Hyderabad: రూ.26వేలకే ‘కారు’ అంటూ వ్యాపారి ప్రకటన.. తీరా అక్కడికి వెళ్తే..!

Eenadu icon
By Telangana Dist. Team Updated : 26 Jan 2026 14:04 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

నాచారం: మోసపూరిత ప్రకటన చేసిన పాత కార్ల వ్యాపారిపై నాచారం పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్‌కు చెందిన రోషన్‌.. రిపబ్లిక్‌ డే సందర్భంగా రూ.26వేలకే కారు అమ్ముతానని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించాడు. 50 కార్లు ఆ ధరకు విక్రయిస్తానని పేర్కొన్నాడు.

దీంతో సోమవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున స్థానికులు ఆయన నిర్వహిస్తున్న షాపు వద్దకు చేరుకున్నారు. కేవలం 10 కార్లు మాత్రమే ఉండటం.. పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో రోషన్‌ చేతులెత్తేశాడు. దీంతో మోసం చేశాడంటూ అక్కడున్న కార్లపై స్థానికులు రాళ్లతో దాడి చేశారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని వ్యాపారిపై కేసు నమోదు చేసి నాచారం పీఎస్‌కు తరలించారు.

► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 13:40 IST

English Translation

Hyderabad: A merchant advertises a 'car' for Rs.26 thousand.. if you go there..!

Eenadu icon
By Telangana Dist. Team Updated : 26 Jan 2026 14:04 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Nacharam: A case has been registered in Nacharam PS against a used car dealer who made fraudulent declaration. According to the police, Roshan, a resident of Mallapur in Malkajigiri district of Medchal, announced on Instagram that he would sell a car for Rs 26,000 on the occasion of Republic Day. He stated that he would sell 50 cars at that price.

With this, a large number of locals reached the shop he was running on Monday morning. As there were only 10 cars, Roshan raised his hand as people came in large numbers. As a result of this, the locals attacked the cars there with stones. Later, the police reached there and registered a case against the businessman and shifted him to Nacharam PS.

► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 13:40 IST