APSRTC bus driver suffers heart attack

సాక్షి, భువనగిరి జిల్లా:చౌటుప్పల్‌లో విషాదం చోటుచేసుకుంది. నాగరాజు అనే  అమరావతి APSRTC డ్రైవర్ దురదృష్టవశాత్తు గుండెపోటుతో మృతిచెందారు. మియాపూర్ నుండి విజయవాడ వెళుతున్న ఏపీఎస్సార్టీసీ బస్సు డ్రైవర్‌ నాగరాజుకు  చౌటుప్పల్‌ వద్ద గుండెపోటు వచ్చింది. అయినప్పటికీ ఆ నొప్పిని భరిస్తూ బస్సును పక్కకు ఆపారు. దీంతో హుటాహుటీన చికిత్స నిమిత్రం ఆటోలో అక్కడి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

ఆ సమయంలో అక్కడ డాక్టర్లు లేకపోవడంతో వెంటనే అక్కడి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వెంటనే బాధితుడిని పరీక్షించిన డాక్టర్లు నాగరాజు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. అయితే డ్రైవర్‌కు గుండెపోటు వచ్చిన సమయంలో బస్సులో 18మంది ప్రయాణికులు ఉన్నారు. ఆయన అప్రమత్తతతో వారికి పెను ప్రమాదం తప్పింది.


English Translation
APSRTC bus driver suffers heart attack

Sakshi, Bhuvangiri district:Tragedy in Choutuppal. took place. An Amaravati APSRTC driver named Nagaraju unfortunately died of a heart attack. APSSRTC bus driver Nagaraju, who was going from Miyapur to Vijayawada, had a heart attack at Choutuppal. However, bearing the pain, the bus was stopped. He was immediately taken to a private hospital in an auto for treatment. 

As there were no doctors there at that time, he was immediately taken to the government hospital there. Doctors immediately examined the victim and said that Nagaraju was already dead. But there were 18 passengers in the bus when the driver had a heart attack. With his vigilance, they avoided a big danger.