EV: ఈవీ బ్యాటరీలకూ ఆధార్!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈనాడు, హైదరాబాద్: దేశంలో విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, వాటిలో కీలకమైన బ్యాటరీల భద్రత, పారదర్శకత కోసం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వినూత్న ప్రతిపాదనను తీసుకొచ్చింది. మనకు ఆధార్ కార్డు తరహాలోనే, ప్రతి బ్యాటరీ ప్యాక్‌కు ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించాలని నిర్ణయించింది. ‘బ్యాటరీ ప్యాక్ ఆధార్ నంబరు’ (బీపీఏఎన్) పేరుతో పిలిచే ఈ 21 అంకెల కోడ్ ద్వారా బ్యాటరీ తయారీ నుంచి అది రీసైక్లింగ్ అయ్యే వరకూ ప్రతి దశనూ పర్యవేక్షించవచ్చు.
ఈ నూతన నిబంధనల ప్రకారం.. బ్యాటరీ ఉత్పత్తిదారులు లేదా దిగుమతిదారులు తాము మార్కెట్లోకి ప్రవేశపెట్టే ప్రతి బ్యాటరీకి తప్పనిసరిగా బీపీఏఎన్ కేటాయించాల్సి ఉంటుంది. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. బ్యాటరీకి సంబంధించిన సమస్త సమాచారం ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. బ్యాటరీకి వాడిన ముడి పదార్థాలను ఎక్కడి నుంచి సేకరించారు, తయారీ విధానం, వినియోగం, రీసైక్లింగ్ వరకూ ప్రతి సమాచారాన్ని దీనిద్వారా తెలుసుకోవచ్చు. ఈ వివరాలన్నింటినీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అధికారిక పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయడం తప్పనిసరి.
చెరిగిపోకుండా..
బీపీఏఎన్ సంఖ్య బ్యాటరీపై అందరికీ కనిపించేలా, స్పష్టంగా ఉండాలి. కాలక్రమేణా అది చెరిగిపోకుండా తయారీ కంపెనీలు ముందే జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఒకవేళ బ్యాటరీని రీసైక్లింగ్ చేసినా, లేదా ఇతర అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసినా, దానికి కొత్త గుర్తింపు సంఖ్యను కేటాయించాల్సి ఉంటుంది.
- పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే 2 కిలోవాట్ అవర్(కేడబ్ల్యూహెచ్) కంటే అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం దేశంలో లిథియం-అయాన్ బ్యాటరీల గిరాకీలో 80-90 శాతం ఈవీల నుంచే వస్తుండటంతో తొలి ప్రాధాన్యం విద్యుత్ వాహనాలకే ఇవ్వనున్నారు.
వీటికి వర్తించదు:వాహనాలను స్టార్ట్ చేసేందుకు వినియోగించే ఎస్‌ఎల్‌ఐ బ్యాటరీలు, చిన్న పోర్టబుల్ బ్యాటరీలు ఈ నిబంధనల పరిధిలోకి రావు.
ఎలా చూడొచ్చు..
వినియోగదారులు, సంబంధిత అధికారులు మూడు విధానాల్లో ఈ సమాచారాన్ని పరిశీలించేందుకు వీలుంటుంది.
- ఆల్ఫాన్యూమరిక్ కోడ్: ఇది నేరుగా బ్యాటరీపై ఉంటుంది. ఇంటర్నెట్ లేకపోయినా ప్రాథమిక వివరాలను తెలుసుకోవచ్చు.
- క్యూఆర్ కోడ్: బ్యాటరీలోని పదార్థాలు, కర్బన ఉద్గారాల గురించి రీసైక్లింగ్ చేసే సంస్థలు చూడొచ్చు.
- సర్వర్ ఆధారిత డేటా: ఇది కేవలం అధీకృత వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పాత బ్యాటరీలను కొనేవారు దాని నాణ్యతను సర్వర్ ద్వారా తనిఖీ చేయొచ్చు.
ఇది ఒక విప్లవాత్మక మార్పు
ఈ కొత్త విధానం ద్వారా బ్యాటరీల పనితీరును కచ్చితంగా అంచనా వేయడమే కాకుండా, పర్యావరణంపై వాటి ప్రభావం ఎంత అన్నదీ తెలుసుకునే వీలుంది. ముఖ్యంగా రెండోసారి వినియోగించే బ్యాటరీల విషయంలో ఇది కీలకపాత్ర పోషించనుంది. ఈ మొత్తం ప్రక్రియను ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ (ఏఐఎస్) మార్గదర్శకాల ప్రకారం అమలు చేయాలని రవాణా శాఖ ప్రతిపాదించింది. వీటి కింద ఏర్పడే కమిటీలో బ్యాటరీ, ఈవీ తయారీదారులు, రీసైక్లర్లు, ఇతర నియంత్రణ సంస్థ ప్రతినిధులు సభ్యులుగా ఉండి, సాంకేతిక అంశాలను పర్యవేక్షిస్తుంటారు. గృహ, పారిశ్రామిక అవసరాలకు బ్యాటరీల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆధార్ తరహా గుర్తింపు సంఖ్య ఒక విప్లవాత్మకమైన మార్పుగా నిలుస్తుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation
EV: Aadhaar for EV batteries!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Today, Hyderabad: The use of electric vehicles (EV) is increasing rapidly in the country. In the background, the Union Ministry of Road Transport and Highways has come up with an innovative proposal for safety and transparency of key batteries. It has decided to assign a unique identification number to each battery pack, similar to our Aadhaar card. This 21-digit code known as 'Battery Pack Aadhaar Number' (BPAN) can be monitored at every stage from battery manufacturing to recycling.
According to these new rules.. battery producers or importers must assign BPAN to every battery they introduce in the market. It's not just a number. All the information related to the battery is stored in it. From where the raw materials used for the battery are collected, manufacturing process, usage, recycling, every information can be known through this. It is mandatory to upload all these details from time to time in the official portal established by the government.
In order not to get lost..
The BPAN number should be visible and clear on the battery. Manufacturing companies should take precautions so that it does not wear out over time.
- If the battery is recycled or modified according to other requirements, it has to be assigned a new identification number.
- These regulations apply to batteries with a capacity higher than 2 kilowatt hours (kWh) used for industrial purposes. As currently 80-90 percent of the demand for lithium-ion batteries in the country comes from EVs, the first priority will be given to electric vehicles.
Not applicable to:SLI batteries used to start vehicles and small portable batteries are not covered by these regulations.
How It can be seen..
Users and concerned authorities can check this information in three ways.
- Alphanumeric Code: It is directly on the battery. Basic details can be found even without internet.
- QR Code: The recycling companies can see the materials in the battery, carbon emissions.
- Server based data: It is accessible only to authorized persons. Buyers of old batteries can check its quality through the server.
This is a revolutionary change
Through this new system, not only the performance of batteries can be accurately assessed, but also their impact on the environment. This will play a vital role especially in the case of second-use batteries. The Transport Department has proposed to implement this entire process as per Automotive Industry Standards (AIS) guidelines. The committee formed under these will have representatives of battery, EV manufacturers, recyclers and other regulatory bodies as members and oversee the technical aspects. Industry experts believe that this Aadhaar-style identification number will be a revolutionary change in the face of increasing use of batteries for household and industrial purposes.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :