Psych Siddhartha: ఓటీటీలోకి ‘సైక్‌ సిద్ధార్థ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Eenadu icon
By Entertainment Team Published : 26 Jan 2026 16:05 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: నందు (Nandu) హీరోగా తెరకెక్కిన ‘సైక్‌ సిద్ధార్థ’ (Psych Siddhartha) సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ‘ఆహా’ ( Aha)లో ఫిబ్రవరి 4 (Psych Siddhartha Streaming Date) నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ‘ఆహా గోల్డ్‌’ సబ్‌స్క్రిప్షన్‌ ఉంటే ఆ డేట్‌ కన్నా 24 గంటల ముందే చూడొచ్చు. వరుణ్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 1న థియేటర్లలో విడుదలైంది. టైటిల్‌ పాత్రలో నందు, హీరోయిన్‌గా యామినీ భాస్కర్‌ అలరించారు.

ఈ సినిమా కథేంటంటే?: సిద్ధార్థ (నందు) అనుకోకుండా ప‌రిచ‌య‌మైన త్రిష (ప్రియాంక‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఆ ఇద్దరూ.. మ‌న్సూర్ (సుఖేష్‌రెడ్డి)తో క‌లిసి ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రారంభిస్తారు. అందులో రూ.2 కోట్ల పెట్టుబ‌డి సిద్ధార్థదే. కానీ, క‌థ అడ్డం తిరుగుతుంది. మ‌న్సూర్‌, త్రిష మ‌న‌సులు ఇచ్చి పుచ్చుకుని సిద్ధార్థని వ్యక్తిగ‌తంగానూ, వ్యాపారంలోనూ మోసం చేస్తారు. దాంతో కోట్లు పోగొట్టుకుని రోడ్డుపైకి వ‌చ్చేస్తాడు సిద్ధార్థ. మాన‌సికంగా క‌ల‌త చెందిన అతడు.. ఓ బ‌స్తీలోని బిల్డింగ్‌లో చిన్న గ‌ది అద్దెకు తీసుకుని అక్కడే ఉంటాడు. అదే బిల్డింగ్‌లోకి త‌న కొడుకుతో క‌లిసి అద్దెకు దిగుతుంది శ్రావ్య (యామినీ భాస్కర్‌). ఆమెది మ‌రో క‌థ‌. భ‌ర్త వేధింపులు తాళ‌లేక బ‌య‌టికొచ్చిన ఆమె.. సిద్ధార్థకి ఎలా ద‌గ్గరైంది? శ్రావ్య క‌లిశాక అతడి జీవితంలో చోటు చేసుకున్న మార్పు ఎలాంటిదన్నది మిగతా కథ.


► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :