Couple recreates 2011 college dance at wedding video viral

పదిహేను సంవత్సరాల క్రితం... కాలేజీ ఫంక్షన్‌లో ‘యూ ఆర్‌ మై సోనియా’ పాటకు అద్భుతంగా డ్యాన్స్‌ చేశారు యశ్, గరీమా.
తాజా విషయానికి వస్తే... స్నేహితులు కాస్తా వధూవరులు అయ్యారు.

హైలెట్‌ ఏమిటంటే ఆనాటి డ్యాన్స్‌ వీడియోను పెళ్లివేడుకలో ప్రదర్శించడం. పెళ్లికి వచ్చిన అతిథులు మాత్రమే కాదు నెట్‌వాసులు కూడా ‘బ్రహ్మాండమైన ఐడియా’ అంటున్నారు.

‘ఎన్నో జ్ఞాపకాలను మోసుకొచ్చి మనసును ఉల్లాసపరిచిన వీడియో ఇది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది గరీమ.‘‘కాలేజీ డ్యాన్స్‌ను రీక్రియేట్‌ చేయాలనే ఐడియా అనుకోకుండా వచ్చింది. ఇంత స్పందన వస్తుందనుకోలేదు’ అన్నాడు యశ్‌. ‘చిన్ననాటి స్నేహితులు, కాలేజీ రోజుల నాటి స్నేహితులు పెళ్లి చేసుకుంటే వారి పాత వీడియోలు, ఫొటోలను పెళ్లి వేడుకలో ప్రదర్శిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది’ అని సూచించాడు ఒక నెటిజనుడు.

చ‌ద‌వండి:ఈ వ‌ధూవ‌రుల‌ది ఎంత గొప్ప మ‌న‌సు!

పెళ్లివేడుకలో మరో హైలైట్‌ ఏమిటంటే ‘యూ ఆర్‌ మై సోనియా’ పాటకు వధూవరులు స్టేజీపై డ్యాన్స్‌ చేశారు.
‘అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా లేదు!’ అంటారా?
ప్రేమకు ఉన్న పవర్‌ అదే కదా!