బుద్ధి... భావం!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

కళ్లు చూసే దృశ్యాన్ని, చెవులు వినే మాటని, నాసిక ఆఘ్రాణించే వాసనని, చర్మం పొందే స్పర్శను, నాలుక పొందే రుచినీ మనసు విశ్లేషిస్తుంది. ఒక భావం పురుడుపోసుకుంటుంది. అది ఎలాంటిది అన్నది మనిషి మనసుకు, బుద్ధి ఇచ్చే తర్ఫీదు మీద ఆధారపడి ఉంటుంది. బుద్ధి సవ్యంగా ఉంటే, మనిషి సవ్యంగా ఉన్నట్టే. మోక్షం కోసం ప్రయత్నించేవాళ్లు తపస్సుతో మనసును కట్టడి చేయాలని చూసేది అందుకే. సంకల్పబలానికి మూలం మనసులోని భావమే!
విగ్రహాన్ని దేనితో రూపొందించినా, దేవుడనే భావంతో శ్రద్ధాభక్తులతో సేవిస్తే భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. పరమాత్ముడు మనిషి భావంలోనే కొలువై ఉంటాడు. సిద్ధి పొందడానికి అదే హేతువు అవుతుంది. ‘భావములోన బాహ్యమునందున గోవింద, గోవిందయని కొలువవో మనసా’ అంటాడు అన్నమయ్య. భగవంతుణ్ని బాహ్యంగానే కాదు అంతరంగంతోనూ ఆరాధించాలి. అప్పుడే మనిషి తన్మయత్వ స్థితికి చేరుకుంటాడు.
కొత్తగా వచ్చిన వ్యక్తి- ఈ ఊరు మంచిదా? చెడ్డదా? అని ఊళ్లోని వ్యక్తిని ప్రశ్నిస్తే ‘మీరు మంచివారా? చెడ్డవారా? అన్నదాని మీద అది ఆధారపడి ఉంటుంద’ని జవాబిస్తాడు. ఇది మనందరికీ తెలిసిన కథ. మనిషిని బట్టే సమాజం. సమాజం అంటే మనుషుల సమూహమే కదా! ఒకసారి శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో- ‘రాజ్యంలో మంచివాళ్లెవరైనా ఉంటే తీసుకురా, వరమిస్తాను’ అన్నాడు. దుర్యోధనుడు రోజంతా వెతికి ఒక్కరు కూడా కనిపించకపోవడంతో నిరాశతో తిరిగొచ్చి- ఒక్కరంటే ఒక్కరు కూడా మంచివాళ్లు కనిపించలేదంటూ పెదవి విరుస్తాడు. కృష్ణుడు ధర్మరాజును పిలిచి ‘రాజ్యంలో చెడ్డవాళ్లెవరైనా ఉంటే తీసుకురా, నీకు వరమిస్తాను’ అన్నాడు. ధర్మరాజు రోజంతా వెతికి రాజ్యంలో ఒక్క చెడ్డవాడు కూడా లేడన్న సంతృప్తితో తిరిగొచ్చి- ‘బావా, రాజ్యమంతా వెదికినా ఒక్క చెడ్డవాడూ కనిపించలేదు’ అన్నాడు. దుర్యోధన, ధర్మరాజుల మనోభావాల మధ్య ఉన్న వ్యత్యాసమది. అంటే ‘యద్భావం తద్భవతి’ అన్నట్టు మనిషి మంచివాడయితే లోకం మంచిదవుతుంది. చెడ్డవారికి అందరూ చెడ్డగానే కనిపిస్తారు. ఇది అక్షర సత్యం.
మనుషులు మోసపోవడానికి, మంచి ఫలితాలు పొందడానికి ఎదుటి వ్యక్తి గురించి మనసు వేసే అంచనాలే కారణం. శ్రీరాముణ్ని మనసా, వాచా నమ్మాడు గనకనే ఆంజనేయుడు రామభక్త హనుమాన్‌గా మన్ననలందుకున్నాడు. విభీషణుడు చూడగలిగిన రామయ్యలోని ధర్మమూర్తిని... లంకేశ్వరుడు, అతడి ఇతర సోదరులూ తమ బుద్ధిమాంద్యంతో చూడలేకపోయారు. నేలకూలారు. ఒక్కోసారి మన తప్పుడు అంచనాలను పెద్దల మాటలు సరిచేస్తాయి. గురువులు మనిషి బుద్ధిని సరైన మార్గంలో పెట్టి దిశానిర్దేశం చేస్తారు. ప్రార్థనలు, పుణ్యతీర్థాల్లో మునకలు, గురువుల పట్ల విశ్వాసం, వైద్యులపై నమ్మకం- వీటిలో మనిషి భావమెలా ఉంటే, అలాంటి ఫలితమే దక్కుతుందని కరుణశ్రీ తెలుగుబాల శతకంలో విశదపరిచారు.
మనిషి మనుగడకు భావమే ఆలంబన. అది నిర్మలమైనదైతే, మనిషి స్వచ్ఛంగా, స్వేచ్ఛగా ఈ భువిలో మనగలుగుతాడు. ముక్తిని పొందగలుగుతాడు.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- యాదగిరీశా నమోస్తుతే! బ్రహ్మ, విష్ణు, రుద్ర సమన్వయ శక్తులతో సృష్టి, స్థితి, లయాత్మకమైన చైతన్య స్వరూపమే నృసింహాకృతి! శ్రీహరి దశావతారాల్లో నరసింహ రూపం విశేషమైనది. నృసింహావతారం ఎంత ప్రచండమో, అంత ప్రహ్లాదం. ఎంత ప్రళయత్వమో అంత ప్రసన్నం.
- దూరదృష్టి ‘రాబోవు నాపదలను/ లేబోనీయకయె ముందు తెలిసి మెలంగున్/ ప్రాబల్యము గలవాడే/ శోభిలు నిల నతడె’ అంటూ దూరదృష్టితో మెలిగితే ఆపదలను తప్పించుకోగలరని వర్ణించాడొక కవి. దూరదృష్టితో వ్యవహరించడమంటే, భవిష్యత్తును ఊహించగలిగే శక్తిగా భావించకూడదు.
- శరణం శరణం... శంకరం మహాశివరాత్రి లోతైన ఆధ్యాత్మిక పరమార్థం ఉన్న పండుగ. ‘శివ’ అంటే అక్షరాలా కల్యాణకారి. మహాశివరాత్రి నిరాకార స్వరూపుడైన ఆ మహాశివుడి దివ్య కార్యాలను స్మరించుకుంటూ, పరమేశ్వరుడికి ప్రణమిల్లే సుదినం.
- తపస్సు భగవంతుడి సాక్షాత్కారం కోసం తపస్సు ప్రధానమైన సాధనమన్నది దైవజ్ఞులు చెప్పే మాట. అది అంత సులభమైనది కాదు. ధ్రువుడు, ప్రహ్లాదుడు వంటి వారు నిష్ఠతో, తదేక దీక్షతో దాన్ని ఆచరించి చిరంజీవులుగా ఖ్యాతి పొందారు.
- మాటే మంత్రం తల వెనక తలంత బలగం ఉన్నా ఒక్కరూ కష్టకాలంలో ఆదుకోలేదు... అంటారు. ఈ కాలంలో ఎంతటి సంపదనైనా ఆర్జించవచ్చు కానీ కష్టంలో మనకోసం నిలబడేవారిని సంపాదించుకోవడం కష్టమే. అలా సంపాదించుకోవడం మన ప్రవర్తన, సంస్కారం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కత్తికన్నా పదునైంది నాలుక.
- మహోన్నత సంస్కర్త ప్రథమ స్వాతంత్య్ర సమరానికి అజ్ఞాతంగా బీజావాపన చేసిన యోధ, భారతీయులు పరపీడన నుంచి బయటపడి ఉజ్వల భవిష్యత్తు గల జాతిగా నిలవడానికి సహస్ర విధాలుగా పరిశ్రమించిన మహామనీషి, సంఘంలోని దురాచారాలను ఖండించి జనంలో ఆత్మవిశ్వాసానికి పాదుకొల్పిన తపస్వి స్వామి దయానందులు.
- అమూల్య వరం మనిషి ముఖం నుంచి ‘అగ్ని’ వాగ్రూపంలో వెలువడుతోందని ఐతరేయోపనిషత్తు పేర్కొంటోంది. మాట అగ్ని అంతటి పవిత్రమైనదీ ప్రమాదకరమైనదీ కూడా.
- సంకల్ప బలం మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, వైఫల్యాలు అనే కొండలను, లోయలను ఎక్కుతూ దిగుతూ ముందుకు పయనించాల్సిందే! నిజానికి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రాథమిక ఇంధనం ఏమై ఉంటుందీ అంటే- సంకల్ప బలం అని చెప్పొచ్చు.
- దాన ఫలం! సర్వ ప్రాణుల పట్ల దయ ఉన్నవారిని దైవిక లక్షణాలు కలిగినవారిగా చెబుతారు. పవిత్ర భావనలతో, నిస్వార్థంతో జీవించేవారిని తాను వెన్నంటి ఉంటానంటాడు పరమాత్ముడు గీతలో.
- ఎవరు గొప్ప? నన్ను మించిన వారెవరూ లేరు అనే అహంభావం వల్ల మనుషుల మధ్య గొడవలు జరగడం సహజమే. కానీ మునులు, మహాపురుషులు, దేవతలు సైతం వాటి ప్రభావంలో పడి, తరవాత పశ్చాత్తాపం చెందడం ఆశ్చర్యపరుస్తుంది.
- అజ్ఞానాన్ని రూపుమాపాలి! ఆదిశంకరుడు చెప్పిన అజ్ఞానం వేరు. ఈ అజ్ఞానం అది కాదు. అంతటా వ్యాపించి రాజ్యమేలుతున్న ఈ అజ్ఞానమే అధర్మానికి, అన్యాయానికి కూడా కారణం.
- పంచ సూత్రాలు భూమి నిశ్చలంగా ఉన్నట్లు కనిపించినా, అది ప్రతిక్షణం చలనంలో ఉంటుంది. మరి ఈ స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తోంది? పురాణాల ప్రకారం, భూమిని నాలుగు దిగ్గజాలు (ఐరావతాలు) మోస్తున్నాయి.
- భక్తి - ధర్మం భక్తిభావం, ధర్మగుణం కలిగినవారే మనకు మార్గదర్శకులు, పురాణపురుషులు అయ్యారు. భక్తి వేరు, ధర్మగుణం వేరు. ధర్మగుణంలేని భక్తి శోభించదు, జయించదు.
- గురుబ్రహ్మ... భౌతిక ప్రపంచంలో వినోద, విహారాలతో సంతృప్తి చెందుతున్నంతవరకు ఆధ్యాత్మిక లోకంలో విహరించాలనే ఆలోచన రాదు. ప్రాపంచిక సుఖాలే శాశ్వతమన్న భ్రమలో ఉండి దారితెన్నులు తెలియని వారికి భగవత్సన్నిధికి దిశానిర్దేశం చేసే వ్యక్తి గురువు.
- సృష్టికి మార్గదర్శకుడు సృష్టి... యాదృచ్ఛికంగా నడిచే ప్రక్రియ కాదు. దానికి ఒక క్రమం ఉంది, నియమం ఉంది, ధర్మం ఉంది. ఆ ధర్మానికి దిశానిర్దేశం చేసే శక్తే శ్రీకృష్ణుడు. ఆయన ద్వాపర యుగ అవతార పురుషుడు మాత్రమే కాదు. కాలం, దేశం, పరిస్థితులను దాటి నిలిచిన పరమసత్యానికి సాకార రూపం. సృష్టి ఎలా సాగాలి, జీవితం ఎలా నడవాలి అనే ప్రశ్నలకు సమాధానంగా నిలిచిన తత్వమే కృష్ణుడు.
- జ్ఞానాయుధం జ్ఞానం మనిషి వికాసానికి మూలాధారం. అది అంధకార మార్గంలో వెలుగులను ప్రకాశింపజేసే దివ్యజ్యోతి. వ్యక్తి ఉనికే ఙ్ఞానం... అంటాడు దక్షిణామూర్తి.
- ఏది హింస? ‘అహింసా పరమోధర్మః’ అన్నారు పెద్దలు. అంటే హింస చేయకుండా ఉండటమే గొప్ప ధర్మమని అర్థం. హింస అంటే శారీరకంగా బాధించడమో, చంపడమో అని మాత్రమే అర్థంకాదు. ఎదుటివారిని మానసికంగా క్షోభకు గురిచేసినా అది హింస కిందకే వస్తుంది. శరీరానికి బాణాలు గుచ్చుకున్నా ఉపాయంతో తీసి వేయవచ్చు, ఆ గాయాలు మందులతో కొంత కాలానికి మానతాయి.
- సహనం ఒక వరం ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవాలన్నా, భౌతికమైన కోరికలు తీర్చుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి. నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ, నిరంతరం అంకితభావంతో చేసే కృషే- సహనం. అవాంతరాలను ఆత్మస్థైర్యంతో, పట్టుదలతో ఎదుర్కొని; పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా చేసే యజ్ఞం అది.
- కాలం విలువ కాలం ప్రతీ క్షణం ఓ ఇంద్రజాలం. కళ్లముందే మాయమైపోతుంటుంది మరి. కదిలే కాలం అనుకోని విజయాలను, వైభవాలను ఇచ్చినట్లే అప్పుడప్పుడు ఓటమినీ చవిచూపిస్తుంది.
- దర్శనకళ ‘దర్శనం’ అనేది చాలా విలువైన పదం. విరివిగా ఉపయోగిస్తూనే ఉన్నా, అంతరార్థం చాలామందికి బోధపడని పదమది. ఉదాహరణకు ‘మీరు దేవుణ్ని చూశారా’ అనే ప్రశ్న ఎదురైతే, మనలో చాలామందిమి బిత్తరపోతాం. ఏం చెప్పాలో తెలియక తికమక పడతాం.
English Translation
Buddhi... Sense!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

What the eyes see, what the ears hear, what the nose smells, The mind analyzes the touch of the skin and the taste of the tongue. A feeling grows. What kind of it is depends on the mind of man and the wisdom given to him. If the intellect is sound, then man is sound. That is why those who seek salvation try to bind their mind with penance. The source of will power is the feeling in the mind!
Whatever the idol is made of, if it is served with devotion with the sense of God, God's grace will be obtained. The divine is measured in human consciousness. That becomes the rationale for attaining Siddhi. Annamayya says that Govinda and Govindaya are measured by the mind because they are external in the sense. God should be worshiped not only externally but also internally. Only then does man reach the state of selfhood.
Newcomer- Is this town good? Is it bad? If you ask a person in the village, 'Are you good? Are you bad? He replies that it depends on that. It's a story we all know. A society based on man. Society is a group of people! Once Lord Krishna said to Duryodhana- 'If there are any good people in the kingdom, bring them, I will bless them'. Duryodhana searched for the whole day and did not find anyone, so he turned back in despair and said that he did not find any good people. Krishna called Dharmaraja and said, 'Bring any bad people in the kingdom, I will give you a boon.' Dharmaraja searched the whole day and returned with the satisfaction that there was not a single bad person in the kingdom and said - 'Brother, even after searching the whole kingdom, not a single bad person was found'. This is the difference between the sentiments of Duryodhana and Dharmaraja. It means 'Yadbhava Tadbhavati' if a man is good then the world will be good. Everyone looks bad to a bad person. This is the literal truth.
The reason people get cheated and get good results is because of the assumptions they make about the other person. Anjaneya was blessed as Hanuman, a devotee of Rama, because he believed in Lord Rama with all his heart and soul. What Vibhishana could see, the Dharmamurti in Ramaya... Lankeshwara and his other brothers could not see with their mental retardation. fell to the ground Sometimes the words of elders correct our wrong assumptions. Gurus direct the mind of man on the right path. Karunashri explained in Telugu Bala Shatakam that prayers, immersion in holy pilgrimages, faith in gurus, faith in doctors - in these things, if a person's attitude is like that, then the result will be the same. If it is pure, man can live in this land pure and free. He can attain liberation.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Yadagirisha Namostute! Nrisimhakriti is the form of creation, state and rhythmic consciousness with the coordinated forces of Brahma, Vishnu and Rudra! Narasimha's form is unique in Srihari Dashavatars. The Nrisimhavatara is as glorious as it is glorious. The greater the flood, the greater the pleasure.
- Foresight A poet describes that if you have foresight, you will be able to avoid the dangers. To act with foresight is not to think of the power to predict the future.
- Sharanam Sharanam... Shankaram Mahashivratri is a festival with deep spiritual significance. 'Shiva' literally means benefactor. Mahashivratri Remembering the divine deeds of the formless form of Lord Shiva, Pranamille Sudinam to the Supreme Lord.
- Tapas It is said by the sages that penance is the main tool for God realization. It is not that simple. People like Dhruva and Prahlad have practiced it with devotion and gaze and gained fame as immortals.
- Mate Mantra It is said that even if there is strength behind each head, no one will be supported in difficult times. In this period we can earn any amount of wealth but it is difficult to get people to stand up for us in times of trouble. Acquiring such is possible only because of our behavior and culture. The tongue is sharper than a sword.
- A great reformer The warrior who anonymously sowed the seeds of the first freedom struggle, the great man who worked in thousands of ways to free the Indians from oppression and become a nation with a bright future, the ascetic Swami Dayanandulu who condemned the vices in the community and instilled self-confidence in the people.
- Amulya Varam. The Aitareyopanishad states that 'Agni' emanates from the face of man in the form of fire. A word is as sacred as fire and also dangerous.
- Strength of will In the life of a man, one has to move forward by going up and down the hills and valleys of joys, sorrows, successes and failures! In fact, what is the basic fuel that a person needs to reach his goal is - willpower.
- The fruit of charity! Those who are kind to all living beings are said to have divine qualities. In the Gita, the Supreme Lord says that he will support those who live with holy thoughts and selflessness.
- Who is great? Due to the ego that there is no one above me, it is natural for people to quarrel. But it is surprising that even the ancients, great men and gods fell under their influence and later repented.
- Ignorance should be eradicated! Adi Shankara said ignorance is different. This ignorance is not that. This ignorance which reigns all over is the cause of unrighteousness and injustice.
- Pancha Sutras Although the earth appears to be stationary, it is constantly in motion. And where is this stability coming from? According to Puranas, the earth is carried by four giants (Airavatas).
- Bhakti - Dharma Those who have piety and virtue have become our guides and legendary men. Bhakti is different, morality is different. Bhakti without Dharmaguna cannot beautify or conquer.
- GuruBrahma... As long as one is satisfied with entertainment and excursions in the material world, one cannot think of wandering in the spiritual world. Guru is the one who directs those who are under the eternal illusion of worldly pleasures and do not know the way to the presence of God.
- Guide to creation Creation... is not a random process. It has an order, a rule, a virtue. Lord Krishna is the power that directs that dharma. He is not only an incarnation of Dwapara Yuga Purusha. An embodiment of the supreme truth that transcends time, country and conditions. Krishna is the philosophy that answers the questions of how creation should proceed and how life should proceed.
- Gnanayudham Knowledge is the basis of human development. It is a divine lamp that shines light in the path of darkness. Dakshinamurthy says the knowledge of the individual.
- What is violence? The elders said 'Ahimsa paramodharmah'. It means that non-violence is the greatest virtue. Violence does not mean only physical harm or killing. Even causing emotional distress to others comes under torture. Arrows pierced through the body can be removed by trickery, and the wounds heal for a while with medicine.
- Patience is a blessing. Patience is a must for man whether he wants to achieve spiritual goals or fulfill material desires. Patience is constant dedicated work, keeping emotions in check to achieve specific goals. Facing obstacles with self-confidence and perseverance; It is a yajna that does not give priority to compliments and criticism.
- The value of time. Every moment of time is magic. It will disappear before the eyes. The moving period brings unexpected victories and glories as well as occasional defeats.
- Darshanka 'Darshan' is a very precious word. Although widely used, the meaning is not taught to many. For example, when faced with the question 'have you seen God', many of us get confused. We get confused because we don't know what to say.