ఎమ్మెల్యే ఇంటిపైకి నిమ్మకాయలు విసిరి పరారీ

Eenadu icon
By Andhra Pradesh Dist. Desk Updated : 08 Feb 2026 08:25 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అనంత నేరవార్తలు, బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: అనంతపురం నగరం అరవింద్‌నగర్‌లో ఉంటున్న శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటిపైకి ఇద్దరు వ్యక్తులు శనివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో నిమ్మకాయలు, తెల్లఆవాలు, పసుపు, కుంకుమ విసిరేయడం కలకలం రేపింది. కారులో వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యే ఇంటి కిటికీ వైపుగా మంత్రించిన సామగ్రి విసిరేసినట్లు అక్కడ విధులు నిర్వహిస్తున్న గన్‌మెన్లు తెలిపారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా వేగంగా పారిపోయినట్లు చెప్పారు.

అనంతరం గన్‌మెన్లు, ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కారు నంబరు, సీసీ ఫుటేజీ అందజేశారు. సీఐ శ్రీకాంత్‌ ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఎమ్మెల్యే శ్రావణిశ్రీ మాట్లాడుతూ.. కొద్ది రోజులుగా తన ఇంటి పరిసరాల్లో అనుమానిత వ్యక్తులు తిరుగుతున్నట్లు సమాచారం ఉందన్నారు. అక్కడికి వచ్చిన ఏపీ39 కేఎక్స్‌ 0986 నంబరున్న కారు గుంటూరు జిల్లా కేంద్రానికి చెందిన మొగలి ఆదిలక్ష్మి పేరుపై ఉంది. ఎమ్మెల్యే వర్గాన్ని వ్యతిరేకిస్తున్న సొంత పార్టీ వారు గానీ, పుట్లూరు మండలానికి చెందిన తెదేపా నాయకులు గానీ.. క్షుద్రపూజలు చేయించి ఉంటారనే అనుమానాలను ఎమ్మెల్యే అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే ఇంటి వద్ద ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టారు.  

► Read latest Anantapur Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 08 Feb 2026 04:45 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • కుమారుడి తప్పు.. తల్లి మృత్యువాత [ 17-02-2026] కుమారుడు చేసిన తప్పునకు తల్లి మృత్యువాత పడిన సంఘటన అనంతపురంలో చోటుచేసుకుంది.
  • కరవు తీరేలా సాగు మురిసేలా! [ 17-02-2026] కరవు జిల్లా అనంతను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. గత వైకాపా ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టుల పనుల్ని పూర్తి చేసేందుకు నడుం బిగించింది.
  • పకడ్బందీగా ‘పది’ పరీక్షలు [ 17-02-2026] మార్చి 16 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్‌ వార్షిక పరీక్షలను అత్యంత పకడ్బందీగా జరపాలని కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశించారు. సోమవారం తన కార్యాలయంలో జేసీ విష్ణు చరణ్‌తో కలిసి సంబంధిత జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.
  • ఖాద్రీశా.. బండి ఎక్కడ నిలపాలయ్యా! [ 17-02-2026] కదిరి శ్రీఖాద్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు వాహనాల పార్కింగ్‌ పెద్ద సమస్యగా మారింది. దైవ దర్శనం సంగతెలా ఉన్నా.. వాహనాలు ఆపేందుకు స్థలం లేక సతమతం అవుతున్నారు. దుకాణాల ముందు ఆపితే యజమానులతో అభ్యంతరం.
  • కమనీయం.. బ్రహ్మరథోత్సవం [ 17-02-2026] మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లేపాక్షిలో సోమవారం శివపార్వతుల బ్రహ్మరథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది.
  • అగ్నిగుండం.. మోక్ష మార్గం! [ 17-02-2026] దేశంలో ఉన్న హిందూ ఆలయాల్లో ఎక్కడ చూసినా శివుడు లింగాకారంలో కనిపిస్తాడు. అమరాపురం మండలం హేమావతిలో హెంజేరు సిద్ధేశ్వరుడిగా పిలువబడే పరమ శివుడు మానవ రూపంలో(విగ్రహ రూపం)లో రుండ మాలధారుడిగా సిద్ధహాసనంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకం.
  • ఫోన్‌ రీఛార్జికి డబ్బులివ్వలేదని మనస్తాపం.. పురుగుమందు తాగి బాలుడి ఆత్మహత్య [ 17-02-2026] డి.హీరేహాళ్‌ మండలంలోని కల్యం గ్రామానికి చెందిన నవీన్‌(17) రెండు రోజుల కిందట మొబైల్‌ఫోన్‌ రీఛార్జికి డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
  • ఓ ‘పట్టా’న తేల్చరే! [ 17-02-2026] పేదల పేరుతో వైకాపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు అక్రమార్కులకు కాసులు కురిపించాయి. ఆ పార్టీ   నాయకులు అనుయాయుల పేరుతో పెద్దఎత్తున పట్టాలు ఇప్పించారు. ఆ తర్వాత విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
  • మేమింతే.. మారమంతే [ 17-02-2026] వైకాపా నాయకుల అత్యుత్సాహానికి అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో రాజకీయాలకు చోటులేదని అధికారులు మొత్తుకుంటున్నా.. వారికి పట్టడం లేదు. ముదిగుబ్బ మండలంలోని సంకేపల్లిలో సోమవారం వీరనారాయణస్వామి పరస జరిగింది.
  • నష్టపరిహారం.. అంచనాకే పరిమితం [ 17-02-2026] వరదలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం కోసం అన్నదాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2024 ఖరీఫ్, రబీలో ఉమ్మడి జిల్లాలో పంటలకు రూ.20 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. గతేడాది ఉద్యాన పంటలకు మాత్రమే పరిహారం ఇచ్చిన అధికారులు వరి, పత్తి, మొక్కజొన్న, వేరుసెనగకు మొండిచేయి చూపారు.
  • అంగన్‌వాడీ పోస్టులకు 19 నుంచి ముఖాముఖి [ 17-02-2026] అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థినులకు 19 నుంచి మూడు రోజులపాటు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. సంబంధిత షెడ్యూల్‌ను ఐసీడీఎస్‌ పీడీ అరుణ కుమారి వెల్లడించారు.

English Translation

MLA throws lemons at house and escapes

Eenadu icon
By Andhra Pradesh Dist. Desk Updated : 08 Feb 2026 08:25 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Ananta Neravartal, Bukkarayasamudram, Newstoday: Two persons threw lemons, white mustard, turmeric and saffron at the house of Shinganamala MLA Bandaru Shravani staying in Arvindnagar of Anantapur city at nine o'clock on Saturday morning. The gunmen on duty said that the two people who came in the car threw the enchanted material towards the window of the MLA's house. They said that they ran away fast when they tried to catch them.

Then the gunmen and MLA's office staff went to the second town police station and lodged a complaint. Car number and CC footage have been handed over. CI Srikanth registered a complaint and took up the investigation. Speaking on this, MLA Shravanishree said that there was information that suspicious people were roaming around her house for a few days. The car number AP39 KX 0986 which came there is in the name of Mogali Adilakshmi of Guntur district headquarters. The MLA's followers are expressing their suspicions that either their own party, which opposes the MLA faction, or the TDP leaders from Putlur mandal, may have performed occult worship. In the past also a two-wheeler was set on fire at the MLA's house.  

href="https://www.eenadu.net/" target="_blank" rel="noopener">Telugu News► Follow us on Facebook, Twitter, href="https://www.instagram.com/eenadulivenews/?hl=en" target="_blank" rel="noopener">Instagram& Google News. Tags :Published : 08 Feb 2026 04:45 IST

Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no need for correspondence in this matter.

More

  • Son's fault.. After mother's death [ 17-02-2026] An incident where the mother died due to her son's mistake took place in Anantapur. [ 17-02-2026] The coalition government is moving forward with the determination to green the drought-stricken district Ananta. It has tightened its belt to complete the works of the projects which were neglected in the previous Vaikapa government. 17-02-2026] Collector Anand ordered to conduct the 10th class public annual examinations to be held from March 16. He held a meeting with the concerned district officials along with JC Vishnu Charan in his office on Monday. [ 17-02-2026] Parking of vehicles has become a big problem for the devotees who come to visit Kadiri Srikhadri Lakshminarasimhaswamy. Even if the vision of God is not there, there is no place to stop the vehicles. If you stop in front of the shops, take objection with the owners.
  • Desirable.. Brahma Rathotsavam [ 17-02-2026] As part of the Mahashivratri Brahmotsavam, Shiva Parvati's Brahmaratha festival took place in Lepakshi on Monday in full splendor.
  • Fire. [ 17-02-2026] Everywhere in the Hindu temples in the country, Lord Shiva is seen in Linga form. In Amarapuram mandal Hemavati, Param Shiva known as Henjeru Siddheshwar appears in human form (idol form) as Runda Maladharu in Siddhahasanam.
  • Unfortunate for not being paid for phone recharge.. Suicide of a boy by drinking pesticide [ 17-02-2026] Naveen (17) from Kalyam village in D. Heerehal mandal committed suicide by drinking pesticide because he was upset that he did not give money for mobile phone recharge two days ago.. He died while receiving treatment. [ 17-02-2026] House plots given in the name of the poor during the Vaikapa government brought money to the illegals. The leaders of that party gave a large number of badges in the name of followers. After that they sold it and made money. 17-02-2026] The enthusiasm of Vaikapa leaders is becoming unstoppable. Officials say that there is no place for politics in spiritual programs, but they don't care. Veeranarayana Swamy Parasa was held at Sankepally in Mudigubba Mandal on Monday. 17-02-2026] Farmers are still waiting for compensation for the crops damaged by floods. In 2024 Kharif and Rabi crops in the combined district were damaged to the tune of more than Rs.20 crores. Officials who gave compensation only for horticultural crops last year showed a stubborn hand to paddy, cotton, maize and groundnut. 17-02-2026] Eligible candidates who have applied for Anganwadi posts will be interviewed for three days from 19. ICDS PD Aruna Kumari disclosed the relevant schedule.