Vehicle Registration: డీలర్‌ వద్దే రిజిస్ట్రేషన్‌

Eenadu icon
By Telangana News Desk Updated : 09 Jan 2026 06:23 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు, హైదరాబాద్‌: కొత్తగా వ్యక్తిగత వాహనాలను కొన్నప్పుడు రిజిస్ట్రేషన్‌ కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది డిసెంబరు 19న రవాణా శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో డీలర్ల వద్దనే వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్‌ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశంతో యంత్రాంగం ఈ సంస్కరణలను చేపట్టింది. రవాణాశాఖ కమిషనర్‌ ఇలంబర్తి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీలర్ల వద్దనే రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధంగా అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. గతంలో వాహన కొనుగోలుదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ను(టీఆర్‌) డీలర్‌ వద్ద చేసుకునే వారు. శాశ్వత రిజిస్ట్రేషన్‌కు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. కార్యాలయాల్లో ముడుపులు ఇస్తేనే పనులు జరుగుతాయన్న విమర్శలు ఉన్నాయి. వీటికి పరిష్కారంగా డీలర్‌ వద్దనే వ్యక్తిగత వాహనాలకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పలు రాష్ట్రాల్లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో వాహన్, సారథి పోర్టల్‌ల ద్వారా షోరూంలోని డీలర్‌ వద్దనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ పోర్టల్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ఆరు నెలల సమయం పట్టే అవకాశాలు ఉండడంతో వెంటనే ఈ నిబంధనలను అమలు చేయడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు.

అధీకృత డీలర్‌ వద్ద శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేయాలంటే పలు పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 

1) ఇన్వాయిస్‌

2) ఫారం-21(విక్రయ ధ్రువీకరణ)

3) ఫారం-22 (రోడ్డు అనుకూలత ధ్రువీకరణ)

4) బీమా పత్రం

5) కొనుగోలుదారుల చిరునామా ధ్రువీకరణ 

6) మరో వాహనం లేదని డిక్లరేషన్‌

7) కొనుగోలుదారుల ఫొటో, సంతకం స్కాన్‌ కాపీ

8) వాహనం ఇంజిన్, ఛాసిస్‌ నంబర్ల ఫొటోలు

9) అవసరం మేరకు రవాణా శాఖ నిర్దేశించే ఇతర పత్రాలు

  • డీలర్‌ నుంచి వచ్చిన వాహన కొనుగోలుదారుల దరఖాస్తులను రిజిస్టరింగ్‌ అథారిటీ/ అదనపు రిజిస్టరింగ్‌ అథారిటీ పరిశీలించి నిబంధనల మేరకు పత్రాలను ఆమోదించడం లేదా తిరస్కరించడం చేస్తుంది.
  • రిజిస్ట్రేషన్‌ పత్రాన్ని(ఆర్‌సీ) స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా కొనుగోలుదారులకు పంపిస్తారు.
  • అధీకృత డీలర్ల వద్ద ఉన్న వాహనాల నిల్వలపై వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌/ఆర్టీవో/డీటీసీ/జేటీసీ/ రవాణా కమిషనర్‌ ఎప్పుడైనా   తనిఖీలు చేపట్టవచ్చు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 04:54 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • హస్తానికి ‘పుర’స్కారం పట్నం ‘చెయ్యె’త్తి జై కొట్టింది.. పుర ఎన్నికల్లో హస్తానికే పట్టం కట్టింది. ఏడింట ఆరు కార్పొరేషన్లు, మూడొంతులకు పైగా మున్సిపాలిటీలను ‘చే’జిక్కించుకునేంతగా అధికార పార్టీ సత్తా చాటింది. 52 శాతానికి పైగా మున్సిపల్‌ వార్డులను చేజిక్కించుకుని.. ‘పీఠా’ధిపత్యం దిశగా పావులు కదుపుతోంది.
  • సతీసమేత విజయం.. పలుచోట్ల భార్యాభర్తల గెలుపు రాష్ట్రంలో హోరాహోరీగా జరిగిన పుర పోరులో పలుచోట్ల భార్యాభర్తలు గెలుపొందారు. జంటగా పుర, నగరపాలికల్లోకి అడుగుపెట్టనున్నారు. మరికొన్ని చోట్ల అత్తాకోడళ్లు, తండ్రీకుమారులు, తల్లీకుమారుడు గెలుపొందారు. 
  • ఫలించిన సీఎం వ్యూహం ఉత్కంఠ మధ్య సాగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యధిక ప్రాంతాల్లో విజయ దుందుభి మోగించి కాంగ్రెస్‌ పట్టు సాధించింది. నోటిఫికేషన్‌ వెలువడటానికి ముందు నుంచీ పార్టీ అత్యధిక వార్డులు, డివిజన్లలో నెగ్గడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రచించిన వ్యూహం ఫలించింది.
  • ఒక్క ఓటు మ్యాజిక్‌ ‘పుర’ ఎన్నికల ఓట్లు లెక్కింపు ఉత్కంఠగా సాగింది. విజయం దోబూచులాడిన చోట్ల అభ్యర్థులు రీకౌంటింగ్‌కు పట్టుబట్టడంతో అధికారులు తిరిగి ఓట్లు లెక్కించారు. ఈ క్రమంలో చాలామంది ఒక్క ఓటు తేడాతో తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు. 
  • వరుస విజయాలతో కాంగ్రెస్‌లో జోష్‌.. వరుస విజయాలు కాంగ్రెస్‌లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. కొన్ని నెలల క్రితం పంచాయతీ ఎన్నికల ఫలితాలు, ఇప్పుడు నగర..
  • మేయర్, ఛైర్‌పర్సన్‌ పదవులకు16న ఎన్నికలు తెలంగాణలో ‘పుర’ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తవడంతో ఏడు నగరపాలక సంస్థల మేయర్లు, ఉప మేయర్లు, 116 పురపాలికల ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవులకు ఈ నెల 16న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేపట్టింది.
  • లక్షల మంది కార్యకర్తల శ్రమ ఫలితమిది ‘రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
  • మాకు ఓట్లు పెరిగాయి పుర ఫలితాలతో తాము సంతృప్తికరంగా ఉన్నామని, తమకు ఓట్లు, సీట్లు పెరిగాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. చాలా చోట్ల కాంగ్రెస్, మజ్లిస్, భారాస ఒక్కటై భాజపా గెలవకుండా అడ్డుకున్నాయని ఆరోపించారు.
  • ‘తిరుగుబాటు’తో తడబాటు తమకు వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు సీటు కావాల్సిందేనని వారు పట్టుబట్టారు. ప్రధాన పార్టీలు ససేమిరా అనడంతో తిరుగుబావుటా ఎగురవేసి.. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు.
  • స్వీపర్‌గా పని చేసి..కౌన్సిలర్‌గా గెలిచి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పురపాలికలో సుదీర్ఘకాలం స్వీపర్‌గా పనిచేసి 2019లో పదవీ విరమణ పొందిన ఇంజమూరి వెంకటమ్మ కౌన్సిలర్‌గా గెలిచి ఔరా అనిపించారు.
  • పురపాలికల్లో కాంగ్రెస్‌కే పట్టం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. మొత్తం 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 50 శాతానికిపైగా వార్డులతో 66 చోట్ల స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. మరో ఐదు మున్సిపాలిటీల్లో సగం వార్డులు సాధించింది.
  • ఇక్కడా లెక్కింపు కోలాహలమే! కొత్తగూడెం నగరపాలిక ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద శుక్రవారం నెలకొన్న కోలాహలమిది. పాల్వంచ పట్టణంలోని అనుబోస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటుచేయగా..
  • కార్పొరేషన్లలో భారాసకు చుక్కెదురు రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాల్లో భారత రాష్ట్ర సమితి (భారాస)కు చుక్కెదురైంది. ఎన్నికలు జరిగిన ఏడు కార్పొరేషన్లలోనూ పార్టీ నామమాత్రపు పోటీ ఇచ్చింది.
  • పండుగ..సందడి హైదరాబాద్‌ శివారు బాట సింగారం మార్కెట్‌కు వివిధ రకాల పండ్లు తీసుకొచ్చిన వాహనాలతో జాతరను తలపిస్తున్న దృశ్యమిది.
  • పార్టీల క్యాంప్‌ ఫైర్‌ రాష్ట్రవ్యాప్తంగా క్యాంపు రాజకీయాల హడావుడి మొదలైంది. ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాని మున్సిపాల్టీల్లో పీఠాలను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల వ్యూహరచనతో రాజకీయాలు వేడెక్కాయి.
  • నేడు అనధికారికంగా మంత్రివర్గ సమావేశం రాష్ట్రమంత్రివర్గం శనివారం సమావేశం కానుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
  • బజ్జీల విక్రేత.. నేడు విజేత! నిన్నటిదాకా గుబిడే నాగుబాయి వేసే వేడివేడి బజ్జీలు తినడానికి ఇష్టపడ్డ జనం.. రేపట్నుంచి సమస్యలు పరిష్కరించమని కోరనున్నారు.
  • కువైట్‌ ఫ్లైట్‌ దిగగానే.. ‘గోల్డెన్‌’ ఛాన్స్‌! స్థానిక నాయకులు సుదీర్ఘంగా వ్యూహాలతో.. భారీ ప్రచారాలతో చెమటోడ్చితే.. సయ్యద్‌ మహబూబ్‌అలీ మాత్రం కువైట్‌ నుంచి వచ్చీరాగానే విజయాన్ని సొంతం చేసుకున్నారు.
  • టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన జూ.అసిస్టెంట్ల నియామకానికి చర్యలు టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 1,309 మంది జూనియర్‌ అసిస్టెంట్లతో ఖాళీలను భర్తీ చేయనున్నందున ఆ పోస్టుల్లో ఒప్పంద, పొరుగుసేవల ద్వారా పనిచేస్తున్న వారిని తొలగించనున్నారు.
  • ‘స్వతంత్రం’గానే హ్యాట్రిక్‌! నల్గొండ జిల్లా దేవరకొండ పురపాలికలో స్వతంత్ర అభ్యర్థి తాళ్ల శ్రీధర్‌గౌడ్‌ వరుసగా మూడోసారి విజయంతో హ్యాట్రిక్‌ సాధించారు.

English Translation

Vehicle Registration: Registration at Dealer

Eenadu icon
By Telangana News Desk Updated : 09 Jan 2026 06:23 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Today, Hyderabad: New. The government has decided not to go to RTA offices for registration when buying personal vehicles. On December 19 last year, in a meeting with the officials of the transport department, the administration took up these reforms with the order given by CM Revanth Reddy to register personal vehicles at the dealers. Transport Commissioner Ilambarthi issued the order on Thursday. Instructions were given to complete the necessary software within 15 days so as to register with the dealers. Earlier, vehicle buyers used to apply for the Temporary Registration (TR) at the dealer. One had to go to RTA offices for permanent registration. There are criticisms that work can be done only if donations are given in the offices. As a solution to this, the authorities have decided to register individual vehicles at the dealer. In many states, registrations are being done at the dealer in the showroom through Vahan and Sarathi portals under the auspices of the Ministry of Road Transport and Highways. As it may take six months for these portals to be fully available in the state, special software is being developed to implement these rules immediately.

Many documents have to be uploaded to apply for permanent registration at an authorized dealer. 

1) Invoice

2) Form-21 (Sales Verification)

3) Form-22 (Roadworthiness Verification)

4) Insurance Document

5) Buyers Address Verification

6) Declaration of No Other Vehicle

7) Buyers Photograph, Signature Scan Copy

8) Vehicle Engine, Photographs of chassis numbers

9) Other documents as required by the Transport Department

  • Registering Authority/Additional Registering Authority will scrutinize the applications of the vehicle buyers from the dealer and approve or reject the documents as per the rules.
  • Registration document(RC) will be sent to the buyers by speed post.
  • Authorized Vehicle Inspector/RTO/DTC/JTC/Transport Commissioner may conduct inspections on stock of vehicles at dealers at any time.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 04:54 IST

Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. Correspondence has no place in this matter. Patnam has 'cheyye'tti jai. The ruling party has so much power that it has 'captured' six out of seven corporations and more than three quarters of municipalities. Having captured more than 52 percent of the municipal wards... it is moving towards the supremacy of 'Peetha'. Husband and wife won in many places in the city war that took place in the state. As a couple, they will enter the town and city administration. In some other places mother-in-law, father-son and mother-son won. 

  • Resulting CM strategy In the municipal elections, which were held amidst excitement, the Congress won the victory in most of the areas. Chief Minister Revanth Reddy's strategy to win the party in most of the wards and divisions even before the notification came out.
  • One vote magic. Counting of 'Pura' election votes went on with excitement. The candidates insisted on a recount where the victory was close, so the officials recounted the votes. In this sequence, many won over their opponents with a difference of one vote. 
  • Josh in Congress with successive victories.. Successive victories have increased confidence in Congress. A few months ago, the results of the panchayat elections, now the city..
  • Elections for the posts of mayor and chairperson on 16 After the counting of 'Pura' election votes in Telangana has been completed, the State Election Commission has made arrangements to hold elections for the posts of mayors, deputy mayors, chairpersons and vice chairpersons of 116 municipal bodies on 16th of this month. Chief Minister Revanth Reddy said, "Heartfelt thanks to the people of the state, who secured a landslide victory for the Congress party in the highest number of seats in the elections held for 116 municipalities and seven corporations across the state." BJP state president Ramachander Rao said that they are satisfied with the results of the city and that they have increased votes and seats. In many places Congress, Majlis and Bharasa have been accused of preventing BJP from winning. They insisted that they need a seat to contest as a ward member. When the main parties called Sasemira, they turned around and ran as independent candidates.
  • Worked as a sweeper and won as a councillor. Injamuri Venkatamma, who retired in 2019 after working as a sweeper in Nereducharla municipality of Suryapet district, won the councilorship and felt aura. Congress won big in municipalities. If elections were held for all 116 municipalities, there was a clear lead in 66 places with more than 50 percent wards. In five other municipalities, half of the wards have been achieved. There was a commotion at the Kothagudem municipal vote counting center on Friday. A vote counting center was set up in the premises of Anubose Engineering College in Palvancha town. In the election results of 116 municipalities and 7 corporations in the state, Bharat Rashtra Samithi (Bharasa) has topped the polls. The party gave nominal contest in all the seven corporations where the elections were held.
  • Festival A fair scene with vehicles carrying different kinds of fruits at Bata Singaram market in the suburb of Hyderabad.
  • Camp fire of parties. The rush of camp politics has started across the state. Politics has heated up with the strategies of major parties to secure seats in municipalities where no party has a clear lead.
  • Informal Cabinet meeting today. The state cabinet will meet on Saturday. It has become important to hold a meeting in the background of the election results of corporations and municipalities.
  • Buzzy seller. Until yesterday, the people who liked to eat the hot bajjis served by Gubide Nagubai.. will be asked to solve the problems from tomorrow.
  • When the Kuwait flight lands.. a 'golden' chance! Local leaders are sweating with long strategies.. with huge campaigns.. Syed Mahbub Ali got success after coming back from Kuwait. 1,309 junior assistants selected by TGPSC will fill the vacancies, so those working on contractual and neighborhood services will be removed. Independent candidate Thala Sreedhargoud achieved a hat-trick by winning for the third time in a row in Devarakonda Municipality of Nalgonda District.