పెళ్లింట విషాదం

Eenadu icon
By Andhra Pradesh Dist. Desk Updated : 22 Feb 2026 06:01 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

బుచ్చెయ్యపేట, కె.కోటపాడు, న్యూస్‌టుడే: పెళ్లి వేడుక ముగిసి కొద్దిసేపైనా గడవక ముందే ఆ ఇంట విషాదం అలుముకుంది. అప్పటివరకు పెళ్లిబాజాలు మోగిన పచ్చని పందిట్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. వధూవరులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో వరుడి సోదరి మృతి చెందగా.. వరుడు తీవ్రంగా గాయపడ్డాడు. 

బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజు పేటకు చెందిన ముత్యాల జగన్నాథరావుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. చిన్న కుమారుడు మోహనకుమార్‌ (28) మాడుగుల మండలం ఎం.కోటపాడు సచివాలయంలో సర్వేయరుగా పనిచేస్తున్నారు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన సునందతో (22) శుక్రవారం రాత్రి ఆయనకు వివాహమైంది. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత శనివారం ఉదయం కారులో శ్రీకాకుళం బయలుదేరారు. కారులో వధూవరులతోపాటు పెళ్లికొడుకు సోదరి లావణ్య (24) శిరీష (22), హరీశ్‌ (25), ప్రదీప్‌ (34) ఉన్నారు. కె.కోటపాడు సమీపంలో బత్తినపాలెం పెట్రోల్‌ బంకు వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లావణ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. వరుడితోపాటు మృతురాలి భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

తొమ్మిది నెలల కిందటే వివాహం

వరుడి సోదరి లావణ్యకు గతేడాది జూన్‌లో విజయనగరం జిల్లా బొండపల్లి మండలం రాచకిండం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. అన్నయ్య పెళ్లి కోసం భర్తతో విజయరామరాజుపేట గ్రామానికి వచ్చిందామె. పెళ్లి వేడుకలో ఉదయం నుంచి అందరితో సరదాగా డ్యాన్సు చేస్తూ సందడి చేసింది. రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. లావణ్య తల్లి గుండెలవిసేలా ఏడుస్తూ సొమ్మసొల్లి పడిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

► Read latest Visakhapatnam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Feb 2026 03:39 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • లో‘పాలు’.. ఇలా గుర్తిద్దాం [ 25-02-2026] రోజులు మారాయి. కాసులకు కక్కుర్తిపడి సంపూర్ణ ఆహారమైన పాలను కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చాలాచోట్ల ఈ కల్తీ యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇది ఇప్పుడు తీవ్రరూపం దాల్చి రాజమహేంద్రవరంలో అయిదు నిండుప్రాణాలను బలిగొంది.
  • ఆలోచనల ప్రభంజనం.. అమోఘ ప్రయో‘జనం’!! [ 25-02-2026] సమాజంలో నిత్యం ఎదురయ్యే ప్రధాన సమస్యలపై విద్యార్థులు దృష్టి సారించారు. తమ సృజనాత్మకతను జోడించి ఆధునిక పరిజ్ఞానంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 77 ప్రాజెక్టులు రూపొందించారు.
  • రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సర్క్యులర్‌ ఎకానమీ పార్కులు [ 25-02-2026] రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సర్క్యులర్‌ ఎకానమీ పార్కులు ఏర్పాటు చేస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ తెలిపారు.
  • రక్తపోటు.. ఆరోగ్యంపై కాటు [ 25-02-2026] జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారిలో రక్తపోటు బాధితులు పెరుగుతున్నారు. ఆర్థిక సంబంధ వ్యవహారాలను చక్కదిద్దే వారిలో చాలా మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నా.. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.
  • ర్యాంపు కానరాదు.. చక్రాల కుర్చీ ఊసేలేదు [ 25-02-2026] ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాల వద్ద దివ్యాంగ విద్యార్థుల కోసం ర్యాంపు, వీల్‌ఛైర్‌ వంటి సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాల్సి. కొత్తకోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద అలాంటివి లేకపోవడంతో దివ్యాంగ విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు.
  • అనధికార మార్గాల మూసివేత [ 25-02-2026] జాతీయ రహదారిపై నక్కపల్లి మండల పరిధిలో పలు అనధికార మార్గాలను మూసివేస్తున్నారు. జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలపై ‘ఈనాడు’లో వస్తున్న కథనాలపై పోలీసు ఉన్నతాధికారులు, హైవే నిర్వహణ సంస్థ ప్రతినిధులు స్పందించారు. నక్కపల్లి మండల పరిధిలో పరిస్థితిపై సీఐ జె.మురళి దృష్టి సారించారు.
  • సచివాలయ ఉద్యోగినంటూ మోసం.. ఒకరి అరెస్టు [ 25-02-2026] సచివాలయం ఉద్యోగినంటూ మోసంచేసి.. నగలు కాజేపిన వ్యక్తిని పట్టణ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం  డీఎస్పీ శ్రావణి వివరాలు వెల్లడించారు.
  • కాలుష్యం కట్టడే కీలకం [ 25-02-2026] పోర్టుల కాలుష్యం కట్టడి చేయకుంటే ‘కాలుష్యస్థాయి’లో దిల్లీని విశాఖ మించి పోయేలా ఉంది. తాజాగా గంగవరం పోర్టులో ఇనుప ఖనిజ మిశ్రమ కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న తరువాత ఈ విషయం మరోసారి చర్చనీయాంశమవుతోంది.
  • వైద్య సేవలకు అంతరాయమేనా..? [ 25-02-2026] కింగ్‌ జార్జ్‌ ఆసుపత్రి(కేజీహెచ్‌)లో వైద్య సేవలకు అంతరాయం కలిగే పరిస్థితి తలెత్తింది. ఏడాది  నుంచి విధులు నిర్వహిస్తున్న దాదాపు 200 మంది హౌస్‌సర్జన్ల గడువు మంగళవారంతో ముగిసింది.
  • గ్రామీణుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం [ 25-02-2026] టొయోట్సు రేర్‌ ఎర్త్స్‌ ఇండియా లిమిటెడ్‌ (టీఆర్‌ఇఐ) ఆర్థిక సహకారంతో ఇవ్వనున్న ఉచిత వసతి, శిక్షణ, ఉపాధి అవకాశాలకు గ్రామీణ యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సెమ్స్‌ సీవోవో కమాండర్‌ (ఆర్‌) గోపీకృష్ణ శివ్వం తెలిపారు.

English Translation

Wedding tragedy

Eenadu icon
By Andhra Pradesh Dist. Desk Updated : 22 Feb 2026 06:01 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

Buchcheyyapet, K.Kotapadu, Newstoday: Tragedy struck the house not even after the end of the wedding ceremony. Until then, the cries of family members and relatives are heard in the green pig where the wedding bells were ringing. The car in which the bride and groom were traveling met with an accident. In this incident, the groom's sister died and the groom was seriously injured. 

Younger son Mohanakumar (28) is working as a surveyor in M. Kotapadu secretariat of Madugula mandal. He got married to Sunanda (22) from Srikakulam town on Friday night. After the wedding ceremony, they left for Srikakulam by car on Saturday morning. Groom's sister Lavanya (24), Shirisha (22), Harish (25) and Pradeep (34) were in the car along with the bride and groom. The car lost control and hit a tree at Battinapalem petrol station near K. Kotapadu. In this accident, Lavanya sustained severe head injuries. She died on the way to the hospital. Along with the groom, the husband of the deceased was seriously injured.

Groom's sister Lavanya was married less than nine months ago

In June, she got married to a man from Ratchakindam village, Bondapalli mandal, Vizianagaram district. Did she come to Vijayaramarajupeta village with her husband for her elder brother's wedding? In the wedding ceremony, there was a lot of noise from the morning, dancing with everyone. The family members and relatives are in mourning after he died in a road accident. Lavanya's mother was crying her heart out and collapsed. Police have registered a case and are investigating.

► Read latest Visakhapatnam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Feb 2026 03:39 IST

Note:Advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter. 25-02-2026] Days have changed. They are tampering with the lives of people by adulterating milk, which is a complete food, for money. In many places this adulteration continues freely. It has now become severe and claimed five lives in Rajamahendravaram. [ 25-02-2026] The students focused on the main problems faced in the society. Adding their creativity with modern knowledge not one.. not two.. Together 77 projects have been designed.

  • Five circular economy parks across the state [ 25-02-2026] Swachhandhra Corporation Chairman Kommareddy Pattabhiram said that five circular economy parks will be established across the state. 25-02-2026] Hypertension sufferers are increasing among the 18-year-olds in the district. Many of those who fix their financial affairs are suffering from high blood pressure.. neglecting their health. 25-02-2026] Intermediate examination centers must have facilities like ramps and wheelchairs for disabled students. Due to lack of such facilities at Govt Junior College, Kottakota, differently abled students are in dire straits.
  • Closing of unauthorized routes [ 25-02-2026] Many unauthorized routes are being closed in Nakkapally mandal on the national highway. Senior police officials and representatives of the highway management organization responded to the stories appearing in 'Eenadu' about the accidents happening on the national highway. CI J. Murali focused on the situation in Nakkapally mandal area. 25-02-2026] On Tuesday, the town police arrested a man who pretended to be an employee of the secretariat and handed over jewellery. DSP Shravani revealed the details at the police station on Tuesday. 25-02-2026] Delhi is likely to exceed Visakhapatnam in 'pollution level' if port pollution is not curbed. Recently, after the decision to set up an iron ore mixing center at Gangavaram port, this matter is being discussed once again.
  • Is it a disruption to medical services..? [ 25-02-2026] A situation has arisen where medical services are disrupted at King George Hospital (KGH). The deadline of nearly 200 house surgeons who have been working since a year ended on Tuesday.
  • Inviting applications from villagers [ 25-02-2026] Sems CVO Commander (R) Gopikrishna Shivam said that applications are invited from rural youth for free accommodation, training and employment opportunities to be provided with the financial support of Toyota Rare Earths India Limited (TREI).