Ravi Teja: ఆసక్తికర టైటిల్‌తో రవితేజ.. ఫస్ట్‌లుక్ రిలీజ్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో హిట్ అందుకున్నారు హీరో రవితేజ. ఇప్పుడు అదే జోష్‌తో మరో సినిమా పనుల్లో బిజీ అయ్యారు. ఆయన కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. నేడు ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా దాని టైటిల్‌ను ప్రకటించారు. ‘ఇరుముడి’గా (Irumudi) ఇది రానున్నట్లు తెలిపారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను పంచుకుంటూ చిత్రనిర్మాతలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
- ఆమె మాటలకు కన్నీళ్లాగలేదు.. జీవితాంతం మిమ్మల్ని అలరిస్తా: చిరంజీవి
‘‘కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక కథే ఈ ఇరుముడి. ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. కొత్త ప్రయాణంలో ఉత్సాహంగా ఉన్నా’’ అని రవితేజ ( Ravi Teja) తెలిపారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో కథానాయికగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా.. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో రవితేజ అయ్యప్ప మాలధారణలో కనిపిస్తున్నారు (Irumudi Firstlook). దీని ఆధారంగా చూస్తే..బలమైన కథతో భక్తికి ప్రాధాన్యమిచ్చే చిత్రంగా ఇది రానున్నట్లు తెలుస్తోంది. రవితేజ 77వ చిత్రంగా ఇది రానుంది.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 10:59 IST