Travel Budget: విహారయాత్ర సరే.. బడ్జెట్‌ మాటేంటి?

Eenadu icon
By Features Team Published : 07 Feb 2026 11:24 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: విహారయాత్రకు వెళ్లాలని ఎవరికి ఉండదు చెప్పండి. కొందరు విదేశాలను చుట్టిరావాలని ఆశ పడుతుంటారు. మరికొందరు దేశీయంగా పర్యటించాలని భావిస్తారు. ఇంకొందరు కనీసం కాస్త దగ్గరలో ఉన్న సందర్శక ప్రాంతాలనైనా చూసి రావాలనుకుంటారు. అనుకునేవరకు బాగానే ఉంటుంది. కానీ, బడ్జెట్‌ మాటేంటి? నెలవారీ ఖర్చులు, భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికల మధ్య విహారయాత్రకు ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించడం కష్టమే. అయితే, ఖర్చుల్లోనే పొదుపు చేస్తే విహారానికి బడ్జెట్‌ పెద్ద సమస్యే కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. మరి దానికి ఏం చేయాలంటే..

మొదట విహారయాత్ర కోసం ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోవాలి. వెళ్లే ప్రాంతాన్ని బట్టి బడ్జెట్‌ ఆధారపడి ఉంటుంది. విదేశాలైతే భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. దేశీయంగా, స్థానికంగా ఓ మోస్తరు ఖర్చు ఉంటుంది. ప్రయాణ టికెట్లు, బస, భోజనం, ఇతర ఫీజులు ఇలా మొత్తం ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు వేసుకొని.. లక్ష్యాన్ని అందుకునేలా పొదుపు ప్రారంభించాలి. ఇందుకోసం రికరింగ్‌ అకౌంట్‌ తెరవచ్చు. లేదంటే.. ఒక పొదుపు డబ్బాను ఉపయోగించుకోవచ్చు.

  • ప్రతి రోజు ఒక నిర్దిష్ట మొత్తాన్ని విహారయాత్ర కోసం జమ చేయండి. ఆదాయాన్ని బట్టి రోజుకు రూ.100 నుంచి ఎంతయినా సరే.. ఆ మొత్తాన్ని పక్కన పెట్టండి. ఆరు నెలలు అలా చేశారంటే మంచి మొత్తం జమవుతుంది.
  • ఉద్యోగం, వ్యాపారం చేసేవారయితే ప్రతి నెలా కొంత మొత్తాన్ని ట్రావెల్‌ బడ్జెట్‌ కింద పొదుపు చేయొచ్చు. ఆ మొత్తాన్ని మరో అకౌంట్‌/పొదుపు స్కీమ్‌లోకి ఆటోమెటిక్‌గా ట్రాన్స్‌ఫర్‌ అయ్యేలా ఏర్పాటు చేసుకోవాలి. 
  • రోజుకు 4 సార్లు బయట టీ/కాఫీ/కూల్‌డ్రింక్స్‌ తాగే అలవాటు ఉంటే.. ఒక్కసారే తాగండి. మిగిలిన డబ్బును పొదుపు చేయండి. చిన్న మొత్తాలే కొంతకాలానికి పెద్దగా కనిపిస్తాయి. 
  • వారాంతాల్లో రెస్టారంట్లలో తినడం ఈ కాలంలో సర్వసాధారణమైపోయింది. అయితే, నెలలో రెండు వారాలు బయట తినడం మానేయండి. రెస్టరంట్‌లో అయ్యే సగటు బిల్లు మొత్తాన్ని జమ చేయాలి. 
  • చాలామంది అవసరమున్నా లేకపోయినా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ తీసుకుంటారు. ఒకవేళ విహారయాత్రకు వెళ్లాలనుకుంటే అనవసరమైన ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ను నిలిపివేయండి. వాటికయ్యే డబ్బును ఆదా చేసి ట్రావెల్‌ బడ్జెట్‌కు మళ్లించాలి. 
  • కొన్ని క్రెడిట్‌ కార్డ్స్‌ విహారయాత్రకు ఉపయోగపడేలా ఉంటాయి. వాటితో రివార్డ్స్‌/ట్రావెల్‌ పాయింట్లు పొంది.. విమాన/రైలు టికెట్లు, హోటల్స్‌లో బుకింగ్స్‌ వంటివాటిలో డిస్కౌంట్స్‌ దక్కించుకోవచ్చు.

సరిగ్గా ప్లాన్‌ చేయాలి గానీ, విహారయాత్రకు అయ్యే ఖర్చులోనూ డబ్బు పొదుపు చేయొచ్చు. అదెలా అంటారా? అయితే వీటిని ట్రై చేసి చూడండి..

  • విమాన/రైలు టికెట్లను కొన్ని నెలల ముందుగానే బుక్‌ చేసుకోవడం మేలు. చివరి నిమిషంలో అయితే, విమాన టికెట్ల ధర భారీగా పెరుగుతుంది. రైలు టికెట్‌ను ఎక్కువ ధర పెట్టి తత్కాల్‌లో బుక్‌ చేసుకోవాల్సి వస్తుంది.
  • తరచూ ట్రావెల్‌ ఏజెన్సీలు, టికెట్‌ బుకింగ్‌ సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. రాయితీలు, బై వన్‌ గెట్‌ వన్‌, గ్రూప్‌ ప్యాకేజీలు వంటివి అందుబాటులోకి తెస్తాయి. అలాంటి సమయంలో ఆ ఆఫర్లను వినియోగించుకుంటే ఖర్చు తగ్గుతుంది.
  • వెళ్లినచోట సందర్శక ప్రాంతాలను చుట్టి రావడానికి ప్రత్యేకంగా క్యాబ్‌ బుక్‌ చేసుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే.. రైలు, బస్సు వంటి  ప్రజారవాణా సౌకర్యాలను ఉపయోగించుకొని డబ్బు ఆదా చేసుకోవచ్చు. 
  • టూరిస్ట్‌ గైడ్‌ను నియమించుకుంటే పెద్ద మొత్తంలో వారికి చెల్లించాల్సి వస్తుంది. నిజానికి ఈ కాలంలో ఇదొక అనవసరపు ఖర్చు. వెళ్లే ముందే ఆ ప్రాంతాల విశేషాలను ఆన్‌లైన్‌లో తెలుసుకొని వెళ్తే గైడ్‌ అవసరం ఉండదు.
  • సందర్శక ప్రాంతాల్లోని హోటల్స్‌లో బస చేయాలంటే ఖరీదెక్కువగా ఉంటుంది. ఖర్చు తగ్గించుకోవాలంటే క్యాంపింగ్‌ (శిబిరం) ప్రయత్నించొచ్చు. లేదంటే హాస్టల్స్‌లో రూమ్‌ ధరలు తక్కువగా ఉంటాయి. వాటిల్లో బస చేయొచ్చు.
► Read latest Explained Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ప్రేమికుల రోజు సరదాలా?ఖర్చే లేకుండా రొమాంటిక్‌ అనుభవాలు పొందొచ్చు! ప్రేమికుల రోజు.. కేవలం ప్రేమ జంటలే కాదు, భార్యాభర్తలూ చేసుకోదగ్గ వేడుక. సాధరణంగా ఈ రోజున ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
  • టెండర్లపై ‘ఏఐ’ నిఘా.. అక్రమాలు, సిండికేట్‌లు ఇకపై కుదరవు! రహదారులు, రైల్వే ప్రాజెక్టులు సహా అభివృద్ధి పనులు.. ఇలా ప్రభుత్వంలో ప్రధాన నిర్మాణ ప్రాజెక్టులకు టెండర్లు తప్పనిసరి.
  • వద్దన్నా వస్తున్నారు.. యూరప్‌లో ట్రావెల్‌ ఓవర్‌క్రౌడింగ్‌! చాలా దేశాల ప్రభుత్వాలు తమ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ.. మా దేశంలో పర్యటించాలని ప్రకటనలు, ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. 
  • ‘మని’ ద్వీపకల్పం.. అక్కడ అంతా ఒకే సమూహం గ్రీసులో ఉన్న ఓ మానవ సమూహం తరతరాలుగా అనేక దాడులను ఎదుర్కొని నిలిచింది.
  • పిల్లల్ని కనబోతున్నారా.. మరి వీటి గురించి ఆలోచించారా? పెళ్లి చేసుకున్న యువజంటలతో బంధువులు అనే మొదటి మాట..‘పిల్లల్ని ఎప్పుడు కంటారు? తొందరగా కనేయండి’అని. వైవాహిక జీవితానికి తల్లిదండ్రులు అనే హోదానే పరిపూర్ణత ఇస్తుందని సమాజం నమ్ముతుంది.
  • మాటలెందుకు? మీమ్స్‌ ఉండగా.. జెన్‌ జీ లైఫ్‌స్టైల్‌ ఇదీ! ఎవరైనా బొద్దుగా ఉన్న వ్యక్తి తారసపడితే ‘ఒడియమ్మా బంటీ’ అంటున్నారు.. ఏదైనా పనిని ఆశ్చర్యపరిచేలా వేగంగా చేసినా, ఎవరూ చేయలేని పనిని చేసి చూపించినా ‘ఫ్లాష్‌మ్యాన్‌’ అని పిలుస్తున్నారు. ఎందుకు అంటారా? ఇటీవల సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అయినా మీమ్స్‌ అవి.
  • టైమ్‌కి పని అవ్వాలంటే.. ఈ టెక్నిక్స్‌ తెలిసుండాలి! అనుకున్న పనులు సమయానికి పూర్తి కావాలంటే సమయ పాలన చాలా ముఖ్యం. దీన్ని పట్టించుకోకపోతే పనులన్నీ గందరగోళంగా, అసంపూర్తిగా ఉంటాయి.
  • జిప్ కోడింగ్.. గల్లీ దాటని ప్రేమ! గతంలో ప్రేమ కోసం సప్తసాగారాలు దాటిన కథలు విన్నాం. ఈ టెక్నాలజీ యుగంలో ఎంత దూరమున్నా మొబైల్‌లో మాట్లాడుతూ, వీడియో కాల్స్‌తో నెట్టుకొస్తున్న లాంగ్‌ డిస్టెన్స్‌ ప్రేమలనూ చూస్తున్నాం. కానీ, ఇప్పుడు కాలంతోపాటు యువత ఆలోచనలూ మారుతున్నాయి.
  • గ్రీన్‌లాండ్‌లో స్థలాన్ని కొనలేం.. ఇల్లు కావాలంటే పదేళ్లు వేచి చూడాలి! గ్రీన్‌లాండ్‌.. డెన్మార్క్‌కు చెందిన స్వయంప్రతిపత్తి గల ప్రాంతం. ఇక్కడి భూచట్టాల ప్రకారం.. భూమి అనేది ఇక్కడి ప్రజల సామూహిక వనరు. అందుకే, వ్యక్తిగతంగా ఎవరికీ యాజమాన్య హక్కులుండవు.
  • నదిలో బంగారం.. అదే వారికి జీవనాధారం! హరియాణాలోని యమునానగర్‌ జిల్లాలో బోలి నది ప్రవహిస్తుంటుంది. ఆ నదీతీర ప్రాంతంలో నివసించే ప్రజలకు అది కేవలం నీటి వనరే కాదు.. జీవనాధారం కూడా. ఎందుకంటే ఆ నదీలో బంగారం ఉంది.
  • ఊరు మొత్తానికి ఒక్కటే వంటశాల.. వృద్ధుల కోసం వినూత్న ఆలోచన! చందంకి.. గుజరాత్‌లోని మారుమూల చిన్న గ్రామం. అన్ని ఊర్లలో ఉన్నట్టుగానే ఇరుకైన వీధులు, సాధారణ ఇళ్లు, గుడి, బడి అన్ని ఉంటాయి. కానీ, ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది.
  • పొట్ట నిండినా ఆహారంపైనే ధ్యాస.. పెరుగుతోన్న ఫుడ్‌ నాయిస్‌ ఆకలి వేస్తే భోజనం చేస్తాం. ఎప్పుడైనా అనుకోకుండా మంచి ఫుడ్‌ కనిపిస్తే జిహ్వా కోరికని తీర్చేస్తాం. కానీ, కొంతమందికి ఆకలి తీరినా, ఎన్ని రకాల రుచులు చూసినా ఇంకా ఏం తినాలి? ఎప్పుడు తినాలి? అని ఆహారం గురించే ఆలోచిస్తుంటారు.
  • ఇజ్రాయెల్‌ ఆర్మీలో అందమైన భామలు! Israeli Army: ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్మీ కలిగిన దేశాల్లో ఇజ్రాయెల్‌ ఒకటి. అత్యాధునిక ఆయుధ, సాంకేతిక సంపత్తి ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (IDF) సొంతం.
  • ఇతరుల్ని అర్థం చేసుకునేవారు ఇలా ఉంటారట! మనుషులంతా ఒకేలా ఉండరు. కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదు. మరికొందరు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు. కానీ, చాలా కొంత మందికే ఇతరులను పూర్తిగా చదవగలిగే సామర్థ్యం ఉంటుంది.
  • ఈ ఆలయంలో మొక్కుకుంటే జుట్టు రాలదట! ఏ దేవాలయానికి వెళ్లినా సుఖఃసంతోషాలు కలిగించమని, ఆరోగ్యం కాపాడమని, సంపద పెరగాలని దేవుళ్లకు ప్రార్థించడం సహజం. వాళ్లు కరుణిస్తే మొక్కులు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే, జపాన్‌లో ఓ విచిత్రమైన ఆలయం ఉంది. అక్కడ భక్తులు కేవలం తమ జుట్టు రాలిపోకూడదని, జుట్టు సమస్యలు తొలగిపోవాలని మాత్రమే ప్రార్థిస్తారు.
  • ఎగిరే గాలిపటం.. మెరుగయ్యే జీవనం! గాలిపటాలు ఎగరవేయడం అనేది కేవలం సంప్రదాయం, సరదా మాత్రమే కాదు.. మనుషులకు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాదు, ఎన్నో లాభాలు చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
  • ఒంటరితనానికి కారణం ఇతరులు కాదు, మన అలవాట్లే! కొంత మంది ఒంటరిగా మిగిలిపోయామని మథనపడుతుంటారు. తనకంటూ ఎవరూ లేరని, చుట్టూ ఉన్నవారు దూరం చేస్తున్నారని భావిస్తారు. నిజానికి మనలోని అలవాట్లు, ఆలోచన తీరు, మనస్తత్వాలే మనుషుల్ని మనకు దూరం చేస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
  • అనగనగా ఓ గ్రామం.. అక్కడ ఒకే ఒక్క ఇల్లు! నిర్మానుష్య ప్రాంతంలో కాసేపు ఉండాలంటేనే భయంతో వణుకు వచ్చేస్తుంటుంది. అలాంటిది, కనుచూపుమేరలో మనుషులే కనిపించని ఓ మారుమూల గ్రామంలో ఓ కుటుంబం కొన్నేళ్లుగా నివసిస్తోంది.
  • బరువు తగ్గాలా? డైట్‌లో ట్రెండ్స్‌ ఇవీ..! బరువు తగ్గాలన్నా, శారీరకంగా ఫిట్‌ ఉండాలన్నా వ్యాయామం తప్పక చేయాల్సిందే. అయితే, డైట్‌ పాటిస్తూ కూడా బరువును నియంత్రణలో ఉంచుకునే వీలుంది. దీంతో వ్యాయామం కుదరని చాలా మంది డైట్‌ పాటిస్తున్నారు.
  • 10 వేల అడుగులా? 45 నిమిషాల వ్యాయామమా? ఏది ఉత్తమం! మన శారీరక, మానసిక ఆరోగ్యం బాగుండాలంటే వ్యాయామం చాలా అవసరం. ప్రతి రోజు 10 వేల అడుగులు నడవాలి లేదా 45 నిమిషాల వ్యాయామం చేయాలని వ్యాయామ నిపుణులు సూచిస్తున్నారు. అయితే, చాలా మందికి వచ్చే అనుమానం.. ఈ రెండింట్లో ఏది చేస్తే మేలు అని.

English Translation

Travel Budget: Viharayatra OK.. What is the budget?

Eenadu icon
By Features Team Published : 07 Feb 2026 11:24 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

Internet Desk: Tell Who Doesn't Want to Go on a Vacation. Some hope to travel abroad. Others consider traveling domestically. Others want to visit at least some of the nearby attractions. It will be good until it is supposed to be. But what about the budget? Between monthly expenses and future financial plans, it can be difficult to budget specifically for a vacation. However, financial experts say that budget for vacation is not a big problem if you save on expenses. And what to do about it..

First decide where to go for vacation. Budget depends on the destination. Abroad will cost a huge amount. There is a moderate cost domestically and locally. Travel tickets, accommodation, meals and other fees should be calculated and started saving to meet the target. A recurring account can be opened for this. Or.. a savings bank can be used.

  • Deposit a certain amount each day for a vacation. From Rs.100 per day depending on your income, keep that amount aside. If you do that for six months, you will get a good amount.
  • If you have a job or business, you can save some amount every month under the travel budget. The amount should be automatically transferred to another account/savings scheme. 
  • If you are in the habit of drinking tea/coffee/cool drinks outside 4 times a day.. drink it once. Save the remaining money. Small amounts seem big over time. 
  • Eating in restaurants on weekends has become common during this period. However, avoid eating out for two weeks of the month. The average bill amount incurred in the restaurant should be deposited. 
  • Most people take OTT subscriptions whether they need it or not. Stop unnecessary OTT subscriptions if going on a vacation. Save that money and divert it to your travel budget. 
  • Some credit cards are useful for vacations. With them you can get rewards/travel points and get discounts on flight/train tickets and hotel bookings. What do you call it? But try these..

    • It is better to book flight/train tickets few months in advance. However, at the last minute, the price of flight tickets will increase drastically. You have to book the train ticket at a higher price.
    • Often travel agencies and ticket booking companies announce offers. Discounts, buy one get one and group packages are available. If you use those offers at such a time, the cost will be reduced.
    • If you book a cab specifically to go around the visiting places, it will cost more. Also.. you can save money by using public transport facilities like train and bus. 
    • If you hire a tourist guide, you will have to pay them a lot of money. In fact, it is an unnecessary expense these days. There is no need for a guide if you know the features of those areas online before going.
    • Staying in hotels in tourist areas is cheaper. If you want to reduce the cost, you can try camping. Otherwise the room rates in hostels are low. You can stay in them.
    ► Read latest Explained Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

    Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

    More

    • Valentine's Day fun? Romantic experiences without spending a fortune! Valentine's Day is a celebration not only for couples but also for husband and wife. Usually on this day they exchange gifts to each other.
    • AI surveillance on tenders..Irregularities and syndicates are no longer possible! Development works including roads and railway projects.. Tenders are mandatory for major construction projects in the government.
    • Vaddanna is coming.. Travel overcrowding in Europe! Governments of many countries are developing their tourism sector and are making advertisements and campaigns to visit our country. 
    • ‘Mani’ peninsula.. there everything is one group A human group in Greece has faced many attacks for generations.
    • Are you going to have children.. and have you thought about these? The first word of relatives with the married couple..'When will the children be born? Hurry up.' Society believes that the status of parenthood is what makes a married life perfect.
    • Why? While there are memes.. This is the lifestyle of Jen Z! If someone is chubby, they say 'Odiamma bunty'. Why do you say? Memes are the latest trend in social media.
    • If you want to work on time.. you should know these techniques! Time management is very important to complete the planned tasks on time. If you don't pay attention to this, all the work will be confused and incomplete.
    • Zip Coding.. Love that does not cross the street! In the past we have heard stories of crossing the seven oceans for love. In this age of technology, we are seeing long-distance love through video calls and talking on mobile phones. But, now the youth's thoughts are changing along with the times.
    • Can't buy land in Greenland.. If you want a house, you have to wait ten years! Greenland is an autonomous region of Denmark. According to the land laws here.. land is the collective resource of the people here. That is why, no one has ownership rights individually.
    • Gold in the river.. that is their livelihood! Boli river flows in Yamunanagar district of Haryana. It is not only a source of water for the people living in that riverside area, but also a source of livelihood. Because there is gold in that river.
    • Only one kitchen for the whole town.. An innovative idea for the elderly! Chandanki.. a remote small village in Gujarat. As in all towns, there are narrow streets, simple houses, temples and schools. But this village has a special feature. Growing food noise If we are hungry, we will eat. Whenever we find good food by chance, we satisfy the desire of Jihwa. But, even if some people are hungry, what else should they eat, no matter how many different flavors they see? When to eat? They think about food.
    • Beautiful women in the Israeli army! Israeli Army: Israel is one of the countries with the most powerful army in the world. Israel Defense Force (IDF) owns the latest weapons and technology.
    • People who understand others are like this! All people are not the same. No matter how much you say to some, it doesn't make sense. Others understand without being told. But, very few people have the ability to read others completely.
    • If you plant in this temple hair will fall! It is natural to pray to the gods to bring happiness, health and wealth to any temple. Devotees believe that if they show mercy, their prayers will be fulfilled. However, there is a strange temple in Japan. There the devotees only pray that their hair does not fall and hair problems get rid of it.
    • Flying Kite.. Better Life! Flying kites is not just a tradition, it is not just fun.. Experts say that it not only improves the physical and mental health of people, but also brings many benefits.
    • The cause of loneliness is not others, but our habits! Some people say that they are left alone. He feels that there is no one like him and that those around him are alienating him. In fact, psychologists say that it is our habits, thinking and mentality that keep people away from us.
    • A village is like a village. Staying in a deserted area for a while makes you shiver with fear. For example, a family has been living for years in a remote village where there are no people in sight.
    • Lose weight? These are the trends in diet..! Exercise is a must to lose weight and stay physically fit. However, it is possible to keep weight under control even by following a diet. Because of this, many people who cannot exercise are following a diet.
    • 10 thousand steps? A 45-minute workout? Which is better! Exercise is essential for our physical and mental health. Exercise experts recommend walking 10,000 steps or exercising for 45 minutes every day. However, many people have a doubt...which of these two is better.