Vijay Hazare Trophy: విజయ్‌ హజారే ట్రోఫీ.. తిలక్‌ శతకం

Eenadu icon
By Sports News Desk Published : 04 Jan 2026 02:31 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

కెప్టెన్‌ తిలక్‌ వర్మ (109; 118 బంతుల్లో 6×4, 3×6) శతకం సాధించడంతో విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ బోణీ కొట్టింది. ఈ టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిన హైదరాబాద్‌.. శనివారం గ్రూప్‌-బి మ్యాచ్‌లో చండీగఢ్‌ను 136 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మొదట హైదరాబాద్‌ 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. తిలక్‌తో పాటు అభిరథ్‌ రెడ్డి (71) రాణించాడు. జగ్‌జీత్‌ (3/43), రోహిత్‌ (2/64), హర్‌తేజస్వి (2/47), విషు (2/58) హైదరాబాద్‌ను కట్టడి చేశారు. బదులుగా చండీగఢ్‌ 37.4 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. సన్యమ్‌ (46) టాప్‌స్కోరర్‌. రక్షణ్‌ రెడ్డి (3/34), నితేశ్‌ రెడ్డి (2/27), మిలింద్‌ (2/20) ప్రత్యర్థికి కళ్లెం వేశారు. 

ఆంధ్ర హ్యాట్రిక్‌ ఓటమి

ఆంధ్ర ఓటమి బాట వీడట్లేదు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడింది. ఆలూర్‌లో జరిగిన గ్రూప్‌-డి మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేయడంతో 7 పరుగుల తేడాతో గుజరాత్‌ చేతిలో పరాజయం చవిచూసింది. మొదట గుజరాత్‌ 9 వికెట్లకు 318 పరుగులు చేసింది. అక్షర్‌ పటేల్‌ (130; 111 బంతుల్లో 10×4, 5×6) సెంచరీ చేశాడు. విశాల్‌ (70), రవి బిష్ణోయ్‌ (31) కూడా రాణించారు. సత్యనారాయణ రాజు (4/53), నితీశ్‌కుమార్‌ రెడ్డి (2/65), ఆంజనేయులు (2/45) ఆకట్టుకున్నారు. ఛేదనలో ఆంధ్ర పోరాడినా.. 311/7కే పరిమితమైంది. జ్ఞానేశ్వర్‌ (102; 125 బంతుల్లో 9×4, 3×6) సెంచరీ చేసినా.. జట్టును గెలిపించలేకపోయాడు. రవి బిష్ణోయ్‌ (3/64), అక్షర్‌ పటేల్‌ (2/27), అర్జాన్‌ (2/69) ఆంధ్రను దెబ్బ కొట్టారు. 5 మ్యాచ్‌ల్లో ఆంధ్రకు ఇది నాలుగో ఓటమి.

హార్దిక్‌ విధ్వంసం

హార్దిక్‌ పాండ్య (133; 92 బంతుల్లో 8×4, 11×6) మెరుపు శతకం సాధించినా.. రాజ్‌కోట్‌లో విదర్భతో గ్రూప్‌-బి మ్యాచ్‌లో బరోడా 9 వికెట్ల తేడాతో ఓడింది. మొదట బరోడా 9 వికెట్లకు 293 పరుగులు చేసింది. ఒక దశలో ఆ జట్టు 71/5తో కష్టాల్లో పడింది. ఈ స్థితిలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హార్దిక్‌.. విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ఎడాపెడా బౌండరీలు బాదాడు. స్పిన్నర్‌ పార్థ్‌ రేఖడే వేసిన 39వ ఓవర్లో అతడు విశ్వరూపం చూపించాడు. వరుసగా 6, 6, 6, 6, 6, 4తో 34 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే లిస్ట్‌-ఎలో తొలి శతకాన్ని అందుకున్నాడు. తొలి 66 పరుగులను 62 బంతుల్లో చేసిన హార్దిక్‌.. సెంచరీ చేయడానికి మరో 6 బంతులే తీసుకోవడం విశేషం. విదర్భ బౌలర్లలో యశ్‌ ఠాకూర్‌ (4/64) ఆకట్టుకున్నాడు. అమన్‌ (150 నాటౌట్‌; 121 బంతుల్లో 17×4, 4×6) భారీ సెంచరీ సాధించడంతో విదర్భ 41.4 ఓవర్లలో ఒక్క వికెటే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ధ్రువ్‌ షోరే (65 నాటౌట్‌) రాణించాడు. 

పడిక్కల్‌ జోరు

విజయ్‌ హజారే ట్రోఫీలో దేవ్‌దత్‌ పడిక్కల్‌ సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు. అయిదు మ్యాచ్‌ల్లో అతడు నాలుగు శతకాలు సాధించాడు. పడిక్కల్‌ (108; 120 బంతుల్లో 8×4, 3×6) జోరుతో అహ్మదాబాద్‌లో త్రిపురతో గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో కర్ణాటక 80 పరుగుల తేడాతో గెలిచింది. మొదట కర్ణాటక 7 వికెట్లకు 332 పరుగులు చేసింది. అభినవ్‌ మనోహర్‌ (79), రవిచంద్రన్‌ సమ్రాన్‌ (60), కేఎల్‌ రాహుల్‌ (35) రాణించారు. అభిజిత్‌ సర్కార్‌ (4/40) సత్తా చాటాడు. ఛేదనలో త్రిపుర 49 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది. స్వప్నిల్‌ సింగ్‌ (100) సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. విజయ్‌ కుమార్‌ (3/54), శ్రేయస్‌ గోపాల్‌ (3/33) ప్రత్యర్థిని కట్టడి చేశారు. మరోవైపు ఝార్కండ్‌తో మ్యాచ్‌లో సంజు శాంసన్‌ (101; 95 బంతుల్లో 9×4, 3×6), రోహన్‌ కన్నుమ్మల్‌ (124; 78 బంతుల్లో 8×4, 11×6) శతకాలతో చెలరేగడంతో కేరళ 8 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట ఝార్ఖండ్‌ 7 వికెట్లకు 311 పరుగులు చేసింది. కుమార్‌ కుశాగ్ర (143; 137 బంతుల్లో 8×4, 7×6) సెంచరీ సాధించాడు. శాంసన్, రోహన్‌ శతకాలతో కేరళ 42.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సర్వీసెస్‌తో మ్యాచ్‌లో దిల్లీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (67 నాటౌట్‌; 37 బంతుల్లో 4×4, 6×6),  ప్రియాంశ్‌ ఆర్య (72; 45 బంతుల్లో 9×4, 3×6) రాణించడంతో దిల్లీ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట సర్వీసెస్‌ 178కే ఆలౌటైంది. హర్షిత్‌ రాణా (4/47), ప్రిన్స్‌ యాదవ్‌ (3/28) రాణించారు. బదులుగా దిల్లీ 19.4 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. 

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పది పరీక్షలకు వైభవ్‌ దూరం భారత అండర్‌-19 ప్రపంచకప్‌ స్టార్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌ యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు దూరంగా ఉండనున్నాడు.
  • కోపం వదిలెయ్‌ సోదరా! పాకిస్థాన్‌తో ఆదివారం మ్యాచ్‌ అనంతరం భారత స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ చాలా కోపంగా కనిపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
  • అక్కడ మెరుపుల్లేవ్‌ టీ20 అనగానే గుర్తొచ్చేది సిక్సర్లు, ఫోర్లే! ఎంత బాదితే అభిమానులకు అంత ఆనందం. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో చాలా మ్యాచ్‌ల్లో బ్యాటర్లు అదరగొడుతున్నారు.
  • కంగారూలు మళ్లీ పడ్డారు లంకేయులు అదరహో.. కంగారూలకు మళ్లీ షాక్‌! శ్రీలంక వరుసగా మూడో విజయంతో టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌ 8కు దూసుకెళ్లింది.
  • పెళ్లి పీటలెక్కనున్న ఇషాన్‌! భారత స్టార్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడా? అంటే అవుననే అంటున్నాడు అతని తాత రామ్‌ అనుగ్రహ పాండే. మోడల్‌ అదితి హుండియాతో ఇషాన్‌ వివాహం జరగొచ్చని పాండే సూత్రప్రాయంగా చెప్పాడు.
  • అజ్మతుల్లా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చిన్న జట్లలోకెల్లా బలమైన జట్టే అయినా, అదృష్టం కలిసిరాక తొలి రెండు మ్యాచ్‌ల్లో బోణీ కొట్టలేకపోయిన అఫ్గానిస్థాన్‌.. టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని సాధించింది.
  • ఇంగ్లాండ్‌ సూపర్‌-8కు టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ సూపర్‌-8కు అర్హత సాధించింది. సోమవారం గ్రూప్‌-సి పోరులో ఆ జట్టు ఇటలీపై 24 పరుగుల తేడాతో గెలిచింది.
  • అతడో అసమర్థుడు టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌ నఖ్వి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పాక్‌ మంత్రి కూడా అయిన అతడు.. తన ఇష్టానుసారంగా బోర్డును నడిపించాడు.
  • పాక్‌తో మ్యాచ్‌లో కాస్త ఎక్కువ ఒత్తిడి: అక్షర్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే సహజంగానే ఒత్తిడి ఉంటుందని భారత ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ అన్నాడు. అయితే మైదానంలోకి దిగాక తమ దృష్టంతా ఆటపైనే ఉంటుందని అతను చెప్పాడు.
  • బాబర్, షాహీన్‌లపై వేటు? టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో పాకిస్థాన్‌ పరాజయ ప్రభావం.. సీనియర్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజాం, షాహీన్‌ అఫ్రిదిలపై పడేలా ఉంది.
  • సంక్షిప్త వార్తలు (4) ఆస్ట్రేలియాకు షాకిచ్చిన జింబాబ్వే టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి సిద్ధమైంది. ఆ జట్టు.. మంగళవారం గ్రూప్‌-బి పోరులో ఐర్లాండ్‌ను ఢీకొంటుంది.