వైఫల్యాల్ని అధిగమించి.. కెరీర్లో రాణించాలంటే..!
వృత్తిఉద్యోగాల్లో మనం ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటాం.. వాటిలో కొన్ని సఫలమవ్వచ్చు.. మరికొన్ని విఫలమవ్వచ్చు. అయితే చాలామంది ఇలాంటి వైఫల్యాల గురించే ఆలోచిస్తూ ఇక తాము కెరీర్‌లో రాణించలేమనుకుంటారు.

- A
- A+
- A++

వృత్తిఉద్యోగాల్లో మనం ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటాం.. వాటిలో కొన్ని సఫలమవ్వచ్చు.. మరికొన్ని విఫలమవ్వచ్చు. అయితే చాలామంది ఇలాంటి వైఫల్యాల గురించే ఆలోచిస్తూ ఇక తాము కెరీర్‌లో రాణించలేమనుకుంటారు. ఇతరులతో పోల్చుకుంటూ తీవ్ర ఒత్తిడిలోకి కూరుకుపోతుంటారు. నిజానికి ఇలాంటి ప్రతికూల భావాలే కెరీర్ తిరోగమనానికి కారణమవుతాయంటున్నారు నిపుణులు. అందుకే వైఫల్యాల్ని కూడా సానుకూలంగా స్వీకరించి.. వాటి నుంచి కొత్త పాఠాలు నేర్చుకోగలిగితే కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టుకోవచ్చంటున్నారు. మరి, కెరీర్‌లో విఫలమయ్యామని ఎప్పుడనిపిస్తుంది? దానిని అధిగమించి ముందుకు సాగడమెలాగో తెలుసుకుందాం రండి..
ఇవే కారణమా?
⚛ ఏ పని చేయాలన్నా ప్రణాళిక ముఖ్యం. కెరీర్‌లో విజయవంతంగా ముందుకెళ్లాలన్నా ప్లానింగ్ తప్పనిసరి! అయితే కొంతమంది దీన్ని విస్మరిస్తుంటారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా చేతికొచ్చిన పనిని చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు. దీనివల్ల ఎంత పనిచేసినా సంతృప్తి కలగదు.. సరికదా కెరీర్‌లో ఆశించిన స్థాయిలో వృద్ధి లేక ఒకానొక సమయంలో విఫలమయ్యామన్న వైరాగ్య భావన ఆవహిస్తుంది.
⚛ కొంతమంది కెరీర్‌లో అయినా, జీవితంలోనైనా సాధ్యం కాని లక్ష్యాల్ని నిర్దేశించుకుంటారు. వాటిని చేరుకునే క్రమంలో ఎంతో శ్రమ పడతారు.. కానీ ఆశించిన ఫలితం దక్కదు. ఇలాంటప్పుడు ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఇది క్రమంగా విఫలమయ్యామన్న భావన కలిగేలా చేస్తుంది.

⚛ చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్క.. తాత్కాలికంగా ఏదో ఒక ఉద్యోగంలో చేరుతుంటారు కొందరు. ఇటు ఈ ఉద్యోగం చేస్తూనే.. తాము కోరుకున్న కెరీర్‌పై దృష్టి పెడుతుంటారు. ఒకవేళ ఆశించిన ఉద్యోగం లభించకపోతే ఒక రకమైన అసహనానికి, కెరీర్ విఫలమైందన్న భావనకూ లోనవుతుంటారు.
⚛ ఉద్యోగంలో ఎవరి సామర్థ్యాలు వారివి! ఒకరికి అప్పగించిన పనిని వేగంగా పూర్తి చేయగలిగే సామర్థ్యముండచ్చు.. మరొకరికి ఎన్ని పనులైనా ఒంటి చేత్తో నిర్వహించే సత్తా ఉండచ్చు.. ఇంకొకరికి టెక్నాలజీపై పట్టుండచ్చు.. అయినా కొంతమంది తమ సామర్థ్యాల్ని పక్కన పెట్టి ఇతరులతో పోల్చుకుంటుంటారు. ఇది కూడా తాము కెరీర్‌లో విఫలమయ్యామన్న భావనను కలిగిస్తుందంటున్నారు నిపుణులు.
⚛ కెరీర్‌ని విజయవంతంగా కొనసాగించాలంటే ఆరోగ్యం కూడా అందుకు సహకరించాలి. అయితే కొంతమందిలో పలు శారీరక సమస్యలుండచ్చు.. మరికొంతమందికి వ్యక్తిగత/వృత్తిపరమైన కారణాల వల్ల మానసిక సమస్యలు ఎదురుకావచ్చు. ఇలాంటి సమయంలో చేసే పనిపై పూర్తి దృష్టి పెట్టలేం. దాంతో అటు కెరీర్‌లో వృద్ధి, ఇటు వ్యక్తిగత జీవితంలో సంతృప్తి లేవన్న భావన వెంటాడుతుంది.
⚛ కొంతమంది కెరీర్‌లో పూర్తి చేయాల్సిన లక్ష్యాల్ని పకడ్బందీగా నిర్దేశించుకుంటారు. కానీ వాటిని ఆచరణలో పెట్టే విషయంలో జాప్యం చేస్తుంటారు. పనుల్ని పూర్తిచేసే విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. దీనివల్ల కూడా లక్ష్యాల్ని సరైన సమయంలో చేరుకోలేక.. విఫలమయ్యామన్న భావన దరిచేరుతుందంటున్నారు నిపుణులు.
⚛ వృత్తిఉద్యోగాల్లో మనం ఎంత చురుగ్గా వ్యవహరించినా.. మన చుట్టూ ఉన్న కొందరు మనల్ని వెనక్కి లాగాలని చూస్తుంటారు. విమర్శలు, నెగెటివ్ మాటలతో మనలో ప్రతికూల భావనలు కలిగేలా చేస్తారు. ఇలాంటి వ్యక్తులకు ప్రభావితమైనా కెరీర్‌లో ఏమీ సాధించలేకపోతున్నామన్న భావన కలగడం సహజం.
⚛ కొంతమంది విషయంలో కెరీర్ ప్రణాళిక అంతా బాగానే ఉంటుంది.. కానీ ఆయా పనులు పూర్తిచేయడానికి సంబంధించిన ఉత్సాహం కొరవడుతుంది. దీనివల్ల కూడా పనులు అనుకున్న సమయానికి పూర్తికాక.. కెరీర్ విఫలమైందన్న ఒక రకమైన అసహనం దరిచేరుతుంది.

అధిగమిస్తేనే అందలం!
⚛ జీవితంలోనైనా, కెరీర్ పరంగానైనా.. తమకెదురైన వైఫల్యాల్ని చాలామంది స్వీకరించరు. తమకే ఎందుకిలా? అన్న ప్రతికూల భావనలోకి కూరుకుపోతారు. కానీ ఇలా ఆలోచించడం కంటే.. ‘జరిగిందేదో జరిగిపోయింది.. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్తపడాల’న్న సానుకూల దృక్పథంతో ముందుకు సాగినప్పుడే.. కెరీర్ వృద్ధి సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు.
⚛ ‘ఓటమి గెలుపుకి తొలి మెట్టు’ అంటారు. అంటే.. ఓటమికి గల కారణాల్ని పసిగట్టి.. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూనే.. అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తపడినప్పుడే కెరీర్ వైఫల్యాల్ని సులభంగా అధిగమించచ్చంటున్నారు నిపుణులు.
⚛ ‘నా పనేదో నాది.. ఇతరులతో సంబంధం లేదన్న’ట్లుగా పని ప్రదేశంలో కొంతమంది రిజర్వ్‌డ్‌గా వ్యవహరిస్తుంటారు. కెరీర్‌లో వెనకబడినప్పుడు ఇలాంటి వారికి తోటి వారి నుంచి ఎలాంటి సహాయం అందదు. కాబట్టి వృత్తిఉద్యోగాల్లో తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, ఇతర సంస్థల్లో పనిచేసే స్నేహితులతో స్నేహబంధం కొనసాగించడం వల్ల.. కెరీర్‌లో ఎదురయ్యే సమస్యల్ని అధిగమించడం సులభమవుతుందంటున్నారు నిపుణులు.
⚛ ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్న ఎంతోమంది తమ కెరీర్ మొదట్లో వైఫల్యాలను ఎదుర్కొన్న వారే! కాబట్టి వాళ్ల స్ఫూర్తి గాథల గురించి తెలుసుకుంటే ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతికూలతల్ని ఎలా అధిగమించాలో కూడా వాళ్ల నుంచి నేర్చుకోవచ్చు.
⚛ వైఫల్యాలు ఎదురయ్యాయని వాటినే తలచుకుంటే అక్కడే ఆగిపోతాం. అదే ఆ ప్రతికూల ఆలోచనల్ని అధిగమించి.. ఆసక్తి ఉన్న అంశాలపై దృష్టి పెడితే.. కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాం.. ఇదీ పరోక్షంగా మన కెరీర్‌కి ప్లస్ అవుతుంది.
⚛ ఎంత నేర్చుకున్నా, ఎన్ని నైపుణ్యాల్లో పట్టు సాధించినా నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడే మన కెరీర్ అవకాశాల్ని విస్తరించుకోగలుగుతాం. అందుకే వైఫల్యాల్ని పక్కన పెట్టి మీ చదువుకు తగ్గ ఇతర కెరీర్ అవకాశాలపై దృష్టి పెట్టమంటున్నారు నిపుణులు. దీనివల్ల ఇటు కెరీర్ అభివృద్ధి సాధించచ్చు.. అటు ఆర్థికంగానూ మరింత దృఢం కావచ్చు.
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation
Overcome failures.. to succeed in career..!
We set many goals in careers.. some of them may succeed.. others may fail. But many think about such failures and think that they will not succeed in their career.

- A
- A+
- A++

In career we set many goals.. Some of them are May succeed.. Others may fail. But many people think about such failures and think that they will not succeed in their career. They get under a lot of pressure by comparing themselves with others. In fact, experts say that such negative feelings are the cause of career decline. That's why if you can accept failures positively and learn new lessons from them, you can get your career back on track. And when do you feel like you have failed in your career? Let's find out how to overcome it and move forward..
Are these the reasons?
⚛ Planning is important for any work. Planning is essential to progress successfully in your career! But some people ignore it. They move forward by doing whatever they have to do without any plan. Due to this, no matter how much work is done, there is no satisfaction.. There is a sense of despair that one has failed at the expected level of growth in the career or at one point. Some people set impossible goals in career or life. In order to reach them, a lot of effort is put into it.. but the desired result is not achieved. This is when self-confidence is weakened. This gradually makes you feel like a failure.

⚛ Some people join a temporary job to find a job that is not suitable for their studies. While doing this job, they focus on their desired career. If they do not get the desired job, they will feel impatient and feel that their career has failed. One person may have the ability to complete the assigned task quickly.. the other may have the ability to handle any number of tasks with one hand.. and another may hold on to technology.. but some people keep their abilities aside and compare themselves with others. Experts say that this also makes them feel that they have failed in their career.
⚛ Health should also contribute to a successful career. But some people may have many physical problems.. some may face mental problems due to personal/professional reasons. At such a time one cannot concentrate fully on the work to be done. This leads to the feeling of lack of satisfaction in career and personal life. But there is delay in implementing them. They are careless in completing tasks. Experts say that this also leads to the feeling of not being able to reach the goals at the right time. Criticism and negative words make us feel negative. It is natural for such people to feel that they are not able to achieve anything in their career even if they are affected.
⚛ Some people have a good career plan.. but lack the enthusiasm to complete the tasks. This also leads to a feeling of impatience that the work is not completed on time.
⚛ Many people do not accept their failures in life or career. Why themselves? They get stuck in a negative feeling. But instead of thinking like this.. experts say that career growth is possible only when you move forward with a positive attitude that 'what has happened has happened.. and be careful not to let this happen again'. In other words, experts say that career failures can be easily overcome only when one senses the reasons for failure and learns from them, and is careful not to repeat such mistakes. Such people do not get any help from their peers when they are behind in their career. Therefore, experts say that by establishing good relations with fellow employees in professional jobs and maintaining friendships with friends who work in other organizations, it will be easier to overcome the problems encountered in career. So it is encouraging to know about their inspirational stories. We can also learn from them how to overcome the negatives in professional jobs. If we overcome those negative thoughts and focus on topics of interest, we will be able to learn new things. This will indirectly be a plus for our career. That's why experts say to keep your failures aside and focus on other career opportunities that match your education. Due to this one can achieve career development.. and become financially stronger.