రూఫ్ టాప్ సోలార్ @138 మెగావాట్లు : సీఎండీ పృథ్వీతేజ్‌

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 26 Jan 2026 16:48 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

విశాఖ: ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని 11 సర్కిళ్లలో సుమారు 74 లక్షల మంది వినియోగదారులకు నాణ్యతా ప్రమాణాలతో నిరంతరాయంగా సేవలందిస్తున్నట్లు సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. విద్యుత్ ప్రసార, పంపిణీ నష్టాలను తగ్గించుకొంటూ కేవలం 5.88 శాతం నమోదు చేయడం ద్వారా దేశంలోని విద్యుత్ పంపిణీ సంస్థలన్నింటిలో ఉన్నత స్థానంలో నిలిచిందన్నారు. పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన పథకంలో భాగంగా రూ.30 వేల నుంచి రూ.78 వేల వరకు రాయితీ అందిస్తూ, ఇప్పటి వరకు 138 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రూఫ్‌ టాప్‌ సోలార్‌ ప్లాంట్లను 43,340 మంది గృహ వినియోగదారులకు ఏర్పాటు చేయడం ద్వారా ఏపీఈపీడీసీఎల్‌ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. రోడ్డు, రవాణా సదుపాయం లేని గిరిజన మారుమూల ప్రాంతాల్లో  41 వేల గృహాలకు విద్యుత్‌ కనెక్షన్లు ఉచితంగా అందించినట్లు ఆయన చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇమ్మడి పృథ్వీతేజ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు.  సోమవార రిపబ్లిక్‌ డే సందర్భంగా విధి నిర్వహణలో ప్రతిభ చూపిన 80 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు, సంస్థ చీఫ్ విజిలెన్స్ అధికారి కె.వి.రామకృష్ణప్రసాద్, సీజీఎంలు డి.సుమన్ కల్యాణి, వి.విజయలలిత, బి.అశోక్ కుమార్, ఎల్.మహేంద్రనాధ్, ఎల్.దైవప్రసాద్, ఎస్.విజయప్రతాప్, పి.వెంకటేశ్వరరావు, కార్పొరేట్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

► Read latest Visakhapatnam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

Roof Top Solar @138 MW : CMD Prithvithej

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 26 Jan 2026 16:48 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Visakha: CMD Prithvithej said that approximately 74 lakh consumers are being served continuously with quality standards in 11 circles under AP Eastern Region Electricity Distribution Corporation. He said that by reducing power transmission and distribution losses by recording only 5.88 percent, it has stood at the top among all power distribution companies in the country. He said that APEPDCL has stood at the top position in the state by providing a subsidy of Rs.30 thousand to Rs.78 thousand as part of the PM Suryagarh Muft Bijli Yojana scheme and by installing roof top solar plants with a capacity of 138 megawatts for 43,340 household consumers. He said that electricity connections have been provided free of cost to 41,000 households in remote tribal areas where there is no road or transport facility. 

The 77th Republic Day celebrations were held on Monday at the corporate office of Andhra Pradesh Eastern Region Power Distribution Company (APEPDCL). On this occasion, the Chairman and Managing Director of the company Immadi Prithvithej unveiled the national flag. He then spoke.  Certificates of appreciation were handed over to 80 employees who showed excellence in their duties on the occasion of Republic Day on Monday. Directors T.V. Suryaprakash, T. Vanaja, S. Haribabu, Chief Vigilance Officer K. V. Ramakrishnaprasad, CGMs D. Suman Kalyani, V. Vijayalalita, B. Ashok Kumar, L. Mahendranath, L. Daivaprasad, S. Vijayapratap, P. Venkateswara Rao, corporate office staff participated in this program.

► Read latest Visakhapatnam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :