
Air quality: కాలుష్యంలో ‘హై’దరాబాద్!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
గాలిలో నాణ్యత పడిపోవడంలో హైదరాబాద్... దేశ రాజధాని దిల్లీతో పోటీ పడుతోంది. కొత్త ఏడాది తొలిరోజున పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 300 వరకు చేరుకుంది. ఇది థర్డ్ పార్టీ, గూగుల్ యాప్‌లు, పరికరాల ద్వారా నమోదవుతున్న సూచీల లెక్క. కానీ సీపీసీబీ ఏర్పాటు చేసిన సూచీలలో కొత్త ఏడాది గరిష్ఠంగా 170 వరకే నమోదుకావడం గమనార్హం. సీపీసీబీ సూచించే కొలతల్లో కచ్చితత్వం లేదని కొందరు విశ్రాంత ఆచార్యులు చెబుతున్నారు. నగరంలోని 14 ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి ఏక్యూఐ పరికరాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా గరిష్ఠ, కనిష్ఠ సూచీలను వెల్లడిస్తోంది. ఏక్యూఐ 100 దాటితే ముప్పు పొంచి ఉన్నట్లే. డిసెంబరులో హైదరాబాద్‌లో గరిష్ఠంగా పీసీబీ లెక్కల ప్రకారం ఏక్యూఐ 132 మాత్రమే. థర్డ్ పార్టీ యాప్‌లలో నమోదైన ఏక్యూఐ 270 వరకు ఉంది. ఇంత వ్యత్యాసం ఉండకూడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాలి నాణ్యతను యురోపియన్ ప్రమాణాల మేరకు కొలిచే యంత్రాల ధర ఒక్కొక్కటి దాదాపు రూ.30 లక్షల వరకు ఉంటుంది. పీసీబీ వాడుతున్న పరికరాలు ఆ స్థాయిలో లేవని పరిశోధకులు చెబుతున్నారు.
మూడు రకాల గాలి కాలుష్యం
గాలిలో కాలుష్యాన్ని బయో, ఫిజికల్, కెమికల్ రియాక్టివ్‌లని మూడు రకాలుగా పరిగణనలోకి తీసుకుంటారు. గాలిలో తేమ, బ్యాక్టీరియా, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వ్యర్థాల వాసనలన్నీ మొదటి రకంలోకి వస్తాయి. సూక్ష్మ ధూళి కణాలను రెండో రకంలోకి తీసుకుంటారు. రసాయన ప్రభావం కల్గించే కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్, మిథనాల్, బెంజిన్ తదితరాలను కెమికల్ రియాక్టివ్‌లో తీసుకుంటారు. ఇవన్నీ ప్రమాణాలను దాటితే ప్రజలకు ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ వంటివి సోకుతాయి.
హైదరాబాద్‌లో దాదాపు 80 లక్షల వాహనాలుంటే.. రోజూ సగటున 50 లక్షల వరకు రోడ్డెక్కుతున్నాయి. వీటి నుంచి వెలువడే పొగ గాలి నాణ్యతను ప్రభావితం చేస్తోంది. వీటితోపాటు భవన నిర్మాణాలు, చెత్తాచెదారం, మురుగు, పరిశ్రమల నుంచి వెలువడే ఘాటు వాసనలు వాయునాణ్యతను క్షీణింపచేస్తున్నాయి.
గాలిలో వివిధ అంశాల ఆధారంగా ఏక్యూఐని గణిస్తాం. జాతీయ స్థాయి గాలినాణ్యత ప్రమాణాల ప్రకారమే పీసీబీ లెక్కిస్తుంది. థర్డ్ పార్టీ యాప్‌లు యూఎస్‌ఈపీఏ ప్రమాణాల ప్రకారం లెక్కిస్తున్నాయి. దానివల్ల వ్యత్యాసం ఉంటుంది. కనిష్ఠాన్ని పరిగణనలోకి తీసుకోకుండా గరిష్ఠం మాత్రమే యాప్‌లు చూపిస్తున్నాయి. పీసీబీ మాత్రం సగటును తీసుకుంటుంది. మన జాతీయ ప్రమాణాలతో కాకుండా యూఎస్‌ఈపీఏ ప్రమాణాలతో పరిశీలిస్తే మన దగ్గర ఏక్యూఐ ఎక్కువగా ఉన్నట్లు వస్తోంది.
పీసీబీ పరికరాల మీద నమ్మకం లేదు. గూగుల్ యాప్‌లో కొంతవరకు నిజమే ఉంటుంది. హైదరాబాద్‌లో వాయునాణ్యత దారుణంగా పడిపోతోంది. దీని మీద నేను పరిశోధన చేస్తున్నా. గాలి నాణ్యత కొలిచే పరికరాన్ని రూపొందించే పనిలో ఉన్నా. పూర్తయిన తర్వాత వెల్లడిస్తా. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమే ఏక్యూఐ పరికరాలు ఉండాలనేది నా అభిప్రాయం.
శనివారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో గాలిలో వాయు నాణ్యత సూచీ 302 సూచించింది. ఇది దిల్లీలో ఏక్యూఐ(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్)తో సమానం. కానీ, ఈ ప్రాంతంలో సీపీసీబీ(సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు)కు సంబంధించిన వాయు నాణ్యతను లెక్కించే సూచీలు లేవు. శనివారం సీపీసీబీ లెక్కల ప్రకారం హైదరాబాద్‌లోని బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో ఏక్యూఐ గరిష్ఠంగా 142, రామచంద్రాపురంలో కనిష్ఠంగా 73 నమోదైంది.
గాలి నాణ్యత 100 దాటితేనే ప్రమాదకరం. ఒకవేళ 300లకు చేరితే.. ఆ గాలి పీల్చిన వారికి పలురకాల వ్యాధులు సంక్రమించే అవకాశముంది. దాన్ని పీలిస్తే రోజుకు 30-35 సిగరెట్లు కాల్చిన దానితో సమానమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గాలి నాణ్యతను సీపీసీబీ నమోదు చేస్తున్నా.. ఎక్కడా కచ్చితమైన లెక్కలు రావడం లేదన్న విమర్శలున్నాయి. థర్డ్‌పార్టీ, గూగుల్ యాప్, సీపీసీబీ ప్రకటిస్తున్న సూచీలకు చాలా వ్యత్యాసం ఉండటమే ఇందుకు కారణం.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation

Air quality: Hyderabad in pollution!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
In falling, Hyderabad is competing with the national capital, Delhi. On the first day of the new year, the AQI reached up to 300 in many areas. This is a calculation of indexes registered by third party, Google apps and devices. But it is noteworthy that in the indices set up by CPCB, the new year has recorded a maximum of 170. Some retired professors say that there is no accuracy in the measurements prescribed by CPCB. The Pollution Control Board has installed ACI devices in 14 areas of the city. Through these, the maximum and minimum indices are revealed. If the ACI exceeds 100, then there is a threat. In December, the maximum ACI in Hyderabad was only 132 according to PCB calculations. AQI recorded in third-party apps is up to 270. Scientists say that there should not be such a difference. The cost of the machines that measure air quality as per European standards is around Rs 30 lakh each. The researchers say that the devices using PCB are not at that level.
Three Types of Air Pollution
Air pollution is considered in three types which are bio, physical and chemical reactive. Moisture in the air, bacteria, and odors from solid waste management fall into the first category. Fine dust particles fall into the second category. Carbon dioxide, nitrogen oxide, sulphur, methanol, benzene etc. which cause chemical effect are taken in chemical reactive. If these standards are exceeded, people will get lung diseases and cancer.
If there are about 80 lakh vehicles in Hyderabad.. An average of 50 lakhs hit the road every day. The smoke emitted from these is affecting the air quality. Apart from these, pungent odors emanating from buildings, garbage, sewage and industries are deteriorating the air quality.
AQI is calculated based on various elements in the air. PCB calculates according to national level air quality standards. Third party apps are calculated according to USEPA standards. That makes a difference. Apps show only the maximum without considering the minimum. PCB takes the average. If we look at the USEPA standards and not our national standards, we have a higher ACI.
No trust in PCB devices. The Google app is somewhat true. Air quality in Hyderabad is deteriorating badly. I am doing research on this. While working on developing an air quality measuring device. Will reveal after completion. I am of the opinion that ACI equipment should be as per international standards.
At 8.30 am on Saturday, the air quality index in KPHB Colony, Hyderabad indicated 302. It is equivalent to AQI (Air Quality Index) in Delhi. But, there is no CPCB (Central Pollution Control Board) air quality index in this area. According to CPCB's calculations on Saturday, the ACI in Hyderabad's Bollaram industrial area was the highest at 142 and the lowest at Ramachandrapuram was 73.
The air quality is dangerous only if it exceeds 100. If it reaches 300.. there is a possibility of contracting various diseases for those who breathe that air. Scientists warn that smoking it is equivalent to smoking 30-35 cigarettes a day. CPCB is recording the air quality. There are criticisms that accurate calculations are not coming anywhere. The reason for this is that there is a huge difference between the indices announced by the third party, Google App and CPCB.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :