గేట్లు.. పాట్లు ఎన్నాళ్లు?

Eenadu icon
By Telangana News Desk Published : 22 Feb 2026 06:36 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ఈనాడు, హైదరాబాద్‌: నీటిపారుదల శాఖ ముందుచూపు లోపం.. ప్రణాళిక లేమి రెండు ఎత్తిపోతల పథకాల కింద రైతులకు కడగండ్లు మిగులుస్తున్నాయి. చిన్న మొత్తం వెచ్చిస్తే రూ.వందల కోట్ల పంటను పండించే రైతులకు ఇక్కట్లు తప్పుతాయి. ఆ దిశగా చర్యలు లేకపోవడంతో వరదలు వచ్చిన ప్రతిసారీ వారు బిక్కుబిక్కుమని గడపాల్సి వస్తోంది. కృష్ణా నదిపై శ్రీశైలం జలాశయం వెనుక జలాలు తీసుకునే మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతలు, గోదావరిపై శ్రీరాంసాగర్‌ వెనుక జలాలు తీసుకునే కాళేశ్వరం ప్యాకేజీ 20లోని పంపుహౌస్‌లు వరదలు వస్తే వణికిపోతున్నాయి. 

సమస్య ఏంటంటే..

ఈ జలాశయాల్లో కనిష్ఠ నీటి మట్టం ఉన్నప్పుడూ నీటిని తీసుకునేలా గ్రావెటీ కాలువను తవ్వి పంపుహౌస్‌కు ముందు భాగాన ఉండే సర్జిపూల్‌కు అనుసంధానించారు. జలాశయంలో ఎంత మట్టం పెరిగితే సర్జిపూల్లో కూడా అంతే నీటి మట్టం పెరుగుతుంది. దీనికి అనుగుణంగా డిజైన్‌ చేశారు.  వరదలు వచ్చినప్పుడు పూర్తి మట్టం స్థాయిని (ఎఫ్‌ఆర్‌ఎల్‌) దాటి జలాశయంలో నీళ్లు పెరుగుతాయి. అప్పుడు ఆ నీటి ఒత్తిడి సర్జిపూల్‌కు.. పంపుహౌస్‌కు మధ్య ఉండే గేట్లపై పడుతోంది. అవి విఫలమైనప్పుడు ఒక్కసారిగా పంపుహౌస్‌లోకి వరద ప్రవేశిస్తోంది. ఇలా రాష్ట్రంలోని పలు పంపుహౌస్‌లు అనేక సార్లు ముంపునకు గురయ్యాయి. జలాశయం నుంచి వచ్చే గ్రావెటీ కాలువకు, సర్జ్‌పూల్‌కు మధ్యలో హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మిస్తే వరద సర్జిపూల్‌కు చేరకుండా నియంత్రించవచ్చు. కానీ, ఈ నిర్మాణాలు లేక ముంపు ఏర్పడుతోంది. యంత్రాంగం పాఠాలు నేర్వలేదు.

కల్వకుర్తి వద్ద ఇలా.. 

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం రేగుమానుగడ్డ వద్ద ఉన్న మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ) మొదటి పంపుహౌస్‌కు శ్రీశైలం జలాశయం నుంచి గ్రావెటీ కాలువ ద్వారా నీళ్లు వస్తాయి. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. 800 అడుగుల స్థాయి నుంచి కేఎల్‌ఐతో నీటిని తీసుకునేలా పంపుహౌస్‌ నిర్మించారు. శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండి, ఎగువ నుంచి భారీ వరద వస్తే నీటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆ ఒత్తిడి కేఎల్‌ఐ పంపుహౌస్‌ వద్ద కూడా ఉంటుంది. గ్రావెటీ కాలువకు హెడ్‌ రెగ్యులేటర్‌ లేకపోవడంతో నీటిని నియంత్రించడం సాధ్యం కావడం లేదు. పంపులను నడిపించేందుకు సర్జిపూల్‌ గేట్లను ఇంచు తెరిచినా చాలు నీటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. కృష్ణా నదికి భారీ వరదలు వచ్చిన సమయంలో 2014, 2022లలో సర్జిపూల్‌ గేట్లు విఫలమై పంపుహౌస్‌ మునిగి పోయింది. ఐదు పంపులు ఉండగా మూడింటికి మాత్రమే మరమ్మతులు పూర్తి చేశారు. 4.20 లక్షల ఎకరాలకు సాగునీరు, చెరువులు, కుంటల ద్వారా అదనపు ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాల్సి ఉన్నా.. చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు మండలాలకు మిషన్‌ భగీరథ పథకం కింద నిరంతరం ఇక్కడి నుంచే తాగునీటిని ఇస్తున్నారు. భారాస ప్రభుత్వ హయాంలో రూ.11 కోట్లతో హెడ్‌ రెగ్యులేటర్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేసినా ముందడుగు పడలేదు. 

కాళేశ్వరం ప్యాకేజీ వద్ద..

కాళేశ్వరం ఎత్తిపోతల్లోని ఏడో లింక్‌లోని 20వ ప్యాకేజీ కింద నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. నిజామాబాద్‌ శివారుల్లోని సారంగాపూర్‌ పంపుహౌస్‌ ద్వారా గోదావరి జలాలు ఆయకట్టుకు అందాల్సి ఉంది. దీనికోసం ఈ జిల్లా నవీపేట మండలం బినోలా గ్రామం వద్ద నుంచి శ్రీరాంసాగర్‌ జలాలు గ్రావెటీ కాలువ ద్వారా పంప్‌హౌస్‌కు చేరుతాయి. ఎస్సారెస్పీ ఎఫ్‌ఆర్‌ఎల్‌ 332.450 మీటర్లు కాగా అంతకు మించి వరద వస్తే ఈ గ్రావెటీ కాలువపై ప్రభావం పడుతోంది. 2021లో పంపుహౌస్‌లోకి వరద చేరి పంపులు మునిగాయి.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఈ పాఠశాలలో... రోజూ కొబ్బరి లడ్డూ ఘుమఘుమలు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎల్కలపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు నిత్యం మధ్యాహ్న భోజనంతోపాటు ఒక కొబ్బరి లడ్డూను అందిస్తున్నారు.
  • కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచేలా అనుమతించొద్దు వ్యాపార వ్యవహారాల్లో భాగంగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఎస్‌బీఐ బ్రాంచి నుంచి విదేశీ ఖాతాలకు సొమ్ము బదిలీ చేయడానికి గానీ, ఇతర బ్యాంకుల్లో కొత్త ఖాతాలను తెరవడానికి గానీ జగతి పబ్లికేషన్స్‌కు అనుమతి ఇవ్వరాదని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
  • బీసీల రిజర్వేషన్లు తేలాకే ‘పరిషత్‌’ ఎన్నికలు! బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చిన తర్వాతే మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
  • నేనూ కులవివక్ష ఎదుర్కొన్నా: డిప్యూటీ సీఎం భట్టి కులం అనేది భారతదేశంలో ఒక వాస్తవమని, తాను కూడా కులవివక్ష ఎదుర్కొన్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఈ సమాజంలో కులవివక్ష ఉంటుందన్న వాస్తవాన్ని మదిలో పెట్టుకుని బలమైన సంకల్పంతో లక్ష్యసాధనకు ముందుకు పోవాలని ఆయన సూచించారు.
  • ‘గౌరవెల్లి’కి త్వరలో పర్యావరణ అనుమతులు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టుకు త్వరలో పర్యావరణ అనుమతులు రానున్నాయని నీటిపారుదల, రవాణా శాఖల మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.
  • ఆశా కార్యకర్తల ‘చలో హైదరాబాద్‌’ ఉద్రిక్తం తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) తమ సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం చేపట్టిన ‘చలో హైదరాబాద్‌’ ఉద్రిక్తంగా మారింది.
  • అవయవదాతకు.. జోత! గత పుష్కరకాలంలో దేశంలో అవయవదానం గణనీయంగా పెరిగిందని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ సోమవారం వెల్లడించిన నివేదికలో పేర్కొంది. 2013లో అవయవదాతల సంఖ్య 5వేల లోపే ఉండగా 2025లో నాలుగు రెట్లు పెరిగి 20వేలకు చేరిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
  • గోవర్ధనగిరిధారిగా నరసింహస్వామి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారు ‘గోవర్ధనగిరిధారి’ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
  • తెలంగాణలో ఆవిష్కరణలకు ఊతమిచ్చే సృజనాత్మక వ్యవస్థ ఐటీ మాత్రమే కాకుండా బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, లైఫ్‌ సైన్సెస్, హెల్త్‌కేర్, ఏరోస్పేస్, మాన్యుఫ్యాక్చరింగ్, ఫిన్‌టెక్, డీప్‌టెక్, రిటైల్‌ రంగాల్లోనూ హైదరాబాద్‌ను ‘గ్లోబల్‌ వాల్యూ క్రియేషన్‌ హబ్‌’గా మార్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పునరుద్ఘాటించారు.
  • వైద్య విధాన పరిషత్తు ఇక.. ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌’ తెలంగాణ వైద్య విధాన పరిషత్తు(టీవీవీపీ)ను ఇక నుంచి డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌(డీఎస్‌హెచ్‌)గా మార్చేందుకు సోమవారం రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఈ మేరకు డీఎస్‌హెచ్‌ బిల్లుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.
  • ప్రముఖ రచయిత్రి పోలాప్రగడ రాజ్యలక్ష్మి కన్నుమూత ప్రముఖ తెలుగు రచయిత్రి, రమ్యకథా రచయిత్రిగా పేరుపొందిన పోలాప్రగడ రాజ్యలక్ష్మి(88) సోమవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లో మరణించారు.
  • ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య సోదరుడికి.. జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం నిజామాబాద్‌ నగరం మాధవనగర్‌ వద్ద గత నెల 23న వాహన తనిఖీలు చేపడుతుండగా.. గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టడంతో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ గాజుల సౌమ్య ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
  • చేనేత మహిళకు ప్రతిభా ‘పురస్కారం’ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడేనికి చెందిన చేనేత మహిళ వర్కాల విజయలక్ష్మి అత్యున్నత ప్రతిభా పురస్కారాన్ని కేంద్ర టెక్స్‌టైల్‌ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ చేతులమీదుగా సోమవారం దిల్లీలో అందుకున్నారు.
  • అనాథ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతాం రాష్ట్రంలో అనాథ పిల్లలకు భరోసా కల్పిస్తూ ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిం చనున్నట్లు శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఎయిర్‌పోర్టు ఆపరేషన్లు, కార్గో గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు.
  • ప్రముఖ హృద్రోగ నిపుణులు, కార్డియో థొరాసిక్‌ సర్జన్‌ ముళ్లపూడి వెంకటరత్నం కన్నుమూత సుప్రసిద్ధ కార్డియో థొరాసిక్‌ సర్జన్, ఉషా ముళ్లపూడి ఆసుపత్రి వ్యవస్థాపకులు డా.ముళ్లపూడి వెంకటరత్నం(88) కన్నుమూశారు.
  • కుమ్మెరలో చిన్నారి మృతిపై దర్యాప్తు జరపాలి నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెర మల్లికార్జునస్వామి జాతరలో దర్శనం విషయంలో జరిగిన గొడవలో కిందపడి రెండు నెలల శిశువు మృతిచెందిన ఘటనను పలు బీసీ సంఘాల ప్రతినిధులు, పార్టీల నాయకులు ఖండించారు.
  • ‘మన ఊరు-మన బడి’ పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి మన ఊరు-మన బడి కాంట్రాక్టర్లకు రెండున్నరేళ్లుగా బిల్లులను చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారాస శాసన సభాపక్ష ఉపనేత టి.హరీశ్‌రావు తెలిపారు.
  • సాగరాన్ని శోధించి.. ధనలక్ష్మిని రప్పించి.. సముద్ర సంపదతో మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా ఇన్‌కాయిస్‌-ఎలీప్‌ సంస్థలు ముందుకుపోతున్నాయి.
  • గచ్చిబౌలిలో చదరపు గజం రూ.1.76 లక్షలు నగరంలోని పలు ప్రాంతాల్లో హౌసింగ్‌ బోర్డు భూములు మరోసారి అధిక ధరలు పలికాయి.
  • ‘భూభారతి’లో కనిపించని గిఫ్ట్‌డీడ్‌ ఐచ్ఛికం భూభారతి పోర్టల్‌లో గిఫ్ట్‌డీడ్‌ కింద రిజిస్ట్రేషన్లు చేసే ఐచ్ఛికం కనిపించడం లేదు. వారం రోజులుగా జనగామ జిల్లావ్యాప్తంగా గిఫ్ట్‌డీడ్‌ కింద రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో కార్యాలయాలకు వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

English Translation

How old are the gates?

Eenadu icon
By Telangana News Desk Published : 22 Feb 2026 06:36 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

Today, Hyderabad: Irrigation department lack of foresight. Under the upliftment schemes, the farmers are getting surplus. If a small amount is spent, the farmers who grow a crop worth Rs. Due to the lack of measures in that direction, every time there is a flood, they have to spend their lives in distress. The Mahatma Gandhi Kalvakurti lifts, which draw water behind the Srisailam reservoir on the Krishna river, and the pump houses in Kaleswaram package 20, which draw water behind Sriramsagar on the Godavari, tremble when floods come. 

The problem is..

A gravity channel is dug and connected to the surge pool in front of the pump house to draw water from these reservoirs whenever the water level is low. As the water level rises in the reservoir, the water level in the Surgipool also rises. Designed accordingly.  During floods the water in the reservoir rises above the full level level (FRL). Then that water pressure falls on the gates between the surge pool and the pump house. When they fail, the pumphouse is suddenly flooded. Many pump houses in the state have been flooded many times. If a head regulator is constructed between the gravity channel and the surge pool coming from the reservoir, the flood can be controlled from reaching the surge pool. But, these structures are causing flooding. The mechanism has not learned its lessons.

Like this at Kalvakurti..

The first pump house of the Mahatma Gandhi Kalvakurti lift scheme (KLI) at Regumanugadda, Kolhapur mandal, Nagarkurnool district receives water from Srisailam reservoir through gravity canal. While the full water level of Srisailam reservoir is 885 feet, a pump house has been built to take water from the 800 feet level with KLI. If Srisailam is full and there is a heavy flood from above, the water pressure will be high. That pressure will also be at the KLI pumphouse. The gravity canal does not have a head regulator so it is not possible to control the water. Opening the surge pool gates just an inch to drive the pumps creates high water pressure. During heavy floods of Krishna river in 2014 and 2022, Surgipool gates failed and the pump house got submerged. Out of five pumps, only three have been repaired. 4.20 lakh acres are irrigated through ponds and ponds, but the last ayacut is not receiving water. Many mandals in the joint Mahabubnagar and Rangareddy districts are continuously supplied with drinking water from here under the Mission Bhagiratha scheme. During the government of India, proposals were prepared for the head regulator with Rs.11 crores but no progress was made. 

At the Kaleshwaram package..

There is four lakh acres of Ayakattu under the 20th package of the seventh link in the Kaleshwaram uplifts. Godavari water is to be supplied to Ayakattu through the Sarangapur pump house in the suburbs of Nizamabad. For this, the waters of Sri Ramsagar reach the pump house from Binola village of Navipet mandal of this district through gravity canal. The SSRSP FRL is 332.450 meters and if the flood occurs beyond that, this gravity affects the canal. In 2021, the pump house was flooded and the pumps submerged.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

more

  • In this school... Coconut Laddu Ghumaghumalu daily. Peddapalli District Palakurti Mandal Elkalapally Government Primary School students are regularly provided with a coconut laddu along with mid-day meal.
  • Do not allow new bank accounts to be opened. The CBI appealed to the Telangana High Court on Monday that Jagati Publications should not be allowed to transfer money from the SBI branch in Banjara Hills, Hyderabad to foreign accounts or to open new accounts in other banks as part of business affairs. It seems that the state government is planning to go for mandal and zilla parishad elections only after the central government decides something about the creation of 42% reservation for BCs.
  • Even if I face caste discrimination: Deputy CM Bhatti Deputy Chief Minister Bhatti Vikramarka said that caste is a reality in India and that he too faced caste discrimination. He suggested to keep in mind the fact that there is caste discrimination in this society and move towards the goal with strong determination. Irrigation and Transport Ministers Uttam Kumar Reddy and Ponnam Prabhakar have stated that the Gauravelli project in Akkannapet mandal of Siddipet district will receive environmental clearances soon. Telangana Asha Workers' Union (CITU affiliate) on Monday took out 'Chalo Hyderabad' to solve their problems. According to a report released on Monday by the Union Family Health Welfare Department, there has been a significant increase in organ donation in the country during the last Puskar season. Statistics make it clear that the number of organ donors was less than 5 thousand in 2013 and will increase four times to 20 thousand in 2025.
  • Narasimhaswamy as Govardhanagiridhari As part of the Yadagirigutta Srilakshminarasimhaswamy temple Brahmotsavam, the Lord appeared to the devotees in the form of 'Goverdhanagiridhari' on Monday.
  • Creative system that boosts innovation in Telangana IT and Industries Minister Duddilla Sridharbabu said that his government is working sincerely to make Hyderabad a 'global value creation hub' in the fields of banking, financial services, life sciences, healthcare, aerospace, manufacturing, fintech, deeptech and retail. Reiterated.
  • Vaidya Vidhana Parishad now.. 'Directorate of Secondary Health' The State Council of Ministers on Monday decided to convert the Telangana Vaidya Vidhana Parishad (TVVP) into the Directorate of Secondary Health (DSH) henceforth. To this extent, the Cabinet approved the DSH Bill.
  • Eminent writer Polapragada Rajyalakshmi passed away. Polapragada Rajyalakshmi (88), famous Telugu writer and Ramyakatha author, passed away in Hyderabad on Monday morning due to a heart attack.
  • Excise Constable Soumya's brother. On 23rd of last month, while conducting vehicle inspections at Madhavnagar in Nizamabad city. It is known that excise constable Gajula Soumya lost her life after being hit by a car by ganja smugglers. Varkala Vijayalakshmi, a handloom woman from Koyyalagude, Chautuppal Mandal, Yadadri Bhuvanagiri District, received the highest talent award at the hands of Union Textile Minister Giriraj Singh in Delhi on Monday.
  • Let's shape the future of orphans. Child Welfare Minister Seethakka said that employment training programs will be conducted to ensure orphan children in the state. It has been revealed that they will be trained for jobs in airport operations and cargo ground handling courses.
  • Eminent cardiologist and cardio thoracic surgeon Mullapudi Venkataratnam passes away. Renowned cardio thoracic surgeon and founder of Usha Mullapudi Hospital Dr. Mullapudi Venkataratnam (88) has passed away. Representatives of many BC associations and party leaders have condemned the incident of death of a two-month-old baby due to a fight over darshan at the Kummera Mallikarjunaswamy fair in Nagarkurnool district. Deputy leader of Bharasa Legislative Assembly T. Harish Rao said that since two and a half years the bills have not been paid to the contractors of our town and school, they are facing serious financial problems. InCois-Ellip companies are moving forward with the aim of creating women entrepreneurs from the wealth of the sea. Housing board lands in many parts of the city have once again fetched high prices.
  • Giftdeed option not found in 'Bhubharati' There is no option to do registrations under giftdeed in Bhubharati portal. Those who have come to the offices are expressing their grief as there has been no registration under gift deed throughout Janagama district for a week.