నన్ను క్షమించండి..! ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై బిల్‌గేట్స్‌

Eenadu icon
By International News Team Updated : 25 Feb 2026 16:58 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణానికి సంబంధించిన పత్రాల్లో తన పేరు ఉండడంపై మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ ( Bill Gates) స్పందించారు. ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉండడంపై ఫౌండేషన్‌ సిబ్బందికి క్షమాపణలు చెప్పినట్లు తాజాగా వెల్లడైంది. తాను చట్టవిరుద్ధంగా ఏ పని చేయలేదని పేర్కొన్నారు. అయితే, ఇద్దరు రష్యన్‌ మహిళలతో సంబంధాలు ఉన్నాయని అంగీకరించిన ఆయన.. ఎప్‌స్టీన్‌ నేరాల్లో మాత్రం భాగస్వామ్యం కాలేదని స్పష్టం చేసినట్లు సమాచారం. ‘ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్‌ ఈ అంశాలను పేర్కొన్నారు.

ఎప్‌స్టీన్‌ పేర్కొన్నట్లు తనకు ఇద్దరు రష్యన్‌ మహిళలతో సంబంధాలు ఉన్న మాట వాస్తవమేనని టౌన్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గేట్స్‌ ఫౌండేషన్‌ సభ్యులతో బిల్‌గేట్స్‌ చెప్పారు. అయితే, వాళ్లు ఎప్‌స్టీన్‌ నేరాల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. ఎప్‌స్టీన్‌తో భేటీ అనంతరం అతడి అసిస్టెంట్లు తనతో ఫొటోలు దిగారని, తాను వారిని ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. అతడితో పలుమార్లు భేటీ కావడం, వీటికి గేట్స్‌ ఫౌండేషన్‌ సభ్యులను తీసుకురావడం చాలా పెద్ద తప్పేనని గేట్స్‌ విచారం వ్యక్తంచేశారు. తాను చేసిన తప్పిదానికి ఇందులో ఇరుక్కున్న వారికి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.

ఓ మైనర్‌పై వేధింపులకు సంబంధించిన కేసులో 2011లో ఎప్‌స్టీన్‌ దోషిగా తేలిన మూడేళ్ల తర్వాత అతడితో భేటీ అయ్యానని బిల్‌గేట్స్‌ వెల్లడించారు. అతడి నేపథ్యాన్ని సరిగ్గా తనిఖీ చేసుకోలేదన్నారు. ఈ విషయంపై మిలిందా గేట్స్‌ (మాజీ భార్య) ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ అతడితో పరిచయాన్ని కొనసాగించానని అన్నారు. అతడి విషయంలో మిలిందా ఎప్పుడూ సందేహాస్పదంగానే ఉండేదన్నారు. ఇదిలాఉంటే, ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ (Epstein files) దర్యాప్తునకు సంబంధించి 30 లక్షల పేజీలను అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Feb 2026 15:34 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పాఠశాలలో దారుణం.. విద్యార్థి కాల్పుల్లో 9 మంది మృతి తుర్కియేలోని ఓ పాఠశాలల దారుణం చోటుచేసుకుంది. రెండు తరగతి గదుల్లో ఓ విద్యార్థి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
  • చమురు ధరలు భారీగా తగ్గుతాయ్‌: ట్రంప్‌ ఇరాన్‌ యుద్ధం ముగిసిన తర్వాత చమురు ధరలు భారీగా తగ్గుతాయని ట్రంప్‌ అన్నారు.
  • అమెరికా దిగ్బంధనం.. ఇరాన్‌కు రోజుకు రూ.4వేల కోట్ల నష్టం! హర్మూజ్‌ జలసంధి వెంబడి రేవుల చుట్టూ అమెరికా ఉచ్చు బిగించడం వల్ల ఇరాన్‌కు ఆర్థికంగా భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
  • హర్మూజ్‌లో కూలిన.. రూ.2,222 కోట్ల అమెరికా నిఘా డ్రోన్‌ US Surveillance Drone: వేలకోట్ల రూపాయల విలువైన డ్రోన్‌ను అమెరికా కోల్పోయింది. 
  • అప్పుల ఊబిలో పాక్‌.. ఆదుకున్న సౌదీ ఆర్థిక సమస్యలతో సతమతమవుతోన్న పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా మరోసారి అండగా నిలిచింది.
  • రూ.9.3 కోట్ల విలువైన పికాసో పెయింటింగ్‌.. రూ.11 వేలకే సొంతం! ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుల్లో స్పెయిన్‌కు చెందిన పాబ్లో పికాసో ఒకరు.
  • సూయజ్‌ సీను.. హర్మూజ్‌ వద్ద రిపీటవుతోందా..? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్‌ విజయగర్వంతో ఈజిప్ట్‌లోని సూయజ్‌ కెనాల్‌ విషయంలో చేసిన ఓ తప్పు..  దాని సూపర్‌పవర్‌ హోదాను ఒక్కసారిగా కూల్చింది.
  • ఇరాన్‌తో యుద్ధం.. ఏమాత్రం ప్రయోజనం లేదు: అమెరికన్లు పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధం వల్ల అమెరికా సైన్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో ఇరాన్‌పై దాడులను సొంత పౌరులు కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
  • నాటో నుంచి అమెరికాకు ఎలాంటి మద్దతు లేదు: ట్రంప్‌ Trump: నాటో కూటమిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ కూటమి ఎప్పుడూ తమకు మద్దతుగా లేదన్నారు. 
  • నా అత్తమామలంటే చాలా ఇష్టం: జేడీవాన్స్ కీలక వ్యాఖ్యలు JD Vance: వలసదారుల అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. 
  • కాల్పుల విరమణ పొడిగింపు ఉండకపోవచ్చు: ట్రంప్‌ ఇరాన్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణను పొడిగించే ఆలోచన తనకు లేదని.. శాశ్వతమైన ఒప్పందం వైపే తాము మొగ్గుచూపుతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. 
  • ఇరాన్‌తో మళ్లీ చర్చలు.. అమెరికా 2 షరతులు..! US-Iran Talks: పశ్చిమాసియాలో యుద్ధం ముగించే విషయమై అమెరికా-ఇరాన్‌ మరోసారి శాంతి చర్చలకు సిద్ధమవుతున్నాయి.
  • హర్మూజ్‌ దిగ్బంధనానికి 10వేల మంది సిబ్బంది ఇరాన్‌ ఓడరేవులపై పూర్తి దిగ్బంధనాన్ని విజయవంతంగా అమలుచేసినట్టు అమెరికా(US) సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది.
  • 24 గంటల్లో.. హర్మూజ్‌ను దాటిన 20 నౌకలు..! Strait of Hormuz: అమెరికా దిగ్బంధం కొనసాగుతుండగానే.. గత 24 గంటల్లో 20 వాణిజ్య నౌకలు హర్మూజ్‌ను దాటినట్లు తెలుస్తోంది. 
  • ఇరాన్‌ చమురుపై ఆంక్షల సడలింపు పొడిగించేందుకు అమెరికా ‘నో’ Iranian oil: ఇరాన్‌ చమురు కొనుగోళ్లకు సంబంధించి ఇచ్చిన సడలింపులను పొడిగించే ప్రణాళిక లేదని అమెరికా ట్రెజరీ శాఖ తేల్చి చెప్పింది. 
  • ట్రంప్‌ తదుపరి గురి మలకా జలసంధి! హర్మూజ్‌ జల సంధిపై పట్టు సాధించేందుకు తంటాలు పడుతున్న అమెరికా మరో కీలక జల మార్గమైన మలాకా జల సంధిలోనూ తనకు ఎదురు లేకుండా చూసుకునేందుకు పావులు కదుపుతోంది.
  • రెండ్రోజుల్లో మళ్లీ చర్చలు! పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇరాన్‌ మరోసారి శాంతి చర్చలకు సన్నద్ధమవుతున్నాయి. పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగా రాబోయే రెండు రోజుల్లోనే ఈ సంప్రదింపులు జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ప్రకటించారు.
  • ఆస్ట్రేలియాకు తొలి మహిళా ఆర్మీ చీఫ్‌! ఆస్ట్రేలియా రక్షణ రంగంలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. ఈ దేశ సైనిక చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఓ మహిళా అధికారిణిని సైన్యాధిపతిగా నియమిస్తూ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
  • స్వల్ప మెజారిటీ సాధించిన కార్నీ ప్రభుత్వం కెనడా పార్లమెంటులో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు సోమవారం జరిగిన ఉపఎన్నికలో ప్రధానమంత్రి మార్క్‌ కార్నీ నేతృత్వంలోని లిబరల్‌ పార్టీ గెలుపొందింది.
  • హర్మూజ్‌ పునరుద్ధరణపై మెక్రాన్, స్టార్మర్‌ సారథ్యంలో సదస్సు హర్మూజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్, బ్రిటన్‌ ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌ల నేతృత్వంలో ఈ నెల 14న పారిస్‌లో కీలక సదస్సు జరగనుంది.