Russia-Ukraine: ‘హేజల్‌నట్‌’తో ఉక్రెయిన్‌లో అలజడి.. అత్యాధునిక క్షిపణిని ప్రయోగించిన రష్యా

Eenadu icon
By International News Team Updated : 09 Jan 2026 14:52 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

మాస్కో: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రమయ్యాయి. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నివాసంపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులకు పాల్పడినట్లు క్రెమ్లిన్‌ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా మాస్కో తాజాగా ఉక్రెయిన్‌ ( Ukraine)పై అత్యాధునిక ఒరెష్నిక్‌ క్షిపణితో విరుచుకుపడింది. ధ్వని కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణించగల ఈ క్షిపణిని (Oreshnik Ballistic Missile) గురువారం అర్ధరాత్రి పశ్చిమ లివివ్‌ ప్రాంతంపై ప్రయోగించింది.

పుతిన్‌ నివాసంపై దాడికి ప్రతీకారంగానే ఈ క్షిపణిని ప్రయోగించినట్లు రష్యా ( Russia) రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ క్షిపణితో కీలక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. అయితే కచ్చితంగా ఏ ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ మిస్సైల్‌ను ప్రయోగించిందన్న వివరాలను మాస్కో వెల్లడించలేదు కానీ.. ఉక్రెయిన్‌ భూగర్భ సహజ వాయువు నిల్వలపై ఈ దాడి జరిగినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాలపై ఉక్రెయిన్‌ అధికారులు స్పందించారు. రష్యా జరిపిన దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 22 మంది గాయపడినట్లు తెలిపారు. ఒరెష్నిక్‌తో పాటు మొత్తం 36 క్షిపణులు, 242 డ్రోన్లను రష్యా ప్రయోగించినట్లు కీవ్‌ ఆరోపించింది. నాటో సరిహద్దుకు సమీపంలో ఒరెష్నిక్‌ పడిందని, ఐరోపా భద్రతకు ఇది పెనుముప్పు అని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి అన్నారు.

  • గ్రీన్‌లాండ్‌ కోసం డబ్బులతో ఎర.. ప్రజలపై డాలర్ల వర్షం కురిపించేందుకు ట్రంప్‌ సిద్ధం..!

ఐరోపా మొత్తాన్ని టార్గెట్‌ చేసేలా..

రష్యా అత్యాధునిక క్షిపణుల్లో ఒరెష్నిక్‌ ఒకటి. రష్యన్‌ భాషలో దీనర్థం హేజల్‌నట్‌ చెట్టు. సాధారణంగా మాస్కో అభివృద్ధి చేసే క్షిపణులకు చెట్ల పేర్లను పెట్టడం ఆనవాయితీ. ఒరెష్నిక్‌ మధ్య స్థాయి క్షిపణి. ఇది గంటకు 13,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అంటే ధ్వని వేగం కంటే 10 రెట్లు వేగంగా దూసుకెళ్తుంది. యూరప్‌లోని అన్ని దేశాలు ఈ మిస్సైల్‌ పరిధిలోకి వస్తాయని రష్యా మిస్సైల్‌ ఫోర్సెస్‌ చీఫ్ వెల్లడించారు. ఇప్పటివరకు ఈ క్షిపణిని అడ్డుకునే సామర్థ్యం గల ఆయుధమేదీ లేదని పేర్కొన్నారు.

తొలిసారిగా ఈ క్షిపణిని 2024 నవంబరులో ఓ ఉక్రెయిన్‌ ఫ్యాక్టరీ మీద ప్రయోగించారు. అప్పట్లో అది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ఇటీవలే దీన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. రష్యా మిత్రదేశమైన బెలారస్‌కు ఈ మిస్సైల్‌ను తరలించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ క్షిపణి అణు బాంబులతో పాటు అనేక వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 14:30 IST