Tata Cars to Become Costlier in India Soon

మారుతి సుజుకి, టయోటా కంపెనీలు తమ కార్ల ధరలు పెంచిన తరువాత.. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ కూడా తన కార్ల రేట్లను పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న వస్తువుల ధరలు, ఖర్చులు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.  అయితే కొత్త ధరలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.

కంపెనీ దాదాపు ఒక సంవత్సరం నుంచి అధిక ఇన్‌పుట్ ఖర్చులను ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం ఇప్పుడు ధర సవరణకు కారణమైందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (TMPVL) యోచిస్తోందని దాని మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ శైలేష్ చంద్ర పేర్కొన్నారు.

టాటా మోటార్స్ ఏ కారు ధరలను ఎంత శాతం పెంచనుంది అనే విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. కొత్త ధరలను బహుశా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ధరల పెరుగుదల అమ్మకాలపై ప్రభావం చూపుతుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పటికే తమ కార్ల ధరలను జనవరిలో పెంచింది.