కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత

- A
- A+
- A++

ఈనాడు డిజిటల్, కామారెడ్డి; కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో కాంగ్రెస్, భాజపా నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉద్రిక్తతలకు దారితీశాయి. పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్ వేదికగా భూముల విషయంలో చర్చకు రెండు పార్టీలు శుక్రవారమే పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు శనివారం ఉదయం నుంచే ఆయా పార్టీల నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. శిశుమందిర్ వద్దకు వచ్చిన కాంగ్రెస్ శ్రేణుల్ని అదుపులోకి తీసుకొని జిల్లాలోని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఎస్పీ అభ్యర్థన మేరకు బయటకు రాకుండా స్వచ్ఛందంగా క్యాంప్ కార్యాలయంలో ఉండిపోయారు.
రామారెడ్డి మండలం పోసానిపేట్ మాజీ సర్పంచి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గీరెడ్డి మహేందర్‌రెడ్డి పోలీసు బందోబస్తును దాటి కారుతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందుకు దూసుకొచ్చారు. గేటు ముందు దిగి ఎమ్మెల్యే డౌన్ డౌన్, షబ్బీర్ అలీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో భాజపా శ్రేణులు భగ్గుమన్నాయి. వెంటనే ఆయనపై దాడికి యత్నించడంతో పోలీసులు ఆయన్ను అక్కడి నుంచి తరలించారు. భాజపా కార్యకర్తలు ఆగ్రహంతో మహేందర్‌రెడ్డి కారును ధ్వంసం చేసి బోల్తా కొట్టించారు. కాసేపు పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అదే సమయంలో పలువురు ఆ కారుకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, శాసనసభలో పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్‌రెడ్డి, మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్తున్నట్లు ప్రచారం జరిగింది. పట్టణంలో మరింత ఉద్రిక్తత నెలకొంది. మహేశ్వర్‌రెడ్డిని, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను పోలీసులు హైదరాబాద్‌లో హౌస్ అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వస్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిని మేడ్చల్‌లో అరెస్టు చేశారు. పోలీసుల చర్యను ఏలేటి, ఈటల తీవ్రంగా ఖండించారు. మహేందర్‌రెడ్డిని, పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు భాజపా కార్యకర్తలను అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేష్‌చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు.
వివాదం ఇలా మొదలైంది...
కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక అనంతరం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆయన తండ్రి.. ఇద్దరూ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల్ని అరోరా కళాశాలకు కట్టబెట్టారని ఆరోపించారు. వాటిని నిరూపించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అనంతరం ఆయా పార్టీల ద్వితీయశ్రేణి నాయకులు విలేకర్ల సమావేశాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటూ వచ్చారు. శనివారం సరస్వతీ శిశు మందిర్ వద్దకు ఆధారాలతో రావాలని ఎన్‌ఎస్‌యూఐ నేత సందీప్‌కు వెంకటరమణారెడ్డి ఫోన్ చేశారు. ఈ ఆరోపణల పర్వం ఇలా వివాదానికి దారి తీసింది.

తేలేదాకా ఊరుకోను: ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
తన కుటుంబీకులపై చేసిన ఆరోపణల్లో నిజమేంటో తేలేదాకా ఊరుకోనని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వస్తానని, కాంగ్రెస్ నాయకులూ వచ్చి ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. తన తప్పు నిరూపిస్తే అక్కడికక్కడే రాజీనామా చేస్తానని అన్నారు.
వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి కాంగ్రెస్ అల్లర్లు: రామచందర్‌రావు
ఈనాడు, హైదరాబాద్: వెంకట రమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ నాయకులు రాజకీయ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే ఈ విధమైన అల్లర్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కామారెడ్డి ఘటనను ఖండిస్తున్నట్టు భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ తెలిపారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుని గృహనిర్బంధం
బాన్సువాడ, కామారెడ్డి ప్రాంతాల్లో ఆదివారం పర్యటించాలని నిర్ణయించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును పోలీసులు శనివారం రాత్రి ఆయన నివాసంలో నిర్బంధించారు. పోలీసుల చర్యలను కేంద్రమంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా ఖండించారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మీ స్మార్ట్‌ఫోన్‌తోనే.. మీ టికెట్ స్మార్ట్‌ఫోన్‌లోని యాప్ ద్వారా బస్ టికెట్లు, బస్‌పాస్‌లు తీసుకునే అవకాశాన్ని తెలంగాణ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది.
- గణపతి ఎక్కడ? మావోయిస్టు పార్టీ సుప్రీం, పూర్వ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు ఎలియాస్ గణపతి ఆచూకీపై సందిగ్ధత వీడటం లేదు.
- ఫిబ్రవరి నెలది.. చిన్న కథ కాదు..! ఒక్క ఫిబ్రవరిలో మాత్రం ఎందుకని 28 రోజులున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ప్రాచీన రోమన్ల మూఢనమ్మకాలే కారణం.
- చెక్కతో చేసినట్లే.. ఇక్కడున్న డైనింగ్ టేబుల్ చెక్కతో చేసినట్టు భలే కనిపిస్తోంది కదూ! కానీ వాడి పారేసిన ప్లాస్టిక్ వస్తువులతోనే దీన్ని తీర్చిదిద్దారు.
- ఆలస్యమే అమృత్‌మా! పుర, నగరపాలికల్లో తాగునీటి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, మురుగునీటి శుద్ధి కోసం ప్లాంట్ల నిర్మాణానికి అమృత్ 2.0 నిధులతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చేపట్టిన పనుల్లో ఎడతెగని జాప్యం జరుగుతోంది.
- సెల్లుకు చెల్లు.. ఆటల్లోనే టీ సిప్పు ఇక్కడ క్యారం, చెస్ ఆటల్లో నిమగ్నమైన వీరిని చూసి ఏ ఇండోర్ స్టేడియంలోనో ఉన్నారనుకుంటున్నారా..!
- ఆ నలుగురూ వచ్చేశారు మావోయిస్టు పార్టీ చరిత్రలో అత్యంత కీలక లొంగుబాటు.. మునుపెన్నడూ లేని రీతిలో ఒకేసారి నలుగురు అగ్రనేతలు జనజీవన స్రవంతిలో కలిశారు.
- చిరకాల వాంఛ నెరవేర్చారు తమ చిరకాల వాంఛను నెరవేర్చారంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
- త్వరలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 రాష్ట్ర సమగ్రాభివృద్ధికి క్యూర్-ప్యూర్-రేర్ అనే త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
- బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకా మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తోపాటు, నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టేందుకు కేంద్రం నడుం బిగించింది.
- ఏకగ్రీవమా? రెండో స్థానానికి పోటీనా! రాజ్యసభకు తెలంగాణ నుంచి రెండు స్థానాలకు జరిగే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేక పోటీ ఉంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.
- భారాస మునిగిపోయే నావ.. ‘‘రాష్ట్రంలో భారాస మునిగిపోయే నావ. కాంగ్రెస్‌ని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ భాజపానే. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపాను గెలవనీయకుండా కాంగ్రెస్, భారాస, ఎంఐఎం- మూడు పార్టీలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.
- ‘పది’ పరీక్షా కేంద్రాల వద్ద క్లోక్‌రూమ్‌లు రాష్ట్రంలో తొలిసారిగా పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో క్లోక్‌రూమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు తెచ్చుకున్న బ్యాగ్‌లను అక్కడ ఇచ్చి.. పరీక్ష తర్వాత తీసుకెళ్లొచ్చు.
- అకాల వర్షం.. అన్నదాతకు తీరని నష్టం నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో సోమవారం రాత్రి ఆకస్మిక గాలివాన బీభత్సం సృష్టించింది. ఆయా జిల్లాల్లోని పలుప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
- పూర్తి కాలపు డీజీపీ ఎంపిక? పూర్తి కాలపు డీజీపీ ఎంపిక ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రస్తుత ఇన్‌ఛార్జి డీజీపీ శివధర్‌రెడ్డి ఏప్రిల్ నెలాఖరులో పదవీవిరమణ చేయనున్నారు.
- పునరుద్ధరించిన శాసనమండలి భవనం ప్రారంభోత్సవం 8న పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని వచ్చే నెల 8న ప్రారంభించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
- ప్రభుత్వానివి చరిత్రాత్మక నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆరోగ్య కార్డుల మంజూరుతోపాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకమని తెలంగాణ ఉద్యోగుల ఐకాస అభివర్ణించింది.
- గాంధీ కుటుంబానికిచ్చే రూ.వెయ్యి కోట్లు రేవంత్‌రెడ్డికి ఎక్కడివి? గాంధీ కుటుంబానికి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాహాటంగా ప్రకటిస్తుంటే.. దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలు ఏం చేస్తున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు.
- సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమం విస్తరణ తెలంగాణలో సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమాన్ని(టీజీఐఎల్‌పీని) మరో నాలుగు జిల్లాల్లోని ఏడు మండలాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- కుమ్మెర ఘటనను అసెంబ్లీలో లేవనెత్తుతాం దేవాలయాల్లో కుల వివక్ష అంతం కావాలని, దీనికోసం భాజపా పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేర్కొన్నారు.
English Translation
Extreme tension in Kamareddy

- A
- A+
- A++

Eenadu Digital, Kamareddy; Kamareddy town, Newstoday: Challenges and counter-challenges between Congress and BJP leaders regarding the government degree college lands in Kamareddy town have led to tensions. On Friday, both parties called for a discussion on the land issue at the venue of Saraswati Shishumandir in the town. As a result, the police arrested the leaders of the respective parties from Saturday morning. The Congress ranks who came to Shishumandir were taken into custody and taken to the police stations of the district. Kamareddy MLA Venkataramana Reddy voluntarily stayed in the camp office instead of coming out as requested by the SP.
Former sarpanch of Ramareddy mandal Posanipet and Congress party leader Geereddy Mahender Reddy bypassed the police presence and rushed in front of the MLA camp office in a car. The MLA got down in front of the gate and shouted slogans like Shabbir Ali Zindabad. This split the ranks of BJP. Immediately after trying to attack him, the police moved him from there. BJP activists vandalized Mahender Reddy's car and overturned it. For a while there was a scuffle between the police and activists. At the same time many people poured petrol on the car and set it on fire. In the background of these circumstances, there were rumors that BJP state president Ramachander Rao, party floor leader Maheshwar Reddy and some other MLAs and MLCs were coming. There is more tension in the town. Maheshwar Reddy and Malkajigiri MP Etala Rajender were arrested by the police in Hyderabad. Armor MLA Rakesh Reddy and MLC Anji Reddy who were coming to Kamareddy from Hyderabad were arrested in Medchal. Eleti and Etala strongly condemned the action of the police. Kamareddy SP Rajeshchandra said in a statement that Mahender Reddy and two BJP workers were arrested for pouring petrol on the fire.
Controversy started like this...
Government advisor Shabbir Ali said in a meeting held after the election of Kamareddy Municipal Chairman that MLA Venkataramana Reddy and his father accused the local government degree college lands of Arora College. The MLA demanded to prove them. Later, the second-tier leaders of the respective parties have been making challenges and counter-challenges in press conferences. Venkataramana Reddy called NSUI leader Sandeep to come to Saraswati Shishu Mandir on Saturday with evidence. This allegation has led to a controversy. The MLA made it clear that he will not rest until the allegations against the family are proved to be true. He challenged the Congress leaders to come to the collector's office on Monday and prove the allegations. He said that if he is proved wrong, he will resign on the spot.
Congress riots to cover up failures: Ramachander Rao
Today, Hyderabad: BJP state president N. Ramachander Rao said in a statement that Congress workers attacked the Venkata Ramana Reddy camp office and strongly condemned it. The Congress leaders alleged that these kinds of riots were being committed to cover up political failures. BJP National Vice President, MP DK Aruna said that they condemn the Kamareddy incident.
House Arrest of BJP State President
BJP State President Ramachandra Rao, who decided to visit Bansuwada and Kamareddy areas on Sunday, was detained by the police at his residence on Saturday night. Union Minister Bandi Sanjay X condemned the actions of the police.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no correspondence in this matter.
More
- With your smartphone.. your ticket Telangana RTC has made available the possibility of taking bus tickets and bus passes through the smartphone app.
- Where is Ganapati? There is no doubt about the whereabouts of Maoist Party Supreme and former General Secretary Muppalla Laxman Rao Elias Ganapathy.
- It is the month of February.. It is not a small story..! Have you ever wondered why there are only 28 days in February? The reason for this is the superstitions of the ancient Romans.
- It looks like the dining table here is made of wood! But it was made with the plastic things he had thrown away.
- Delay is the elixir! In order to further strengthen drinking water and underground drainage system in cities and towns, construction of plants for sewage treatment, there is continuous delay in the works undertaken in many places across the state with Amrit 2.0 funds. Seeing these people engaged in carrom and chess games here, do you think they are in any indoor stadium..!
- The four came. The most important surrender in the history of the Maoist party.. In a never before manner, four top leaders met in the stream of public life.
- A long time wish was fulfilled. The leaders of Udyoga, Upadhyaya and Pensioners Unions thanked Chief Minister Revanth Reddy for fulfilling their long wish.
- Ease of Doing Business 2.0 soon. State IT Minister Duddilla Sridharbabu stated that the three-pronged strategy of Cure-Pure-Rare is being implemented for the overall development of the state.
- Free HPV vaccination for girls. In addition to cervical cancer in women, the center is also working to prevent other types of cancer that are preventable.
- Agreed? Competition for the second place! It has become a topic of discussion whether the election of two seats from Telangana to the Rajya Sabha will be unanimous or there will be a contest. BJP is the party that has guts and courage to face Congress. Congress, Bharatiya Janata Party and MIM - three parties have tried to prevent BJP from winning the Karimnagar Corporation elections. For the first time in the state, cloakrooms will be set up in class 10 examination centers. The bags brought by the students can be given there and taken after the exam.
- Untimely rain. A sudden storm created havoc in Nirmal and Jagityala districts on Monday night. Crops have been severely damaged in many areas of the respective districts.
- Choice of full-time DGP? The Telangana government has expedited the selection process for full-time DGP. The current in-charge DGP Shivdhar Reddy will retire at the end of April.
- Inauguration of the renovated Legislative Council building on 8 The government is making arrangements to start the renovated Legislative Council building on the 8th of next month.
- Historic decisions by the government Telangana Employees' Association has described the decisions taken by the government by granting health cards to state government employees and pensioners and changing the name of Telangana Vaidya Vidhana Parishad to Directorate of Secondary Health as historic. Bharata Executive President Kalvakuntla Taraka Rama Rao questioned what the investigation agencies like ED, CBI and IT departments are doing if Chief Minister Revanth Reddy is openly announcing that Rs.1000 crore will be given to the Gandhi family. The state government has decided to extend the Integrated Livelihood Program (TGILP) in Telangana to seven mandals in four more districts.
- Kummera incident will be raised in the assembly. BJP state president Ramachandra Rao said that caste discrimination in temples should end and BJP will fight for this.