Mamata Banerjee: ‘ఐప్యాక్’ ఆఫీస్‌లో ఈడీ సోదాలు.. మమత మెగా ర్యాలీ

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee) శుక్రవారం భారీస్థాయిలో ఆందోళనను చేపట్టారు. ఆమె నాయకత్వంలో జరిగిన ఈ మెగా ర్యాలీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోల్‌కతాలో ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ సహా ఆ సంస్థ కార్యాలయాలపై నిన్న ఈడీ దాడులను నిరసిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం బయట తృణమూల్ ఎంపీలు ఇప్పటికే నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.
కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ప్రాంతంలో ఉన్న ఐ-ప్యాక్ కార్యాలయంలో, దిల్లీ ( Delhi)లోని నాలుగు చోట్ల గురువారం ఉదయం ఏడు గంటల నుంచే ఏకకాలంలో ఈడీ సోదాలు చేసింది. కొన్ని హవాలా లావాదేవీలు, నగదు వ్యవహారాలు ప్రతీక్ జైన్ ద్వారా జరిగినట్లు నిర్దిష్ట ఆధారాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది. బొగ్గు స్మగ్లింగ్ రాకెట్‌తో సంబంధం ఉన్న ఒక హవాలా ఆపరేటర్ ద్వారా ఐ-ప్యాక్‌కు చెందిన ‘ఇండియన్ పీఏసీ కన్సల్టింగ్ ప్రై.లి.’కు రూ.కోట్లలో లావాదేవీలు జరిగాయని ఈడీ వర్గాలు వెల్లడించాయి. సోదాల గురించి తెలిసిన వెంటనే జైన్ నివాసానికి మమత హుటాహుటిన చేరుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతోనే ఈ సోదాలు జరిగాయని, ఇవి రాజ్యాంగ విరుద్ధమని దీదీ మండిపడ్డారు.
- నేను నెహ్రూ అభిమానినే కానీ.. థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘మా పార్టీ పత్రాలను, హార్డ్‌డిస్క్‌లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల సమాచారం కూడా ఉంది. అందుకే వాటిని నేను వెనక్కి తెచ్చేశాను’’ అని మమత తెలిపారు. అయితే, చట్టపరమైన దర్యాప్తును మమత అడ్డుకున్నారని, ఆమెతో కలసి రాష్ట్ర పోలీసులు కీలక ఆధారాలను బలవంతంగా తీసుకుపోయారని దిల్లీలోని ఈడీ కార్యాలయం ఆరోపించింది. ఈ పరిణామాలపై ఇరు వర్గాలూ కోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యవహారంలో తక్షణ విచారణ చేపట్టాలని కలకత్తా హైకోర్టు (Calcutta High Court)ను ఈడీ కోరింది. అయితే దీనిపై న్యాయస్థానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఈ ర్యాలీని ముందే ఊహించాం: భాజపా
చట్టబద్ధమైన పాలనకు బెంగాల్ అతీతమని మమతా బెనర్జీ చూపించే ప్రయత్నం చేస్తున్నారని భాజపా ( BJP) విమర్శించింది. ప్రతి ఎన్నిక ముందు ఆమె ఇలాంటి డ్రామాలే చేస్తుంటారని ఎద్దేవా చేసింది. ఈ ర్యాలీని ముందే ఊహించామని పేర్కొంది.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation
Mamata Banerjee: ED searches at 'IPAC' office.. Mamata mega rally

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Internet Desk: West Bengal Chief Minister and Trinamool Congress chief Mamata Banerjee (Mamata Banerjee) has launched a massive agitation on Friday. A large number of ministers, MLAs and party leaders participated in this mega rally under her leadership. It is known that Trinamool MPs have already staged a protest outside Union Home Minister Amit Shah's office in Kolkata, protesting the ED raids on the offices of the organization including IPAC chief Prateek Jain. rel="noopener">Delhi) conducted simultaneous searches by the ED from 7 am on Thursday morning. ED says there is concrete evidence that certain hawala transactions and cash transactions were done by Prateek Jain. ED sources revealed that through a hawala operator linked to the coal smuggling racket, transactions worth Rs. It is known that Mamata rushed to Jain's residence as soon as she came to know about Sodala. Didi fumed that these searches were done with political malice and these are unconstitutional.
- I am a Nehru fan but... Tharoor's interesting comments
''ED officials seized our party documents and hard disks. They also contain information about candidates for assembly elections. That's why I brought them back," said Mamata. However, the ED office in Delhi has alleged that Mamata obstructed the legal investigation and the state police along with her forcibly took away key evidence. Both sides approached the court on these developments. The ED has asked the Calcutta High Court to conduct an immediate inquiry into the matter. But the court has not taken any decision on this yet.
Predicted this rally: BJP
BJP ( BJP) criticized that Mamata Banerjee is trying to show that Bengal is beyond the rule of law. Before every election, she complained that she would do such dramas. This rally has been predicted.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :