World Telugu Conference: మాతృభాషతోనే గౌరవం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈనాడు, అమరావతి: ‘భాషంటే కేవలం భావ వ్యక్తీకరణే కాదు.. ఒక ప్రపంచాన్ని సృష్టించే బలం దానికి ఉంది. పుస్తకాల్లానే భాష మనతో పాటు మన మనసులో, ఆత్మలో ఉంటుంది. వాడుకలో లేకపోతే మనిషిలాగే క్షీణిస్తుంది. మాతృభాష వాడుకలో ఉన్నంత కాలం మనకు గౌరవం, మర్యాద, గుర్తింపు లభిస్తాయి. ఆ పరిస్థితి లేని నాడు ఏమీ మిగలదు’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ అన్నారు. గుంటూరులో శనివారం అట్టహాసంగా ప్రారంభమైన మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఆయన ప్రసంగంలో ప్రధానాంశాలివీ..
రెండు బంధాలతో పుడతాం
‘మనం పుట్టినప్పుడు రెండు బంధాలతో పుడతాం. ఒకటి మాతృబంధం, ఇంకొకటి భాషాబంధం. మాతృబంధం రక్తబంధమైతే, భాషా బంధం భాషానురక్తబంధంగా ఉంటుంది. భాషంటే కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు, భావం వ్యక్తపరిచేందుకు మాత్రమే కాదు. దానికి ఒక ప్రపంచాన్ని సృష్టించగలిగే బలం ఉంది. భారత రాజ్యాంగంలో మూడు ముఖ్యమైన విషయాల గురించి చెప్పారు. మొట్టమొదటిది స్వేచ్ఛ, రెండోది సమానత్వం, మూడోది రాజ్యాంగంలో పదం వాడినా వాడకపోయినా మనం తెలుగులో బంధుత్వం అని చెప్పుకోవచ్చు. బంధుత్వం అంటే అది మనందరినీ బంధిస్తుందని. అలాగే మనందరం మాతృభాష వల్ల బంధువులం. ఈ బంధం ఎప్పటికీ వదులుకోలేం. బంధుత్వం వల్ల ఒక గుర్తింపు కలుగుతుంది. వీరెవరు అంటే మా తెలుగువాళ్లు అంటాం. అలా మనకు భాష ద్వారా మర్యాద, గౌరవం, గుర్తింపు లభిస్తాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ గౌరవం మనకు లభిస్తోందా లేదా అన్న దానిపై ఇప్పటికే చర్చ జరిగింది. భాషను కాపాడుకోవాలంటే ముఖ్యమైనది దాని వాడుక. వాడుక లేనిదే భాష ఉండదు. మనకు గౌరవం, గుర్తింపు, బంధం ఏమీ మిగలవు.

తప్పనిసరిగా అమలు చేయాలి
భాషను వాడుకలో ఉంచాలంటే పరిపాలన, అధికార వ్యవహారాల్లో తప్పనిసరిగా అమలు చేయాలి. న్యాయస్థానంలో జడ్జి, అడ్వకేట్ తమ కేసు గురించి సరిగ్గా చర్చిస్తున్నారా లేదా అనే విషయం కోర్టుకెళ్లిన ప్రతి ఒక్కరికీ తెలియాలి. అది మన బాధ్యత. అందుకే జిల్లా స్థాయి వరకు న్యాయస్థాన వ్యవహారాల్లో తెలుగును వాడాలి. దానివల్ల ధర్మాన్ని ప్రతి ఒక్కరి గడప వరకు తీసుకెళ్లాలనే డిక్లరేషన్ సార్థకమవుతుంది.పాఠశాలల్లో తప్పనిసరిగా మాతృభాషలో బోధన ఉండాలి.
తెలుగు ఉపాధ్యాయులను గౌరవించండి
తెలుగువాళ్లమైన మనం తెలుగు ఉపాధ్యాయుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదనే భావన నా మనసును కష్టపెడుతోంది. ఆ గౌరవం ఇవ్వనందువల్లనే ఇవాళ ఈ పరిస్థితి ఉంది. తెలుగు ఉపాధ్యాయులను హేళన చేయకుండా కాళ్లు కడిగి దణ్ణం పెట్టాలి. వారిని గౌరవించని సమాజం సమాజం కాదు. ఈ రోజు నుంచే వారిని గౌరవించి, మన భాషను కాపాడుకోవాలి. ఈ వేదికపై నుంచి నేను చెప్పదలచుకున్న ముఖ్యమైన విషయమిదే.

నేను సమ్మతిస్తున్నాను
సుప్రీంకోర్టులో ఇద్దరు కంటే ఎక్కువ జడ్జిలు ఉంటే మా పని సులువవుతుంది. మేం వేరుగా తీర్పు రాయాల్సిన అవసరం లేకుండా.. నేను సమ్మతిస్తాను అని చిన్నగా రాస్తే సరిపోతుంది. మీరన్న ప్రతి ఆలోచన, వాగ్దానాన్ని నేను పూర్తిగా సమ్మతిస్తున్నాను. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గజల్ శ్రీనివాస్‌కు ధన్యవాదాలు. ఆయన ప్రతి పాటలో తెలుగు భాషపై అనురాగం, ప్రేమ కనిపిస్తున్నాయి’ అని వివరించారు. వందేమాతరం అంటూ జస్టిస్ శ్రీనరసింహ ప్రసంగం ముగించగానే.. సభికులందరూ లేచి నిల్చుని చప్పట్లతో అభినందనలు తెలిపారు.
భాషతోనే మంచి ప్రవర్తన
భాష మన వ్యక్తిత్వాన్ని వృద్ధి చేస్తుంది. ‘ఇంత పెద్ద రాజ్యాంగాన్ని మనం రాత్రింబవళ్లు కష్టపడి సిద్ధం చేశాం. ఇంత మంచి రాజ్యాంగం ఉన్నా దీన్ని నడిపించే మనుషులు సరైనవారు కాకపోతే ఇది ఉండీ లాభం లేదు. మన దగ్గర మంచి ప్రవర్తన కలిగిన మనుషులుంటే ఇంత పెద్ద రాజ్యాంగం అవసరం లేదు’... రాజ్యాంగ రచన పూర్తి చేశాక అంబేడ్కర్ అన్న మాటలివి. ఆయన ఉద్దేశం సత్ప్రవర్తనకు మించింది ఏదీ లేదని. ఇంజినీరింగ్, మెడిసిన్, పీహెచ్‌డీలు, సైన్స్, గణితం.. ఇలా దేని వెనక పరుగెడుతున్నామో అవి డేటాను ఇస్తాయే కానీ మంచి నడవడికను నేర్పలేవు. అది తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి వస్తుంది. దానికి భాష తోడవుతుంది. చిన్నప్పటి నుంచి చక్కటి తెలుగులో మాట్లాడేలా ప్రేరేపించేటట్లుగా జీవనం సాగాలి. చందమామ రావే అన్నా, నీరు పల్లమెరుగు.. నిజము దేవుడెరుగు అని చెప్పినా, పరుల సొమ్ము పామువంటిది అని పలికినా వాటిని సామెతలుగా తీసుకుంటాం. కానీ ఈ చిన్న సామెతల్లో పెద్దతత్వం ఉంది. మన వ్యక్తిత్వాన్ని రూపొందించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి.
నిత్యజీవితంలో అలవరుచుకోవాలి
మన ప్రవర్తన (క్యారెక్టర్ ఫార్మేషన్)కు దేశానికి చాలా పెద్ద అనుబంధం ఉందని అంబేడ్కర్ అన్నారు. ఆ క్యారెక్టర్‌కు, భాషకు అనుబంధం ఉంది. భాషల్లో మాతృభాషతో ఉండే అనుబంధమే ప్రత్యేకం. ఇవన్నీ పెద్దపెద్ద సభల్లో మాట్లాడుకునే విషయాలు కావు. చిన్నచిన్న పనుల్లో, క్రియల్లో ఉంటాయి. వాటిని మన జీవితంలో చేర్చుకుని తు.చ. తప్పకుండా పాటిస్తూ ఉంటే భాష సార్థకమవుతుంది. తద్వారా మనమూ సార్థకత పొందుతాం. మంచి పద్యాలకు జవాబు నిశ్శబ్దమే. అయ్యన్నపాత్రుడు తన వ్యక్తిగత అనుభవాలతో తెలుగు పరిస్థితిని వివరించారు. జిల్లా న్యాయస్థానాల వరకు తీర్పులు తెలుగులో ఉండాలని జస్టిస్ రఘురాం స్పష్టం చేశారు. విశ్వంజీ ప్రవచనంతో పాటు మనల్ని ప్రేరేపించారు. పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేయాలని లక్ష్మీనారాయణ చెప్పారు. అవధానం ప్రాధాన్యం, తెలుగుతో దానికున్న అనుబంధాన్ని మాశర్మ చక్కగా వివరించారు. విశ్వామిత్రుడి కుమారుడు ఆంధ్రుడని నాకు ఈ సభావేదికపైనే తెలిసింది. ఇక్కడికి వచ్చి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 04 Jan 2026 04:43 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 520 కేజీల కొమ్ముకోనం కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు శనివారం భారీ కొమ్ముకోనం చేప చిక్కింది. 12 అడుగుల పొడవుతో ఏకంగా 520 కిలోలు ఉంది.
- విశాఖ తీరంలో మరో సంబరం ప్రపంచ యుద్ధ నౌకల ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం భారత నౌకాదళం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి వివిధ దేశాల నౌకల రాక సైతం మొదలైంది.
- కోటప్పకొండంత భక్తి! శివుడిపై భక్తితో ఓ కళాకారుడు కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి మినీయేచర్‌ను తయారు చేశారు.
- తిరుమల ‘కమాండ్’ దేశానికే తలమానికం కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం ఆధ్యాత్మికతతోపాటు అత్యాధునిక సాంకేతికతలోనూ ఆదర్శంగా నిలుస్తోంది. అలిపిరి వద్ద తనిఖీలు, భక్తుల రద్దీని లెక్కగట్టడం, లడ్డూ ప్రసాద పంపిణీలో పారదర్శకత పెంచడం..
- సవాళ్లున్నా సంక్షేమం.. అభివృద్ధే సంకల్పం ఒకటీ ఒకటీ కలిస్తే ప్రతిసారీ రెండే కానక్కర్లేదు.. ఒక్కోసారి అనూహ్యంగా ఎన్నో రెట్ల బలం సమకూరొచ్చు... 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి రాష్ట్రంలో అఖండ విజయం సాధించడంతోపాటు అటు కేంద్రంలోనూ కీలక భాగస్వామిగా మారడం అలాంటిదే.
- సీమలో సిరుల పంట ఉమ్మడి ప్రకాశం జిల్లా సహా రాయలసీమ ముఖచిత్రమే మార్చేలా.. కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దేలా రూ.30 వేల కోట్లతో ప్రతిపాదనలు సమర్పిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు.
- మౌలికం.. పెట్టుబడుల ఆకర్షణకు మార్గం కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు ‘పాలసీ 4.0’ విధానాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనిద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం, ఎగుమతులు పెంచడం.. రాష్ట్ర సుస్థిర పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
- అప్పులు తగ్గించుకుని.. ప్రగతి దిశగా అప్పులు తగ్గించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేలా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ.. గత ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన అప్పులపై వడ్డీరేట్లు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
- విద్యకు రూ.34,875 కోట్లు రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం బడ్జెట్‌లో విద్యకు రూ.34,875 కోట్లు (11శాతం) కేటాయించింది. ఇందులో పాఠశాల విద్యకు రూ.32,308 కోట్లు కేటాయించింది.
- ఊపందుకోనున్న అమరావతి రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.6,000.10 కోట్లు ప్రతిపాదించింది. భూసమీకరణ పథకానికి రూ.50 కోట్లు, రాజధాని ప్రాంతంలో సామాజిక భద్రతా నిధి, భూమిలేని పేదలకు పింఛన్ల కోసం రూ.115.14 కోట్లు కేటాయించింది.
- కొత్త పథకాలు, కార్యక్రమాలు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం పలు కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రకటించింది. ఇంద్రధనుస్సు కార్యక్రమం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనుంది.
- రైతుకు రాజమార్గం రైతును రాజుగా నిలబెట్టాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్ర ఆర్థిక సౌధానికి మూలస్తంభమైన వ్యవసాయరంగాన్ని పటిష్ఠపరిచేలా బడ్జెట్ కేటాయింపులు చేశామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
- రోడ్లు, వంతెనలు రయ్..రయ్.. వైకాపా ప్రభుత్వం రోడ్లను పట్టించుకోకుండా ప్రజలకు నరకం చూపించగా.. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రెండేళ్లుగా ఆ రోడ్లను బాగుచేసేందుకే పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తోంది.
- ఇది స్వర్ణాంధ్ర బడ్జెట్ ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కూడా బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణ, దీర్ఘకాలిక వృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది స్వర్ణాంధ్ర బడ్జెట్.
- ఆర్థిక వృద్ధికి త్రిముఖ వ్యూహం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా తలపెట్టిన ఎకనమిక్ రీజియన్‌ల ఏర్పాటు దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
- రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చింది మేమే రాయలసీమలో ఒకప్పుడు పశువులకు తాగడానికీ నీరు దొరికేది కాదని, రైళ్లలో పశుగ్రాసం, నీరు తరలించిన రోజులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గతంలో తాము హంద్రీనీవా ప్రాజెక్టు పనులను సీరియస్‌గా చేపట్టామని, అందుకే ఇప్పుడు దాని ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.
- ఆది దేవుడి సన్నిధిలో.. ఆధ్యాత్మిక వైభోగం! మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రం ముస్తాబైంది. ఆది దేవుడి ఉత్సవ శోభను తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. శివదీక్షా భక్తుల శివనామ స్మరణలతో శ్రీగిరులు మార్మోగిపోతున్నాయి.
- ‘రాయంచ’పై.. సోమస్కందుడి వైభవం మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమస్కందమూర్తి శనివారం హంస వాహనంపై దర్శనమిచ్చారు.
- శివోహం.. అనంతం! మహాశివరాత్రి నేపథ్యంలో బ్రహ్మకుమారీలు జ్యోతిర్లింగాలన్నీ ఒకే చోట చూసేందుకు భక్తులకు వీలు కల్పించారు. చిత్తూరులోని సాంబయ్యకండ్రిగ సమీపంలోని ఓం శాంతి యోగా భవనంలో వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
- సహస్ర వృత్తులకు సంక్షేమ పెన్నిధి గత ఏడాదితో పోలిస్తే ఈ సారి బడ్జెట్‌లో ఎస్టీలకు నిధుల కేటాయింపును ప్రభుత్వం పెంచింది. 2025-26లో రూ.8,159 కోట్లు ప్రతిపాదించగా తాజాగా రూ.9,190 కోట్లు చేసింది.
English Translation
World Telugu Conference: Respect through mother tongue

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Today, Amaravati: 'Language is just an expression' No.. It has the power to create a world. Like books, language stays with us in our mind and soul. If not in use it decays like man. As long as the mother tongue is in use, we get respect, courtesy and recognition. Without that situation, nothing will be left," said Supreme Court judge Justice Pamidigantam Srinarasimha. He spoke as the chief guest at the 3rd World Telugu Congress, which started with great fanfare in Guntur on Saturday. Explaining the greatness of Telugu language, he emphasized the need to preserve it. The main points of his speech. One is maternal and the other is language. If matrilineage is consanguinity, then linguistic relation is linguistic consanguinity. Language is not only for talking to each other and expressing feelings. It has the power to create a world. The Constitution of India mentions three important things. The first is freedom, the second is equality, and the third is kinship in Telugu, regardless of whether the word is used in the constitution or not. Kinship means that it binds us all. Also we are all related by mother tongue. This bond can never be broken. Kinship creates an identity. Who are our Telugu people? Thus we get politeness, respect and recognition through language. There has already been a debate on whether we are getting that respect in the current situation. What is important to preserve a language is its usage. There is no language without use. We are left with no respect, no identity, no bond.
Everyone who goes to the court should know whether the judge and the advocate are discussing their case properly or not. That is our responsibility. That is why Telugu should be used in court proceedings up to the district level. That makes the declaration to take dharma to everyone's doorstep valid. Teaching in mother tongue must be in schools.Respect Telugu teachers
I feel that we Telugus do not give the Telugu teacher due respect. This situation exists today because that respect was not given. Do not make fun of Telugu teachers and wash your feet A society that does not respect them is not a society. We should respect them and protect our language from today. This is the important thing that I want to say from this platform.

I agree
If the Supreme Court has more than two judges. Our work is easy. Without the need for us to write a judgment separately.. it is enough to write a small I agree. I fully agree with your every thought and promise. Thanks to Ghazal Srinivas for organizing such a big event. In every song of his, affection and love for the Telugu language is visible. When Justice Srinarasimha finished his speech called Vande Mataram, all the audience stood up and applauded.
Language itself is good behavior
Language enhances our personality. We have worked hard day and night to prepare such a big constitution. Even if there is such a good constitution, if the people running it are not right, it is of no use. If we have well-behaved people, there is no need for such a big constitution'... Ambedkar's words after completing the writing of the constitution. His intention was nothing but good conduct. Engineering, Medicine, PhDs, Science, Maths.. They give data but cannot teach good behavior. It comes from parenting. Language is added to it. Life should be inspired to speak in good Telugu from childhood. Chandamama Rave Anna, Niru Pallamerugu.. Even if they say that the truth is God, or if they say that money is like a snake, we take them as proverbs. But there is greatness in these little sayings. These play a vital role in shaping our personality.
must be habituated in daily life
Ambedkar said that our behavior (character formation) has a great connection with the nation. That character has an affinity for language. The connection with the mother tongue is special among languages. These are not things that are discussed in large gatherings. It is in small works and actions. Include them in our life. Language is useful if it is followed without fail. That way we will be fulfilled. The answer to good poetry is silence. Ayyannapatra explained the Telugu situation with his personal experiences. Justice Raghuram made it clear that judgments should be in Telugu up to the District Courts. Viswanji inspires us with his prophecy. Lakshminarayana said Telugu should be made compulsory in schools. Awadhanam Pradhanyam and its association with Telugu have been well explained by Masharma. I came to know that Vishwamitra's son was Andhra from this Sabhavedi. I came here and learned many things.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 04 Jan 2026 04:43 ISTNote:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- 520 kg horn A huge Kommukonam fish was caught in the fishermen's net on the coast of Kakinada on Saturday. 12 feet long and weighing 520 kg.
- Another celebration in Visakhapatnam The stage is set for the display of World Warships. Indian Navy has completed the arrangements for this. In this background, the arrival of ships from different countries has also started from Saturday. An artist Kotappakonda Trikoteswaraswamy made a miniature out of devotion to Lord Shiva. Tirumala Kshetra is the epitome of spirituality as well as state-of-the-art technology. Inspections at Alipiri, counting the crowd of devotees, increasing transparency in the distribution of laddu prasad..
- Welfare despite challenges. Willingness to develop If one comes together, there is no need for two each time.. At times, the strength can be unimaginably many times higher... In the 2024 general elections, the NDA alliance won overwhelmingly in the state and became a key partner in the center as well. The alliance government has launched a special project to change the face of Rayalaseema, including the Prakasam district. Finance Minister Payyavula Keshav announced in his budget speech that proposals of Rs.30 thousand crores are being submitted to make this area an international horticultural hub. The coalition government is implementing 'Policy 4.0' policies to attract investment in key sectors. By providing employment opportunities and increasing exports, the government is working towards the sustainable industrial development of the state. Finance Minister Payyavula Keshav said that the budget has been prepared to reduce the debts and lead the state towards development. Following financial discipline, it has been disclosed that measures have been taken to reduce the interest rates on the debts incurred by the previous government.
- Rs.34,875 crores for education. The government has given high priority to education in the state budget. Rs.34,875 crore (11 percent) has been allocated for education in the total budget. In this, Rs.32,308 crore has been allocated for school education.
- Amaravati to gain momentum The government has proposed Rs.6,000.10 crores in this budget for the construction of capital Amaravati. Rs.50 crores for land acquisition scheme, Rs.115.14 crores for social security fund in capital region, pensions for landless poor.
- New schemes and programs The government has announced many new schemes and programs in the state budget. Free bus travel will be provided to disabled people under Indradhanusu programme.
- Rajamargam for farmer Agriculture Minister Achchennaidu said that the government is working with the determination to make the farmer the king and budget allocations have been made to strengthen the agricultural sector which is the cornerstone of the state's economic structure. Spending.
- This is the Golden Andhra Budget The coalition government is committed to responsible fiscal management and long-term growth despite economic pressures. This is the Golden Andhra Budget.
- A three-pronged strategy for economic growth The government has taken another step towards the establishment of economic regions aimed at the integrated development of all parts of the state.
- We are the ones who changed the face of Rayalaseema. Chief Minister Chandrababu said that once in Rayalaseema there was no water for cattle to drink and there were days when cattle fodder and water were transported in trains. He said that in the past they had taken up the work of the Handriniva project seriously, and that is why the results are coming now.
- In the presence of Adi Deva. Srisaila Mahakshetra in Nandyal district is set up for Mahashivratri Brahmotsavam. Devotees flocked to witness the festive splendor of Adi Deva. Srigir is rejoicing with the remembrance of Lord Shiva by devotees of Shivadeeksha.
- The glory of Somaskandu on 'Rayancha' As part of the annual Brahmotsavam of Mahashivratri, Somaskandamurthy appeared on a swan vehicle at Srikalahasteeshwaralayam on Saturday.
- Shivoham.. Anantham! On the occasion of Mahashivratri, the Brahmakumaris have made it possible for the devotees to see all the Jyotirlingas at one place. These are specially set up at Om Shanti Yoga Building near Sambayyakandriga in Chittoor. Compared to last year, the government has increased the allocation of funds for STs in this budget. It proposed Rs.8,159 crores in 2025-26 and recently made Rs.9,190 crores.