సంగీత దర్శకుడు రవి బస్రూర్‌కు గోల్డ్‌ రోలెక్స్‌ వాచ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన విశ్వక్

Eenadu icon
By Entertainment Team Published : 22 Feb 2026 07:12 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘చాలా మంది నేను ఏమీ గమనించడం లేదనుకుంటారు. కానీ ఎక్స్‌, రెడిట్‌ సహా సోషల్‌మీడియాలో ఏం ట్రెండ్‌ అవుతుందో చూస్తూ ఉంటా. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అన్నీ మిక్సీలో వేసి తీసిన సినిమానే ‘కల్ట్‌’’ అంటున్నారు విశ్వక్‌సేన్‌. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఇంటెన్స్‌ పార్టీ థ్రిల్లర్‌ ఇది. శనివారం ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు రవి బస్రూర్‌కు విశ్వక్‌ విలువైన బహుమతి ఇచ్చారు. అత్యంత ఖరీదైన రోలెక్స్‌ గోల్డ్‌ వాచ్‌ ఇచ్చి పాదాభివందనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతున్నాయి.

 విశ్వక్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ఫలక్‌నుమా దాస్‌ తీయక ముందు ఏదైనా సాధించాలన్న కసితో ఉండేవాడిని. ‘కల్ట్‌’కు ముందు ఆ కసి పదింతలు అయింది. అదంతా పెట్టి ఈ మూవీ తీశా. టీజర్‌లో మీరు చూసింది చాలా తక్కువ. కుటుంబం, పిల్లలను ఈ సినిమాకు దూరంగా ఉంచండి. గుండె బలహీనంగా ఉన్న వారు కూడా రావొద్దు. ఈ సినిమాకు ఒక కన్ను తరుణ్‌ భాస్కర్‌ అయితే, మరొక కన్ను మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవి బస్రూర్‌గారు. నిజంగా డిఫరెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. అది బాగా నచ్చింది. అందుకే రెండేళ్లు వెయిట్‌ చేసి మరీ రోలెక్స్‌ గోల్డ్‌ వాచ్‌ తెప్పించాను’’ అంటూ విశ్వక్‌ స్వయంగా వాచ్‌ను రవి బస్రూర్‌ చేతికి తొడిగారు. ఈ సందర్భంగా రవి బస్రూర్‌ కాస్త ఎమోషనల్‌ అయ్యారు. 25ఏళ్ల తన కెరీర్‌లో తనలోని అసలైన మ్యూజిక్‌ డైరెక్టర్‌ను విశ్వక్‌ గుర్తించాడని అన్నారు. ఇది కేవలం వాచ్‌ మాత్రమే కాదని, సంగీత దర్శకులకు దక్కిన గౌరవమని ఆనందం వ్యక్తం చేశారు.

రెండుసార్లు ఆత్మహత్య చేసుకుందామనుకున్నా: రవి బస్రూర్‌

‘‘నాకు 18ఏళ్లు వయసున్నప్పుడు రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించా. రెండుసార్లు ఎలాగో బతికా. రెండోసారి నన్ను కాపాడిన వ్యక్తి నా గురించి తెలిసి కీ-బోర్డ్‌ కొనుక్కునేందుకు రూ.35వేలు ఇచ్చాడు. అతడి పేరు రవి. అప్పటి నుంచి నా సొంత పేరును తీసేసి రవి బస్రూర్‌గా మార్చుకున్నా. నా ఆఖరి ఊపిరి ఉన్నంతవరకూ మీరందరూ నన్ను రవి బస్రూర్‌ అని పిలుస్తారు కదా! ఆ క్రెడిట్‌ ఆయనకు దక్కుతుంది. ఇప్పుడు విశ్వక్‌కు థ్యాంక్స్‌ చెబుతున్నా. నా ప్రతిభను గుర్తించాడు. ఈ ఇద్దరిని నా జీవితంలో మర్చిపోలేను’’ అని అన్నారు. ‘కల్ట్‌’తో పాటు యశ్‌ ‘టాక్సిక్‌’, ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ మూవీకి రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు.

అది తెలిస్తే నేను బాబాజీ అయ్యేవాడిని: విశ్వక్‌

ఈ సినిమా ఏస్థాయిలో హిట్‌ అవుతుందనుకుంటున్నారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు విశ్వక్‌ సమాధానం ఇచ్చారు. ‘సినిమా హిట్‌ అవుతుందా? ఫ్లాప్‌ అవుతుందా? ఎంత వసూలు చేస్తుందనేది తెలిస్తే తాను బాబాజీ అయ్యేవాడిని కదా! ప్రతి సినిమాకు ప్రతి గంట ప్రాణం పెట్టే పనిచేస్తున్నాం. ఇదంతా ఒక సుదీర్ఘ ప్రక్రియ. ఇది జానర్‌ బ్రేకింగ్‌ ఫిల్మ్‌. జెన్‌జీకి బాగా నచ్చుతుంది. న్యూఏజ్‌ కోసం సినిమా చేయాలని లెక్కలు లేకుండా పనిచేశా. ఎవరేమనుకున్నా నేను నటించిన ‘ఫంకీ’ హిట్‌’’అని విశ్వక్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.


► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మూవీ మేకర్స్‌కు ఆర్జీవీ హెచ్చరిక.. ‘ధురంధర్‌2’తో దర్శకులు.. హీరోల మబ్బులు విడిపోతాయి! ‘ధురంధర్‌2’ (dhurandhar 2) దక్షిణాది చిత్రాలకు ఓ సవాల్‌ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.
  • మహేశ్‌బాబు, రాజమౌళి ఫైట్‌.. ఏఐ వీడియోను షేర్‌ చేసిన వర్మ అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తోంది ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ). ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలుసుకోలేనంతగా సమాచారాన్ని వ్యాప్తి చేస్తోంది.
  • నమ్మకం కోల్పోయా.. ఆ సమయంలో రాజ్‌ అండగా నిలిచారు: సమంత వివాహ బంధం ముగిసిన తర్వాత ఇక ఎవరినీ నమ్మడం, ఆధారపడటం సాధ్యం కాదేమోననిపించిందని, కానీ రాజ్‌ నిడుమోరుతో పరిచయం తనలో మార్పు తీసుకొచ్చిందన్నారు స్టార్‌ హీరోయిన్‌ సమంత.  
  • ‘వెడ్డింగ్‌ ఆఫ్‌ విరోష్‌’.. రష్మికతో పెళ్లిపై విజయ్‌ దేవరకొండ ఫస్ట్‌ పోస్ట్‌ విజయ్‌ దేవరకొండ, రష్మిక త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివాహం విషయంలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విజయ్‌ ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు.
  • అసౌకర్యంగా అనిపించేది: మరోసారి సౌత్‌ ఇండస్ట్రీపై తాప్సీ కామెంట్స్‌ సౌత్‌ ఇండస్ట్రీపై తాప్సీ మరోసారి కామెంట్స్‌ చేశారు. దీనిపై నెట్టింట చర్చ జరుగుతోంది.
  • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌: ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌.. ఉత్తమ నటి నివేదా థామస్‌ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌, ఉత్తమ నటిగా నివేదా థామస్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నారు.
  • ఆ కామెంట్స్‌ చేసినందుకు నేను మూడు రోజులు నిద్ర పోలేదు: శివాజీ మహిళల డ్రెస్‌ల ఆధారంగా వారి క్యారెక్టర్‌ను నిర్ణయించకూడదని నటుడు శివాజీ అన్నారు.
  • సుకుమార్‌ డైరెక్షన్‌లోనే హీరోగా ఎంట్రీ.. కానీ: దేవిశ్రీ ప్రసాద్‌ తాను హీరోగా గతంలోనే ఓ సినిమా చేయాల్సి ఉందని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
  • విజయ్‌- రష్మిక పెళ్లి.. శుభలేఖ లీక్‌పై టీమ్‌ అసహనం! విజయ్‌ దేవరకొండ, రష్మిక వివాహం, రిసెప్షన్‌ తదితర వివరాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంపై విజయ్‌ టీమ్‌ అసహనం వ్యక్తం చేసింది.
  • విజయ్‌ ఆంటోనీ మూవీ.. వాటి వల్లే నాకు ఛాన్స్‌: మంచు లక్ష్మి విజయ్‌ ఆంటోనీ ‘బూకి’ సినిమాలో తనకు ఎలా అవకాశం వచ్చిందో మంచు లక్ష్మి తెలిపారు.
  • అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 రూల్స్.. క్షమాపణలు చెప్పిన కావేరి స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ను (Allu Arjun) కలవాలంటే 42 నిబంధనలు తప్పకుండా పాటించాలంటూ బ్రాండ్‌ స్ట్రాటజర్‌ కావేరి బరూవా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.
  • ‘వారణాసి’లో ప్రకాశ్‌రాజ్‌ పాత్ర ఇదే.. వీడియో వైరల్‌ ‘వారణాసి’లోని తన పాత్రపై ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు.
  • చిరంజీవి భుజానికి సర్జరీ.. కోలుకుంటున్నానంటూ పోస్ట్ అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) భుజానికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.
  • నయినార్‌ నాగేంద్రన్‌ విమర్శలు.. స్పందించిన త్రిష ప్రముఖ నటుడు, టీవీకే అధ్యక్షకుడు విజయ్‌ (Vijay)ను విమర్శిస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌నాగేంద్రన్ (Nainar Nagendran) చేసిన విమర్శలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
  • అల్లు వారి పెళ్లిసందడి.. తొలి శుభలేఖ చిరంజీవికే.. అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. ఈ క్రమంలో పెళ్లి పిలుపులు షురూ చేశారు.
  • బుచ్చిబాబుకు చరణ్‌ విషెస్‌.. ఫొటో పంచుకున్న హీరో దర్శకుడు బుచ్చిబాబుకు హీరో రామ్‌చరణ్‌ విషెస్‌ తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.
  • ‘ధురంధర్‌’లో విలన్‌ రోల్‌ మిస్సయారా?.. నాగార్జున క్లారిటీ..! కథానాయకుడిగానే కాదు, ప్రత్యేక పాత్రల్లోనూ మెరుస్తున్నారు నాగార్జున (Nagarjuna). ఇటీవల ‘కూలీ’లో ప్రతినాయకుడు సిమన్‌ పాత్రలో నటించి మెప్పించారు.
  • నేను ‘సాగర సంగమం’ తీశానని చెప్పలేదుగా: నాగవంశీ తాను నిర్మించిన కొత్త సినిమా ‘ఫంకీ’ ఫలితంపై నాగవంశీ స్పందించారు.
  • రూ.120 కోట్లకు ‘టాక్సిక్‌’ మూవీ హక్కులు: దిల్‌ రాజు ఏమన్నారంటే? ‘టాక్సిక్‌’ మూవీ హక్కుల గురించి ప్రశ్నించగా నిర్మాత దిల్‌ రాజు స్పందించారు.
  • మిమ్మల్ని కూడా హగ్‌ చేయాలనే వచ్చా.. కానీ..: నరేశ్‌ ఇటీవల ఓ వ్యవహారం తర్వాత సినిమా వేడుకల్లో మహిళలందరూ చీరలోనే కనిపిస్తున్నారని సీనియర్‌ నటుడు నరేశ్‌ అన్నారు.