Sivakarthikeyan Ajith: అజిత్‌తో శివకార్తికేయన్.. స్ఫూర్తిదాయకమంటూ పోస్టు.. ఫొటోలు వైరల్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: అబుదాబిలో జరుగుతున్న ‘యాస్ స్పీడ్ ఫెస్టివల్’లో ప్రముఖ నటుడు, ప్రొఫెషనల్ రేసర్ అజిత్ (Ajith)ను మరో నటుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan) కలిశారు. ఆయనతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ.. ‘స్ఫూర్తిదాయకమైన వ్యక్తితో ఒకరోజు’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. చేసే పనిపై ఆసక్తి, అంకితభావం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూశానంటూ అజిత్‌ను కొనియాడారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘కాంబినేషన్ అదిరింది’ అంటూ ఈ హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
రేసింగ్‌లో అజిత్ టీమ్ అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. అబుదాబిలోని యాస్ మెరినా సర్క్యూట్‌లో జరుగుతున్న రేస్‌లో పాల్గొంది. నేటి (ఫిబ్రవరి 8) ఫెస్టివల్ పూర్తికానుంది. అజిత్ రేసింగ్ కెరీర్‌పై ఓ ప్రాజెక్టు తెరకెక్కించనున్నట్లు దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. సినిమాల విషయానికొస్తే.. గతేడాది ‘విదాముయార్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు అజిత్. శివ కార్తికేయన్ లేటెస్ట్ మూవీ ‘పరాశక్తి’ (Parasakthi) జనవరిలో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఓటీటీ ‘జీ 5’లో స్ట్రీమింగ్ అవుతోంది.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :