Republic Day: మోదీ తలపాగా.. ఉర్సులా డ్రెస్‌: ఆకర్షిస్తున్న వస్త్రధారణ

Eenadu icon
By National News Team Updated : 26 Jan 2026 20:33 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: దేశంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi) ధరించిన తలపాగా అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌ భారతీయత ఉట్టిపడేలా డ్రెస్ ధరించారు.

ప్రధాని మోదీ ప్రకాశవంతమైన ఎరుపు, పసుపు, ఉదా, ఆకుపచ్చ రంగులు కలగలిసిన తలపాగాను ధరించారు. జరీతో నేసిన బంగారు రంగు మోటిఫ్‌లతో అది ఆకర్షణీయంగా కనిపించింది. ఈ రాజస్థానీ సంప్రదాయ తలపాగా.. పండగ వాతావరణాన్ని ప్రతిబింబించింది. అందులోని ఎరుపు.. అభిరుచి, ఉత్సుకత, ధైర్యసాహసాలకు నిదర్శనంగా చెప్తారు. అలాగే ముదురునీలం, తెలుపు రంగుల్లో ఉన్న కుర్తా పైజామా ధరించారు. పైన లేత నీలంలో ఉన్న జాకెట్ వేసుకున్నారు. మరోవైపు ఉర్సులా.. మెరూన్ రంగులో గోల్డ్ డిజైన్ చేసిన డ్రెస్ ధరించారు. ఈ వస్త్రధారణతో ఈ వేడుక ( Republic Day)కు తగ్గట్టుగా ఆమెలో భారతీయ సంప్రదాయం ఉట్టిపడింది. ఆమె సాధారణంగా ధరించే ప్యాంట్‌సూట్స్‌కు భిన్నంగా ఈ దుస్తులు వేసుకున్నారు. 

  • రిపబ్లిక్‌ డేలో ‘సిందూర్‌’ స్పెషల్‌.. సైనిక సత్తాను చాటిన పరేడ్‌

ఐరోపా సమాఖ్యకు ఉర్సులా తొలి మహిళా అధ్యక్షురాలు. 2019లో తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఆమె.. 2024లో రెండోసారి ఎన్నికయ్యారు. 2029 వరకు ఆ బాధ్యతల్లో కొనసాగుతారు. అంతకుముందు ఆమె 2005 నుంచి 2019 వరకు జర్మనీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఇండియా-ఈయూ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. మరోవైపు, భారత్‌-ఐరోపా యూనియన్ (India-EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్యఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ పర్యటనలో ఆ ఒప్పందం జరిగే అవకాశం ఉంది. 

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 12:58 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • 10వేలమంది పోలీసులు.. యాంటీ డ్రోన్‌ వ్యవస్థలు.. ‘ఏఐ సదస్సు’కు పటిష్ఠ భద్రత దేశ రాజధాని దిల్లీ వేదికగా ‘ఇండియా- ఏఐ ఇంపాక్ట్ సమిట్‌’ ప్రారంభమైంది.
  • పెళ్లికి ముందే లైంగిక సంబంధంలోకి ఎలా వెళ్తారో?: సుప్రీంకోర్టు ఓ అత్యాచార కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 
  • ఇజ్రాయెల్‌ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం.. ముగ్గురికి మరణశిక్ష  Israeli Tourist Gang Rape: కర్ణాటకలో ముగ్గురికి మరణశిక్ష పడింది. 
  • పన్నూ హత్యకు కుట్ర : నిఖిల్‌ గుప్తాతో ప్రభుత్వానికి సంబంధం లేదు..! Nikhil Gupta: పన్నూ హత్య కేసులో నిందితుడు నిఖిల్ గుప్తాకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అధికారులు వెల్లడించారు. 
  • శిక్ష పూర్తయిందంటూ పిటిషన్‌.. అబూ సలేంకు ‘సుప్రీం’లో చుక్కెదురు ముంబయిలో 1993 నాటి పేలుళ్ల కేసులో దోషిగా తేలిన గ్యాంగ్‌స్టర్‌ అబూ సలేంకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.
  • ఏఐ వాడకంలో అప్రమత్తత అవసరం: కేంద్రమంత్రి జితిన్‌ ప్రసాద  దిల్లీలో ప్రారంభం కానున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ నేపథ్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి పాల్గొని ప్రసంగించారు.
  • రూ.400 కోట్ల దారిదోపిడీ.. అంతా కట్టుకథే ట్రక్కు నుంచి రూ.400 కోట్లమేర నగదు దారి దోపిడీ జరిగిందంటూ ఓ వాహన డ్రైవర్‌ చేసిన ఫిర్యాదు ఇటీవల కలకలం రేపింది.
  • రాజస్థాన్‌లో అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం రాజస్థాన్‌లోని భివాడీలోని ఓ రసాయన ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు సజీవ దహనమయ్యారు. 
  • మహిళలకు ఆలయ ప్రవేశ అంశం: విచారించనున్న సుప్రీం ధర్మాసనం కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలన్న అంశంపై దాఖలైన పిటిషన్లను ఏప్రిల్‌లో విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. 
  • నరవణె పుస్తక వివాదం వేళ.. చైనా సరిహద్దులో కిరణ్‌రిజిజు Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు అరుణాచల్ ప్రదేశ్‌లోని తన నియోజకవర్గంలో పర్యటించారు. 
  • ఏఐ సమ్మిట్‌..భారత్‌ వేగవంతమైన వృద్ధికి నిదర్శనం: ప్రధాని మోదీ దేశ రాజధాని దిల్లీలో నేటి నుంచి ప్రారంభమవ్వనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు  ప్రధాని మోదీ ప్రపంచ దేశాలకు ఆహ్వానం పలికారు. 
  • బ్లడ్‌ క్యాన్సర్‌ విస్తుపోయేలా.. బాంధవ్యం కొనసాగుతోంది! ప్రేమించిన యువతికి బ్లడ్‌ క్యాన్సర్‌ ఉందని పెళ్లికి ముందే తెలిసినా అతడు వెనకడుగు వేయలేదు. స్వయానా ఆ యువతే వద్దని వారించినా.. ఆమె మెడలో తాళి కట్టి గత పదకొండేళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకొంటూ చికిత్స చేయిస్తున్నాడు.
  • జంటల్లో జన్యుపరమైన జాగ్రత్తలకు చిట్టా.. బిహార్‌లో 700 ఏళ్ల ప్రాచీన పెళ్లి వ్యవస్థ ఒకే గోత్రం ఉన్నవారు, దగ్గరి రక్త సంబంధీకులు పెళ్లి చేసుకోవద్దని వందల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు శాస్త్రీయంగా ఆలోచించారు. జన్యుపరమైన సమస్యల ముప్పు నుంచి భావితరాలను కాపాడే లక్ష్యంతో గొప్ప సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
  • వందేళ్లు బతికినా.. ఈ గౌరవం దక్కేనా! ‘‘ఈ చిన్నారి భౌతికకాయాన్ని మనం ఖననం చేస్తున్నా.. అవయవ దానమనే మహోన్నతమైన చర్యతో ఇతరుల రూపంలో ఆమె చిరంజీవిగానే ఉంటుంది’’ అని కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి అన్నారు.
  • వాణిజ్య ఒప్పందం పేరుతో భారత రైతులకు ద్రోహం అమెరికాతో వాణిజ్య ఒప్పందం పేరుతో భారతీయ రైతులు మోసపోవడాన్ని కళ్లారా చూస్తున్నామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు.
  • కాశీ విశ్వనాథుడికి 62 ఆలయాల కానుకలు మహాశివరాత్రి సందర్భంగా దేశవిదేశాల్లోని 62 ప్రసిద్ధ ఆలయాల నుంచి కాశీవిశ్వనాథ క్షేత్రానికి పవిత్ర జలం, నైవేద్యం, వస్త్రాలు, మట్టి కానుకలుగా అందాయి.
  • బంగ్లా ప్రధానిగా రేపు తారిఖ్‌ రెహమాన్‌ ప్రమాణం బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) ఛైర్మన్‌ తారిఖ్‌ రెహమాన్‌ ఆ దేశ ప్రధానిగా మంగళవారం ప్రమాణం చేయనున్నారు.
  • ఆసుపత్రిలో చేరిన పంజాబ్‌ సీఎం పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఆదివారం మొహాలీలోని ఓ ఆసుపత్రిలో చేరారు.
  • ఏప్రిల్‌ 22న తెరచుకోనున్న కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు భక్తుల దర్శనార్థం ఏప్రిల్‌ 22న మళ్లీ తెరచుకోనున్నాయి. ఉత్తరాఖండ్‌లోని ఈ పవిత్ర క్షేత్రాన్ని శీతాకాలం నేపథ్యంలో దాదాపు 6 నెలలుగా మూసి ఉంచారు.
  • ప్రకృతి సాగే బాగు..పోషణ్‌ వాటికల్లో శిక్షణ రాజస్థాన్‌లోని జైపుర్‌ జిల్లా బిచూన్‌ గ్రామ పరిధిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతు సురేంద్ర అవానా. ఈ పద్ధతిలో ప్రస్తుతం గోధుమలు, బార్లీ, ఆవాలు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను ఆయన పండిస్తున్నారు.

English Translation

Republic Day: Modi's turban.. Ursula's dress: An alluring outfit

Eenadu icon
By National News Team Updated : 26 Jan 2026 20:33 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Delhi: Republic celebrations were held grandly in the country. The turban worn by Prime Minister Narendra Modi ( PM Modi) at the event attracted everyone's attention. Also, the President of the European Commission, Ursula van der Leyen, who participated as the chief guest in this ceremony, wore a dress that emphasized Indianness. It looked attractive with golden motifs woven with lace. This Rajasthani traditional turban reflects the festive atmosphere. The red in it is said to be a proof of passion, curiosity and courage. Also wearing dark blue and white kurta pajama. He wore a light blue jacket on top. On the other hand, Ursula.. wore a gold designed dress in maroon color. With this attire, Indian tradition is infused in her to suit this celebration ( Republic Day). The dress was different from the pantsuits she usually wears. 

  • 'Sindoor' special on Republic Day..parade showing military power

Ursula was the first woman president of the European Union. She took office for the first time in 2019. She was elected for the second time in 2024. He will continue in those responsibilities till 2029. Earlier, she served as a minister in the German government from 2005 to 2019. As part of this visit, she participated in the India-EU Summit. On the other hand, negotiations are going on for a free trade agreement between India and the European Union (India-EU). That deal is likely to be done during this trip. 

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 12:58 IST

Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • 10 thousand policemen.. Anti-drone systems.. Strong security for 'AI Conference' The 'India-AI Impact Summit' has started in Delhi, the capital of the country.
  • How to have sex before marriage?: Supreme Court The Supreme Court bench made important remarks during the hearing of a rape case. 
  • Gang rape of Israeli tourist.. Three sentenced to death  Israeli Tourist Gang Rape: Three sentenced to death in Karnataka 
  • Conspiracy to kill Pannu: Government has nothing to do with Nikhil Gupta..! Nikhil Gupta: Officials revealed that Nikhil Gupta, the accused in the Pannu murder case, has no connection with the government. 
  • Petition that the sentence has been completed.. Abu Salemku drops in 'Supreme' Convicted gangster Abu Salem in the 1993 Mumbai blasts case has been brought up in the Supreme Court.
  • Vigilance needed in use of AI: Union Minister Jitin Prasad  The Minister of State for Electronics and Information Technology participated and spoke in a program organized in the background of the AI Impact Summit to be started in Delhi. Recently, a complaint filed by a vehicle driver that Rs.400 crores of cash was stolen from a truck caused a stir.
  • Fire accident in Rajasthan.. Seven people were burnt alive. A fire broke out in a chemical factory in Bhiwadi, Rajasthan. Many were burnt alive in this incident. 
  • Temple entry issue for women: Supreme Court to hear The Supreme Court announced in April that it will hear the petitions filed on the issue of allowing women of all ages to enter the Sabarimala temple in Kerala. 
  • At the time of Naravane book controversy.. Kiran Rijiju on China border Kiren Rijiju: Union Minister Kiren Rijiju toured his constituency in Arunachal Pradesh. 
  • AI Summit..Proof of India's rapid growth: PM Modi Prime Minister Modi has invited the countries of the world to the AI Impact Summit which will start from today in the national capital Delhi. 
  • Blood cancer is spreading.. the relationship continues! Even though he knew before marriage that the girl he loved had blood cancer, he did not back down. Swayana has decided that she is the young woman or not.. He has tied a tali around her neck and is treating her closely for the past eleven years. Hundreds of years ago, our ancestors scientifically thought that people of the same gotra and close blood relatives should not marry. A great tradition was started with the aim of protecting future generations from the threat of genetic problems. "We are burying the body of this child.. With the great act of organ donation, she will live forever in the form of others," said Union Minister Suresh Gopi.
  • Treason to Indian farmers in the name of trade agreement. Congress leader Rahul Gandhi said that Indian farmers are being cheated in the name of trade agreement with America. On the occasion of Mahashivratri, holy water, offerings, cloths and earth were donated to the Kashi Vishwanatha Kshetra from 62 famous temples across the country. Bangladesh Nationalist Party (BNP) Chairman Tariq Rahman, who won the Bangladesh elections, will be sworn in as the country's Prime Minister on Tuesday.
  • Punjab CM admitted to the hospital. Punjab Chief Minister Bhagwant Mann was admitted to a hospital in Mohali on Sunday.
  • Gates of Kedarnath temple to be opened on April 22 The gates of the Kedarnath temple, one of the Dwadasha Jyotirlingas, will reopen on April 22 for the darshan of devotees. This holy place in Uttarakhand has been closed for almost 6 months due to winter. Surendra Awana is an exemplary farmer practicing organic farming in Bichoon village of Jaipur district in Rajasthan. He is growing wheat, barley, mustard, vegetables and spices in this way.