



This Week Movies: సంక్రాంతి తర్వాత థియేటర్‌లో అలరించడానికి వస్తున్న చిత్రాలివే..!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
Om Shanti Shanti Shantihi || తనపై పెత్తనం చెలాయించే భర్తకి ఓ భార్య ఎలా బుద్ధి చెప్పింది.. అతడి అహంకారాన్ని ఎలా అణిచింది అనే నేపథ్యంలో సాగే కథ ‘ఓం శాంతి శాంతి శాంతిః’. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ఈ సినిమాని ఏఆర్ సజీవ్ తెరకెక్కించారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ సంస్థలు నిర్మించాయి. బ్రహ్మాజీ, సురభి ప్రభావతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జనవరి 30న థియేటర్లలోకి రానుంది.
Gandhi Talks || టాకీ యుగం ప్రారంభమైన తర్వాత వచ్చిన అతి తక్కువ ప్రయోగాత్మక చిత్రాల్లో ‘పుష్పక విమానం’ ఒకటి. ఆ కోవలో మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మూవీ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘గాంధీ టాక్స్’.విజయ్ సేతుపతి, అదితీరావ్ హైదరీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రమిది. కిశోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుందీ సినిమా. ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానుంది. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Mardaani3 || మహిళల అక్రమ రవాణా.. కిడ్నాప్ లాంటి అంశాలతో రూపొంది మంచి హిట్ బొమ్మ అనిపించుకున్నాయి ‘మర్దానీ’ చిత్రాలు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్‌ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాలు ఇప్పటికే రెండు భాగాలుగా విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించాయి. తాజాగా ఈ ఫ్రాంఛైజీలో ‘మర్దానీ 3’ రాబోతోంది. రాణి ముఖర్జీ మరోసారి పోలీసు అధికారిణి శివానీ రాయ్ పాత్రలో కనిపించనున్నారు. జనవరి 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘తుంబాడ్’ వంటి వైవిధ్యమైన కథతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన దర్శకుడు రాహి అనిల్ బార్వే. ఇప్పుడు మరో సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘మయసభ’. జావేద్ జాఫ్రీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బంగారం వేటకు మీకు స్వాగతం’ అంటూ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. వీణా జామ్కర్, దీపక్ దామ్లే తదితరులు నటిస్తున్నారు.
ఓటీటీలో సందడి చేసే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!
- నెట్‌ఫ్లిక్స్
- బ్రిడ్జర్టన్ 4 (వెబ్‌సిరీస్) జనవరి 29
- ఛాంపియన్ (మూవీ) జనవరి 29
- 96 మినిట్స్ (మూవీ)జనవరి 30
- మిరకిల్: ది బాయ్స్ ఆఫ్ 80 (మూవీ) జనవరి 30
- అమెజాన్ ప్రైమ్
- ది రెక్కింగ్ క్రూ (మూవీ) జనవరి 28
- దల్‌దల్ (వెబ్‌సిరీస్) జనవరి 30
- జియో హాట్‌స్టార్
- వండర్‌మాన్ (వెబ్‌సిరీస్)జనవరి 28
- సర్వం మాయ (మూవీ) జనవరి 30
- ఈటీవీ విన్
- గొల్ల రామవ్వ (మూవీ) స్ట్రీమింగ్ అవుతోంది.
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మరో చారిత్రకగాథతో సంజయ్ లీలా భన్సాలీ.. ‘జై సోమనాథ్’ భారతీయ సినీ ప్రేక్షకులను అలరించడానికి మరో చారిత్రక కథ సిద్ధమవుతోంది. లార్జర్ దేన్ లైఫ్ కథలను అందించడంలో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సిద్ధహస్తులు.
- చిన్న ఛేంజ్.. థియేటర్లలోకి ‘సాంప్రదాయిని సుప్పిని..’రిలీజ్ ఆ రోజే.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (ఎస్‌ఎస్‌ఎస్) విడుదలలో చిన్న మార్పు చోటుచేసుకుంది.
- ఆ జాబితాలోకి ‘ది ప్యారడైజ్’.. కొత్త విడుదల తేదీ వచ్చేసింది నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదల వాయిదా పడింది.
- దర్శకురాలిగా వరలక్ష్మీ శరత్‌కుమార్.. అలరిస్తున్న ప్రమోషనల్ వీడియో నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. దర్శకురాలిగా ఓ సినిమాని ప్రకటించారు.
- అందుకే మా సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ : ‘కపుల్ ఫ్రెండ్లీ’ నిర్మాత ‘కపుల్ ఫ్రెండ్లీ’ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిందని ధీరజ్ మొగిలినేని తెలిపారు.
- వాలెంటైన్స్ డే స్పెషల్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే! వాలెంటైన్స్ డే సందర్భంగా పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాయి. అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించే చిత్రాలేంటో చూసేయండి.
- 2027 సంక్రాంతికి అక్కినేని హీరో మూవీ.. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ఆసక్తికర పోస్టు తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి ఓ సినిమా వస్తుందని ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ప్రకటించింది.
- ఈ కథ చిరంజీవికి బాగా తెలుసు.. విజయ్ సేతుపతిని అనుకున్నా కానీ: అర్జున్ తాను డైరెక్ట్ చేసిన ‘సీతాపయనం’ గురించి అర్జున్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
- పవర్‌ఫుల్ టైటిల్‌తో తరుణ్ భాస్కర్ మూవీ.. ‘జీపీఎస్’ అంటే ఇదే తరుణ్ భాస్కర్ కొత్త టైటిల్‌ను ప్రకటించారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న రెండో చిత్రమిది.
- రామ్‌చరణ్ ‘పెద్ది’ వాయిదా.. కొత్త విడుదల తేదీ ఇదే రామ్‌చరణ్ సినిమా ‘పెద్ది’ విడుదల వాయిదా పడింది.
- పవన్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’.. రిలీజ్ డేట్ ఫిక్స్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ విడుదల తేదీ ఖరారైంది.
- ‘డెకాయిట్’ మరోసారి వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే అడివి శేష్ ప్రధాన పాత్రలో రానున్న ‘డెకాయిట్’ మరోసారి వాయిదా పడింది
- ‘వారణాసి’కి ‘అవతార్’తో పోలిక.. రాజమౌళి ఏమన్నారంటే! ‘వారణాసి’ కోసం రాజమౌళికి ప్రియాంక చోప్రా ఒక విజ్ఞప్తి చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె దాని గురించి వివరించారు.
- వేసవిలో ‘బైకర్’.. శర్వా మూవీ కొత్త విడుదల తేదీ ఇదే శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘బైకర్’ సినిమా విడుదల తేదీ ఖరారైంది.
- ధనుష్- సాయి పల్లవి జోడీ.. మరోసారి.. ఆ హిట్ డైరెక్టర్‌తో ధనుష్, సాయి పల్లవి మరో సినిమాలో సందడి చేయనున్నారు.
- ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో వినోదం వాటిదే! 2026లో మరో నెల ముగిసింది. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు వస్తున్నాయి. మరి అవేంటో చూసేయండి.
- 94 ఏళ్ల వయసులో సింగీతం కొత్త మూవీ.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ వైవిధ్యంగా సినిమాలు తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. ప్రయోగాత్మక చిత్రాలకే కేరాఫ్ అడ్రస్.. మాటలే లేకుండా మూవీ తీసిన సినీ రుషి.
- ‘వారణాసి’ విడుదల అప్పుడే.. ప్రకటించిన రాజమౌళి ‘వారణాసి’ (Varanasi) విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది.
- టాలీవుడ్‌కు కొత్తందం.. రషా థడానీ ఫస్ట్‌లుక్ చూశారా! ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి రషా థడానీ లుక్‌ను రిలీజ్ చేశారు.
- ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టికెట్స్.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. వారికి మాత్రమే! ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్ర బృందం టికెట్లపై ఆఫర్ ప్రకటించింది.