participated in the program. on Facebook, Twitter, Instagram& Google News. Tags :
Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Committee for Regulation of Fees CM Revanth Reddy said that a state level committee will be set up under the leadership of a retired judge or former chief secretary of the state to control fees in private educational institutions in the state. Sumita is the name of the girl in Amma's armpit in this picture. Born mute and hearing impaired. Height is only 1.5 feet.
- Heart temple of infants Sri Sathya Sai Sanjeevani Center for Child Heart Care and Research in Siddipet District, Kondapaka, Siddipet District is taking care of young minds who are struggling with heart problems.
- You are the eyes and ears of the government. CM Revanth Reddy revealed that Harvard University will come to Marri Chenna Reddy Human Resources Development Center to provide executive education to civil services officers. Bharata's Executive President KTR said that he will fight in the Supreme Court on behalf of the poor people who were made homeless due to the demolition of houses built on Bhudan lands and that they will raise their voice in the Assembly and fight with the government. The Telangana Education Commission has recommended to the government to cancel the EAPSET (APSET) conducted for admission to engineering, agriculture and pharmacy courses in the state. Statistics show that there is a relationship between criminality and literacy. An average of 5,000 under-trial prisoners and 2,000 sentenced prisoners are coming to the jails in the state every year.
- BJP's contribution to corruption in India KCR should distribute some of the looted money in irrigation projects including Kaleswaram to the poor and apologize to the people. BITS Hyderabad professors and researchers Yogeshwar Devarakonda, M.V.N. Janardhan Reddy, Arunima and Kirtiman Syal said on Thursday. I have been doing research for the prevention of streptococcal pneumonia since a year. The technology to convert the packaging waste of daily consumer goods into fuel has been developed by the scientists of the Indian Institute of Chemical Technology, Hyderabad. Supreme Court refused to grant statusco to 57.09 acres of disputed land in Survey No. 59, Kondapur, Hyderabad.
- What happened to 8.68 lakh Bhubharati applications?: Harish Rao "After Congress came to power in the state, people are facing problems due to revenue issues.. Even though 8.68 lakh applications have been received so far in the revenue conferences in the name of Bhubharti.. Harish Rao, deputy leader of the legislative party, alleged that it has not been resolved.
- Partnership of NMDC, IIT-H for mineral research National Mineral Development Corporation (NMDC) Research and Development Center has tied up with the Indian Institute of Technology (IIT) Hyderabad for mineral research. Children who leave their mother's lap and go to school without fear and anger... Ketawath Tavaryanayak, a teacher of ZP High School, Nagaram, Hatnura Mandal, Sangareddy district, has designed a special board named 'Myslate' to help students learn letters and words.
- Government and private organizations should work together on rare minerals: NCMM The National Critical Mineral Mission (NCMM) Committee has expressed the opinion that rare minerals are of high priority in today's modern world and there is a need for government and private organizations to work together in this field. State Government Retired Employees Association (TSGREA) named Venkat Reddy as President and MC Lingannalu as General Secretary.
- Explain the facilities in Fire Department: High Court The High Court on Thursday directed the government to submit details of the facilities, resources and equipment available in the fire department to deal with disasters.
- Brief News PCC Working President Jaggareddy appealed to AICC President Mallikarjuna Kharge to give opportunity to former PCC Working President Jetty Kusuma Kumar and former MP V. Hanumantha Rao who are constantly working for the Congress party in the Rajya Sabha elections. An average of 72 percent teaching posts are vacant in universities and government degree colleges. 80 percent degree colleges suffer from lack of basic facilities.
- 30 types of diagnostic tests for 42 lakh people in women's societies. 30 types of diagnostic tests for 42 lakh self-help group women through T-Diagnostics... The Department of Health and Family Welfare has prepared a plan for several programs including designing a digital health profile for rural women.