హాట్‌

హాట్‌టాపిక్‌గా ‘దేవాదుల’

హాట్‌టాపిక్‌గా ‘దేవాదుల’

సీఎం రేవంత్‌ టూర్‌ ఇలా..

8లోu

విహారయాత్రకు

ముఖ్యమంత్రి, మంత్రులు..

దేవన్నపేట వద్ద నీళ్లు

ఎత్తిపోస్తున్నారు..

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

జేసీఆర్‌ దేవాదుల ఎత్తిపోతల పథకం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఉమ్మడి వరంగల్‌ ఆయకట్టుకు కీలకమైన ఈ ప్రాజెక్టులో పంపుహౌజ్‌ మోటార్లు పనిచేయకపోవడం వివాదాస్పదంగా మారింది. గత యాసంగి సీజన్‌లో మోటార్లు మొరాయించాయి. ఫలితంగా 60 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందక ఎండిపోయాయని రైతుల పక్షాన ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దేవన్నపేట పంపుహౌస్‌ను హుటాహుటిన సందర్శించారు. మోటార్లు రన్‌ అయ్యే వరకు అక్కడే ఉంటామని ప్రకటించినా ఆ వెంటనే మోటార్లు ఆన్‌ కాలేదు. మోటార్లలో సాంకేతిక కారణాలు తలెత్తాయన్న అధికారులు.. ఆ తర్వాత రెండింటినీ ఆన్‌చేయగా యాసంగి సీజన్‌ దాటే సమయానికి నీళ్లందాయి. ఈ సీజన్‌లోనూ దేవన్నపేట పంపుహౌస్‌లో మోటార్లు ఆన్‌ చేయకపోవడంతో శుక్రవారం సందర్శించిన మాజీ మంత్రి హరీశ్‌రావు బృందం.. కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం, మంత్రుల తీరుపై విమర్శలు గుప్పించింది. ఇదిలా ఉంటే దేవన్నపేట పంపుహౌస్‌లో అధికారులు శని వారం మోటార్‌ను ఆన్‌చేశారు. అక్కడినుంచి ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ ద్వారా సాగునీరు అందించేందుకు ఆన్‌ చేసినట్లు అధికారులు ప్రకటించారు.

గోదావరి ఇంటెక్‌ వెల్‌కు నేడు సీఎం రేవంత్‌

దేవాదుల ప్రాజెక్టు అంశం వివాదం అవుతున్న నేపథ్యంలో ఆదివారం సీఎం రేవంత్‌ రెడ్డి ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఆ ప్రాజెక్టు ఇంటెక్‌ వెల్‌ను సందర్శించనున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న సీఎం.. అక్కడినుంచి ఇంటెక్‌ వెల్‌ను సందర్శించి అక్కడే అధికారులతో ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నీటిపారుదలశాఖ మంత్రి గతంలో 2026 మార్చి వరకు ప్రాజెక్టు పూర్తి చేసి పూర్తి ఆయకట్టుకు నీరందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో నెలరోజులే గడువు ఉండడంతో ప్రాజెక్టు పెండింగ్‌ భూసేకరణ, మూడో విడత పనులపై సీఎం రేవంత్‌రెడ్డి అఽధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు అధికారవర్గాల సమాచారం. శనివారం రాత్రి నుంచి పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రాజెక్టు పంపుహౌస్‌లకు నేతల తాకిడి

నిన్న బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌,

మాజీ ఎమ్మెల్యేల బృందం

నేడు సీఎం రేవంత్‌రెడ్డి రాక..

గంగారం వద్ద పనుల పరిశీలన

అనంతరం దేవాదుల ప్రాజెక్టుపై సమీక్ష

ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌ ద్వారా బయల్దేరి 2.15 గంటలకు మహబూబాబాద్‌ జిల్లా రెడ్యాల గ్రామానికి చేరుకుంటారు. 2.45 గంటలకు ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. 3 గంటలకు అక్కడినుంచి బయల్దేరి దేవాదుల ప్రాజెక్టుకు 3.30 గంటలకు చేరుకుంటారు. 5 గంటల వరకు ప్రాజెక్టుపై రివ్యూ నిర్వహిస్తారు. అనంతరం నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో కలిసి హెలికాప్టర్‌లో తిరుగు పయనమై హైదరాబాద్‌ చేరుకుంటారు.

దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కేటాయించని రేవంత్‌రెడ్డి

బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి

హాట్‌టాపిక్‌గా ‘దేవాదుల’1
1/1

హాట్‌టాపిక్‌గా ‘దేవాదుల’


English Translation
hot

'Devada' as a hot topic

'Devada' as a hot topic

CM Revanth tour like this..

in 8

outing

Chief Minister, Ministers..

at Devannapet Water

is being lifted..

Witness representative, Warangal :

JCR Devada's lifting scheme has become a hot topic now. The non-functioning of the pumphouse motors in this project, which is crucial for the joint Warangal Ayakattu, has become controversial. Motors roared last Yasangi season. As a result, the opposition has criticized the farmers for saying that the water supply has dried up for the 60,000 acres of Ayakattu. Dharnas and protests were also held under the auspices of the BRS party. Responding to this, Irrigation Minister Uttam Kumar Reddy and District In-charge Minister Ponguleti Srinivas Reddy immediately visited the Devannapet pump house. They announced that they would stay there until the motors were running, but the motors were not turned on immediately. Officials said that there were technical reasons in the motors.. After that both were turned on and the water was flowing by the time the Yasangi season was over. The team of former Minister Harish Rao, who visited the Devannapet pump house on Friday, criticized the behavior of the Congress government, the CM and the ministers as the motors were not turned on this season as well. Meanwhile, the authorities switched on the motor at the Devannapet pump house on Saturday. Officials have announced that they have turned on the supply of irrigation water through the Dharmasagar reservoir.

CM Revanth to Godavari intake well today

In the wake of the dispute over the Devada project, CM Revanth Reddy will visit the intake well of the project in Ethurunagaram mandal of Mulugu district on Sunday. The CM is coming to participate in a private program in Mahabubabad district. From there, he will visit the intake well and there he will conduct a review of the project with the officials. It is known that the Irrigation Minister had previously announced that the project will be completed by March 2026 and the entire area will be irrigated. Officials informed that CM Revanth Reddy will hold a high-level meeting with officials on the pending land acquisition and third phase of the project as the deadline is only a month away. From Saturday night, the police made a massive security.

Leaders clashed with the project pump houses

BRS leader Harish yesterday,

a group of former MLAs

CM Revanth Reddy arrived today..

Inspection of works at Gangaram

After that review of Devada project

Sunday afternoon. They will leave Begumpet by helicopter at 1.30 a.m. and reach Redyala village of Mahabubabad district at 2.15 a.m. At 2.45 pm will participate in a private program. It will leave from there at 3 o'clock and reach Devada project at 3.30 o'clock. A review will be conducted on the project till 5 o'clock. Later, he will return to Hyderabad in a helicopter along with Irrigation Minister Uttam Kumar Reddy.

Revanth Reddy who did not allocate a single rupee for the Devada project

BRS senior leader and former MLA Peddi Sudarshan Reddy

'Devada' as hot topic1
1/1

'Devada' as hot topic