TG News: 4 వారాల్లో పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయండి: హైకోర్టు

Eenadu icon
By Telangana News Team Published : 09 Jan 2026 17:40 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

హైదరాబాద్‌: తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన నియామకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెగ్యులర్‌ డీజీపీ నియామకానికి సంబంధించిన ప్రక్రియను నాలుగు వారాల్లో ముగించాలని యూపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నియామక ప్రక్రియపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది.

డీజీపీగా శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త ధన్ గోపాల్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డీజీపీ నియామక ప్రక్రియ జగలేదని.. శివధర్ రెడ్డిని నియమిస్తూ జారీ చేసిన జీఓను రద్దు చేయాలని కోరారు. నిబంధనల ప్రకారం డీజీపీ పదవీ విరమణ పొందే సమయానికి మూడు నెలల ముందే యూపీఎస్సీకి ప్యానెల్ పంపాల్సి ఉంటుందన్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఐదుగురు పేర్లతో కూడిన జాబితాను పంపిస్తూ వస్తున్నామని.. కానీ యూపీఎస్సీ క్లారిఫికేషన్ కోసం తిప్పి పంపిందని అడ్వొకేట్‌ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 31న కూడా మరోసారి జాబితా పంపామని.. సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవాలంటూ యూపీఎస్సీ ఆ జాబితాను తిప్పి పంపిందని ఏజీ కోర్టుకు తెలిపారు. ఆ జాబితాను పరిగణనలోకి తీసుకునే విధంగా యూపీఎస్సీని ఆదేశించాలని ఏజీ కోరారు. 

సకాలంలో డీజీపీ ప్యానెల్ లిస్ట్ పంపకపోవడం వల్లే తిప్పి పంపామని యూపీఎస్సీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని యూపీఎస్సీని ఆదేశించింది. పూర్తిస్థాయి డీజీపీ నియామకంపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఈ నెల 23న తెలంగాణ క్యాబినెట్‌ భేటీ.. వాటిపైనే చర్చ! రాష్ట్ర మంత్రివర్గం ఈనెల 23న భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది.
  • కోర్టు ధిక్కరణ కేసులో మెదక్‌ కలెక్టర్‌కు జైలు శిక్ష కోర్టు ధిక్కరణ కేసులో మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌కు జైలుశిక్ష పడింది.
  • కారు అద్దాలు పగలగొట్టి.. రూ.8లక్షలు చోరీ! కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ దుండగుడు సినీ ఫక్కీలో చోరీకి పాల్పడ్డాడు. పట్టణంలోని తాడ్కోలు చౌరస్తాలో రిలయన్స్ స్మార్ట్ బజార్‌ వద్ద పార్కింగ్‌ చేసిన కారులో నుంచి రూ.8లక్షలు దోచేశాడు.
  • కేసీఆర్‌ పుట్టినరోజు.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కార్యకర్తల సందడి బీఆర్ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకల వేళ.. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం సందడిగా మారింది.
  • శివుడికి ప్రసాదంగా డ్రగ్స్‌.. సీపీ సజ్జనార్‌ పోస్టుతో పోలీసుల యాక్షన్‌ మహా శివరాత్రి రోజున దేవుడికి మాదకద్రవ్యాలు చూపిస్తూ కొందరు రీల్స్‌ చేయడంపై హైదరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • ఏడుపాయలలో మహా శివరాత్రి వేడుకలు.. ఆకట్టుకుంటున్న డ్రోన్‌ విజువల్స్‌ మెదక్ జిల్లా ఏడుపాయలలో మహా శివరాత్రి వేడుకలు గత మూడు రోజులుగా వైభవంగా కొనసాగుతున్నాయి.
  • ఐబొమ్మ రవికి బెయిల్‌.. దేశం విడిచివెళ్లొద్దని హైకోర్టు ఆదేశాలు సినిమాల పైరసీ కేసులో ‘ఐబొమ్మ’ రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.
  • మూడు మున్సిపాలిటీల్లో ఛైర్మన్‌ ఎన్నిక మళ్లీ వాయిదా తెలంగాణలో మున్సిపాలిటీ ఛైర్మన్ల ఎన్నిక కొనసాగుతోంది.
  • త్వరలో హైదరాబాద్‌లోని ప్రతి జోన్‌లో పర్యటిస్తా: సీఎం రేవంత్‌రెడ్డి నెక్లెస్‌రోడ్‌ రైల్వేస్టేషన్‌ వద్ద మల్టీలెవల్‌ కారు పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
  • మొబైల్‌ ద్వారా ఈఏపీసెట్‌ దరఖాస్తులకు అవకాశం ఈఏపీ సెట్‌ (EAPCET) దరఖాస్తులు సహా.. పరీక్షల వరకు ఎలాంటి తప్పులు దొర్లకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్టు జేఎన్టీయూ రెక్టార్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
  • తాను జాతిపితనని కేసీఆర్‌ ఏనాడూ అనలేదు: కేటీఆర్‌ భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ తాను జాతిపితనని
  • ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక.. బీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
  • రాజకీయాల్లో ఉండాలా.. వద్దా?: మాజీ మంత్రి ఎర్రబెల్లి కంటతడి తొర్రూర్‌ మున్సిపాలిటీని కోల్పోవడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కంటతడి పెట్టుకున్నారు.
  • పాక్‌ బోర్డర్‌ వద్ద సంచారం.. బీఎస్‌ఎఫ్‌ అదుపులో తెలంగాణ వ్యక్తి రాజస్థాన్‌లో భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు వద్ద తెలంగాణకు చెందిన మహ్మద్‌ అష్ఫాక్‌ హుస్సేన్‌(38) అనే వ్యక్తిని బీఎస్‌ఎఫ్‌ అదుపులోకి తీసుకుంది.
  • మంత్రి కోమటిరెడ్డి మానవత్వం.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి! రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను ఆసుపత్రికి పంపించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు.
  • కేసీఆర్‌ బర్త్‌ డే.. పూరీ తీరంలో భారీ సైకత శిల్పం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ (KCR) జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ నాయకులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
  • జనగామ, తొర్రూర్‌లో లాటరీ.. కాంగ్రెస్‌నే వరించిన అదృష్టం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తీవ్ర ఉత్కంఠ మధ్య జనగామ, తొర్రూర్‌ మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ (Congress) పార్టీ దక్కించుకుంది.
  • ఇల్లెందు మున్సిపాలిటీ కాంగ్రెస్‌కు.. ఇబ్రహీంపట్నంలో బీఆర్‌ఎస్‌.. తెలంగాణలో వాయిదా పడిన 11 చోట్ల మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికలు కొనసాగుతున్నాయి.
  • క్యాతనపల్లిలో ఉద్రిక్తత.. పోలీసులు, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య తోపులాట మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
  • ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు ఓఎంసీ కేసులో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. డిశ్చార్జ్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు (Supreme Court) సమర్థించింది.

English Translation

TG News: Complete DGP appointment process in 4 weeks: High Court

Eenadu icon
By Telangana News Team Published : 09 Jan 2026 17:40 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Hyderabad: Telangana DGP Shivdhar Reddy got relief in the High Court. The High Court has issued orders dismissing the interim petition filed to cancel his appointment. UPSC has directed the state government to complete the process of appointment of regular DGP within four weeks. Ordering to file a counter on the appointment process, the next hearing has been adjourned to the 5th of next month.

Social activist Dhan Gopal has filed a petition in the High Court challenging the appointment of Shivdhar Reddy as DGP. According to the Supreme Court's verdict, the process of appointment of DGP has not taken place.. They wanted to cancel the GO issued appointing Shivdhar Reddy. According to the rules, the panel has to be sent to UPSC three months before the time of retirement of the DGP. Advocate General Sudarshan Reddy told the court that they have been sending a list of five names since April last year, but UPSC has sent it back for clarification. The AG told the court that as per the orders of the court, they sent the list once again on December 31. The AG asked to direct UPSC to consider the list. 

The counsel for UPSC told the court that it was sent back because the DGP panel list was not sent on time. The bench heard arguments from both sides. UPSC has been directed to examine the list sent by the state government and take an appropriate decision. Directing a decision on the appointment of the full-time DGP within four weeks, it adjourned the next hearing to the 5th of next month. href="https://www.facebook.com/eenaduonline/" target="_blank" rel="noopener">Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

more

  • Telangana cabinet meeting on 23rd of this month.. Discussion on them! The state cabinet will meet on 23rd of this month. A cabinet meeting will be held at the secretariat at 3 pm under the chairmanship of CM Revanth Reddy.
  • Medak collector jailed in contempt of court case Medak District Collector Rahul Raj was jailed in a contempt of court case. In Bansuwada of Kamareddy district, a thug committed theft from a movie theater. He stole Rs.8 lakhs from a car parked at Reliance Smart Bazaar in Tadkolu square in the town.
  • KCR's birthday.. Activists buzz at Erravalli Farmhouse During the birthday celebrations of BRS chief and former chief minister KCR.. Erravalli farm in Siddipet district became bustling.
  • Drugs as prasad to Shiva.. Police action with CP Sajjanar post. Hyderabad Commissioner Sajjanar expressed his anger over some people showing drugs to God on the day of Maha Shivaratri.
  • Drone visuals of Maha Shivaratri celebrations in Edupaya. Maha Shivratri celebrations have been going on in seven districts of Medak district for the past three days. The Telangana High Court granted conditional bail to 'Ibomma' Ravi in the movie piracy case.
  • Chairman election in three municipalities postponed again. Election of municipal chairmen is going on in Telangana.
  • Soon will visit every zone of Hyderabad: CM Revanth Reddy Telangana CM Revanth Reddy has issued instructions to the officials to set up multilevel car parking at Necklesroad railway station.
  • Eapset applications through mobile EAP set (EAPCET) applications including.. Rector of JNTU Vijay Kumar Reddy said that they are taking full measures to avoid any mistakes till the exams.
  • KCR never said that he is the father of the nation: KTR Bharat Rashtra Samithi leader KCR says he is the father of the nation
  • Election of Ibrahimpatnam Municipal Chairman..shock to BRS Suspense continues over the election of Ibrahimpatnam Municipal Chairman.
  • Should I be in politics.. or not?: Former Minister Errabelli Kantathadi Ex-minister Errabelli Dayakar Rao shed tears after losing Thorrur municipality.
  • Telangana man in BSF custody at Pak border. The BSF has detained a man named Mohammad Ashfaq Hussain (38) from Telangana at the India-Pakistan border in Rajasthan.
  • Minister Komati Reddy's humanity.. Move the injured to the hospital! Minister Komati Reddy Venkat Reddy showed his humanity by sending the people injured in the road accident to the hospital.
  • KCR's birthday.. A huge Saikata sculpture on Puri beach. Celebrating the birthday of former Telangana Chief Minister and BRS leader KCR, party leaders are giving innovative wishes.
  • Lottery in Janagama, Thorur. The Congress party has won Janagama and Thorur municipalities amid intense excitement in the joint Warangal district. BRS in Ibrahimpatnam. Municipal chairman and vice chairman elections are continuing in 11 postponed places in Telangana.
  • Tension in Kyatanapally.. Clash between police and BRS ranks. In the wake of the election of the municipal chairman, there was tension in Kytanapally of Mancharyala district. IAS officer Srilakshmi was accused in the OMC case. The Supreme Court upheld the previous verdict of the Telangana High Court dismissing the discharge petition.