
Gottipati Ravi Kumar: డిస్కంలకు మెరుగైన రేటింగ్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వంలో నిర్వీర్యమైన విద్యుత్ రంగాన్ని కూటమి ప్రభుత్వం కోలుకునేలా చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు చేపట్టిన విద్యుత్ సంస్కరణల కారణంగా కేంద్రం ఇచ్చిన గ్రేడింగ్‌లో డిస్కంలు మెరుగైన రేటింగ్‌ను సాధించాయని అన్నారు. ‘గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసింది. అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. సాంకేతిక, వాణిజ్య నష్టాలు తగ్గించడం, విద్యుత్ బిల్లుల వసూళ్లలో సామర్థ్యం పెంచింది.. ఈ కారణంగా కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఇచ్చిన గ్రేడింగులు మెరుగయ్యాయి. గృహ, పారిశ్రామిక, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్ అందిస్తున్నాం. రాబోయే మూడేళ్లలో యూనిట్‌కు రూ.1.19 చొప్పున విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా.. ప్రజలపై భారాన్ని తగ్గించే విధానాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది’ అని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులు, ఇంజినీర్లను మంత్రి అభినందించారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 05:04 ISTEnglish Translation

Gottipati Ravi Kumar: Better rating for discs

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
Today, Amaravati: Minister Gottipati Ravikumar has claimed that the alliance government has made the power sector, which was crippled under the Vaikapa government, recover. He said that due to the electricity reforms undertaken by CM Chandrababu, the discoms have achieved a better rating in the grading given by the Centre. "The previous government crippled the power sector for political purposes. It made him drown in debt. The coalition government has given special attention to the power sector. Reduction of technical and commercial losses, increased efficiency in the collection of electricity bills. We provide uninterrupted power to household, industrial and agricultural power users. We are working to reduce the cost of power purchase by Rs.1.19 per unit in the next three years. Apart from financially strengthening the power sector, the coalition government is implementing policies to reduce the burden on the people," the minister said in a statement. Minister congratulated the employees and engineers.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 05:04 IST