స్వైసీగా తింటున్నారు!

‘ఉన్నది ఒక్కటే జీవితం... దీన్ని పూర్తిగా అనుభవించాలి’... ఈ తరం చెబుతోన్న మాటే ఇది. కాబట్టే, కెరియర్‌ దగ్గర్నుంచి... టూర్ల వరకూ ఏదైనా నచ్చిందే చేస్తున్నారు. భిన్న రుచులను వెతుక్కుంటూ వెళ్లిమరీ ఆస్వాదించేస్తున్నారు.

Eenadu icon
By Vasundhara Team Published : 22 Feb 2026 01:28 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

‘ఉన్నది ఒక్కటే జీవితం... దీన్ని పూర్తిగా అనుభవించాలి’... ఈ తరం చెబుతోన్న మాటే ఇది. కాబట్టే, కెరియర్‌ దగ్గర్నుంచి... టూర్ల వరకూ ఏదైనా నచ్చిందే చేస్తున్నారు. భిన్న రుచులను వెతుక్కుంటూ వెళ్లిమరీ ఆస్వాదించేస్తున్నారు. అన్నట్టూ ఈమధ్య వాళ్లని ఆకర్షిస్తున్నదేంటో తెలుసా? హాట్‌ హనీ! అంటే తేనెని వేడి చేసి తీసుకోవడం అనుకునేరు. ఇదో తీపి, కారాల కలయిక. తేనెని వేడిచేసి, దానికి చిల్లీఫ్లేక్స్‌ కలుపుతారు. ఓవైపు తీయగా, మరోవైపు కారంగా... ఆ రుచే వేరు అంటూ పిజ్జా, కూరగాయల సలాడ్, ఫ్రైడ్‌స్నాక్స్, టోస్ట్‌... ఇలా ప్రతి దానిమీదా వేసుకుని తినేస్తున్నారు. పైగా ఈ స్వీట్, స్పైసీల కలయికకి ‘స్వైసీ’ అని పేరు పెట్టుకుని మరీ సోషల్‌మీడియాలో దీని గురించి పంచుకుంటున్నారు. ఏళ్లనాటి నుంచి వస్తున్న సాస్‌కి దీన్నో ట్రెండీ ప్రత్యామ్నాయంగానూ చెబుతున్నారు. దీంతో చిటికెలో పూర్తయ్యే వంటలు, ఫ్లేవర్ల విషయంలో ప్రయోగాలు చేసే జెన్‌జీ అమ్మాయిల ఫేవరెట్‌గా మారిపోయిందీ స్వైసీ తేనె. మరి మీ సంగతేంటి? మీరూ రుచి చూస్తారా ఓసారి?

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :