చెలిమి విలువ

Eenadu icon
By Editorial Team Published : 01 Jan 2026 01:37 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

జీవితంలో తీయని అనుబంధం స్నేహం. అందుకే ‘పరమ మిత్రుండున్న బంధువర్గంబేల’ అని అడిదము సూరకవి అన్నాడు. ‘సాధు సంగంబు సకలార్థ సాధనంబు’ అని భర్తృహరి భావిస్తాడు. అన్నమయ్య కూడా ఒక సంకీర్తనలో ‘నారాయణుడు మంచి మనసులున్నవారితో స్నేహం కోరుకుంటాడు’ అని ప్రకటించాడు. 

చెలిమిని మించిన కలిమి లేదు. కలిమి లేని కుచేలుడు కృష్ణుడి చెలిమి వల్ల భాగ్యవంతుడయ్యాడు. ఆ మాటకొస్తే ఏ సంపత్తితో నిమిత్తం లేకుండానే బుద్ధిమంతులు మైత్రి ద్వారా స్వకార్యం సాధించుకుంటారు. పంచతంత్రంలోని మిత్రలాభం మొదటి కథే ఇందుకు ఉదాహరణ. కౌరవసభలో ధర్మరాజుకు ఒక్క శత్రువూ కనిపించలేదు. దుర్యోధనుడికి మిత్రుడు కనిపించలేదు. స్నేహ దృష్టితో చూస్తే లోకమంతా సన్నిహితులతోనే నిండి ఉంటుంది. హృదయ కవాటం తెరిచి ఉంచితే.. ఆ ప్రేమ వాటికలోకి నేల ఈనినట్లు ఆప్తులు చొచ్చుకొస్తారు. అందుకే హృదయ కంబానికి పాకే చెలిమి తీగను ద్వేషమనే  కొడవలితో తెంచకూడదు.

స్నేహం విలువను తెలిపే అద్భుతమైన కథ ఒకటి గ్రీకు పురాణాల్లో ఉంది. డామన్, పితియస్‌ అనే ఇద్దరు స్నేహితుల్లో పితియస్‌ మీద ఏవో ఆరోపణలు వచ్చి మరణశిక్ష పడుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు ముగించుకుని వస్తానని గడువివ్వమని అడుగుతాడు. అయితే నీ స్నేహితుణ్ని నీ స్థానంలో ఉంచి వెళ్లమంటాడు ప్రభువు. డామన్‌ అందుకు అంగీకరించి పితియస్‌ వచ్చేవరకు జైల్లో ఉంటాడు. వారి స్నేహబంధం చూసి అచ్చెరువొందిన రాజు ఇద్దరినీ విడిచిపెడతాడు. అంతెందుకు... తొలి తెలుగు కావ్యం స్నేహ సంబంధే. భారత రచనలో తనకు అడుగడుగునా మిత్రుడు నారాయణభట్టు తోడ్పాటు అందించినట్లు నన్నయ ప్రస్తుతించాడు. మనిషి ఒక ద్వీపం అయితే ఆ ద్వీపాలను కలిపే తంత్రి స్నేహం. చెలికాడితో మాట్లాడటం అంటే మనతో మనం ముచ్చటించుకున్నట్లే. సన్నిహిత మిత్రుడు రహస్యాలను భద్రంగా దాచుకునే లాకర్‌తో సమానం. సుఖసంతోషాలను పంచుకునేందుకు అందరూ సిద్ధంగా ఉంటారు కానీ కష్టం, దుఃఖం పంచుకునేది మాత్రం మిత్రుడొక్కడే. శ్రీకృష్ణుడి నిర్యాణం తరవాత అర్జునుడు తాను ప్రియస్నేహితుణ్ని కోల్పోయినట్లు ఆవేదన చెందుతాడు. సప్త సుగుణాలలో స్నేహ సౌఖ్యం ప్రముఖమైందని పెద్దలు చెబుతారు. కాలం గడిచినా స్నేహం మెరుపు తగ్గదు సరికదా ఊరగాయలా రుచి పెరుగుతుంది. ఆస్ట్రియా సామాజిక శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, మైత్రీబంధం వల్ల కలిగే ఆత్మానందం మరే బంధం వల్లా పొందలేం. దేహాన్ని ఒక ప్రమిద అనుకుంటే ఆ ప్రమిదలోని దీపం వెలగడానికి స్నేహమనే నూనె అవసరం. సమాజ దీప్తికీ స్నేహదీపమే ఆధారమని రాయప్రోలు భావిస్తారు. స్నేహం కాలాన్ని పట్టించుకోదు. దూరాన్ని మనసు దరికి రానీయదు. జీవితగణితంలో స్నేహం సంతోషాన్ని హెచ్చవేస్తే, దుఃఖాన్ని విభజిస్తుంది. అమృతం సాధించడానికి బద్ధశత్రువులైన దేవదానవులు కలిసి పాలసముద్రాన్ని మధించారు. స్నేహామృతాన్ని సాధించడానికి జాతి, కుల, మత, భాష, ప్రాంతాల అడ్డుగోడలను మనం పడగొట్టలేమా?

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • జీవితమే సందేశం పాలూ నీళ్లను వేరు చేసేదిగా హంసకు పేరు. భౌతిక సుఖాలను, కష్టాలను సమ స్థితిలో అనుభవించేలా చేయగలిగే వైరాగ్య భావనలను ప్రబోధించిన వారు పరమహంస. శ్రీరామకృష్ణులు ఆచరణయోగ్యమైన ఆధ్యాత్మిక తత్వానికి నిలువెత్తు నిదర్శనం. కలకత్తాలోని దక్షిణేశ్వర్‌ కాళికా ఆలయంలో పూజారిగా ఉంటూ ఎంతోమందికి జ్ఞానభిక్ష అందించారు.
  • యాదగిరీశా నమోస్తుతే! బ్రహ్మ, విష్ణు, రుద్ర సమన్వయ శక్తులతో సృష్టి, స్థితి, లయాత్మకమైన చైతన్య స్వరూపమే నృసింహాకృతి! శ్రీహరి దశావతారాల్లో నరసింహ రూపం విశేషమైనది. నృసింహావతారం ఎంత ప్రచండమో, అంత ప్రహ్లాదం. ఎంత ప్రళయత్వమో అంత ప్రసన్నం.
  • దూరదృష్టి ‘రాబోవు నాపదలను/ లేబోనీయకయె ముందు తెలిసి మెలంగున్‌/ ప్రాబల్యము గలవాడే/ శోభిలు నిల నతడె’ అంటూ దూరదృష్టితో మెలిగితే ఆపదలను తప్పించుకోగలరని వర్ణించాడొక కవి. దూరదృష్టితో వ్యవహరించడమంటే, భవిష్యత్తును ఊహించగలిగే శక్తిగా భావించకూడదు.
  • శరణం శరణం... శంకరం మహాశివరాత్రి లోతైన ఆధ్యాత్మిక పరమార్థం ఉన్న పండుగ. ‘శివ’ అంటే అక్షరాలా కల్యాణకారి. మహాశివరాత్రి నిరాకార స్వరూపుడైన ఆ మహాశివుడి దివ్య కార్యాలను స్మరించుకుంటూ, పరమేశ్వరుడికి ప్రణమిల్లే సుదినం.
  • తపస్సు భగవంతుడి సాక్షాత్కారం కోసం తపస్సు ప్రధానమైన సాధనమన్నది దైవజ్ఞులు చెప్పే మాట. అది అంత సులభమైనది కాదు. ధ్రువుడు, ప్రహ్లాదుడు వంటి వారు నిష్ఠతో, తదేక దీక్షతో దాన్ని ఆచరించి చిరంజీవులుగా ఖ్యాతి పొందారు.
  • మాటే మంత్రం తల వెనక తలంత బలగం ఉన్నా ఒక్కరూ కష్టకాలంలో ఆదుకోలేదు... అంటారు. ఈ కాలంలో ఎంతటి సంపదనైనా ఆర్జించవచ్చు కానీ కష్టంలో మనకోసం నిలబడేవారిని సంపాదించుకోవడం కష్టమే. అలా సంపాదించుకోవడం మన ప్రవర్తన, సంస్కారం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కత్తికన్నా పదునైంది నాలుక.
  • మహోన్నత సంస్కర్త ప్రథమ స్వాతంత్య్ర సమరానికి అజ్ఞాతంగా బీజావాపన చేసిన యోధ, భారతీయులు పరపీడన నుంచి బయటపడి ఉజ్వల భవిష్యత్తు గల జాతిగా నిలవడానికి సహస్ర విధాలుగా పరిశ్రమించిన మహామనీషి, సంఘంలోని దురాచారాలను ఖండించి జనంలో ఆత్మవిశ్వాసానికి పాదుకొల్పిన తపస్వి స్వామి దయానందులు.
  • అమూల్య వరం మనిషి ముఖం నుంచి ‘అగ్ని’ వాగ్రూపంలో వెలువడుతోందని ఐతరేయోపనిషత్తు పేర్కొంటోంది. మాట అగ్ని అంతటి పవిత్రమైనదీ ప్రమాదకరమైనదీ కూడా.
  • సంకల్ప బలం మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, వైఫల్యాలు అనే కొండలను, లోయలను ఎక్కుతూ దిగుతూ ముందుకు పయనించాల్సిందే! నిజానికి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రాథమిక ఇంధనం ఏమై ఉంటుందీ అంటే- సంకల్ప బలం అని చెప్పొచ్చు.
  • దాన ఫలం! సర్వ ప్రాణుల పట్ల దయ ఉన్నవారిని దైవిక లక్షణాలు కలిగినవారిగా చెబుతారు. పవిత్ర భావనలతో, నిస్వార్థంతో జీవించేవారిని తాను వెన్నంటి ఉంటానంటాడు పరమాత్ముడు గీతలో.
  • ఎవరు గొప్ప? నన్ను మించిన వారెవరూ లేరు అనే అహంభావం వల్ల మనుషుల మధ్య గొడవలు జరగడం సహజమే. కానీ మునులు, మహాపురుషులు, దేవతలు సైతం వాటి ప్రభావంలో పడి, తరవాత పశ్చాత్తాపం చెందడం ఆశ్చర్యపరుస్తుంది.
  • అజ్ఞానాన్ని రూపుమాపాలి! ఆదిశంకరుడు చెప్పిన అజ్ఞానం వేరు. ఈ అజ్ఞానం అది కాదు. అంతటా వ్యాపించి రాజ్యమేలుతున్న ఈ అజ్ఞానమే అధర్మానికి, అన్యాయానికి కూడా కారణం.
  • పంచ సూత్రాలు భూమి నిశ్చలంగా ఉన్నట్లు కనిపించినా, అది ప్రతిక్షణం చలనంలో ఉంటుంది. మరి ఈ స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తోంది? పురాణాల ప్రకారం, భూమిని నాలుగు దిగ్గజాలు (ఐరావతాలు) మోస్తున్నాయి.
  • భక్తి - ధర్మం భక్తిభావం, ధర్మగుణం కలిగినవారే మనకు మార్గదర్శకులు, పురాణపురుషులు అయ్యారు. భక్తి వేరు, ధర్మగుణం వేరు. ధర్మగుణంలేని భక్తి శోభించదు, జయించదు.
  • గురుబ్రహ్మ... భౌతిక ప్రపంచంలో వినోద, విహారాలతో సంతృప్తి చెందుతున్నంతవరకు ఆధ్యాత్మిక లోకంలో విహరించాలనే ఆలోచన రాదు. ప్రాపంచిక సుఖాలే శాశ్వతమన్న భ్రమలో ఉండి దారితెన్నులు తెలియని వారికి భగవత్సన్నిధికి దిశానిర్దేశం చేసే వ్యక్తి గురువు. 
  • సృష్టికి మార్గదర్శకుడు సృష్టి... యాదృచ్ఛికంగా నడిచే ప్రక్రియ కాదు. దానికి ఒక క్రమం ఉంది, నియమం ఉంది, ధర్మం ఉంది. ఆ ధర్మానికి దిశానిర్దేశం చేసే శక్తే శ్రీకృష్ణుడు. ఆయన ద్వాపర యుగ అవతార పురుషుడు మాత్రమే కాదు. కాలం, దేశం, పరిస్థితులను దాటి నిలిచిన పరమసత్యానికి సాకార రూపం. సృష్టి ఎలా సాగాలి, జీవితం ఎలా నడవాలి అనే ప్రశ్నలకు సమాధానంగా నిలిచిన తత్వమే కృష్ణుడు.
  • జ్ఞానాయుధం జ్ఞానం మనిషి వికాసానికి మూలాధారం. అది అంధకార మార్గంలో వెలుగులను ప్రకాశింపజేసే దివ్యజ్యోతి. వ్యక్తి ఉనికే ఙ్ఞానం... అంటాడు దక్షిణామూర్తి.
  • ఏది హింస? ‘అహింసా పరమోధర్మః’ అన్నారు పెద్దలు. అంటే హింస చేయకుండా ఉండటమే గొప్ప ధర్మమని అర్థం. హింస అంటే శారీరకంగా బాధించడమో, చంపడమో అని మాత్రమే అర్థంకాదు. ఎదుటివారిని మానసికంగా క్షోభకు గురిచేసినా అది హింస కిందకే వస్తుంది. శరీరానికి బాణాలు గుచ్చుకున్నా ఉపాయంతో తీసి వేయవచ్చు, ఆ గాయాలు మందులతో కొంత కాలానికి మానతాయి.
  • సహనం ఒక వరం ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవాలన్నా, భౌతికమైన కోరికలు తీర్చుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి. నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ, నిరంతరం అంకితభావంతో చేసే కృషే- సహనం. అవాంతరాలను ఆత్మస్థైర్యంతో, పట్టుదలతో ఎదుర్కొని; పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా చేసే యజ్ఞం అది.
  • కాలం విలువ కాలం ప్రతీ క్షణం ఓ ఇంద్రజాలం. కళ్లముందే మాయమైపోతుంటుంది మరి. కదిలే కాలం అనుకోని విజయాలను, వైభవాలను ఇచ్చినట్లే అప్పుడప్పుడు ఓటమినీ చవిచూపిస్తుంది.

English Translation

Fluid Rounded

Eenadu icon
By Editorial Team Published : 01 Jan 2026 01:37 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Friendship is the most important thing in life. That is why Adidamu Surakavi said, 'Parama Mitrundunna Bandhuvargambela'. Bhartrihari thinks that 'Sadhu Sangambu is the all-purpose tool'. Annamayya also declared in a hymn that 'Narayana seeks friendship with those who are good-hearted'. 

> Kuchela, who had no pot, became blessed by Krishna's hand. For that matter, the wise achieve self-realization through alliance without regard to any wealth. An example of this is the first story of Mitralabham in Panchatantram. Dharmaraja did not find a single enemy in the Kauravasabha. Duryodhana found no friend. If you look at it from the perspective of friendship, the whole world is full of close friends. If the valve of the heart is kept open.. affections penetrate into that love like the soil. That is why the thorny vine that creeps to the heart's pillar should not be cut with the machete of hatred.

There is a wonderful story about the value of friendship in Greek mythology. Among the two friends, Damon and Pythius, Pythius is accused of something and is sentenced to death. He asks to spend time as he will finish some important work. But the Lord says to put your friend in your place. Damon agrees and stays in jail until Pythias arrives. Surprised by their friendship, the king leaves them both. After all... the first Telugu poem is about friendship. Nannaya mentions that his friend Narayanabhattu supported him every step of the way in writing India. Man is an island but friendship is the magic that binds those islands together. Talking to Chelikadi is like talking to ourselves. A close friend is like a locker that keeps secrets safe. Everyone is ready to share happiness but only friend can share hardship and sorrow. After Lord Krishna's death, Arjuna feels that he has lost his dear friend. Elders say that among the seven virtues, friendliness is prominent. Even with the passing of time, the luster of friendship does not diminish, but the taste increases like a pickle. According to the researches of Austrian sociologists, the self-pleasure that comes from friendship is unmatched by any other relationship. If we think of the body as a Pramida, the oil of friendship is needed to light the lamp in that Pramida. Raipros believe that friendship is the basis for the light of society. Friendship knows no time. The mind cannot fathom the distance. If friendship in life heightens happiness, it divides sorrow. In order to get the nectar, the arch-enemies of the gods and goddesses bathed the Palasa Samudra together. Can't we break the barriers of race, caste, religion, language and region to achieve friendship?

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. Correspondence has no place in this matter.

More

  • Life is a message. Swan is known as the separator of milk and water. Paramahamsa was the one who preached the concept of dispassion which enables one to experience material pleasures and hardships equally. Sri Ramakrishna is a living example of practical spiritual philosophy. He was a priest in Dakshineshwar Kalika Temple in Calcutta and gave alms of knowledge to many people.
  • Yadagirisha Namostute! Nrisimhakriti is the form of creation, state and rhythmic consciousness with the coordinated forces of Brahma, Vishnu and Rudra! Narasimha's form is unique in Srihari Dashavatars. The Nrisimhavatara is as glorious as it is glorious. The greater the flood, the greater the pleasure.
  • Foresight A poet describes that if you have foresight, you will be able to avoid the dangers. To act with foresight is not to think of the power to predict the future.
  • Sharanam Sharanam... Shankaram Mahashivratri is a festival with deep spiritual significance. 'Shiva' literally means benefactor. Mahashivratri Remembering the divine deeds of the formless form of Lord Shiva, Pranamille Sudinam to the Supreme Lord.
  • Tapas It is said by the sages that penance is the main tool for God realization. It is not that simple. People like Dhruva and Prahlad have practiced it with devotion and gaze and gained fame as immortals.
  • Mate Mantra It is said that even if there is strength behind each head, no one will be supported in difficult times. In this period we can earn any amount of wealth but it is difficult to get people to stand up for us in times of trouble. Acquiring such is possible only because of our behavior and culture. The tongue is sharper than a sword.
  • A great reformer The warrior who anonymously sowed the seeds of the first freedom struggle, the great man who worked in thousands of ways to free the Indians from oppression and become a nation with a bright future, the ascetic Swami Dayanandulu who condemned the vices in the community and instilled self-confidence in the people.
  • Amulya Varam. The Aitareyopanishad states that 'Agni' emanates from the face of man in the form of fire. A word is as sacred as fire and also dangerous.
  • Strength of will In the life of a man, one has to move forward by going up and down the hills and valleys of joys, sorrows, successes and failures! In fact, what is the basic fuel that a person needs to reach his goal is - willpower.
  • The fruit of charity! Those who are kind to all living beings are said to have divine qualities. In the Gita, the Supreme Lord says that he will support those who live with holy thoughts and selflessness.
  • Who is great? Due to the ego that there is no one above me, it is natural for people to quarrel. But it is surprising that even the ancients, great men and gods fell under their influence and later repented.
  • Ignorance should be eradicated! Adi Shankara said ignorance is different. This ignorance is not that. This ignorance which reigns all over is the cause of unrighteousness and injustice.
  • Pancha Sutras Although the earth appears to be stationary, it is constantly in motion. And where is this stability coming from? According to Puranas, the earth is carried by four giants (Airavatas).
  • Bhakti - Dharma Those who have piety and virtue have become our guides and legendary men. Bhakti is different, morality is different. Bhakti without Dharmaguna cannot beautify or conquer.
  • GuruBrahma... As long as one is satisfied with entertainment and excursions in the material world, one cannot think of wandering in the spiritual world. Guru is the one who directs those who are under the eternal illusion of worldly pleasures and do not know the way to the presence of God. 
  • Guide to creation Creation... is not a random process. It has an order, a rule, a virtue. Lord Krishna is the power that directs that dharma. He is not only an incarnation of Dwapara Yuga Purusha. An embodiment of the supreme truth that transcends time, country and conditions. Krishna is the philosophy that answers the questions of how creation should proceed and how life should proceed.
  • Gnanayudham Knowledge is the basis of human development. It is a divine lamp that shines light in the path of darkness. Dakshinamurthy says the knowledge of the individual.
  • What is violence? The elders said 'Ahimsa paramodharmah'. It means that non-violence is the greatest virtue. Violence does not mean only physical harm or killing. Even causing emotional distress to others comes under torture. Arrows pierced through the body can be removed by trickery, and the wounds heal for a while with medicine.
  • Patience is a blessing. Patience is a must for man whether he wants to achieve spiritual goals or fulfill material desires. Patience is constant dedicated work, keeping emotions in check to achieve specific goals. Facing obstacles with self-confidence and perseverance; It is a yajna that does not give priority to compliments and criticism.
  • The value of time. Every moment of time is magic. It will disappear before the eyes. Moving times bring unexpected victories and glories as well as occasional defeats.