Rupee: రూపాయి.. ఈ ఏడాది ఎందాకా?

Eenadu icon
By Business News Desk Published : 04 Jan 2026 02:18 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

భారత్‌పై అమెరికా భారీగా విధించిన సుంకాల ప్రభావంతో 2025లో డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ సుమారు 5% పతనమైంది. గత మూడేళ్లలోనే దేశీయ కరెన్సీకి ఇదే అత్యధిక క్షీణత. ఆసియాలో  పేలవ ప్రదర్శన కనబరచిన దేశాల కరెన్సీల్లో ఒకటిగానూ రూపాయి నిలిచింది. డిసెంబరులో రూ.91.0775 వద్ద కొత్త జీవనకాల కనిష్ఠాన్ని కూడా తాకింది. భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం సాధ్యమైనంత త్వరగా కుదరకపోతే.. రూపాయి బలహీనతలు ఇక్కడితో ఆగకపోవచ్చని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

ఆర్‌బీఐ జోక్యం మాటేమిటి?

అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో.. రూపాయి కదలికల విషయంలో ఆర్‌బీఐ జోక్యం ఎలా ఉండొచ్చన్నదే కీలకం కానుంది. గతేడాది రూపాయి విషయంలో జోక్యం చేసుకునేందుకు సమర్థ వ్యూహాలను ఆర్‌బీఐ అనుసరించలేదనే అభిప్రాయం ఉంది. అయితే ఆర్‌బీఐ వద్ద విదేశీ మారకపు నిల్వలు భారీగా తగ్గడం, డాలరుకు అధిక గిరాకీ నేపథ్యంలో ఒకవేళ అమెరికా అధిక సుంకాలు కొనసాగితే రూపాయి విలువను ఆర్‌బీఐ మరింత పడనిచ్చే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

ఒప్పందం కుదిరినా..

అమెరికాతో భారత్‌కు వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ.. రూపాయి మారకపు విలువ పెరిగే విషయంలో మరీ అంత సానుకూల అంచనాతో లేమని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే.. ఒప్పందం అనంతరం ఒకవేళ రూపాయి పుంజుకున్నా, విదేశీ మారకపు నిల్వలను పెంచుకునే ఉద్దేశంతో డాలర్లను కొనేందుకే ఆర్‌బీఐ ప్రాధాన్యం ఇస్తుందని చెబుతున్నారు. ఈ కారణం వల్ల రూపాయి విలువ పుంజుకోవడం పరిమితంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

2026లో ఎలా ఉండొచ్చు..

ప్రస్తుత సంవత్సరంలో రూపాయి కదలికలకు ప్రధానంగా భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన పరిణామాలే దిశానిర్దేశం చేయనున్నాయి. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరకుంటే.. 2026లో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 89-93 శ్రేణిలో చలించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఒప్పందం కుదిరితే 87.50-88కు పుంజుకునే అవకాశం ఉంటుందంటున్నారు. వాణిజ్య ఒప్పందం కుదిరినా.. భారత వస్తువులపై సుంకాలను 15-20 శాతానికి అమెరికా తగ్గించినప్పుడే సానుకూల పరిణామంగా చూడాలని అభిప్రాయపడుతున్నారు. 

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • వచ్చే 12-18 నెలలు మార్కెట్‌కు మంచి రోజులు గత ఏడాదిన్నరగా ఒడుదొడుకులకు లోనవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు, ఇకపై కోలుకునే అవకాశముందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈఓ ధీరజ్‌ రెల్లి విశ్లేషించారు.
  • అంతరిక్షంలో డేటా సెంటర్లు భూమిపై చిన్న చెత్త ముక్క పడి ఉందనుకోండి. పెద్ద ప్రమాదమేమీ లేదు. కానీ, అంతరిక్షంలో పరిస్థితి వేరు. అక్కడ చిన్న శకలం వేగంగా దూసుకొచ్చి ఢీకొడితే పెను ప్రమాదమే సంభవిస్తుంది.
  • వేతన పెంపులు.. తగ్గేదేలే కొత్త లేబర్‌ కోడ్‌లను అమలు చేయడం వల్ల అధిక వేతన బిల్లులు చెల్లించాల్సి వస్తున్నప్పటికీ.. చాలా వరకు కంపెనీలు వేతన పెంపులను తగ్గించే ప్రయత్నం చేయకపోవచ్చని హెచ్‌ఆర్‌ అధిపతులు, వేతన నిపుణులు అంటున్నారు.
  • జియో, ఆంథ్రోపిక్‌ వంటి 15 కంపెనీలతో కూటమి ఏర్పాటు జియో ప్లాట్‌ఫామ్స్, ఆంథ్రోపిక్, ఎరిక్‌సన్‌తో పాటు సెమీ కండక్టర్లకు క్లౌడ్‌ మౌలిక సదుపాయాలు, అనుసంధానత అందించే రంగంలో సారూప్యత కలిగిన అంతర్జాతీయ సంస్థలు విశ్వసనీయ సాంకేతిక కూటమి (టీటీఏ)ని ఏర్పాటు చేయడానికి చేతులు కలిపాయి.
  • విస్తరణ బాటలో అన్విత గ్రూపు స్థిరాస్తి రంగంలోని అన్విత గ్రూపు దేశంలోని, వివిధ ప్రాంతాలతోపాటు, అమెరికా, దుబాయ్‌లకూ తమ ప్రాజెక్టులను విస్తరించే ప్రణాళికల్లో ఉంది.
  • ఐఓబీ నుంచి మరిన్ని స్టార్టప్‌ బ్యాంకింగ్‌ శాఖలు ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) తన 90వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘స్టార్టప్‌ బ్యాంకింగ్‌’ నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  • ట్రెన్స్‌లో 60% వాటా కొనుగోలు: ఇక్సిగో స్పెయిన్‌లోని రెండో అతి పెద్ద రైలు బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రెన్స్‌లో 60 శాతం వాటాను 11.70 మిలియన్‌ యూరోలకు (రూ.125 కోట్లకు పైగా) కొనుగోలు చేయడానికి బోర్డు బైండింగ్‌ ఒప్పందాల అమలుకు ఆమోదం తెలిపినట్లు ట్రావెల్‌ అగ్రిగేటర్‌ ఇక్సిగో వెల్లడించింది.
  • మణప్పురంలో వాటా కొనుగోలుకు బెయిన్‌ క్యాపిటల్‌కు ఆర్‌బీఐ అనుమతులు పసిడి రుణాల సంస్థ మణప్పురం ఫైనాన్స్‌లో 41.66 శాతం వాటాను బెయిన్‌ క్యాపిటల్‌ కొనుగోలు చేయడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతులు ఇచ్చింది.
  • ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌కు ఎన్‌విడియా సీఈఓ జెన్సెన్‌ రావట్లేదు ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో పాల్గొనాల్సిన ఎన్‌విడియా సీఈఓ జెన్సెన్‌ హువాంగ్, తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు.

English Translation

Rupee: Rupee.. this year?

Eenadu icon
By Business News Desk Published : 04 Jan 2026 02:18 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

US heavy tariffs on India As a result, the rupee depreciated by around 5% against the dollar in 2025. This is the biggest depreciation for the domestic currency in the last three years. The rupee has also been one of the weakest performing currencies in Asia. It also touched a new lifetime low of Rs.91.0775 in December. Market sources are of the view that if the trade agreement between India and America is not concluded as soon as possible, the rupee's weakness may not stop here. 

What is RBI's intervention?

At a time when there is uncertainty about the US-India trade agreement, the key is how RBI's intervention can be in the case of rupee movements. There is an opinion that RBI did not follow effective strategies to intervene in the case of rupee last year. However, market sources are analyzing that there is a possibility that the RBI will further depreciate the value of the rupee if the US continues to impose high tariffs in the face of a huge decrease in foreign exchange reserves at the RBI and high demand for the dollar. 

Even if the agreement is reached..

Even if India has reached a trade agreement with America, some analysts say that they are not very positive about the increase in the value of the rupee. Because, if the rupee recovers after the agreement, it is said that the RBI will prefer to buy dollars with the intention of increasing foreign exchange reserves. Due to this reason, it is expected that the recovery of the value of the rupee will be limited.

What will happen in 2026..

The movements of the rupee in the current year will mainly be directed by the developments related to the India-US trade agreement. If no agreement is reached between the two countries, analysts predict that the value of the rupee may fluctuate in the range of 89-93 against the dollar in 2026. If the agreement is reached, it is said that there is a possibility to recover to 87.50-88. Even if the trade agreement is reached, they are of the opinion that it should be seen as a positive development only when the US reduces tariffs on Indian goods to 15-20 percent. 

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence on this matter.

More

  • Next 12-18 months are good days for the market. HDFC Securities MD and CEO Dhiraj Relli has analyzed that the domestic stock markets, which have been undergoing ups and downs for the last year and a half, have a chance to recover.
  • Data centers in space Imagine a small piece of garbage lying on the ground. No big danger. But, the situation in space is different. There is a big accident if a small fragment comes fast and collides with it.
  • Salary hikes. Although the implementation of new labor codes has led to higher wage bills. HR heads and pay experts say that most companies may not try to reduce pay hikes.
  • Alliance with 15 companies like Jio, Anthropic Jio Platforms, Anthropic, Ericsson and similar international companies in the field of cloud infrastructure and connectivity for semiconductors have joined hands to form the Trusted Technology Alliance (TTA).
  • Anvita Group on expansion path Anvita Group in the real estate sector is planning to expand its projects in various parts of the country, including the US and Dubai.
  • More Startup Banking Branches from IOB Indian Overseas Bank (IOB) celebrates its 90th founding day by expanding its 'Startup Banking' network.
  • 60% stake acquisition in Trance: Ixigo Travel aggregator Ixigo has announced that it has approved the execution of board binding agreements to acquire 60 percent stake in Spain's second largest train booking platform Trance for 11.70 million euros (over Rs. 125 crore).
  • RBI approvals for Bain Capital to acquire stake in Manappuram The Reserve Bank of India (RBI) has approved Bain Capital's acquisition of 41.66 per cent stake in PSD loans firm Manappuram Finance.
  • NVIDIA CEO Jensen to miss India AI Impact Summit Nvidia CEO Jensen Huang, who was scheduled to participate in the India AI Impact Summit, has canceled his visit to India, a top official revealed.