
వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని సహించం
నల్లబెల్లి:రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలందించడంలో వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని కలెక్టర్ డాక్టర్ సత్యశారద హెచ్చరించారు. మండలంలోని మేడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. డాక్టర్ జ్యోతి, పలువురు వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈవిషయమై డీఎంహెచ్‌ఓతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, వైద్యసిబ్బంది గైర్హాజరుపై చర్యల నిమిత్తం రెండు రోజుల్లో విచారణ నివేదిక అందించాలని ఆదేశించారు. అనంతరం రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరురికార్డు, ఫార్మసీ విభాగంలోని మందుల నిల్వలను పరిశీలించారు. అవసరమైన ఔషధాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీహెచ్‌సీ పరిధిలోని రాంపూర్ సబ్ సెంటర్‌ను పందర్శించారు. మౌలిక సదుపాయాలు, సబ్ సెంటర్‌లో అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించారు. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు, తల్లిబిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సుచించారు. ప్రభుత్వ ఆరోగ్య పథకాల ప్రయోజనాలు గ్రామీణ ప్రజలకు సమర్థవంతంగా చేరేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఇన్‌చార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసరావు, పీహెచ్‌సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తాగునీటి సమస్య లేకుండా చూడాలి..
న్యూశాయంపేట:జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. తాగునీరు, వేసవి ప్రణాళికపై కలెక్టరేట్ సమావేశహాల్‌లో శనివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 698 హాబిటేషన్లలో నివసిస్తున్న 1,16,934 కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నల్లా కనెక్షన్లు లేని 1,784 గృహాలకు వెంటనే కనెక్షన్లు ఇవ్వాలని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న 902 తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయాలని, ఎక్కడైనా నీటి సమస్య తలెత్తితే యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, చేతిపంపులు, బోరుమోటార్ల మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని, అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా నీటి సరఫరా వ్యవస్థలు నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, మిషన్ భగీరథ ఈఈ నిర్మల, ఈఈ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
మేడపల్లిలో పీహెచ్‌సీ తనిఖీ
English Translation

Negligence in medical services will not be tolerated
Nallabelli:Collector Dr. Sathyasarada has warned that negligence by doctors and medical staff in providing better and quality medical services to patients will not be tolerated. She paid a surprise visit to the Medapalli primary health center in the mandal on Saturday. Dr. Jyoti and many other medical staff expressed their displeasure over the non-availability of medical staff. Talked to the DMHO on the phone and inquired about the details. He was directed to submit an inquiry report within two days regarding the action taken against the absence of doctors and medical staff. After that, the medical services provided to the patients, attendance record of the staff and stock of medicines in the pharmacy department were examined. It is advised to take steps to ensure that necessary medicines are available. Rampur sub center under PHC was visited. The infrastructure and medical services provided in the sub center were reviewed. It is recommended to pay special attention to the health of pregnant women, children, the elderly, and infants. He asked the medical staff to work hard to ensure that the benefits of government health schemes reach the rural people effectively. In-charge MPDO Srinivasa Rao and PHC medical staff participated.
Drinking water should be ensured without problem..
Newsayampet:Collector Dr. Sathyasarada ordered the officials of all departments to work in coordination to prevent drinking water problem in the district. A review meeting was held with officials on Saturday in the collectorate conference hall on drinking water and summer planning. It has been advised to take measures to avoid any difficulties for the 1,16,934 families living in 698 habitations in the district. Nalla said that 1,784 households without connections should be given connections immediately. He suggested that 902 drinking water tanks in the district should be cleaned, if there is a water problem anywhere, alternative measures should be taken on war footing, and repairs of hand pumps and bore motors should be completed on time. If necessary, water should be supplied through tankers and the water supply systems should be closely monitored by the committees formed in all the villages. JDP CEO Ram Reddy, DPO Kalpana, Mission Bhagiratha EE Nirmala, EE Surender and others participated in the meeting.