IND vs NZ: ఆ కివీస్‌ స్పిన్నర్‌ మనోడే..

Eenadu icon
By Sports News Team Updated : 09 Jan 2026 13:10 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు జనవరి 11 నుంచి భారత్‌లో పర్యటించనుంది. ఇందులోభాగంగా 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. న్యూజిలాండ్‌ టీ20 జట్టులో యువ స్పిన్నర్‌ ఆదిత్య అశోక్‌ (Adithya Ashok) స్థానం దక్కించుకున్నాడు. అతడి స్వస్థలం తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు. అతడి తల్లిదండ్రులు ఆదిత్యకు 4 సంవత్సరాల వయసున్నప్పుడు న్యూజిలాండ్‌కు వలస వెళ్లారు. అతడికి తన తాతతో చక్కటి అనుబంధం ఉంది. మరణించిన తన తాతకు గుర్తుగా తన బౌలింగ్ ఆర్మ్‌పై సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ డైలాగ్‌ ‘నా దారి రహదారి’ అని అర్థం వచ్చేలా.. తమిళ అక్షరాలతో ఓ టాటూ కూడా వేయించుకున్నాడు.  

23 యేళ్ల ఆదిత్య అశోక్‌ తరచూ భారత్‌ను సందర్శిస్తుంటాడు. అయితే అతడు గత సంవత్సరం కొన్ని వారాలపాటు చెన్నైలోని సీఎస్కే అకాడమీలో కొంతకాలం గడిపాడు. దీంతో అతడు ఇక్కడి పిచ్‌ పరిస్థితులను ఆకళింపు చేసుకున్నాడు. 

  • నేను అతన్ని కెప్టెన్‌ అనే అంటాను: ఐసీసీ ఛైర్మన్‌ జైషా

‘మొదట నేను చెన్నై అనుభవం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అలాంటి అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. నేను ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నా. బంకమట్టి (బ్లాక్‌ సాయిల్‌) పిచ్‌, ఎర్రమట్టి (రెడ్‌ సాయిల్‌) పిచ్‌ల మీద నాకు అవగాహన వచ్చింది. అవి ఎలా ప్రవర్తిస్తాయో ఒక అంచనా ఏర్పడింది’ అని ఆదిత్య అశోక్‌ అన్నాడు. 

అలాగే తన ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ అని అతడు వివరించాడు. ‘మీరు నన్ను నీ ఫేవరెట్‌ ఆల్‌టైమ్‌ లెగ్‌స్పిన్నర్‌ ఎవరని అడిగితే.. షేన్‌వార్న్‌ పేరు చెప్పకుండా ఉండటం చాలా కష్టం. కానీ న్యూజిలాండ్‌లో పెరగడం బాగుంది. ఇష్‌ సోధీతో చక్కటి అనుబంధం ఉండటం నిజంగా నా అదృష్టం. అతడు నాకు పెద్దన్నలాంటోడు. నేను ఇష్‌ బౌలింగ్‌ చూస్తూ పెరిగాను’ అని ఆదిత్య వివరించాడు. 


► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 12:39 IST

English Translation

IND vs NZ: That Kiwis spinner is Manode..

Eenadu icon
By Sports News Team Updated : 09 Jan 2026 13:10 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Internet Desk: New Zealand Cricket Team January Will tour India from 11. As part of this, 3 ODIs and 5 T20s will be played. Young spinner Aditya Ashok has secured a place in the New Zealand T20 team. His native place is Vellore in Tamil Nadu state. His parents migrated to New Zealand when Aditya was 4 years old. He has a good relationship with his grandfather. In memory of his deceased grandfather, he also got a tattoo on his bowling arm in Tamil characters meaning Superstar Rajinikanth's dialogue 'My road is the road'.  

23-year-old Aditya Ashok often visits India. But he spent some time at CSK Academy in Chennai last year for a few weeks. So he took a look at the pitch conditions here. 

  • I call him captain: ICC Chairman Jaisha

First I want to talk about the Chennai experience. I feel really lucky to have such an opportunity. I have learned many things here. I got an understanding of clay (black soil) pitch and red soil (red soil) pitch. Aditya Ashok said that there is an expectation of how they will behave. 

Also he explained that his all time favorite spinner is Shane Warne. 'If you ask me who is your favorite leg-spinner of all time... it is very difficult not to mention Shane Warne's name. But growing up in New Zealand is cool. I am really lucky to have a good relationship with Ish Sodhi. He is like an elder to me. I grew up watching Ish bowling,' explains Aditya. 

href="https://x.com/eenadulivenews/" target="_blank" rel="noopener">Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 12:39 IST