BCCI: బంగ్లాదేశ్ టూర్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: భారత్, బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య రోజురోజుకూ రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది టీమ్ఇండియా బంగ్లాదేశ్ పర్యటనను తాత్కాలికంగా నిలిపిచేయాలని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఈ ఏడాది తాము ఆడబోయే సిరీస్‌ల వివరాలను శుక్రవారం ప్రకటించింది. సెప్టెంబరులో భారత జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నట్లు అందులో పేర్కొంది. అయితే, బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత, హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో టీమ్ఇండియా పర్యటనను బీసీసీఐ తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది.
‘బంగ్లాదేశ్ టూర్‌ను మేం ఇంకా ఖరారు చేయలేదు. గతేడాది కూడా మా జట్టు బంగ్లా పర్యటనకు వెళ్లలేదు. స్వదేశంలో జరిగే అంతర్జాతీయ సిరీస్ క్యాలెండర్‌ను బీసీబీ విడుదల చేసినప్పటికీ.. టీమ్ఇండియా పర్యటించేది మాత్రం అనుమానమే. ఎందుకంటే టీమ్ఇండియా ఇతర దేశాలకు వెళ్లి ఆడాలంటే భారత ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. ఇక, టీ20 ప్రపంచ కప్ విషయానికొస్తే.. షెడ్యూల్ ప్రకారమే.. బంగ్లాదేశ్ మ్యాచ్‌లు భారత్‌లో జరగనున్నాయి’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- శర్మా.. మొదట నువ్వు సింగిల్ తీసుకో: సునీల్ గావస్కర్ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
- యువరాజ్ సింగ్ పేరు.. శతకంతో రికార్డ్: కెనడా ‘యువీ’ సెన్సేషన్ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.