పరగడుపున ఇవి తీసుకుంటే..!

కొందరు నిద్ర లేవగానే కాఫీ లేదా టీ తాగకుండా ఉండలేరు. అయితే వీటికి బదులు పరగడుపున కొన్ని పదార్థాల్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు....

Eenadu icon
By Vasundhara Team Published : 09 Feb 2026 15:13 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

కొందరు నిద్ర లేవగానే కాఫీ లేదా టీ తాగకుండా ఉండలేరు. అయితే వీటికి బదులు పరగడుపున కొన్ని పదార్థాల్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇలా తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరతాయంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

ఉసిరి
ఉసిరిలో విటమిన్‌-సి అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. ఉసిరి గుజ్జును గోరువెచ్చని నీటిలో కలుపుకొని పరగడుపునే తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.

తేనె
పరగడుపునే గోరువెచ్చటి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు శరీరంలోని హానికారక బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులతో పోరాడడానికి కావాల్సిన శక్తిని శరీరానికి అందిస్తాయి. ఇలా తేనెను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకునే అవకాశమూ ఉంటుంది.

తులసి
రోజూ తులసి ఆకులను నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చు. ఐదు తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ ఆకులు తిని, నీటిని తాగేయాలి. తద్వారా దగ్గు, జలుబు లాంటి ఇన్ఫెక్షన్ల నుంచి తక్షణ ఉపశమనం పొందచ్చు. అంతేకాదు తులసి రసం తాగితే చర్మానికి, శిరోజాలకు, దంతాలకు కూడా ఎంతో మంచిదంటున్నారు నిపుణులు.

వెల్లుల్లి
సహజసిద్ధమైన యాంటీ బయాటిక్‌గా పిలిచే వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు కావాల్సిన శక్తిని శరీరానికి అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయుల్ని నియంత్రించి గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా కాపాడతాయంటున్నారు నిపుణులు. అందుకే వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమిలి, ఆపై గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

If you take these in the morning..!

Some people can't stop drinking coffee or tea when they wake up. But instead of these, experts say that by taking some substances in the stomach, immunity can be increased. Moreover...

Eenadu icon
By Vasundhara Team Published : 09 Feb 2026 15:13 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Some people cannot avoid drinking coffee or tea when they wake up. But instead of these, experts say that by taking some substances in the stomach, immunity can be increased. Not only that.. It is said that taking this also adds more health benefits. Let's find out..

Amla
Amla is rich in Vitamin-C. It is also rich in antioxidants. These help in boosting immunity. Mix amla pulp in warm water and take Paragadupene.

Honey
Honey in Paragadupene warm water, Adding lemon juice increases immunity. Its antioxidants and antibacterial properties provide the body with the energy it needs to fight against harmful bacteria and other microorganisms in the body. By making honey a part of daily diet, there is a chance to reduce excess weight.

Tulsi
Chewing Tulsi leaves daily can have many health benefits. Soak five tulsi leaves in water overnight. Next morning eat those leaves and drink the water. Thus, you can get immediate relief from infections like cough and cold. Moreover, experts say that drinking Tulsi juice is very good for the skin, scalp and teeth. Garlic has anti-microbial and anti-viral properties. They give the body the energy it needs to fight infections like colds and coughs. Experts say that by controlling blood sugar levels, heart and lung related problems can be prevented. That's why experts say that apart from making garlic a part of daily diet, chewing two cloves of raw garlic immediately and then drinking warm water will give good results. on Facebook, Twitter, Instagram& Google News. Tags :