Suzuki e-Access: సుజుకీ ఇ-యాక్సెస్‌ వచ్చేసింది.. ధర రూ.1.88 లక్షలు

Eenadu icon
By Business News Team Updated : 09 Jan 2026 16:21 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Suzuki e-Access | ఇంటర్నెట్‌ డెస్క్‌: సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా తన తొలి విద్యుత్‌ స్కూటర్‌ను దేశీయ మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. తన విజయవంతమైన మోడల్‌ యాక్సెస్‌ను.. ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో ఇ-యాక్సెస్‌ పేరుతో లాంచ్‌ చేసింది. కంపెనీ తన గురుగ్రామ్‌ ప్లాంట్‌లో దీన్ని తయారు చేయనుంది. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల మార్కెట్‌లో బజాజ్‌ చేతక్‌, టీవీఎస్‌ ఐక్యూబ్‌, ఏథర్‌ రిజ్తాతో ఇది పోటీ పడనుంది.

సుజుకీ ఇ-యాక్సెస్‌లో 3.07 kWh లిథియం ఐరన్‌ పాస్ఫేట్‌ బ్యాటరీని అమర్చారు. ఇది సింగిల్‌ ఛార్జ్‌తో 95 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ స్కూటర్‌లో 4.1kW ఎలక్ట్రిక్‌ మోటార్‌ను అమర్చారు. ఇది 15 Nm పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పోర్టబుల్‌ ఛార్జర్‌తో 0-80 శాతం ఛార్జింగ్‌ను 4 గంటల 30 నిమిషాల్లో ఛార్జ్‌ చేయొచ్చని కంపెనీ పేర్కొంది. ఫాస్ట్‌ ఛార్జర్‌తో అయితే పూర్తి బ్యాటరీని ఛార్జ్‌ చేయడానికి 2 గంటల 12 నిమిషాల సమయం పడుతుందని కంపెనీ వెల్లడించింది. టాప్‌ స్పీడ్‌ గంటకు 71 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది.

  • ఒక ఛార్జింగ్‌తో 810 కి.మీ... వోల్వో విద్యుత్తు ఎస్‌యూవీ ఈఎక్స్‌ 60 

ఇందులో పూర్తి డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంటల్‌ కన్సోల్‌ ఉంది. దీంట్లో ఎకో, రైడ్‌ ఏ, రైడ్‌ బి మోడ్‌లు ఉన్నాయి. రీజనరేటివ్‌ బ్రేకింగ్‌, రివర్స్‌ మోడ్‌ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. బ్లూటూత్‌/యాప్ కనెక్టివిటీ ఉన్నాయి. యూఎస్‌బీ ఛార్జింగ్‌ సదుపాయం కూడా ఉంది. ఎల్‌ఈడీ లైట్స్‌ ఇచ్చారు. మొత్తం నాలుగు కలర్‌ ఆప్షన్లలో లభిస్తోంది. గతేడాది భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో దీన్ని తొలిసారిగా ప్రదర్శించారు. సుజుకీ డీలర్‌షిప్‌లతో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఆర్డర్‌ చేయొచ్చు. ఏడేళ్లు లేదా 80వేల కిలోమీర్ల వరకు వారెంటీ, సుజుకీ కస్టమర్లకు రూ.10వేల వరకు లాయల్టీ బోనస్‌, ఇతర వినియోగదారులకు రూ.7వేలు వెల్‌కం బోనస్‌ ఇస్తున్నారు. 5.99 శాతం వడ్డీ రేటుతో ఫైనాన్సింగ్‌ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 15:53 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఎలక్ట్రిక్‌ టూవీలర్ల మార్కెట్‌లో టీవీఎస్‌, బజాజ్‌, హీరో హవా Electric two wheeler: విద్యుత్‌ ద్విచక్ర వాహనాల విషయంలో నిన్న మొన్నటి వరకు ఆధిపత్యం చెలాయించిన స్టార్టప్‌ కంపెనీలు చతికిలపడ్డాయి.
  • తొలి యమహా ఈవీ స్కూటర్‌.. ధర ఎంతంటే..? ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ యమహా మోటార్‌ ఇండియా తన తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఈసీ-06ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. 
  • నెలకు రూ.49 వేలతో ఇంటికి టెస్లా వై Tesla offers: ఎలాన్‌ మస్క్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) దేశీయంగా తన విక్రయాలు పెంచుకునేందుకు కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది.
  • 3 లక్షల స్కూటర్లను రీకాల్ చేసిన యమహా.. మోడళ్లు ఇవే Yamaha recall: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్‌ ఇండియా 3 లక్షల స్కూటర్ల రీకాల్‌ చేపట్టింది.
  • టయోటా నుంచి తొలి ఈవీ.. సింగిల్‌ ఛార్జ్‌తో 543 km Toyota Urban Cruiser Ebella: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (Toyota) దేశంలో తొలి విద్యుత్‌ కారును విడుదల చేసింది. అర్బన్‌ క్రూయిజర్‌ ఎబెల్లా (Toyota Urban Cruiser Ebella) పేరిట దీన్ని లాంచ్‌ చేసింది.
  • కొరవడిన అమ్మకాలు.. టెస్లా Yపై ₹2 లక్షల వరకు డిస్కౌంట్‌ Tesla discount: ఎన్నో అంచనాల మధ్య భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన టెస్లాకు ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి.
  • వాహనాల టైర్లు కేవలం నలుపు రంగులోనే ఎందుకుంటాయి? వాహనాల టైర్ల రంగు ఎందుకు నలుపు రంగులోనే ఉంటుంది. దీనికి కార్బన్‌ బ్లాక్‌ ప్రధాన కారణం.
  • బజాజ్‌ నుంచి చేతక్‌ కొత్త EV.. ధర రూ.లక్షలోపే! Bajaj chetak c25: ప్రముఖ ఆటో మొబైల్‌ సంస్థ బజాజ్‌ ఆటో చేతక్‌.. సీ25 పేరిట కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. దీని ధరను రూ.91,399 (ఎక్స్‌ షోరూమ్‌)గా నిర్ణయించింది.
  • టాటా పంచ్‌ ఫేస్‌లిఫ్ట్‌ విడుదల.. ధర ₹5.59 లక్షల నుంచి ప్రారంభం Tata Punch Facelift:  ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ పాసింజర్స్‌ వెహికల్స్‌.. టాటా పంచ్‌ ఫేస్‌లిఫ్ట్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.5.59 లక్షల (ఎక్స్-షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది.
  • మహీంద్రా నుంచి ఎక్స్‌యూవీ 3XO ఈవీ.. ధరెంత? Mahindra XUV 3XO: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా సబ్‌కాంపాక్ట్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ ఈవీని (Mahindra XUV 3XO) మంగళవారం లాంచ్‌ చేసింది.
  • మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ.. ధరల శ్రేణి రూ.13.66- 24.11 లక్షలు మహీంద్రా అండ్‌ మహీంద్రా, కొత్తగా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ ఎస్‌యూవీని సోమవారం ఆవిష్కరించింది. ఏఎక్స్, ఏఎక్స్‌3, ఏఎక్స్‌5, ఏఎక్స్‌7, ఏఎక్స్‌7టీ, ఏఎక్స్‌7ఎల్‌ వేరియంట్లలో ఈ వాహనం లభ్యం కానుంది.
  • మార్కెట్‌లోకి కొత్త కియా సెల్టోస్‌.. ధర ₹10.99 లక్షల నుంచి ప్రారంభం New Kia Seltos: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తన రెండో జనరేషన్‌ సెల్టోస్‌ను (Kia Seltos) దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది.
  • విద్యుత్‌ కార్లలో టాటా దూకుడు.. లక్ష విక్రయాలు దాటిన నెక్సాన్‌.ఈవీ Tata Motors:  ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ పాసింజర్స్‌ వెహికల్స్‌ (TMPV) అరుదైన మైలురాయిని సాధించింది. టాటా రూపొందించిన నెక్సాన్‌.ఈవీ (Nexon.ev) లక్ష విక్రయాలు సాధించిన తొలి విద్యుత్‌ కారుగా నిలిచింది.
  • జనవరి 1 నుంచి ఏథర్‌ ఈవీ ధరలకు రెక్కలు Ather price hike: ఏథర్‌ ఎనర్జీస్‌ సంస్థ ఈవీ ధరలను సవరించింది. జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.
  • జనవరి నుంచి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ కార్ల ధరలు పైకి JSW MG Motor price hike: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా (JSW MG Motor) తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
  • మారుతీ వ్యాగన్‌ఆర్‌లో స్వివెల్‌ సీటు వృద్ధులు, దివ్యాంగులు కూడా సౌకర్యవంతంగా ప్రయాణించేలా, మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్‌ కారులో స్వివెల్‌ సీటు అమర్చుతోంది.
  • ఏథర్‌ రిజ్తా విక్రయాల్లో దూకుడు.. 20 నెలల్లో 2 లక్షల మైలురాయి Ather Rizta: ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీకి (Ather energy) చెందిన ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రిజ్తా (Ather Rizta) అరుదైన మైలురాయిని సాధించింది.
  • కొత్త కియా సెల్టోస్‌ వచ్చేసింది.. ఫీచర్లు, బుకింగ్‌ వివరాలు ఇవే! Kia Seltos: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తన రెండో జనరేషన్‌ సెల్టోస్‌ను ఆవిష్కరించింది. గట్టి పోటీ ఉన్న మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యాధునిక హంగులతో 2026 మోడల్‌ సెల్టోస్‌ను తీసుకొచ్చింది.
  • టాటా సియారా వచ్చేసింది.. ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభం Tata Sierra: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ ప్యాసింజర్స్‌ వెహికల్స్‌ (TMPV) తన ఐకానిక్‌ మోడల్‌ సియారాను (Tata Sierra) మళ్లీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
  • బైకులన్నింటికీ ABS తప్పనిసరి.. ఇప్పట్లో లేనట్లే! Two wheeler ABS: టూవీలర్స్‌ అన్నింటిలో 2026 జనవరి 1 నాటికి ABSను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం గతంలో ప్రతిపాదించింది. కానీ, కంపెనీలు అందుకు సిద్ధంగా లేకపోవటంతో వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

English Translation

Suzuki e-Access: Suzuki e-Access has arrived.. Price Rs.1.88 lakh

Eenadu icon
By Business News Team Updated : 09 Jan 2026 16:21 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Suzuki e-Access | Internet Desk: Suzuki Motorcycle India has launched its first electric scooter in the domestic market. It has launched its successful model Access in an electric version called E-Access. The company will manufacture it at its Gurugram plant. It will compete with Bajaj Chetak, TVS iCube and Aether Rizta in the electric scooter market.

Suzuki E-Access is equipped with a 3.07 kWh lithium iron phosphate battery. The company claims that it will give a range of 95 kilometers on a single charge. This scooter is equipped with a 4.1kW electric motor. It produces 15 Nm of peak torque. The company claims that the portable charger can charge from 0-80 percent in 4 hours and 30 minutes. The company revealed that it takes 2 hours and 12 minutes to charge a full battery with a fast charger. The company claims a top speed of 71 kmph.

  • 810 km on a single charge... Volvo Electric SUV EX60

It has a fully digital instrumental console. It has Eco, Ride A and Ride B modes. Regenerative braking and reverse mode are also available. Bluetooth/App connectivity is available. There is also a USB charging facility. LED lights are given. Available in four color options. It was first showcased at Bharat Mobility Expo 2025 last year. You can order from Suzuki dealerships as well as Flipkart. Warranty up to seven years or 80,000 kilometers, loyalty bonus up to Rs.10,000 for Suzuki customers and welcome bonus of Rs.7,000 for other customers. There are also financing options at an interest rate of 5.99 percent.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 15:53 IST

Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this regard.

More

  • TVS, Bajaj, Hero Hawa in the electric two-wheeler market Electric two wheeler: The start-up companies that dominated the electric two-wheeler business till yesterday are squatting.
  • The first Yamaha EV scooter.. What is the price..? The leading two-wheeler company Yamaha Motor India has launched its first electric scooter EC-06 in the domestic market. 
  • Tesla Y for home with Rs.49 thousand per month Tesla offers: Elon Musk's car manufacturer Tesla (Tesla) has come forward with a new strategy to increase its domestic sales.
  • Yamaha has recalled 3 lakh scooters. These are the models Yamaha recall: Leading two-wheeler manufacturer Yamaha Motor India has undertaken a recall of 3 lakh scooters.
  • The first EV from Toyota.. 543 km on a single charge Toyota Urban Cruiser Ebella: Leading car manufacturing company Toyota Kirloskar Motor (Toyota) has released the first electric car in the country. It has been launched in the name of Urban Cruiser Ebella (Toyota Urban Cruiser Ebella). Tesla discount: Tesla, which has entered India amid many expectations, is facing problems from the beginning.
  • Why are the vehicle tires only black? Why are vehicle tires black in color? Carbon black is the main reason for this.
  • Chetak New EV from Bajaj.. Price under Rs.1 Lakh! Bajaj chetak c25: The leading auto mobile company Bajaj Auto Chetak has launched a new electric scooter named C25. It has been priced at Rs.91,399 (ex-showroom).
  • Tata Punch facelift launched.. Price starts from ₹5.59 lakh Tata Punch Facelift: The leading car manufacturer Tata Motors has launched Passengers Vehicles.. Tata Punch Facelift in the domestic market. Its price starts from Rs.5.59 lakh (ex-showroom).
  • XUV 3XO EV from Mahindra.. How much? Mahindra XUV 3XO: Leading automobile company Mahindra and Mahindra launched the XUV 3XO EV in the subcompact SUV segment on Tuesday.
  • Mahindra XUV 7XO.. The price range is Rs.13.66-24.11 lakhs Mahindra and Mahindra launched the new XUV 7XO SUV on Monday. The vehicle will be available in AX, AX3, AX5, AX7, AX7T and AX7L variants.
  • New Kia Seltos in the market.. Price starts from ₹10.99 lakh New Kia Seltos: Leading car manufacturer Kia has launched its second generation Seltos in the domestic market. Tata Motors: Leading carmaker Tata Motors Passenger Vehicles (TMPV) has achieved a rare milestone. Tata's Nexon.ev has become the first electric car to achieve 1 lakh sales. Ather price hike: Ather Energies revises EV prices. The new prices will come into effect from January 1.
  • JSW MG motor car prices to go up from January JSW MG Motor price hike: The leading car manufacturing company JSW MG Motor India (JSW MG Motor) has announced a hike in the prices of its cars.
  • Swivel seat in Maruti WagonR Maruti Suzuki WagonR is installing a swivel seat in the car so that the elderly and the disabled can travel comfortably. 2 lakh milestone in 20 months Ather Rizta: Ather Rizta, a family electric scooter belonging to the leading electric vehicle manufacturer Ather energy, has achieved a rare milestone.
  • New Kia Seltos has arrived.. Features, booking details are here! Kia Seltos: Leading car manufacturer Kia has unveiled its second generation Seltos. In the fiercely competitive midsize SUV segment, the 2026 model Seltos has been brought in with the latest touches. Tata Sierra: The leading automobile company Tata Motors Passenger Vehicles (TMPV) has brought back its iconic model Tata Sierra in the market.
  • ABS is mandatory for all bikes. Two wheeler ABS: The government had earlier proposed to make ABS mandatory in all two wheelers by January 1, 2026. But, it is reported that there is a possibility of postponement as the companies are not ready for it.