World Telugu Conference: భాషా పరిమళం.. సంప్రదాయ సౌరభం

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 04 Jan 2026 05:31 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

ఈనాడు, అమరావతి: తెలుగు పరిమళం గుబాళించింది. సంప్రదాయం ఉట్టిపడింది. తెలుగు కళల వైభవం కళ్లకు కట్టింది. మాతృభాషపై మమకారంతో తరలివచ్చిన తెలుగు ప్రేమికులను అమ్మఒడిలా అక్కున చేర్చుకుంది. ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో శనివారం గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు అమ్మభాషకు పట్టం కట్టేలా అట్టహాసంగా మొదలయ్యాయి. వివిధ రంగాల ప్రముఖుల ప్రసంగాలు, భాషాపండితుల చమత్కారాలు, తెలుగు కవుల నుడికారాలు, అవధానుల ప్రతిభా పాటవాలు, కళాకారుల నృత్యాలు, సంప్రదాయ వస్త్రధారణలు అందరినీ కట్టిపడేశాయి. తెలుగు వైభవం చాటిచెప్పిన మహనీయులను గుర్తుకు తెచ్చుకునేలా తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా కార్యక్రమాలు కొనసాగాయి. సంక్రాంతి సంబరాలు ముందుగానే వచ్చాయన్నట్లు సభా వేదిక అయిన ‘సత్యసాయి ఆధ్యాత్మిక నగరి’ సరికొత్త శోభతో వెలిగింది. మహాసభలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భాషాభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులూ పాల్గొన్నారు.  

జానపదాల హోరు... జనంలో జోరు

తెలుగునాట వివిధ ప్రాంతాలకు చెందిన కళలు, జానపదాలకు మహాసభల్లో సముచిత గౌరవం దక్కింది. వయసుతో సంబంధం లేకుండా కళాకారులు ప్రతిభను ప్రదర్శించారు. నృత్యాలు, పాటలు, భజనలు, సంకీర్తనలు తెలుగుభాష వైభవాన్ని చాటిచెప్పాయి. మన చేతివృత్తులు, చేనేత వస్త్రాలు, శిల్ప, చిత్రకళలు... అన్నీ ఒకచోట చేరి తెలుగువారి వారసత్వ సంపద గొప్పతనాన్ని తెలియజెప్పాయి. ప్రధానవేదికపై ఏర్పాటుచేసిన శ్రీవేంకటేశ్వరుని ప్రతిమ, తెలుగుతల్లి, ఎన్టీఆర్‌ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెనాలి కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న తుక్కు ఇనుము శిల్పాలను సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. నోరూరించే ఆంధ్రా వంటకాలను వడ్డించారు. చారిత్రక, వారసత్వ సంపదను, విజ్ఞాన సర్వస్వాన్ని ఒకే చోటకు తీసుకొచ్చి నేటి తరానికి పరిచయం చేశారు. 

ఐదు తరాల సందడి

మహా సభల వేదికలపై ఐదుతరాలు కనువిందు చేశాయి. మహాసభలకు చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా, విభిన్న వయస్సులవారు హాజరు కావడం ఆకట్టుకుంది. ప్రధానవేదిక వద్ద ఉదయం నుంచీ పాఠశాలల విద్యార్థులు సందడి చేయగా.. అన్నమయ్య సంకీర్తనల సందర్భంగా యువతులు గొంతు కలిపి అమ్మభాషను కీర్తించారు. పిల్లలతో కలిసొచ్చిన మాతృమూర్తులు, మాతృభాషపై మమకారంతో హాజరైన అమ్మమ్మలు.. ఇలా అన్ని తరాలూ ప్రాంగణంలో కనిపించాయి. కొన్నిచోట్ల పిల్లలకు తెలుగుభాష గొప్పతనాన్ని వివరిస్తుండటం కనువిందు చేస్తే.. మరికొన్నిచోట్ల తమ బిడ్డలను సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు పరితపించడం ఆకట్టుకుంది.

ఆంధ్రం అనగానే మనకు గుర్తొచ్చేది అవధానం. ఆ ప్రక్రియ మన తెలుగోడి సొత్తు. అవధానం అంటే జ్ఞాపకశక్తి, ధారణ, ధోరణి, చమత్కారం, ధైర్యం.. ఇవన్నీ ఉండాలి. అలాంటి అవధానం భారతీయ భాషల్లో ఇంకెక్కడా లేదు. 

మహా సభలను గుంటూరులో నిర్వహించాలని రెండేళ్ల క్రితం నిర్ణయించుకున్నాం. దేశం, ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసిన అందరికీ రుణపడి ఉన్నాం.

తెలుగుభాష మనుగడ సాగించలేకపోతోందంటే, మాట్లాడలేకపోతున్నారంటే, పిల్లలు తెలుగు భాష అని గర్వంగా తలెత్తుకుని తిరగలేకపోతున్నారంటే అందుకు తలదించుకోవాల్సింది తల్లిదండ్రులే. వ్యవస్థల్ని, ప్రభుత్వాన్ని తర్వాత నిందిద్దాం.  తల్లి ఒడి నుంచే ఈ భాషకు పునాది ఏర్పడాలి. మానసిక శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం పసివయసులో ఎన్ని భాషలైనా నేర్చుకోగలరు. చైనాలో మాండరిన్, జర్మనీలో జర్మన్, ఇటలీలో ఇటాలియన్, జపాన్‌లో జపనీస్‌.. వీరంతా ప్రపంచంలో ఎక్కడా వెనుకబడలేదు. వారు విశ్వవిజ్ఞానాన్ని తమ భాషల్లోకి అనువదింపజేసుకుని పిల్లలకు అందజేస్తున్నారు.

శ్రీరామచంద్రమూర్తికి విద్యలు నేర్పిన మహాగురువు విశ్వామిత్రుడు. ఆయన కుమారుల్లో ఒకరి పేరు ఆంధ్రుడు. ఆయన ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చి మన ప్రాంతాన్ని పాలించారు. అలా మన ప్రాంతానికి ఆంధ్ర దేశమని, మనకు ఆంధ్రులని, మన భాషకు ఆంధ్రమని పేరు వచ్చింది. అంటే శ్రీరాముని కాలం నుంచి తెలుగు భాష ఉందని గ్రహించాలి.

నేను ఐదు భాషలు అనర్గళంగా మాట్లాడటానికి కారణం నా మాతృభాష తెలుగు బాగా రావడం వల్లే అని గర్వంగా చెబుతున్నా. తెలుగులో చదివితే ఉద్యోగాలు రావని చాలామంది అనుకుంటుంటారు. మనకు ఉద్యోగాలు ఇంగ్లిషు భాష చూసి ఇవ్వరు. విషయ గ్రాహక శక్తి, పరిజ్ఞానం చూసి ఇస్తున్నారు. అవి పెరగాలంటే మాతృభాష బాగా రావాలి. మాతృభాషకు ప్రాధాన్యమిచ్చే దేశాలు ముందుకెళుతున్నాయి. 

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 04 Jan 2026 04:44 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • 520 కేజీల కొమ్ముకోనం కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు శనివారం భారీ కొమ్ముకోనం చేప చిక్కింది. 12 అడుగుల పొడవుతో ఏకంగా 520 కిలోలు ఉంది.
  • విశాఖ తీరంలో మరో సంబరం ప్రపంచ యుద్ధ నౌకల ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం భారత నౌకాదళం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి వివిధ దేశాల నౌకల రాక సైతం మొదలైంది.
  • కోటప్పకొండంత భక్తి! శివుడిపై భక్తితో ఓ కళాకారుడు కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి మినీయేచర్‌ను తయారు చేశారు.
  • తిరుమల ‘కమాండ్‌’ దేశానికే తలమానికం కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం ఆధ్యాత్మికతతోపాటు అత్యాధునిక సాంకేతికతలోనూ ఆదర్శంగా నిలుస్తోంది. అలిపిరి వద్ద తనిఖీలు, భక్తుల రద్దీని లెక్కగట్టడం, లడ్డూ ప్రసాద పంపిణీలో పారదర్శకత పెంచడం..
  • సవాళ్లున్నా సంక్షేమం.. అభివృద్ధే సంకల్పం ఒకటీ ఒకటీ కలిస్తే ప్రతిసారీ రెండే కానక్కర్లేదు.. ఒక్కోసారి అనూహ్యంగా ఎన్నో రెట్ల బలం సమకూరొచ్చు... 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి రాష్ట్రంలో అఖండ విజయం సాధించడంతోపాటు అటు కేంద్రంలోనూ కీలక భాగస్వామిగా మారడం అలాంటిదే.
  • సీమలో సిరుల పంట ఉమ్మడి ప్రకాశం జిల్లా సహా రాయలసీమ ముఖచిత్రమే మార్చేలా.. కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దేలా రూ.30 వేల కోట్లతో ప్రతిపాదనలు సమర్పిస్తున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రకటించారు.
  • మౌలికం.. పెట్టుబడుల ఆకర్షణకు మార్గం కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు ‘పాలసీ 4.0’ విధానాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనిద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం, ఎగుమతులు పెంచడం.. రాష్ట్ర సుస్థిర పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
  • అప్పులు తగ్గించుకుని.. ప్రగతి దిశగా అప్పులు తగ్గించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేలా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ.. గత ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన అప్పులపై వడ్డీరేట్లు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
  • విద్యకు రూ.34,875 కోట్లు రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం బడ్జెట్‌లో విద్యకు రూ.34,875 కోట్లు (11శాతం) కేటాయించింది. ఇందులో పాఠశాల విద్యకు రూ.32,308 కోట్లు కేటాయించింది.
  • ఊపందుకోనున్న అమరావతి రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.6,000.10 కోట్లు ప్రతిపాదించింది. భూసమీకరణ పథకానికి రూ.50 కోట్లు, రాజధాని ప్రాంతంలో సామాజిక భద్రతా నిధి, భూమిలేని పేదలకు పింఛన్ల కోసం రూ.115.14 కోట్లు కేటాయించింది.
  • కొత్త పథకాలు, కార్యక్రమాలు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం పలు కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రకటించింది. ఇంద్రధనుస్సు కార్యక్రమం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనుంది.
  • రైతుకు రాజమార్గం రైతును రాజుగా నిలబెట్టాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్ర ఆర్థిక సౌధానికి మూలస్తంభమైన వ్యవసాయరంగాన్ని పటిష్ఠపరిచేలా బడ్జెట్‌ కేటాయింపులు చేశామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
  • రోడ్లు, వంతెనలు రయ్‌..రయ్‌.. వైకాపా ప్రభుత్వం రోడ్లను పట్టించుకోకుండా ప్రజలకు నరకం చూపించగా.. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రెండేళ్లుగా ఆ రోడ్లను బాగుచేసేందుకే పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తోంది.
  • ఇది స్వర్ణాంధ్ర బడ్జెట్‌ ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కూడా బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణ, దీర్ఘకాలిక వృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది స్వర్ణాంధ్ర బడ్జెట్‌.
  • ఆర్థిక వృద్ధికి త్రిముఖ వ్యూహం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా తలపెట్టిన ఎకనమిక్‌ రీజియన్‌ల ఏర్పాటు దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
  • రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చింది మేమే రాయలసీమలో ఒకప్పుడు పశువులకు తాగడానికీ నీరు దొరికేది కాదని, రైళ్లలో పశుగ్రాసం, నీరు తరలించిన రోజులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గతంలో తాము హంద్రీనీవా ప్రాజెక్టు పనులను సీరియస్‌గా చేపట్టామని, అందుకే ఇప్పుడు దాని ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.
  • ఆది దేవుడి సన్నిధిలో.. ఆధ్యాత్మిక వైభోగం! మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రం ముస్తాబైంది. ఆది దేవుడి ఉత్సవ శోభను తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. శివదీక్షా భక్తుల శివనామ స్మరణలతో శ్రీగిరులు మార్మోగిపోతున్నాయి.
  • ‘రాయంచ’పై.. సోమస్కందుడి వైభవం మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమస్కందమూర్తి శనివారం హంస వాహనంపై దర్శనమిచ్చారు.
  • శివోహం.. అనంతం! మహాశివరాత్రి నేపథ్యంలో బ్రహ్మకుమారీలు జ్యోతిర్లింగాలన్నీ ఒకే చోట చూసేందుకు భక్తులకు వీలు కల్పించారు. చిత్తూరులోని సాంబయ్యకండ్రిగ సమీపంలోని ఓం శాంతి యోగా భవనంలో వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
  • సహస్ర వృత్తులకు సంక్షేమ పెన్నిధి గత ఏడాదితో పోలిస్తే ఈ సారి బడ్జెట్‌లో ఎస్టీలకు నిధుల కేటాయింపును ప్రభుత్వం పెంచింది. 2025-26లో రూ.8,159 కోట్లు ప్రతిపాదించగా తాజాగా రూ.9,190 కోట్లు చేసింది.

English Translation

World Telugu Conference: Bhasha Parlamam.. Traditional Aurabha

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 04 Jan 2026 05:31 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

Today, Amaravati: Telugu perfume has been released. Tradition prevailed. The splendor of Telugu arts is eye-catching. Amma Odila has joined the Telugu lovers who flocked to the mother tongue. Under the auspices of Andhra Saraswata Parishad, the Third World Telugu Mahasabha started in Guntur on Saturday with a bang to crown the mother tongue. The speeches of eminent people from various fields, the witticisms of linguists, the dances of Telugu poets, the talented songs of Awadhana, the dances of artists and the traditional costumes captivated everyone. The programs continued to reflect the Telugu cultural traditions to remember the great people who have shown the glory of Telugu. As if the Sankranti celebrations had come early, the meeting venue 'Satyasai Spiritual City' was lit up with a new splendor. A large number of language lovers from both Telugu states came to the Mahasabha. Representatives of Telugu communities in other states were present. Students from various educational institutions of joint Guntur district also participated.  

Janapadala Horu... Janamalo Joru

Arts and folk songs from different regions of Telugu got due respect in Mahasabhas. Artistes have demonstrated talent regardless of age. Dances, songs, bhajans and hymns reflect the glory of the Telugu language. Our handicrafts, handlooms, sculpture, paintings... all come together to show the richness of Telugu heritage. The statue of Sri Venkateswara, Telugu mother and NTR idols installed on the main platform are special attractions. The visitors were interested to see the wrought iron sculptures shaped by the artisans of Tenali. Mouth-watering Andhra cuisine was served. Historical, heritage and knowledge have been brought together in one place and introduced to the present generation. 

The noise of five generations

Five generations met on the platforms of Maha Sabhas. It was impressive that people of different age groups attended the congresses, young and old alike. While the students of the schools made noise from the morning at the Pradhanvedi, the young women glorified Amma Bhasha during Annamayya's sankirtanas. All the generations were seen in the premises, the mother idols who met with the children, the grandmothers who were present in the mother tongue. In some places, the greatness of Telugu language is explained to the children. In other places, it is impressive that they encourage their children to participate in cultural activities.

Andhra is what we remember. That process belongs to our Telugodi. Attention means memory, retention, attitude, wit, courage... all these should be there. Such attention is not found anywhere else in Indian languages. 

Two years ago we decided to organize the Maha Sabhas in Guntur. We are indebted to all those who have come here from all parts of the country and the world.

Telugu language is not able to survive, if it is not able to speak, children are not able to stand up and walk around with pride as Telugu language. Parents have to deal with that. Let's blame the systems and the government later.  The foundation of this language should be formed from the mother's lap. According to the study of psychologists, babies can learn any number of languages. Mandarin in China, German in Germany, Italian in Italy, Japanese in Japan.. All of them are not behind anywhere in the world. They are translating the cosmology into their own languages ​​and imparting it to the children.

Vishvamitra was the great teacher who taught Sri Ramachandramurthy. One of his sons was named Andhra. He came from the north to the south and ruled our region. That is how our region got the name of Andhra country, we got the name of Andhras, and our language got the name of Andhra. It means that Telugu language has existed since the time of Sri Rama.

I am proud to say that the reason I speak five languages ​​fluently is because my mother tongue Telugu is good. Many people think that they will not get jobs if they study in Telugu. We don't get jobs based on English. The subject's receptive power and knowledge are given. If they want to grow, the mother tongue should be good. Countries that prioritize mother tongue are leading the way. 

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 04 Jan 2026 04:44 IST

Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • 520 kg horn A huge Kommukonam fish was caught in the fishermen's net on the coast of Kakinada on Saturday. 12 feet long and weighing 520 kg.
  • Another celebration in Visakhapatnam The stage is set for the display of World Warships. Indian Navy has completed the arrangements for this. In this background, the arrival of ships from different countries has also started from Saturday. An artist Kotappakonda Trikoteswaraswamy made a miniature out of devotion to Lord Shiva. Tirumala Kshetra is the epitome of spirituality as well as state-of-the-art technology. Inspections at Alipiri, counting the crowd of devotees, increasing transparency in the distribution of laddu prasad..
  • Welfare despite the challenges. If one comes together, there is no need for two each time.. At times, the strength can be unimaginably many times higher... In the 2024 general elections, the NDA alliance won overwhelmingly in the state and became a key partner in the center as well. The alliance government has launched a special project to change the face of Rayalaseema, including the Prakasam district. Finance Minister Payyavula Keshav announced in the budget speech that proposals are being submitted with Rs.30 thousand crores to make this area an international horticultural hub.
  • Foundation.. A way to attract investment The coalition government is implementing 'Policy 4.0' policies to attract investment in key sectors. By providing employment opportunities and increasing exports, the government is working towards the sustainable industrial development of the state. Finance Minister Payyavula Keshav said that the budget has been prepared to reduce the debts and lead the state towards development. Following financial discipline, it has been disclosed that measures have been taken to reduce the interest rates on the debts incurred by the previous government.
  • Rs.34,875 crores for education. The government has given high priority to education in the state budget. Rs.34,875 crore (11 percent) has been allocated for education in the total budget. In this, Rs.32,308 crore has been allocated for school education.
  • Amaravati to gain momentum The government has proposed Rs.6,000.10 crores in this budget for the construction of capital Amaravati. Rs.50 crores for land acquisition scheme, Rs.115.14 crores for social security fund in capital region, pensions for landless poor.
  • New schemes and programs The government has announced many new schemes and programs in the state budget. Free bus travel will be provided to disabled people under Indradhanusu programme.
  • Rajamargam for farmer Agriculture Minister Achchennaidu said that the government is working with the determination to make the farmer the king and budget allocations have been made to strengthen the agricultural sector which is the cornerstone of the state's economic structure. Spending.
  • This is the Golden Andhra Budget The coalition government is committed to responsible fiscal management and long-term growth despite economic pressures. This is the Golden Andhra Budget.
  • A three-pronged strategy for economic growth The government has taken another step towards the establishment of economic regions aimed at the integrated development of all parts of the state.
  • We are the ones who changed the face of Rayalaseema. Chief Minister Chandrababu said that once in Rayalaseema there was no water for cattle to drink and there were days when cattle fodder and water were transported in trains. He said that in the past they had taken up the work of the Handriniva project seriously, and that is why the results are coming now.
  • In the presence of Adi Deva. Srisaila Mahakshetra in Nandyal district is set up for Mahashivratri Brahmotsavam. Devotees flocked to witness the festive splendor of Adi Deva. Srigir is rejoicing with the remembrance of Lord Shiva by devotees of Shivadeeksha.
  • On 'Rayancha'.. Glory of Somaskandu As part of the annual Brahmotsavam of Mahashivratri, Somaskandamurthy appeared on a swan vehicle at Srikalahasteeshwaralayam on Saturday.
  • Shivoham.. Anantham! On the occasion of Mahashivratri, the Brahmakumaris have made it possible for the devotees to see all the Jyotirlingas at one place. These are specially set up at Om Shanti Yoga Building near Sambayyakandriga in Chittoor. Compared to last year, the government has increased the allocation of funds for STs in this budget. It proposed Rs.8,159 crores in 2025-26 and recently made Rs.9,190 crores.