IND vs NZ: చివరి రెండు మ్యాచ్‌లకూ తిలక్ దూరం.. జట్టుతోనే శ్రేయస్ అయ్యర్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు కూడా తిలక్ వర్మ ( Tilak Varma) అందుబాటులో ఉండడు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న అతను ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దీంతో న్యూజిలాండ్ చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు కూడా శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer) భారత జట్టులో కొనసాగుతాడని బీసీసీఐ ప్రకటించింది. మొదటి మూడు మ్యాచ్‌లకు తిలక్ రీప్లేస్‌మెంట్‌గా శ్రేయస్‌ను ఎంపిక చేయగా.. ఒక్కసారి కూడా తుది జట్టులో చోటు దక్కలేదు.
తిలక్ పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్ పొందిన తర్వాత టీ20 ప్రపంచ కప్ కోసం ఫిబ్రవరి 3న ముంబయిలో భారత జట్టుతో కలుస్తాడు. ఫిబ్రవరి 4న డీ.వై.పాటిల్ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరిగే వార్మప్ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ విషయానికొస్తే.. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా విజయం సాధించి సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. నాలుగో టీ20 బుధవారం (జనవరి 28) విశాఖపట్నంలో జరగనుంది.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation
IND vs NZ: Tilak absent for last two matches.. Shreyas Iyer with team

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Internet Desk: Five things happening with New Zealand Tilak Varma ( Tilak Varma) will be unavailable for the remaining two matches of the T20 series. He recently underwent surgery and is currently working hard to get fit at the Center of Excellence in Bangalore. BCCI announced that Shreyas Iyer ( Shreyas Iyer) will continue in the Indian team for the last two T20 matches in New Zealand. While Tilak chose Shreyas as his replacement for the first three matches, he did not get a place in the final team even once.
Tilak will join the Indian team on February 3 in Mumbai for the T20 World Cup after getting full match fitness. He will play in the warm-up match against South Africa at the DY Patil Stadium on February 4. As for the T20 series with New Zealand... Team India has won the three matches so far and won the series 3-0. The fourth T20 will be held in Visakhapatnam on Wednesday (January 28).
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :