పనితీరుతోనే పదవులు

- A
- A+
- A++

డీసీసీ అధ్యక్షులం అయ్యాం కదా అని జిల్లాలకు అధిపతులమయ్యామని ఎవరైనా భావిస్తే... మొట్టమొదటి తప్పిదం అదే అవుతుంది. పార్టీలో అన్నిరకాల నాయకులు ఉంటారు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి. మహాత్మా గాంధీ కాలంలోనూ ఆయన ఆలోచనకు భిన్నంగా అభిప్రాయాలు చెప్పినవారున్నారు. జాతీయ నాయకత్వం ఆలోచనలకు భిన్నంగా అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ కాంగ్రెస్‌లో ఉంది. దాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిగా తీసుకోవాలే గానీ, మనల్ని వ్యతిరేకిస్తున్నారని, మనల్ని కాదంటున్న వారిని అణిచివేయాలని అనుకోకూడదు. అలా చేస్తే పార్టీకి కీడు చేసినట్లు అవుతుంది.
ఈనాడు, హైదరాబాద్: ‘‘డీసీసీ అధ్యక్షుల ప్రతి చర్యనూ మేం గమనిస్తున్నా ప్రతిరోజు మార్కులు వేయం. మనం ఎంత బాగా చదువుకున్నా ఏడాదికి ఒకసారే పరీక్షలు పెడతారు. పదవి వచ్చింది కదా.. ఏం చేసినా ఎవరు చూస్తారులే...ఎన్నికల ముందు ఎవరో ఒకరిని పట్టుకుంటే ఏదో ఒక కోటాలో సీటు వస్తుందని కొందరు అనుకుంటున్నారు. ఇక ఏ కోటాలూ ఉండవు. పార్టీలో మెరిట్ కోటా మాత్రమే ఉంటుంది. పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేసుకుంటే మిమ్మల్ని ఆ దేవుడు కూడా బాగుచేయలేడు. సద్వినియోగం చేసుకుంటే సీఎం స్థాయికైనా ఎదగడానికి ఈ పదవి మీకు ఉపయోగపడుతుంది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. శనివారం వికారాబాద్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షులకు ఏర్పాటు చేసిన పదిరోజుల శిక్షణ శిబిరం ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం వల్లనే తెలంగాణ కాంగ్రెస్‌కు ఎన్నికల్లో ఓట్ల ఆధిక్యత పెరిగిందని అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో భారాస కంటే కాంగ్రెస్‌కు అదనంగా వచ్చిన మెజార్టీ 2 శాతం ఓట్లే అయినా ఆ తర్వాత 4 నెలలకే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 4 శాతానికి, తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 12 శాతానికి పెరిగిందని ఆయన వివరించారు. ఇందుకు ప్రజల ఆదరణతో పాటు కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ కారణమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కరానికి కృషి చేస్తే డీసీసీ అధ్యక్షులకు గౌరవం పెరుగుతుందని, పైరవీలు చేస్తారనే ముద్ర పడితే అందరికీ లోకువవుతారని.. ఛీత్కారాలు వస్తాయని సీఎం అన్నారు. ‘‘నేను జడ్పీటీసీ సభ్యుని స్థాయి నుంచి సీఎం స్థాయికి చేరా. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అప్పటి సీఎం వై.ఎస్.ను నేను ఎప్పుడు కలిసినా ‘వాట్ హీరో’ అని నన్ను గౌరవంగా పలకరించేవారు. ఏపీలో కాంగ్రెస్ నేతలు పడుతున్న ఇబ్బందులు చూడాలి. వారితో పోలిస్తే తెలంగాణలో పార్టీ నేతలు ఎంత సౌకర్యంగా ఉన్నారో గుర్తించాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని అభివృద్ధి చేసుకోవాలి. రెండు రాష్ట్రాలు కలసి అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలవాలి.
ఈ దేశం ఆత్మనే కాంగ్రెస్
ఈ దేశం ఆత్మనే కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని, కాంగ్రెస్‌ను విడదీసి చూడలేం. ఈ ఆత్మను దెబ్బతీయాలని భాజపా వంటివి కుట్ర చేస్తున్నాయి. పార్లమెంటులో రాహుల్‌గాంధీని మాట్లాడనివ్వడం లేదు. గాంధీ కుటుంబాన్ని అవినీతి ఆరోపణలతో అవమానించేలా మాట్లాడేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. దేశం కోసం ప్రాణాలిచ్చిన గాంధీ కుటుంబానికి ఈరోజు సొంత ఇల్లు కూడా లేదు. వారికి డబ్బులు ఒక లెక్కనా? నిజంగా గాంధీ కుటుంబానికి డబ్బులు కావాలంటే కాంగ్రెస్ కార్యకర్తలు పోగుచేస్తే రూ.పదివేల కోట్లు జమ అవుతాయి. నిజంగా ఆ కుటుంబానికి ఆర్థిక అవసరాలు ఉన్నాయంటే... తెలంగాణ నుంచి మనమందరం తలా ఒక చేయి వేస్తే రూ.వెయ్యి కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్‌పార్టీకి ఉంది. గాంధీ కుటుంబాన్ని అవమానపరచాలని రాజకీయంగా అడ్డుతొలగించాలని చూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 63 శాతం బీసీలను ఎన్నుకున్నామంటే కాంగ్రెస్ వల్లనే సాధ్యమైంది.

డిజిటల్ సభ్యత్వాలతో...
గతంలో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలు వేసే ముందు సభ్యత్వాలను నమోదు చేయమంటే గ్రామంలో ఒక నాయకుడు తనకు తెలిసినవారి, కావాల్సిన వారి పేర్లను రాసి ఇచ్చేవారు. అలా కాదని డిజిటల్ సభ్యత్వాల కోసం యాప్ రూపొందించి 42 లక్షల మంది సభ్యత్వాలను నమోదు చేశాం. ఏఐసీసీ నేతలకు అనుమానం వచ్చి ర్యాండమ్‌గా కొన్ని వేల నంబర్లకు ఫోన్ చేసి తనిఖీ చేస్తే వందశాతం వాస్తవమేనని తేలింది. అత్యధిక సభ్యత్వాలు చేసిన వారిని గాంధీభవన్‌కు పిలిపించి రాహుల్‌గాంధీతో సన్మానం చేయించాం.
సీపీఐ ఒక్కటే....
ఈ దేశంలో కాంగ్రెస్‌తోపాటు వందేళ్ల పార్టీ చరిత్ర కలిగింది సీపీఐ ఒక్కటే. ఆ తరవాత రాజకీయ పార్టీలుగా ఏర్పడినవి ఈరోజు ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదంతో ఈ దేశానికే ప్రమాదకరంగా మారుతున్నాయి. బ్రిటిషర్లు కూడా మహాత్మాగాంధీని టచ్ చేయడానికి ధైర్యం చేయలేదు. కానీ భారతీయ జనతాపార్టీ వారసత్వం ఉన్నవారు గాంధీ ప్రాణాన్నే బలిగొన్నారు. మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలిచ్చిన వారసత్వంతో రాహుల్‌గాంధీ కష్టమనేది తెలియకుండానే ఈ దేశానికి ప్రధాని కావాలి. అయినా 150 రోజులు పాదయాత్ర చేసి పేదవారిని చేరాలని రాహుల్‌గాంధీ ప్రయత్నించారు. ఆ ప్రయత్నమే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు స్ఫూర్తి కావాలి. దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దుచేయాలని జరుగుతున్న కుట్రను ఎదుర్కొనేలా మీకు ఇస్తున్న ఈ శిక్షణ ఎంతో ప్రత్యేకమైనది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, శిక్షణ కార్యక్రమం సమన్వయకర్త సచిన్‌రావు, ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌సావంత్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాంమోహన్‌రెడ్డి, వెడ్మ బొజ్జు తదితరులు పాల్గొన్నారు.
నేను పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తరవాత ప్రతి నాయకుడి ఇంటికి వెళ్లి కలిశా. అందరం కలసి కొట్లాడితే తప్పకుండా మనకు మంచిరోజులు వస్తాయని చెప్పా. నేను వెళ్లి కలిసిన తరవాత పరిస్థితి మారింది. ‘ఐదు, పది మంది నాయకులం పోట్లాడుకుంటే పార్టీని నమ్ముకున్న లక్షల మంది కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది కదా’ అని అందరూ పెద్దమనసు చేసుకుని ముందుకొస్తే సరిగ్గా రెండున్నరేళ్లలోనే కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని రెండున్నర నుంచి 40 శాతానికి తీసుకెళ్లగలిగాం. నేను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో... ఎస్సీ, ఎస్టీ వంటి అనుబంధ కాంగ్రెస్ విభాగాలకు ఛైర్మన్‌గా ఉండమంటే కొందరు నాయకులు చాలా అవమానకరంగా భావించారు. ‘మా స్థాయి అంతగా పడిపోయిందనుకుంటున్నావా? నీ అదృష్టం బాగుండి పీసీసీ అధ్యక్షుడివి అయ్యావు’ అని చెప్పి ఆ పదవులు తీసుకోవడానికి నిరాకరించారు. ఆ రోజు ముందుకొచ్చి ఆ పదవులు తీసుకున్న 37 మందిని ప్రభుత్వం వచ్చిన మరుక్షణం వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమించాం.
ఈనాడు, హైదరాబాద్ : కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయిస్తే సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి వైపు తీసుకెళుతున్నారని, ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగుతోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. వికారాబాద్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షులకు ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడుతూ...‘‘నాణ్యమైన నాయకత్వాన్ని రూపొందించడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే 14 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. గతంలో బాపట్లలో జరిగిన శిక్షణ శిబిరం నాకు ఎంతగానో దోహదపడింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజల్లో నమ్మకం కలిగించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు స్థానం పరిధిలోని జూబ్లీహిల్స్‌లో జరిగిన ఉప ఎన్నికల్లోనే భాజపాకు డిపాజిట్ దక్కలేదు. ఇటీవల జరిగిన మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించాం.ఏపీ కాంగ్రెస్ చీకట్లో నుంచి వెలుగులోకి రావడానికి సమయం దగ్గర్లో ఉంది.’’ అని చెప్పారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ ‘‘పార్టీ పటిష్ఠానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కృషిచేయాలి. పది రోజుల పాటు జరిగే ఈ శిక్షణ శిబిరంలో నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, ఎన్నికల వ్యూహాలు, మీడియా నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ ఇస్తాం’ అని అన్నారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ‘అండర్ రోడ్’ ట్యాంక్..! సాధారణంగా ఓవర్ హెడ్ ట్యాంక్ అని వింటాం. మరి అండర్ రోడ్ ట్యాంక్ ఏంటనేగా మీ సందేహం. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కడపగండి తండాలో అధికారులు నిర్లక్ష్యంతో అలానే నిర్మించారు.
- ఉపాధ్యాయురాలి డిప్యుటేషన్‌పై గ్రామస్థుల ఆందోళన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఉండం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు గ్రామస్థులు బుధవారం తాళం వేసి విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లారు.
- ఆ భూములు.. ఇక ఆదాయ వనరులు! దేశవ్యాప్తంగా మూతపడిన బొగ్గు గనులకు చెందిన భూములను ఆదాయ వనరులుగాను.. ప్రజోపయోగకరంగాను.. తీర్చిదిద్దేందుకు కేంద్రం సంకల్పించింది.
- ఆపరేషన్ ‘సారండా’ ఆపరేషన్ కగార్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో భద్రతా బలగాలు కొత్త ప్రాంతాలపై గురిపెట్టాయి.
- అస్పష్ట చూపుతో లోతైన గ్రహణశక్తికి ముప్పే! క్రికెట్ బంతి మీ వైపు వేగంగా దూసుకొస్తోంది.. పట్టుకోవడానికి బంతి వైపు పరుగెడుతూ చేతులు చాపుతారు కదా.. ఆ కొన్ని సెకన్లలోనే రెండు కళ్ల ద్వారా అందుకున్న భిన్నమైన చిత్రాలను మన మెదడు విశ్లేషించి..
- కనుల విందుగా లక్ష్మీనారసింహుల కల్యాణం యాదగిరిగుట్టలో బుధవారం రాత్రి సింహలగ్నంలో లక్ష్మీనారసింహుల తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.
- తొలిరోజు 96.90% హాజరు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ద్వితీయ భాషా సబ్జెక్టులైన సంస్కృతం, తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్ తదితర పరీక్షలు నిర్వహించారు.
- డిస్కంల ‘లెక్క’లేని తనం ఇళ్లు సహా అన్నిరకాల భవనాల పైకప్పు (రూఫ్‌టాప్)లపై సౌరపలకల ఏర్పాటు పూర్తిచేసినా ‘విద్యుత్ పంపిణీ సంస్థ’(డిస్కం)లు నెట్‌మీటర్లు బిగించడంలో నిర్లక్ష్యం చేస్తుండటంతో అటు డిస్కంలు.. ఇటు భవన యజమానులు నష్టపోతున్న వైనమిది.
- ఆత్మవిశ్వాసమే ఆయుధంగా... ఇలా మోకాళ్లపై నడుచుకుంటూ వస్తున్న విద్యార్థి విష్ణుతేజది జోగులాంబ గద్వాల జిల్లా కుచినెర్ల. పుట్టుకతోనే ఒక కాలు లేకుండానే జన్మించారు. కొన్నాళ్ల కిందట రెండో కాలుకు సెప్టిక్ కావడంతో దాన్నీ తొలగించారు.
- లండన్‌లో అగ్నిప్రమాదం.. ఏపీ వాసి మృతి లండన్‌లోని క్రొయిడాన్ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గొంతి అభిషేక్ (28) మృతిచెందారు.
- శత్రువు దాడి చేయాలంటే భయపడాలి మారుతున్న కాలానికి అనుగుణంగా యుద్ధతంత్రాలు భౌతికం నుంచి సింథటిక్, కాగ్నిటివ్ రంగాలకు విస్తరిస్తున్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు.
- ప్రత్యేకావసరాల పిల్లలకు ఈ-స్కూటర్లు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరిన ప్రత్యేక అవసరాల పిల్లలు (చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్- సీడబ్ల్యూఎస్‌ఎన్) వెయ్యి మందికి ఈ-స్కూటర్లు అందించాలని ఇంటర్ విద్యాశాఖ భావిస్తోంది.
- నిజనిర్ధారణ లేకుండా నిందారోపణ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో ఒక పిల్లర్ కుంగిన నేపథ్యంలో అదెలా జరిగిందన్నదానిపై విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ నిజనిర్ధారణ చేయకుండా వ్యక్తిగత నిందారోపణలకు పరిమితమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు.
- భూదాన్ నిర్వాసితుల ఆందోళన భూదాన్ యజ్ఞ సమితి భూముల్లో నిర్మించిన ఇళ్లను తొలగించటంతో గూడు కోల్పోయిన బాధితులు బుధవారం ఆందోళన బాటపట్టారు.
- ‘రైల్ పార్సిల్ యాప్’తో ఇంటి నుంచే బుకింగ్ పార్సిల్ బుకింగ్ కోసం క్యూలో నిలబడటం, ఫారాలు నింపడం, కార్యాలయాల చుట్టూ తిరగడం వంటి వ్యయప్రయాసలు ఇక గతం కానున్నాయి.
- యార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి: మంత్రి తుమ్మల అకాల వర్షాల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
- మ్యూల్ ఖాతాలపై యుద్ధం సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలకు ఆయువుపట్టుగా ఉన్న మ్యూల్ (కమీషన్‌కు ఆశపడి బ్యాంకు ఖాతాలను సైబర్ నేరస్థులకు అప్పగించడం) ఖాతాదారుల ఆట కట్టించడంపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) దృష్టి సారించింది.
- స్థిరాస్తి కొనుగోలులో సందేహాలా? తెలుగు రాష్ట్రాల్లో ఏ నలుగురు కలిసినా మాట్లాడుకునేది రియల్ ఎస్టేట్ గురించే. పెరుగుతున్న ధరలను తట్టుకుని రాబడి ఇస్తున్న పెట్టుబడి మార్గంగా ఎక్కువ మంది దృష్టిని స్థిరాస్తి రంగం ఆకర్షిస్తోంది.
- సురవరం సుధాకర్‌రెడ్డి సతీమణికి రూ.10.91 లక్షల టోకరా సీపీఐ దివంగత నేత సురవరం సుధాకర్‌రెడ్డి సతీమణి బీవీ విజయలక్ష్మి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.
- కంచె వేసే ముందు ఆధారాలు పరిశీలించరా? ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ ఫెన్సింగ్ వేసే ముందు ఆధారాలను పరిశీలించరా అంటూ హైడ్రాను బుధవారం హైకోర్టు నిలదీసింది. ‘ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలన్న హైడ్రా ఉద్దేశం మంచిదే.
English Translation
Positions based on performance

- A
- A+
- A++

If anyone thinks we have become DCC presidents... That would be the first mistake. There are all kinds of leaders in the party. There will be differences of opinion. Even during the time of Mahatma Gandhi, there were those who expressed opinions different from his thought. The Congress has the freedom to express opinions that differ from the thoughts of the national leadership. We should take it as a spirit of democracy, but we should not think of suppressing those who oppose us and reject us. Doing so will harm the party.
Today, Hyderabad: “Although we observe every action of the DCC presidents, we do not mark them every day. No matter how well we study, exams are given once a year. The post has come, no matter what you do, who will see it...some people think that if someone catches someone before the election, they will get a seat in some quota. No more quotas. There is only merit quota in the party. If you abuse the office of party district president, even God cannot heal you. CM Revanth Reddy emphasized that this post will be useful for you to rise to the level of CM if you make good use of it. He addressed the inaugural meeting of the ten-day training camp organized for the district congress committee (DCC) presidents of AP and Telangana states in Vikarabad on Saturday. He said that the Telangana Congress's lead in the elections has increased due to the trust and confidence of the people towards the state government. He explained that the additional majority of the Congress in the 2023 assembly elections was only 2 percent, but it increased to 4 percent in the Lok Sabha elections held 4 months later and 12 percent in the results of the latest municipal elections. He said that the reason for this was the support of the people and the hard work of the Congress workers. The CM said that DCC presidents will gain respect if they work to solve public problems, but if they get the impression that they are doing piravis, then everyone will be humiliated. "I have reached the level of CM from the level of member of ZPTC. When I was an MLC, whenever I met the then CM YS, he used to greet me with respect saying 'what a hero'. We should see the difficulties faced by Congress leaders in AP. It should be noted how comfortable the party leaders are in Telangana compared to them. The party should be developed in two Telugu states. Both the states should develop together and become an example for the country.
This nation is the Congress
This nation is the Congress party. Country and Congress cannot be seen separately. People like BJP are conspiring to damage this soul. Rahul Gandhi is not allowed to speak in Parliament. BJP is trying to talk about humiliating the Gandhi family with allegations of corruption. The Gandhi family who gave their lives for the country do not even have their own house today. Does money matter to them? If the Gandhi family really wants money, if the Congress workers collect Rs.10,000 crores. If that family really has financial needs... Congress party today has the power to give Rs. 1000 crores if all of us from Telangana join hands. They are trying to humiliate the Gandhi family and seek political distraction. It was only because of Congress that 63 percent of the BCs were elected in the municipal elections.

with digital memberships...
In the past, before setting up village, mandal, district and state committees, a leader in the village had to register the memberships. They used to write their names. Otherwise, we have created an app for digital subscriptions and registered 42 lakhs of subscriptions. If the AICC leaders get suspicious and call a few thousand random numbers and check, it turns out that it is 100% true. We invited those who had the highest number of memberships to Gandhi Bhavan and felicitated them with Rahul Gandhi.
CPI is the only one...
The CPI is the only party in this country that has a hundred years of history along with the Congress. The political parties that formed after that are today becoming a danger to this country with the slogan of 'Congress Mukt Bharat'. Even the British did not dare to touch Mahatma Gandhi. But the legacy of the Bharatiya Janata Party sacrificed Gandhi's life. With the legacy of Mahatma Gandhi, Indira Gandhi and Rajiv Gandhi who gave their lives for this country, Rahul Gandhi needs to be the prime minister of this country without knowing that it is difficult. However, Rahul Gandhi tried to reach the poor by walking for 150 days. That effort should inspire the district congress presidents. CM Revanth Reddy said that this training given to you is very special to face the ongoing conspiracy to change the constitution and abolish reservations in the country. APPC President Sharmila, Telangana PCC President Mahesh Kumar Goud, Ministers Ponguleti Srinivasa Reddy, Sridhar Babu, Ponnam Prabhakar, CM Advisor Vem Narendra Reddy, Training Program Coordinator Sachin Rao, AICC Secretary Sachin Sawant, MLC Patnam Mahender Reddy, MLAs Ram Mohan Reddy, Vedma Bojju and others were present in the program. Participated.
After I assumed the post of PCC president, I went to each leader's house and met them. He said that if we all fight together, we will surely have better days. After I went and met, the situation changed. If five or ten leaders fight, injustice will be done to the lakhs of workers who have believed in the party, then we could have taken the percentage of Congress votes from two and a half to 40 percent in exactly two and a half years. When I was the PCC president... some leaders felt it was very humiliating to be the chairman of affiliated Congress units like SC, ST. Do you think our level has fallen that much? He refused to take the post saying that you are lucky to have become the President of PCC. 37 people who came forward and took those positions on that day were appointed as chairmen of various corporations the moment the government came.
Today, Hyderabad: PCC president Mahesh Kumar Goud said that if KCR bankrupts the state, CM Revanth Reddy is taking it towards development and governance is going on as per the aspirations of the people. Speaking at a training camp organized for District Congress Committee (DCC) presidents of AP and Telangana in Vikarabad, he said...''This training is very useful for creating quality leadership. This program has already been successfully conducted in 14 states. The training camp held in Bapat in the past helped me a lot. The Congress party came to power in Telangana under the leadership of Revanth Reddy and instilled trust in the people. The BJP did not get a deposit in the by-election held in Jubilee Hills, a parliamentary seat represented by Union Minister Kishan Reddy. We have won the recent municipal and panchayat elections. The time is near for the AP Congress to emerge from darkness. APCC president Sharmila said, "District Congress presidents should work for the party's strength. In this ten-day training camp, we will provide training on leadership skills, methods of solving public problems, election strategies, media management, etc.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- 'Under Road' Tank..! Usually we hear it as overhead tank. And what is your doubt about the underground tank? In Kadapagandi Thanda of Yadadri Bhuvanagiri District Sansthan Narayanapuram Mandal, the authorities have built it like that with negligence. Villagers locked Undam Government Primary School in Talamadu mandal of Adilabad district on Wednesday and took the students home. The Center has decided to develop the lands belonging to the closed coal mines across the country as a source of income. With the expiry of Operation Kagar, the security forces are targeting new areas. A cricket ball is rushing towards you.. Don't you run towards the ball and stretch out your hands to catch it.. Within those few seconds our brain analyzes the different images received by the two eyes..
- Lakshminarasimhu Kalyanam Thirukalyana mahotsava of Lakshminarasimhu was held in Yadagirigutta on Wednesday night in Simhalagnam with grandeur.
- 96.90% attendance on the first day. The intermediate first year exams in the state started on Wednesday. On the first day, second language subjects such as Sanskrit, Telugu, Hindi, Urdu, Arabic etc. were conducted. Even after the installation of solar panels on the roofs of all kinds of buildings including houses, the 'Electricity Distribution Company' (Discoms) are neglecting to fix the net meters and the Discoms.. This is where the building owners are losing money.
- Confidence is a weapon... Like this student Vishnutejadi Jogulamba Gadwala district Kuchinerla walking on his knees. He was born without one leg. A few years ago, the second leg became septic, so it was removed.
- Fire in London.. AP resident died Gonthi Abhishek (28) from Andhra Pradesh died in a fire that broke out after midnight on Tuesday in Croydon area of London. Chief of Defense Staff (CDS) General Anil Chauhan said that the tactics of warfare are expanding from physical to synthetic and cognitive fields in accordance with the changing times.
- E-scooters for children with special needs. The Department of Inter-Education expects to provide e-scooters to 1,000 children with special needs (Children with Special Needs- CWSN) enrolled in government junior colleges in the state.
- Allegation without verification. Former Minister Harish Rao's counsel reported to the High Court that the Justice Ghosh Commission set up to investigate the collapse of a pillar in the Medigadda barrage, which is part of the Kaleswaram project, limited itself to personal accusations without establishing the truth.
- Anxiety of Bhudan residents. The victims who lost their nest due to the removal of the houses built on the land of Bhudan Yajna Samiti raised their concern on Wednesday.
- Booking from home with 'Rail Parcel App' The hassle of standing in queues for parcel booking, filling up forms and going around offices will be a thing of the past.
- Infrastructure should be provided in yards: Minister Thummala Agriculture Minister Tummala Nageswara Rao said that the farmers should be vigilant in view of untimely rains and the government will provide them with all necessary assistance.
- Battle on mule accounts. The Telangana Cyber Security Bureau (TGCSB) has focused on playing the game of Mule (handing over bank accounts to cybercriminals in hopes of commission) clients who are the lifeblood of cyber crime gangs.
- Doubtful about buying real estate? In Telugu states, any four people get together and talk about real estate. Real estate sector is attracting more people's attention as an investment avenue that is yielding returns with rising prices.
- Suravaram Sudhakar Reddy's wife received Rs. BV Vijayalakshmi, wife of late CPI leader Suravaram Sudhakar Reddy, was cheated by cyber criminals. The High Court on Wednesday stopped Hydra saying that it should not check the evidence before putting up fencing claiming it as a government land. Hydra's intention to protect government places is good.